క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు

You are currently viewing క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు

ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే క్యాన్సర్ కేసులు అంతకంతకూ పెరుగుతుండడం మనం చూస్తున్నాం.

కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.  ఈ కారణం చేతనే క్యాన్సర్ వ్యాధిని అరికట్టే క్రమంలో కొత్త కొత్త పద్ధతులను వెతికేలా చేసింది.  క్యాన్సర్ నివారణ విషయంలో అనేక అంశాలు తోడ్పడుతున్నాయి కాని వాటన్నింటి కంటే కూడా ఆహార నియమాలు చాలా ముఖ్యమైనది.  జీవన విధానంలో ఆహార నియమాలకు ఉన్న ప్రాధాన్యత వేరు.  ఆహార నియంత్రణ సాధ్యమైతే ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడం కూడా సాధ్యమవుతుంది.  క్యాన్సర్లు పెరగడానికి ఏదైనా తగ్గడానికి ఏదైనా ఆహారం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఊబకాయం నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉండటం శరీర బరువును నియంత్రణలో లేకపోవడం వంటి అనేక కారణాలు క్యాన్సర్లు పెరగడానికి కారణమవుతుంటాయి.

సమయానికి ఆహరం:

అదే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ సరైన జీవన విధానాన్ని ఆచరిస్తూ ఉంటే గనుక క్యాన్సర్లో 10 నుంచి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది.  తినే సమయంలో తినాలి. తినకూడని సమయంలో తినకూడదు.  ఇదే సమయంలో కూడా పరిమితిని మించి తినకుండా పొదుపుగా తినాలి.  ఈ రకంగా ఆహార జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే క్యాన్సర్లే కాదు ఏ వ్యాధి కూడా దరిచేరదు.

క్యాన్సర్ నియంత్రణలో ఉంచడానికి తీసుకోవాల్సిన ప్రధాన ఆహారాలు:

క్యాన్సర్ నియంత్రణలో ఉంచడానికి తీసుకోవాల్సిన ప్రధాన ఆహారాలు ఏంటంటే… పప్పు ధాన్యాలు, తాజాగా ఉండే ఫ్రూట్స్…, కాయగూరలు, గింజలు…  వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దపేగు క్యాన్సర్ వంటి క్యాన్సర్లకు  ఇవి చక్కగా పనిచేస్తాయి.

ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లో క్యాన్సర్లపై పోరాడే గుణాలు ఉంటాయి.  కాలీఫ్లవర్ క్యాబేజీ, బ్రొకోలి వంటి కాయగూరల్లో క్యాన్సర్ నియంత్రణలో చక్కగా పనిచేస్తాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ రకంగా కాయగూరలు, తాజా పండ్లు తింటూ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి దరిచేరవు.  శరీరంలో ఉన్న విష పదార్థాలు అన్నీ కూడా ఈ పళ్ళు, కాయగూరలు బయటికి తరిమేస్తాయి.

బ్రెస్ట్ క్యాన్సర్ ని నియంత్రించే ఆహారాలు:

ఆడవాళ్లకు ముఖ్యంగా ఇటువంటి పదార్థాల నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆడవాళ్లు ఎక్కువగా శాకాహారం తీసుకోవడమే మంచిది.  మొక్కల్లో ఉండే సల్ఫరాఫేన్  చివరి దశలో ఉన్న క్యాన్సర్లను  సమర్థవంతంగా అడ్డుకుంటుంది.  క్యాన్సర్ కణాలు మరి పెరగకుండా ఆపుతుంది.  రోజుకి తక్కువలో తక్కువ మూడు నుంచి నాలుగు రకాల కాయగూరలు తింటూ వుంటే మంచిదే. సిట్రస్ పళ్ళు, టమాటలు, ఆకుకూరలు,  కెరోటిన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటూ ఉండాలి.

ఫైటోకెమికల్స్ ఆహారాలు:

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే మరికొన్ని ఆహారాల్లో సోయా గింజలు, పింటో గింజలు, కిడ్నీ గింజలు  రోజుకి కనీసం మూడు సార్లకు తగ్గకుండా తీసుకోవాలి. వీటిలో ఫైటోకెమికల్స్ మెండుగా ఉంటాయి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు:

కొన్ని రకాల నూనెగింజల్లో  ప్రొటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు  ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి ఫ్లాక్స్ గింజలు, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు, చియ గింజలు వంటి వాటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్లు శరీరానికి మేలు చేస్తాయి.  ప్రతివారం మాంసం అలవాటు ఉన్నవారు ఈ విధంగా వీటిని రెండు మూడుసార్లు తీసుకుంటే  ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.  ఎర్ర మాంసం, నిల్వ ఉంచిన మాంసం, ఫాస్ట్ ఫుడ్స్  లేదా పంచదార కంటెంట్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్  అలాగే ఇతర తీపి పదార్థాలను దూరంగా పెట్టడం మంచిది.

 క్యాన్సర్ దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఎందుకంటే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే క్యాన్సర్లో వాటంతట అవే తగ్గుముఖం పడతాయి.  వీటితోపాటు కాలుష్యానికి దూరంగా ఉంటూ మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి.  ప్రతిరోజు ఎంతో కొంత సమయం పాటు వ్యాయామం చేస్తే మంచిదే.  లేదు వ్యాయామం చేయడం కూడా కుదరడంలేదు… అలాంటప్పుడు రోజూ కొద్ది సేపు వాకింగ్ అన్నా చేయండి.  మిత్రులతో కూచుని పిచ్చాపాటీ చేయండి. మనసు తేలికవుతుంది.  కుటుంబంతో ఎక్కువ సేపు కాలక్షేపం చేయండి.  ఆఫీస్ పనులతోపాటు ఒత్తిడికి సంబంధించిన పనులు అనవసర ఆలోచనలన్నీ పక్కన పెట్టేయాలి.   అప్పుడే శారీరక ఉత్సాహ, మానసిక ఉల్లాసం పూర్తి ఆరోగ్యం  సాధ్యమవుతుంది.

సరైన ఆహారం తీసుకుంటే క్యాన్సర్లను జయించడం పెద్ద కష్టమైనా విషయమేమీ కాదు. ఈ ఒక్క మాటని దృష్టిలో ఉంచుకుని ఆహార జాగ్రత్తలు పాటించండి…. క్యాన్సర్లను జయించండి.

పునర్జన్ ఆయుర్వేదతో క్యాన్సర్ నియంత్రణ:

క్యాన్సర్ ట్రీట్మెంట్లో గడిచిన పదేళ్లుగా అసాధారణ ట్రీట్మెంట్ అందిస్తూ వ్యాధి నివారణలో ఎంతో మెరుగైన ఫలితాలనిస్తూ ముందుకు సాగుతోంది పునర్జన్ ఆయుర్వేద.

చాలామంది క్యాన్సర్ బాధితులు మా మెడిసిన్ వాడి లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్న వాళ్ళున్నారు. ఒకపక్క క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్ అందిస్తూనే మరోపక్క వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.

ముఖ్య గమనిక :

ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Also Read: ట్రేండింగ్ లో ఉన్న కార్నివోర్ డైట్ వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ !