క్యాన్సర్ ప్రూఫ్ జీవితాన్ని అనుభవించగలమా? ఎలా?

You are currently viewing క్యాన్సర్ ప్రూఫ్ జీవితాన్ని అనుభవించగలమా? ఎలా?

మన దేశంలో ప్రతీ తొమ్మిది మందిలో ఒకరికి వాళ్ళ జీవిత కాలం లో క్యాన్సర్ రిస్క్ ఉందట.

ఈ మాట చెప్పింది నేషనల్ క్యాన్సర్ ప్రోగ్రాం రిజిస్ట్రీ. క్యాన్సర్ మరీ ఇంత తీవ్రంగా మారుతుండటానికి కారణాలు ఎన్నో.. అందులో కొన్ని మన అలవాట్ల వల్ల సంభవిస్తే కొన్ని పర్యావరణంలో ఉండే కాలుష్యం వల్ల సంభవించే అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని జన్యు పరంగా రావచ్చు. 

ఏ రూపంలో అయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ ను పూర్తిగా అయితే నివారించాలేము కానీ మన చేతుల్లో ఉన్నంతాచేసి వీలైనంత వరకు క్యాన్సర్ దరిచేరకుండా మనం ఎం చేయాలంటే..

మన జీవన విధానంలో చేసుకునే చిన్న చిన్న మార్పుల వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు, సింపుల్ గా చెప్పాలంటే ఎండలో ఎక్కువగా తిరగాకుంటే స్కిన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఇలా ఎన్నో మార్గాలు.. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.

