మైగ్రేషన్ అనేది ఉపాధి, స్థిరనివాసం, విద్య మరియు వ్యాపార కార్యకలాపాలు వంటి అనేక ప్రయోజనాల కోసం ప్రజలు వారి స్వదేశం నుండి ఇతర ప్రదేశాలకు వెళ్ళే ప్రక్రియ. ఇది ఒక రాష్ట్రంలో అయిన, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రం, ఒక దేశంలో అయిన, ఒక దేశం నుండి నుండి మరొక దేశం అయిన కావచ్చు.
ఈ మైగ్రేషన్ క్యాన్సర్ రావడంలో ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం…
ఒక రిపోర్ట్ ద్వారా, అమెరికాకు వచ్చిన చైనీస్ లేదా జపనీస్ మహిళలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది, ఎందుకంటే అమెరికాలో రొమ్ము క్యాన్సర్ రావడం రెండు నుండి నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుంది. కొన్ని తరాల తర్వాత స్థిర పడ్డ చైనీస్ లేదా జపనీయన్లకు కూడా క్యాన్సర్ ప్రమాదం అమెరికన్లతో సమానంగా ఉంటుంది.
మాములుగా క్యాన్సర్ రావడం అనేది ఆసియాలోని ఆసియా మహిళలకు తక్కువగా ఉంటుంది. అమెరికాలో స్థిరపడ్డ ఆసియాన్లకు మధ్యస్థంగా ఉందని మరియు అమెరికాలో పుట్టి పెరిగిన ఆసియాన్లకు అత్యధికంగా ఉందని వెల్లడైనది.
మనము ఇతర క్యాన్సర్లను కూడా ఒక సారి పరిశీలిస్తే, జపాన్లో నివసించే వ్యక్తితో పోలిస్తే హవాయికి వచ్చిన జపనీస్ వ్యక్తికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదే హవాయిలో స్థిరపడ్డ జపనీయులు కన్నా, జపాన్లో నివసించే వారికే జీర్ణాశయ క్యాన్సర్ రావడం ఐదు రెట్లు ఎక్కువ ఉంటుందని ఒక పరిశోధన చెప్తుంది.
పైన పేర్కొన్న వాటి నుండి, చాలా మంది పరిశోధకులు క్యాన్సర్ వ్యాధి మన జీవనశైలిలో వస్తున్న మార్పులు, మన ఆహారపు అలవాట్లు, మన నివసించే ప్రదేశం మీద కూడా ఆధారపడి ఉంటుంది అని నిర్ధారించారు.
కానీ, కేవలం మనలో జరిగే జీన్ మ్యుటేషన్లే ప్రధాన కారణము అనే ఆలోచనను మనము తీసేయవచ్చు. కావున మన నివసించే వాతావరణం, ఆహార విధానాలు మరియు జీవనశైలిలో వచ్చే మార్పులే క్యాన్సర్ ప్రమాదాన్ని నిర్ధయిస్తాయని ఎక్కువ మంది పరిశోధకులు, విశ్లేషకులు వారి పరిశోధనల ద్వారా తెలుపుతున్నారు.
ఏ రకంగా విత్తనమే కాకుండా, మొక్కల పెరుగుదలలో మట్టి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో, అలాగే మనము ఉండే ప్రదేశం, వాటి పర్యావరణం కూడా క్యాన్సర్ వ్యాధి రావడానికి ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది.
Also read: బినైన్ ట్యూమర్స్ అంటే ఏమిటి? రకాలు, లక్షణాలు