loading

బూడిద గుమ్మడికాయ … దిష్టికే కాదు… సర్వరోగ నివారిణి !

 • Home
 • Blog
 • బూడిద గుమ్మడికాయ … దిష్టికే కాదు… సర్వరోగ నివారిణి !
Ash gourd benefits - Punarjan ayurveda hospitals

బూడిద గుమ్మడికాయ … దిష్టికే కాదు… సర్వరోగ నివారిణి !

బూడిద గుమ్మడి జ్యూస్‌ వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

బూడిద గుమ్మడికాయ పేరు చెప్పగానే గుమ్మానికి దిష్టి తియ్యడానికి లేదా వడియాలు  హలువ వంటి వంటకాలు చేసుకోడానికే పనికి వస్తుందనుకుంటారు కదా అయితే మీరు ఖచ్చితంగా ఈ బ్లాగ్ చదవాల్సిందే. ఎందుకంటే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగించడానికి ఉపయోగపడ్డట్లే, శరీరంలోని  వ్యర్ధాలను తొలగించడానికి బూడిద గుమ్మడికాయ అద్భుతంగా పనిచేస్తుంది. 

 

సంస్కృతంలో కుష్మాండ అంటారు

కేవలం రుచికర వంటకాలకే కాదు ఆరోగ్యం పెంచుకోవడానికి  కూడా బూడిద గుమ్మడికాయ  ఉపయోగపడుతుంది. వంటకాల కంటే జూస్ రూపంలో తీసుకుంటే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. శక్తినివ్వడంలో  దీనికి సాటిలేదని  చెప్పవచ్చు. బూడిద గుమ్మడికాయను శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతున్నారు. సంస్కృతంలో కుష్మాండ అంటారు. కుష్మాండ అంటే అండ రూపంలో లభించే  శక్తి  ఒక కాయలో దాగి వుంది.

 

పోషకాలు

బూడిద గుమ్మడికాయ లో 96 శాతం నీరు ఉంటె మిగితా 4 శాతంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియమ్, ఐరన్, విటమిన్ బి1, బి 2, బి3, బి5, బి6, విటమిన్ సి ఉంటాయి. ఇందులో ఉండే బయో యాక్టీవ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం ఇవ్వడానికి దోహాపడుతాయి,

 

బాడీ డీ టాక్సీ ఫయింగ్

 • బూడిద గుమ్మడికాయ  ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.
 • యాంటాసిడ్‌గా పని చేస్తుంది అసిడిటీని  నియంత్రించడానికి సహాయపడుతుంది
 • బాడీ డీ టాక్సీ ఫయింగ్ కు సహాయపడే ఆహార పదార్ధాల లో ఉత్తమంగా చెప్పుకునేది
 • బూడిద గుమ్మడికాయ…శరీరం  లో పేరుకుపోయిన విష వ్యర్ధాలను  తొలగిస్తుంది
 • ఇవి లివర్ పని తీరును మెరుగుపరుస్తుంది ,జీర్ణక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది..

 

మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది

బూడిద గుమ్మడికాయ నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. యాంజియోలైటిక్ ప్రభావం  కలిగి ఉన్నందున  ఆందోళన నుండి ఉపశమనం అందిస్తుంది. ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందేవారు తరచూ ఈ జూస్  తాగితే మంచి ఫలితం ఉంటుంది. డిప్రెషన్‌ ను అధికమించడానికి సహాయపడుతుంది. అంతేకాదు యాంటీ కన్వల్సెంట్ లక్షణం కలిగి ఉంటుంది. మూర్ఛవ్యాధితో బాధపడేవారికి కూడా  మేలు చేస్తుంది.

 

యాంటీ-డయాబెటిక్

బూడిద గుమ్మడికాయ  రసంలో కేలరీలు మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కొవ్వు శాతం అతి తక్కువగా ఉన్నందున జీరో ఫాట్ గా చెబుతారు. మధుమేహం ఉన్న వారికి  ఇది గొప్ప ఎంపికగా చెప్పవచ్చు. పండు యొక్క గుజ్జు  వివిధ పోషకాలు యాంటీ-డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉన్నందున   రక్తంలో గ్లూకోజ్‌లెవెల్స్ ను  తగ్గించడంలో సహాయపడుతుంది.

 

వెయిట్ లాస్

ఈ జూసులో కొవ్వు పదార్ధాలు ఉండవు కాలరీలు తక్కువ గా ఉంటాయి కాబట్టి  బరువు  తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక్క   గ్లాసు   జూసు  తాగితే  చాలాసేపు కడుపు నిండి నట్లుగా ఉంటుంది. చిరుతిళ్ళ వైపు మనసు మళ్ళకుండా చేస్తుంది. అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

 

గుండెకు మేలు

అలాగే  యాష్ గోర్డ్ జ్యూస్‌లోని లిపిడ్-తగ్గించే లక్షణాలు మరియు డైటరీ ఫైబర్ యొక్క అధిక కంటెంట్ సీరం కొలెస్ట్రాల్ మరియు లిపిడ్ స్థాయిలను తగ్గించడానికి  దోహదపడుతుంది, ఉబాకాయాన్ని నిరోధిస్తుంది కాబట్టి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తుంది.గుండెకు మేలు చేస్తుంది.