  1. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ వాటర్ వాటిల్ మీరు తీసుకెళ్ళండి, రాగి బాటిల్ అయితే మరీ మంచిది. ప్లాస్టిక్ బాటిల్స్ లో ఎక్కువగా  నీరు త్రాగితే BPA  వంటి పదార్థాల ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకని స్టీల్ బాటిల్ లేదా రాగి బాటిల్ ను తీసుకెళ్ళండి. అలాగే ఏదైనా హోటల్ లో అక్కడ వాళ్ళు తెరిచి ఉంచిన గ్లాసుల్లో నీళ్లు పెట్టినట్లయితే అందులో దుమ్ము ధూళి వంటివి ఉండే అవకాశం ఉంది. అందుకని వాటర్ బాటిల్ ఇంటి నుండే తీసుకెళ్లడం మరచిపోకండి.
  2. చాలా వరకు మనలో ఉదయాన్నే కాఫీ లేదా టీ త్రాగే అలవాటు ఉంటుంది. మితంగా కాఫీ లేదా టీ త్రాగటం వల్ల ప్రమాదం లేదు, అలాగే రోజూ కెఫిన్ తీసుకోవటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్,ఓరల్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీ త్రాగితే మంచిది కదా అని నాలుగైదు కప్పులు తాగేయకండి. మితంగా ఉంటేనే మంచిది.
  3. డ్రై క్లీనింగ్ ను అవాయిడ్ చేయండి, ఎందుకంటే డ్రై క్లేనింగ్ చేసే సమయంలో ఉపయోగించే సాల్వెంట్ లో ఉండే  పెర్క్లోరోఎథైలీన్ లివర్ మరియు కిడ్నీ క్యాన్సర్లకు కారణం అవ్వచ్చట.వీటిని వేరే ప్రత్యమ్నాయలతో రిప్లేస్ చేయటం మంచిది.
  4. ఆహారంలో తప్పని సరిగా గ్రీన్స్ అంటే ఆకు కూరలు ఉండేలా చూసుకోండి, ఎక్కువగా క్లోరోఫిల్ ఉన్న వాటిలో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇది మహిళల్లో కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది.ఒక అర కప్పు పాలకూర ను ఉడికించి తిన్నట్లయితే అందులో 75 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుందట.ఇది మన రోజూ మెగ్నీషియం  అవసరాలలో ఇరవై శాతం.
  5. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి,దీనివల్ల రెండు రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి ఇలా చేయటం వల్ల ఇంట్లో దుమ్ము ధూళి వంటివి ఎక్కువగా ఉండి, మనం తినే ఆహారం లోకి, పీల్చే గాలి లోకి వెళ్ళవు, ఇక రెండోది ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా చేస్తూ సర్దుతూ ఉండటం వల్ల ఈ పని చేసే మహిళలకు కూడా ఇది ఒక వ్యాయామం లాగా మారి 30 శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుందట.
  6. ఎండలో మరీ ఎక్కువగా తిరగకండి, దీని వల్ల వచ్చే ప్రమాదం స్కిన్ క్యాన్సర్. ఎక్కువగా అల్ట్రా వాయిలేట్ కిరణాల వల్ల ఈ సమస్య వచ్చే రిస్క్ ఉంది. అందుకే వేలినంత వరకు ఎక్కువ ఎండా ఉన్న సమయంలో బయట ఉండకండి అలాగే ఒకవేళ వెళ్ళాల్సి వస్తే సన్ స్క్రీన్ ఉపయోగించండి.
  7. ఒకవేళ అధిక బరువు ఉన్నట్లయితే బరువు తగ్గి సరైన బరువుకు రావటానికి ప్రయత్నం మొదలుపెట్టండి. బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేసుకోండి.సరైన బరువులో ఉండటం క్యాన్సర్ తో సహా చాలా ఆరోగ్య సమస్యలనుండి రక్షిస్తుంది. మహిళల్లో ఇరవై శాతం,పురుషులలో పద్నాలుగు శాతం క్యాన్సర్ మరణాలు ఊబకాయం వల్లే సంభావిస్తున్నయట.
  8. ఒకవేళ కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉంది ఉంటే మీ క్యాన్సర్ రిస్క్ ను తెలుసుకోవటానికి వైద్యుడిని సంప్రదించండి. వైద్యుల సూచనల మేరకు జన్యు పరీక్షలు నిర్వహించుకోండి. జీవన శైలి లో మార్పుల వల్ల క్యాన్సర్  ను నివారించగలమైతే,సరైన సమయానికి గుర్తించి చికిత్స చేయటం వల్ల క్యాన్సర్ ను పూర్తిగా నయం చేసే అవకాశం కూడా ఉంది.
  9. రోజు కు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్ళు త్రాగండి, నీళ్ళు త్రాగటం వల్ల బ్లాడర్  క్యాన్సర్ కారకాలు మూత్రం ద్వారా వెళ్ళిపోయి, బ్లాడర్  క్యాన్సర్  రిస్క్ ను తగ్గిస్తాయి.అందుకని నీళ్లు సరిపడా త్రాగటం ఎప్పుడూ మరచిపోకండి.
  10. సరైన ఆహారాన్నే ఎంచుకోండి,వీలైనంత వరకు పెస్టిసైడ్ రేసిడ్యు లేని కూరగాయాలనే తీసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే కూరగాయలను శుభ్రంగా పైన ఉండే పెస్టిసైడ్  రేసిడ్యు పోయేదాకా ఉప్పునీటితో కడిగి ఉపయోగించండి. పోషకాలు ఉన్న ఆహారం ఎంత ముఖ్యమో, శుభ్రమైన ఆహారం అంతే ముఖ్యం.
  11. ధూమపానానికి దూరంగా ఉండండి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ధూమపానం అత్యంత ముఖ్యమైన క్యాన్సర్ కారణాలలో ఒకటి.ఎన్నో రకాల క్యాన్సర్ లు ఈ వ్యసనానికి ముడి పది ఉన్నాయి.అలాగే మద్యపానాన్ని కూడా మానేయటం మంచిది. ఈ రెండూ క్యాన్సర్ రిస్క్ ను మరింత పెంచ గలవు.
  12. శరీరానికి సరిపడా క్యాల్షియం రోజూ అందేలా చూడండి, పాలను త్రాగటం ద్వారా క్యాల్షియం లభిస్తుంది. సరైన క్యాల్షియం శరీరానికి అందితే కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందట.
  13. సరైన డైట్ ను అనుసరించండి, ఆరోగ్యంగా ఉండటానికి ఏ పోషకాలు అవసరమో అవన్నీ ఆహారంలో భాగం అయ్యేలా చూసుకోండి. క్యాన్సర్ ఫైటింగ్ ఫుడ్స్ ను డైట్ లో ఉండేలా చూడండి. సరైన సమయానికి తగినంత ఆహారమే తిని ఆరోగ్యంగా ఉండటం వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.
  14. వ్యాయామం చేయండి, రోజుకు కనీసం ముప్పై నిముషాలు వ్యాయామం చేసిన వాళ్లకు క్యాన్సర్ రిస్క్ చాలా వరకు తగ్గుతుందట. సరైన వ్యాయమ దినచర్య తాయారు చేసుకొని రోజూ వ్యాయామం చేస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యలను దూరం చేసినట్టే.
  15. మానసిక ఒత్తిడిని దూరం పెట్టండి, మానసిక ఒత్తిడి అనేది పరోక్షంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది,ఒకానొక సమయంలో క్యాన్సర్ కు కారణంగా కూడా మారవచ్చు. అందుకని ధ్యానం వంటి అలవాట్లు చేసుకోండి.ప్రశాంతంగా ఉండండి. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం.

చివరగా,

క్యాన్సర్ ను పూర్తిగా నివారించలేము కానీ నివారించే అవకాశం ఉన్న ప్రతీ క్యాన్సర్ ను మన అలవాట్లను మరియు జీవన విధానాన్ని మార్చుకోవటం వల్ల చాలా వరకు నివారించవచ్చు.పైన ఉన్న ఈ మార్గాలు క్యాన్సర్ ను నివారించడానికి ఎంతగానో సహాయపడగలవు. క్యాన్సర్ పట్ల అవగాహన మన అందరికీ అవసరమే,ఏదైనా సందేహం వచ్చినా లేక క్యాన్సర్ సంకేతాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. తద్వారా నివారించలేని క్యాన్సార్లను కూడా సరైన సమయానికి చికిత్స జరిగి నయం అయ్యేలా చూడగలం.

Also read: క్యాన్సర్ ను ‘ఆత్మవిశ్వాసం’ తో జయించండి!