cloves

రోజూ రెండు లవంగాలు తినడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు

By Punarjan Ayurveda

లవంగాలు వంటలకు రుచిని పెంచడమే కాకుండా, లవంగాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి.

జీర్ణ వ్యవస్థ

లవంగాలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, కడుపులోని మంట (acidity) తగ్గుతుంది.

నోటి ఆరోగ్యం

లవంగాలు నోటి దుర్వాసన  తొలగించడానికి మరియు దంతాల నొప్పి తగ్గించడానికి సహాయపడతాయి.

జలుబు, ఫ్లూ

లవంగాలలో ఉండే యాంటీ-బ్యాక్టీరియా గుణాలు జలుబు, ఫ్లూ వంటి వాటిని నివారించడానికి సహాయపడతాయి.

రక్తంలో చక్కెర - డయాబెటిస్

లవంగాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

రోగ నిరోధక శక్తి

రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల లాంటివి దరి చేరకుండా చూస్తాయి.

కీళ్ల నొప్పులు

లవంగాలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడానికి సహాయపడతాయి.

స్మెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది

మగవారు లవంగాలు తింటే స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది, స్పెర్మ్‌ నాణ్యత, మూవబిలిటీని మెరుగుపడుతుంది.

రోజూ రెండు లవంగాలు తినడం వల్ల  ఆరోగ్యానికి మంచిదే. అయితే, ఎక్కువగా తినకుండా ఉండటం మరియు  ఏదైనా సందేహాలు ఉంటే డాక్టర్‌ని సంప్రదించడం ముఖ్యం.