పునర్జన్ ఆయుర్వేద Fake Or Real

You are currently viewing పునర్జన్ ఆయుర్వేద Fake Or Real

నిజానికి ఆధారాలు అవసరం లేదు కానీ, సందేహాలకు సమాధానాలు అవసరం 

మనందరం గర్వంగా చెప్పుకోదగిన మన దేశ జ్ఞానసంపద ఆయుర్వేదం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆధునిక వైద్య విధానాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఆయుర్వేదాన్ని జాగ్రత్తగా పాతాళానికి కింద అంతస్తులోకి చేర్చారు. కేవలం వ్యాధికి లేదా రుగ్మతకు మాత్రమే మందులిచ్చి శరీర స్థితిగతులను పెద్దగా పట్టించుకోని వైద్యం ప్రధాన వైద్యంగా చలామణి అవుతోంది. కాలాతీతంగా చాలావరకు కఠినమైన మొండివ్యాధులకు కచ్చితమైన ఫలితాలనిచ్చిన ఆయుర్వేదాన్ని మాత్రం కంటికి కనిపించకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్ అనే పరదా కట్టి కళ్ళకు కనపడకుండా చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఆశ్చర్యమేమిటంటే ఇప్పటికీ చాలావరకు ఆధునిక వైద్య విధానంలోని ప్రముఖులు ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు సుశ్రుతుడిని ఫాదర్ ఆఫ్ సర్జరీ అని అంగీకరించారు. అలాగే కొన్ని హాస్పిటల్‌లో ధన్వంతరి విగ్రహాలను కూడా చూడవచ్చు. దీన్ని బట్టి ఆయుర్వేదానికి ఉన్న విశ్వసనీయత ఏమిటన్నది మనం అర్ధం చేసుకోవచ్చు. 

ఇదే పునర్జన్ ఆయుర్వేద మెకానిజం 

అపోహలు ఎంతగా ప్రచారంలో ఉన్నా కూడా ఫలితాలు అబద్ధం చెప్పవు కదా. కొద్దిసేపు ప్రచారాలే నిజం అనుకుందాం. పునర్జన్ ఆయుర్వేద ట్రీట్మెంట్ అనంతరం తమ అనుభవాన్ని పంచుకుంటూ వేల మంది పెషెంట్లు తమ పరిస్థితి బాగుందని, చాలా వరకు మెరుగైందని, తమ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని ఎందుకు చెబుతున్నారో ఒకసారి ఆలోచన చెయ్యాలి.  ప్రపంచాన్ని భయపెట్టిన క్యాన్సర్‌ను అదిమిపట్టి బాధితులకు అభయమిచ్చింది పునర్జన్ అయుర్వేద. ఇది ఎవ్వరు కాదనలేని సత్యం. క్యాన్సర్‌తో పోరాడుతున్నవారికి సహాయకారిగా నిలుస్తూ ఎంతోమంది క్యాన్సర్ బాధితుల జీవితాలకు భవిష్యత్తుపై భరోసాను కల్పించింది ‘పునర్జన్ ఆయుర్వేద‘. ముఖ్యంగా ఆధునిక ట్రీట్మెంట్లను ఆశ్రయించిన వారికి ఎదురయ్యే దుష్ప్రభావాలను తట్టుకునే విధంగా ప్రాణశక్తిని పెంచి  ఇమ్యూనిటీని బలపరచడం ద్వారా రెండు విధాలుగా మేలు చేస్తుంది. అందుకే అనుపాన, సహపాన సాధనంగానూ, ప్రత్యామ్నాయ విధానంగానూ ఆయుర్వేదం నేటికీ అందరి మన్ననలను పొందుతోంది.          

ఏది సత్యం..? ఏదసత్యం..? 

సోషల్ మీడియా వాడకం విశేషంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఏది అసలు వార్త? ఏది నకలు వార్త? అన్నది విశ్లేషించడం కాస్త కష్టమైన పనే. అయినా కూడా చాలామంది స్వయంప్రకటిత మేధావులు ఎదైనా ఒక విషయం వారి నోటీసుకు వచ్చిందంటే చాలు దానిపైన సానుకూలంగానూ ప్రతికూలంగానూ స్పందిస్తూ తమతమ అభిప్రాయాలను తెలపడం, సమీక్షలు చేయడం పరిపాటిగా మారిపోయింది. పర్యవసానంగా వాస్తవాలు కూడా మసకబారిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో పునర్జన్ ఆయుర్వేద ట్రీట్మెంట్‌ను ఎంత వరకు నమ్మవచ్చు? పునర్జన్‌ను ఎంత వరకు విశ్వసించవచ్చు? ఈ ఫలితాలు నిజమా అబద్దమా? అని సందేహం కలగడం సర్వసాధారణం. అనుమానాన్ని నివృత్తి చేయడానికి ముందు అసలు పునర్జన్ ఆయుర్వేద వలన కలిగే లాభనష్టాలేమిటి? ఈ వివరాల గురించి కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. 

ఒక డిబేట్ చూసినా, విన్నా మొదటగా మనమొక ప్రాధమిక అంచనా వేయగలగాలి. అసలు అబిప్రాయాలు, సమీక్షలు చెబుతూ నిజానిజాలను నిర్ధారించేవారికి ఉన్న అర్హతలేమిటి? వారు ఎంత వరకు నిష్ణాతులు? నిగ్గు తేల్చేంత వివరం వారి దగ్గర ఉందా లేదా? వారికి తెలిసిన విషయం ఎంత? వారు చెబుతున్న వాటిలో వాస్తవాలెంత? ఇటువంటి మిలియన్ డాలర్ల ప్రశ్నలన్నిటికీ మొదట సమాధానాలు వెతకాలి.   

పునర్జన్ ఆయుర్వేద ట్రీట్మెంట్ విధానంలో ఎటువంటి ప్రమాణాలు పాటిస్తారు? అందరికీ ఉన్న మొదట సందేహం ఇదే.. వ్యాధి ఏదైనా కానీ ట్రీట్మెంట్ విధానంలో మాత్రం ఒక్కొక్కరు ఒక్కో శైలిని అనుసరిస్తుంటారు. సాధారణంగా రెండు రకాల ట్రీట్మెంట్లు జరుగుతూ ఉంటాయి. వ్యాధి ఆధారిత ట్రీట్మెంట్, బాధితుడి శరీర ఆధారిత ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ క్రమంలో బాధితుడి శరీర ఆధారిత ట్రీట్మెంట్ చాలా కీలక భూమిక పోషిస్తుంది. కేవలం క్యాన్సర్లను మాత్రమే టార్గెట్ చేసి వాటిని తొలగించే ట్రీట్మెంట్ విధానంపైన ఆధారపడితే కొన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశముంది. క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించారా లేదా?  సర్జరీ, కీమోథెరపీ చేసిన తర్వాత కూడా ఒకవేళ ఏమైనా అవశేషాలు మిగిలి ఉంటే ఏంటి పరిస్థితి? తదనంతర పర్యవసానాలను తట్టుకోవడంలో ఆ ట్రీట్మెంట్ బాధితుడికి ఎంత వరకు సహాయపడుతుంది? వీటినే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాం. వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ని నిర్లక్ష్యం చేస్తే అవి మళ్ళీ అదనపు తలనొప్పిగా తయారయ్యే అవకాశముంది. వాటికి కూడా సరైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటే సక్సెస్ రేటు ఎందుకంత తక్కువగా ఉందన్న విషయంపై పునరాలోచన చేయాలి. 

కళ్ళకు బిగుతైన గంతలు 

ప్రధానంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలామంది ప్రఖ్యాత ఆంకాలజిస్టులు క్యాన్సర్ వంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే అన్ని విధానాలు సమగ్రంగా కలిసికట్టూగా ప్రయత్నిస్తే చాలా మేలు కలుగుతుందని చెబుతారు. తర్కానికి పోకుండా కొంచెం విచక్షణతో ఆలోచించినట్లయితే ఇది ఎవరికైనా అర్ధమవుతుంది. పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకున్న చాలామంది పేషెంట్లు తరచుగా చెప్పేది ఒక్కటే. సహజంగా సర్జరీ లేదా కీమోథెరపీ తీసుకున్నవారికి కొనసాగింపుగా అందించే ట్రీట్మెంట్లో కలిగే ప్రయోజనం కంటే పునర్జన్ ఆయుర్వేద ట్రీట్మెంట్ వాడుతున్న వారిలో కలుగుతున్న ప్రయోజనమే ఎక్కువని. అందుక్కారణం బాధితుడి శరీర స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ట్రీట్మెంట్ అందించడమే. ఏ ట్రీట్మెంట్ అందించినా బాధితుడి శరీర స్థితిగతులను సరైన విధంగా అంచనా వేయాలి. బాధితుడి శరీరం ఔషధాలను స్వీకరించే స్థితిలో ఉందా లేక దీర్ఘకాలికంగా ఔషధాలు వాడటం వలన మందులు స్వీకరించే పరిస్థితిని కోల్పోయిందా? అలాంటి స్థితిలో ఉంటే గనుక మొదట శరీరాన్ని ఉత్తేజితం చేయాలి. ప్రాణశక్తిని మేల్కొలపాలి. మునుపు అందించిన ఔషధసమూహం యొక్క ప్రభావం వలన ప్రాణశక్తిని కోల్పోయిన శరీరానికి తిరిగి ప్రాణవాయువులను అందించాలి. ప్రాణశక్తి పెరిగితే ధాత్వాగ్ని పెరిగి పోషణ కోల్పోయిన ధాతువులు తిరిగి వాటి పూర్వ తేజస్సును సాధించి శరీరం ఓజస్సును, ఇమ్యూనిటీని సాధిస్తుంది. 

ఇక్కడే సాంప్రదాయ ట్రీట్మెంట్లు వెనకబడ్డాయన్నది కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం.  వాస్తవానికి ఒక ట్రీట్మెంట్లో ఒక మేలు జరిగితే మరో ట్రీట్మెంట్లో మరో మేలు జరుగుతుంది. ఇలా అన్ని ట్రీట్మెంట్లు సమిష్టిగా ప్రయత్నం చేస్తే తప్ప క్యాన్సర్ వంటి మహమ్మారిని ఎదుర్కోవడం కష్టం. క్యాన్సర్ విషయంలో ఆయుర్వేదం ఎల్లప్పుడూ బాధితుడి ప్రాణాన్ని తేలిక చేస్తుంటుంది. ఇతర పద్ధతుల వలన కలిగిన అసౌకర్యాన్ని కూడా తొలగించి శరీరానికి సౌకర్యాన్ని కలుగజేస్తుంది. మంచిని మంచి అని అంగీకరించాలంటే చాలా పెద్ద మనసుండాలి.  

ఎవరి దారి వారిది 

వ్యాధి బాధితుడి శరీర ఆధారిత చికిత్సా విధానం కాబట్టి ఆయుర్వేదంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు సాంప్రదాయ నిర్ధారణ పరీక్షలకు కాస్త భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా శరీర స్థితిగతులు ఎలా ఉన్నాయన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో నాడీపరీక్షా విధానాన్ని ఎక్కువగా అనుసరించడం జరుగుతుంది. దీన్ని ఆధారం చేసుకునే క్యాన్సర్ పేషెంట్ల శరీరంలో ప్రాణశక్తి ఏ స్థాయిలో ఉందన్నది తెలుస్తుంది. ఇక క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ చేయడం వరకు ఆధునిక సాంప్రదాయ వైద్య పరీక్షలనే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది.  

అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తుంటాయి? ఉదాహరణకి కీమోథెరపీ ట్రీట్మెంట్ చూస్తే అందులో డ్రగ్ మెకానిజం వేగంగా వృద్ధి చెందే కణాలను నాశనం చేసేందుకు ఉపయోగపడుతుంది. కానీ శరీరంలో వేగంగా వృద్ధి చెందే కణాలు ఎక్కడున్నా అవి చనిపోవడం జరుగుతుంది. ఈ ఎఫెక్ట్స్ శరీరంపై విపరీత ప్రభావాలు చూపుతాయి. వీటినే మనం సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పుకుంటున్నాము. ఫలితంగా వీటికోసం మరో డ్రగ్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఎక్కువగా ఉపయోగిస్తే హానికరమని తెలిసినా, ఆరోగ్యంలో కొంచెం నలతగా అనిపిస్తే చాలు వెంటనే మెడికల్ షాప్ వైపు పరిగెత్తి ట్యాబ్లెట్ కొనుక్కుని వెంటనే వేసుకుంటారు. ఈ పద్ధతికి ఒకసారి అలవాటుపడిన తర్వాత ఇది తప్పని చెప్తే మాత్రం ఎంతమందికి అర్ధమవుతుంది? ఆ ఔషధాలు మన కళ్ళముందు తయారు కావని ఎక్కడో ల్యాబ్‌లో తయారైన కెమికల్స్‌ను ఉపయోగించి తయారుచేసినవని తెలిసినా కూడా వాటి పైన లేని సందేహం, ఆయుర్వేదంపైన ఎందుకు? అత్యంత ప్రామాణికమైన ఈ విధానంలో మరింత విశ్వసనీయత ఉన్న రసాయన ఆయుర్వేదాన్ని ఆచరిస్తున్న పునర్జన్ ఆయుర్వేదపైన ఎందుకు? మనం పుట్టిన ఇదే భూమిలో పుట్టిన వైద్య విధానం, మన పూర్వీకుల ఆరోగ్యకరమైన జీవితానికి నిదర్శనంగా, మనకు ప్రకృతి అందించిన వరంగా చెప్పుకోదగ్గ ఆయుర్వేద వైద్యాన్ని నమ్మటానికి ఎందుకు?

ఆయుర్వేదం సామర్థ్యం ఎంత? 

పునర్జన్ ఆయుర్వేద యూట్యూబ్ చానల్ ఓపెన్ చేసి చూస్తే, పునర్జన్ ఆయుర్వేదలో చికిత్స పొంది క్యాన్సర్‌తో సమర్ధవంతంగా పోరాడి నిలిచిన ఎందరో చిరునవ్వులు కనిపిస్తాయి. పునర్జన్ ఆయుర్వేద వ్యవస్థాపకులు శ్రీ బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు 25 సంవత్సరాలకు పైగా రసాయన ఆయుర్వేదంలో ఎన్నో పరిశోధనల ద్వారా ఆర్జించిన జ్ఞానాన్నంతా క్యాన్సర్‌పై పోరాడుతున్నవారికి ఉపయొగపడాలన్న సంకల్పంతో పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్‌ను స్థాపించారు. పేరుకు తగ్గట్టుగానే ఈ హాస్పిటల్ ద్వారా అనేక మంది క్యాన్సర్ పీడితులకు పునర్జన్మను ప్రసాదించి ఎన్నో కుటుంబాల్లో సంతోషాలు నింపారు. పునర్జన్ హాస్పిటల్స్‌లో అనుభవజ్ఞులైన, నిష్ణాతులైన వైద్య బృందం ఎంతో అంకితభావంతో ప్రతీ పేషెంట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బాధితుల జీవితాలు తిరిగి సాధారణమయ్యేంత వరకు పూర్తిస్థాయి ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తున్నారు.

ఆయుర్వేదం అనగా “ఆయుః” (ప్రాణం) + “వేదం” (శాస్త్రం) అనే రెండు పదాల కలయిక. అంటే ఇది ఆయుష్షుకు సంబంధించిన వేదం అని అర్ధం. మన శరీరం, మనస్సు, ఆత్మలను సమతుల్యం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేసే దివ్యమైన శాస్త్రం. 

ఆయుర్వేదం మనిషి జీవనశైలిని, ఆహారాన్ని, దోషాల(వాత, పిత్త, కఫ) స్థితిగతులను ఆధారంగా చేసుకుని చికిత్సను అందిస్తుంది. లోతుగా చూస్తే ఇది శరీరం సహజంగా స్వస్థతను పొందే విధంగా పనిచేస్తుంది.

రసాయన ఆయుర్వేదం అంటే..? 

