క్యాన్సర్ నిర్దారణ తరువాత సమయం వృధా అవకుండా మనం ఎం చేయాలి !

You are currently viewing క్యాన్సర్ నిర్దారణ తరువాత సమయం వృధా అవకుండా మనం ఎం చేయాలి !

క్యాన్సర్ అనేది  మనిషిని మానసికంగా, శారీరకంగా ఒక మోయలేని బరువు. కానీ ఆ బరువు మనిషిని నేలమట్టం చేసేలోపే మనం దించేయాలి. ఆ బరువును మనిషి ఎంత కాలం మోయగలడనేది ఆ మనిషి పైనే ఆధారపడి ఉంది. కానీ ఆ బరువును దించే ప్రక్రియలో ప్రతీ నిమిషం ముఖ్యమే ! కాలానికి ఎదురుగా ఈదడమే క్యాన్సర్ తో ప్రయాణించడం.

ఆ నిమిషాలలో ఎం చేయాలి? ఎలాంటి ప్రశ్నలు అడగాలి? ఎలాంటి సమాధానాలు వెతకాలి? ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 

ఉదాహరణకు ఒక మనిషికి క్యాన్సర్ అని నిర్ధారణ అయింది అంటే  ఆ వ్యక్తి శారీరకంగా బలహీనపడకన్నా ముందే మానసికంగా బలహీనమవుతున్నాడు. చుట్టూ ఉండే వాళ్ళు మాట్లాడే మాటలు ధైర్యం కంటే ఎక్కువగా భయాన్నే ఇస్తున్నాయి. సరైన వైద్యమేదో తెలియక సరైన సూచనేదో తెలియక సతమతమైపోయి భయం అనే మరో క్యాన్సర్ బారిన పడి మరింత బలహీనమవుతున్నాడు. ఉన్న సమయాన్ని వృధా చేస్తున్నాడు. 

సమయం క్యాన్సర్ విషయంలో కీలకం.

అలా అవ్వకుండా ధైర్యంగా క్యాన్సర్ రికవరీ అవ్వడానికి ఎం చేయాలి ? 

అనేదే మీ ప్రశ్న అయితే ఇదే మా సమాధానం.

క్యాన్సర్ నిర్ధారణ జరిగిన తరువాత ముందు టైం వెస్ట్ అవ్వనివ్వకండి. ప్రతీ నిమిషాన్ని సమస్య నుండి బయటపదేందుకే ఉపయోగించండి. ముఖ్యంగా ప్రశ్నించండి, సమాధానాలు వెతకండి.

క్లారిటీ ధైర్యాన్ని ఇస్తుంది, అందుకే మీ సమస్య పై అవగాహన పొందండి.

మీకు వచ్చిన క్యాన్సర్ ఏ రకమైనది? అది పూర్తిగా నయం అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? అది స్ప్రెడ్ అవుతుందా లేదా ? సరైన చికిత్స మార్గాలేవి? ట్రీట్మెంట్ కి ఎంత సమయం పడుతుంది ?  అలవాట్లు ఏమైనా మార్చుకోవాలా?  ఆహార విధానం ఎలా చేంజ్ చేసుకోవాలి? ఇలా ప్రతీ విషయాన్ని ప్రశ్నించి సమాధానం తెలుసుకొని అవగాహన పెంచుకోండి. 

క్లారిటీ ధైర్యాన్ని ఇస్తుంది, మనకు ఏం జరుగుతుందో తెలియనప్పుడే ఎక్కువ భయపడతాం.

ఈ సమయం లో డిసిషన్ మేకింగ్ చాలా వేగంగా ఉండేలా చూడండి. నెలల పాటు ఏ చికిత్స తీసుకోవాలి అనే సందేహం తో ఉండకండి. ఎందుకంటే క్యాన్సర్ నిర్దారణ తరువాత అది పెరుగుతూ ఉంటుంది, మీరు సమయాన్ని వృధా చేయటం అంటే మీ క్యాన్సర్ ను తీవ్రం అవ్వడానికి మీరు దారిని సృష్టిస్తున్నట్లే. మీ స్నేహితుల, కుటుంబ సభ్యుల సహకారం తీసుకొని సరైన చికిత్సను ఎంచుకొని వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభం అయ్యేలా చూడండి. చికిత్సను ఎంచుకునే ముందు ఆ చికిత్స విధానం గురించి, కలిగే దుష్ప్రభావాల గురించి, అలాగే వాటి నుండి ఎలా బయట పడాలో కూడా తెలుసుకోండి.

ఆయుర్వేదంలో క్యాన్సర్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సర్జరీ, రేడియేషన్, కీమో లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా క్యాన్సర్ ను ఏంతో మందికి నయం చేసిన మా పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ హాస్పిటల్ మీకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది.

ధైర్యంగా, నమ్మకంతో ఉండండి. ఇది మీకు ఒక పరీక్షా సమయం మాత్రమే ! టైం వేస్ట్ చేయకండి.

మనుషులతో మాట్లాడండి, భయాలను లోపలే పెట్టుకొని సందేహాలతో కాలాన్ని గడపకండి. ఒంటరిగా ఫీల్ అవ్వకుండా, నలుగురితో సమస్యను చర్చించి సరైన పరిష్కార మార్గాన్ని అన్వేషించండి. అలాగే ఈ క్యాన్సర్ నిర్ధారణ మరియు క్యాన్సర్ చికిత్స మీకు మానసికంగా మరియు శారీరకంగా సవాళ్ళను విసరవచ్చు. ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే మీ రికవరీ కి మార్గామవుతుంది.

క్యాన్సర్ చికిత్స సమయంలో మీరు సరైన జీవనవిధానాన్ని ఎంచుకోవడం ప్రధానమైన అంశం. సరైన జీవన విధానం అంటే సరైన ఆహార అలవాట్లు, సరైన నిద్ర మరియు మంచి ఆలోచనలు కూడా. ఇవన్నీ మీ క్యాన్సర్ రికవరీ ప్రయాణాన్ని మరింత చేరువ చేస్తాయి. సమయం వృధా చేయకుండా  సరైన వైద్యం, సరైన జీవన విధానం మీరు ఎంచుకున్నట్లయితే క్యాన్సర్ ను జయించటం మీకు అంత కష్టమైన పనేమీ కాదు! మీరు ఎంచుకున్న వైద్యం పట్ల నమ్మకం, క్యాన్సర్ నయం చేసుకోగాలననే మీ ధృడ  సంకల్పమే మిమ్మల్ని కాపాడుతుంది ! 

మా పునర్జన్ ఆయుర్వేద ఎప్పుడూ మీకు తోడుంటుంది. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.