 

శ్వాస సులభతరం చేస్తుంది

 • యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ-పారాసిటిక్ గా పనిచేస్తుంది .
 • బ్రోంకోడైలేటర్‌గాకూడా  పని చేసి  శ్వాస ప్రక్రియను  సులభతరం చేస్తుంది.
 • రక్తహీనత ,క్షయ తగ్గించడానికి.,సంతాన సాఫల్యత పెంచడానికి  దోహదపడుతుంది.

 

యాంటి ఏజింగ్

బూడిద గుమ్మడికాయ  చర్మ ఆరోగ్యానికి ,సౌందర్యానికి  కూడా ప్రయోజనాలు చేకూరుస్తుంది..  ఈ పండు యొక్క సారంతో  ముఖసౌందర్య  క్రీములు తాయారు చేస్తారు  ఇది వయస్సుతో వచ్చే చర్మ కణాల క్షీణతను అంటే చర్మంలో ముడతలు రావడాన్ని ఆలస్యం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది నిత్య యవ్వనులుగా  శక్తివంతంగా చేస్తుంది.

యాంటి క్యాన్సర్

ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి పెంపొందిస్తుంది.వృద్ధాప్యంలో సైతం క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రక్షణ కల్పిస్తుంది ,పండులోని సమ్మేళనాలు గుజ్జు, పై తొక్క, గింజలు దాని యాంటీఆక్సిడెంట్ చర్యకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.,. ఇది ఆక్సీకరణ తగ్గిస్తుంది. ఇందులో ఫ్లవనాయిడ్స్ ఉన్నందున క్యాన్సర్ ను నిరోధించడానికి దోహదపడుతుంది.

 

ఇన్ని ప్రయోజనాలు కలిగించే జూసు తగలని ఎవరనుకోరు చెప్పండి !!

అందుకే ఆలస్యం చెయ్యకుండా

బూడిద గుమ్మడికాయ  జూస్ ను ఎలా తాయారు చేసుకోవాలో చూసేద్దాం

తయారీ విధానం ..

ముందుగా కాయను కట్ చేసి తొక్క,గింజలు  తీసి జూసర్లో వేసి కాసిని నీరు పోసి తిప్పాలి. తర్వాత జూ సు వడపోసుకుని తాగాలి .  జూసర్  లేకపోతె  .మిక్సీ లో ఐనా ఇలాగే  చేసుకోవచ్చు . రుచి కావాలనుకునే వారు కాస్త నిమ్మరసం ,తేనే కూడా కలుపుకుని తాగవచ్చు..ఉదయం పూట  వెజిటేబుల్ జూసు తాగే అలవాటు వున్నవారు ఇందులోనే ఒకటి లేదా రెండు టమాటాలు కూడా కలుపుకుని తాగవచ్చు .  టమాటాలు యాంటిఆక్సిడెంట్స్  కలిగి  ఉన్నందున అటు జూసు  రుచిని పెంచడానికి ఇటు క్యాన్సర్ నియంత్రణకూ దోహదపడుతాయి.

 

ఎప్పుడు తాగాలి ?

ఇది ఒక డి టాక్సీ ఫయింగ్ మరియు ఎనర్జీ  డ్రింక్ ఐనందున ఈ జూసు .పరకడుపున తాగండి.  జూసు శరీరంలో కి ప్రవేశించగానే  క్రిందటి రోజు ఆహారం తాలూకు వ్యర్ధ పదార్ధాలను తొలగించడం మొదలుపెడుతుంది. బాడీ డీటాక్సీఫై అవుతుంది. తాగిన కొన్ని నిముషాలు లేదా గంటలలో కడుపులో కదలికలు గమనించవచ్చు.

 

ఎవరు తాగకూడదు

చలువచేసే పండు కాబట్టి టెంపరేచర్ ను నియంత్రిస్తుంది . జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతుతున్నారు. అయితే చలువ గుణం కలిగి ఉన్నందున జలుబు తో బాధపడుతున్నవారు, ఆస్తమా పేషంట్లు తాగకూడదు గర్భిణి స్త్రీలు వై ద్యుల సలహా మేరకే స్వీకరించాలి. అలాగే ఏ వయసువారైనా  సరే ముందు కొంచెం కొంచెం తాగడం అలవాటు చేసుకోవాలి. మితంగా తీసుకుంటేనే  ఏ ఆహారమైనా ఔషధంగా పనిచేస్తుందని గమనించాలి.

చివరిగా ఒక మాట, గుమ్మడికాయను గుమ్మంలో కట్టేది ఏకారణం చేతైనా సరేకానీ  దాని ప్రయోజనాలు గుర్తుచెయ్యడానికి కూడా అని అర్ధంచేసుకోవాలి ..

ఒక్క గ్లాసు బూడిద గుమ్మడికాయ జూస్లో  లభించే శక్తిని సూక్ష్మం లో మోక్షంగా పోల్చవచ్చు.

మరో అంశంతో మళ్లి కలుద్దాం అప్పటిదాకా ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి.

ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారమే ఔషధం. 

 

Also Read: టాప్ 8 క్యాన్సర్ ఫైటింగ్ ఫుడ్స్

 

Book Appointment


  Follow On Instagram

  punarjan ayurveda hospital logo

  Punarjan Ayurveda

  16k Followers

  We have a vision to end cancer as we know it, for everyone. Learn more about cancer Awareness, Early Detection, Patient Care by calling us at +(91) 80088 42222

  Call Now