రసాయన అంటే పునరుజ్జీవన శక్తిని అందించే ఔషధ సిద్ధాంతం. ఇది కణాల పెరుగుదలను నియంత్రించి కొత్త కణాలను ఉత్పత్తి చేసే విధంగా పనిచేస్తుంది. రసాయన చికిత్స ద్వారా సప్తధాతువులను పునరుద్ధరించి శారీరక శక్తిని, మానసిక శక్తిని పెంపొందిస్తుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. పునర్జన్ ఆయుర్వేద – రసాయన చికిత్సతో ఇతర క్యాన్సర్ చికిత్సలకు మద్దతుగా నిలిచి పేషేంట్ పూర్తిగా కోలుకోవడంలో తనదైన పాత్రను పోషిస్తుంది. ఇది కేవలం కేన్సర్‌ను “గుర్తించు – నాశనం చెయ్” అన్నట్టుగా కాకుండా శరీరాన్ని శక్తివంతంగా చేసి తనంతట తానే తిరిగి ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవడంలో దోహదపడుతుంది. ఇతరత్రా చికిత్సల వలన కలిగే దుష్ప్రభావాలను తగ్గుముఖం పట్టేలా చేసి వ్యాధి ప్రతిఘటక శక్తిని మెరుగుపరచి రోగి మానసిక స్థితిని బలపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

సమగ్ర చికిత్సా విధానం (Integrative Approach), సహాయక చికిత్సా విధానం (Supportive Care) రెండిటికీ ప్రాధాన్యతనిస్తుంది ఆయుర్వేదం. ఆధునిక వైద్యంలో భాగంగా సర్జరీ, కీమో, రేడియేషన్ వంటి చికిత్సలు సాధారణంగా క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించబడతాయి. వీటితోపాటు పునర్జన్ ఆయుర్వేద ట్రీట్మెంట్ పద్ధతులను సమన్వయంగా ఉపయోగించినట్లైతే శరీరాన్ని మానసికంగా, శారీరకంగా బలోపేతం చేస్తుంది. కీమో/రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకోక ముందు తీసుకున్న తర్వాత పరిస్థితిని పునర్జన్ ట్రీట్మెంట్ ద్వారా ఎలా అధిగమించారన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. శారీరక శక్తిని పెంపొందించే ఔషధాలు, ధాతుపుష్టిని పెంచే ఆహారం, ధ్యానం, యోగా, పంచకర్మ తదితర విధానాలు ఆయుర్వేదం అందించిన ప్రధాన విధానాలు. 

అందరి చూపు పునర్జన్ ఆయుర్వేద వైపే..  

ప్రముఖ సినీనటుడు శ్రీ తనికెళ్ళ భరణి గారు, వెండితెరపై నవ్వులు పూయించిన అలీ గారు వంటి ఎందరో ప్రముఖులు సైతం పునర్జన్ ఆయుర్వేదను సందర్శించి క్యాన్సర్ పేషేంట్లతో స్వయంగా మాట్లాడి  అభినందించారు. సామాన్యులతోపాటు , ఎందరో ప్రముఖుల మన్ననలు పొందిన పునర్జన్ ఆయుర్వేదపై ప్రజల్లో ఉన్న నమ్మకమే క్యాన్సర్ బాధితులను ఇటువైపు నడిపించింది. 

ఇదే అసలు రహస్యం 

దైవ వైద్యంగా పిలవబడే సాంప్రదాయ రసాయన ఆయుర్వేద వైద్యం అనేకానేక క్యాన్సర్ బాధితులకు ప్రాణశక్తిని పెంపొందించి క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సహాయపడుతోంది. ఆనందంగా సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఎందరో క్యాన్సర్ పేషేంట్ల ఆశీర్వాదమే క్యాన్సర్ ట్రీట్మెంట్లో పునర్జన్ ఆయుర్వేద ఆర్జించిన ప్రతిష్టకు నిదర్శనం. 

సందేహాలు, భయాలు పక్కనపెట్టండి, అపోహలకు తావివ్వకండి.

మీకు తెలిసిన వారిలో ఎవరైనా క్యాన్సర్ బారినపడిన వారుంటే వెంటనే సంప్రదించండి. మీ సందేహాలు అవే తొలగిపోతాయి.

 

Disclaimer:

This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.