Bone Cancer : బోన్ క్యాన్సర్ లక్షణాలు , రకాలు ,చికిత్స

You are currently viewing Bone Cancer : బోన్ క్యాన్సర్ లక్షణాలు , రకాలు ,చికిత్స

బోన్  క్యాన్సర్ శరీరంలో ఏ ఎముక భాగంలోనైనా ప్రారంభం కావొచ్చు.  బోన్ క్యాన్సర్ ఎక్కువుగా కాళ్ళు మరియు చేతులు ఎముకలలో వస్తుంటుంది.  శరీరంలో ఏ ఎముకులకి క్యాన్సర్ వచ్చినా దానిని బోన్ క్యాన్సర్ అనలేము.  కొన్ని శరీరంలో ఎక్కడో ప్రారంభమై బోన్ వరకు వ్యాప్తి చెందుతుంటాయి.

దానిని బోన్ క్యాన్సర్ అనలేము. అలాంటి క్యాన్సర్లను  సెకండరీ క్యాన్సర్లు లేదా మెటాస్టాటిక్ క్యాన్సర్లని అంటారు. కాబట్టి బోన్ క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత మొదటగా అది ప్రాధమిక క్యాన్సరా? సెకండరీ క్యాన్సరా? అన్నది తెలుసుకోవాలి. అపుడే ట్రీట్మెంట్ చేయడం సాధ్యమవుతుంది.

బోన్ క్యాన్సర్ రకాలు:

బోన్ క్యాన్సర్లలో ఆస్టియో సార్కోమా, ఖండ్రో సార్కోమా, ఎవింగ్ ట్యూమర్, ఫైబ్రో సార్కోమా, జైంట్ సెల్ ట్యూమర్, ఖార్డోమా… అని కొన్ని రకాల క్యాన్సర్లున్నాయి.

ఆస్టియో సార్కోమా:  సాధారణంగా 10-30 ఏళ్ల మధ్య వయసువారికి మాత్రమే వస్తుంటుంది.

ఖండ్రో సార్కోమా:  వయసు పెరిగే కొద్దీ ఈ రకమైన బోన్ క్యాన్సర్ వస్తుంటుంది. కానీ చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ఈ క్యాన్సర్లు. కార్టిలేజ్ ఎముకలలో వచ్చే క్యాన్సర్లను ఖండ్రో సార్కోమా అంటుంటారు. యౌవనస్తుల్లో ఎక్కువగా ఈ రకమైన క్యాన్సర్లు కనిపిస్తుంటాయి.

ఎవింగ్ సార్కోమా:  దీన్నే ఎవింగ్ ట్యూమర్లని కూడా అంటూ ఉంటారు. 30 ఏళ్ళు పైబడిన వారిలో ఎవింగ్ సార్కోమా క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి.

ఫైబ్రో సార్కోమా: ఈ రకమైన క్యాన్సర్లు ఎముకల చుట్టూ ఉండే  మృదువైన కణజాలంలో మాత్రమే వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక్కోసారి లెగ్మెంట్ లోనూ కండరాల్లోనూ చూస్తూ ఉంటాం.

జైంట్ సెల్ ట్యూమర్: జైంట్ ట్యూమర్లను ఎక్కువగా మధ్య వయస్కుల్లో చూస్తూ ఉంటాం. అలాగని ఇది యౌవనస్తుల్లో ఇది కనిపించదని కాదు కానీ… వారికి కూడా ఈ రకమైన క్యాన్సర్ వస్తుంటుంది. చేతి ఎముకల్లోనూ, కాలి ఎముకల్లోనూ ఏ క్యాన్సర్లను ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. ఇందులో ప్రమాదం లేనివి, ప్రమాదకరమైనవి రెండు రకాలు ఉంటాయి.

ఖార్డోమా: వెన్ను లోనూ… పుర్రె ఎముకల్లోనూ ఈ రకమైన క్యాన్సర్లు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఫలానా వయసు వారికే ఈ తరహా క్యాన్సర్లు వస్తాయనడానికి లేదు. ఎవరికైనా ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశాలున్నాయి.  ఊపిరితిత్తులు, కాలేయం, లింఫ్ నాళాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి.

ఇవి బోన్ క్యాన్సర్లలో కొన్ని రకాలు.

సాధారణంగా ఎముకల్లో రక్త కణాలు తయారయ్యే మజ్జ నుంచి ప్రారంభమైతే దానిని బోన్ కాన్సర్ అనరు. దాన్ని ల్యుకీమియా అని అంటారు.

బోన్ క్యాన్సర్ లక్షణాలు

  1. తీవ్రమైన అలసట
  2. ఎముకల వాపు లేదా ఎముకల్లో బాగా నొప్పి కలగడం
  3. నీరసం కలగడం
  4. ఉన్నట్టుండి బరువు తగ్గిపోవడం
  5. రాత్రిళ్ళు చెమటలు పట్టడం
  6. తరచుగా జ్వరం రావడం
  7. ఎముకలు బలహీన పడటం

బోన్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

బోన్ క్యాన్సర్ నిర్ధారించడానికి కొన్ని నిర్దిష్టమైన పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా ఎముకల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లు గుర్తుపట్టడానికి వీలవుతుంది.

ఎక్స్ రే :

ఎక్స్ రే ద్వారా శరీరంలో ఏ ఎముకలో ప్రాబ్లెమ్ ఉన్నా తెలుసుకోవొచ్చు . శరీరంలో ఏ భాగంలో ఉన్న ఎముక విరిగినా , ఫ్రాక్చర్ అయినా సులభంగా ఎక్స్ రే ద్వారా తెలుసుకోవొచ్చు . ఎక్స్ రేల్లో క్యాన్సర్ గడ్డల పరిణామాన్ని స్పష్టంగా చూసే అవకాశముంటుంది.

ఎక్స్ రే తర్వాత బోన్ క్యాన్సర్లలో ఎక్కువగా బోన్ స్కాన్ నిర్వహిస్తుంటారు.

బోన్ స్కాన్ అంటే ఏంటి?

శరీరంలో ఎక్కడైనా ఎముకలు నొప్పి పుట్టినా… బాధ పెట్టినా వెంటనే బోన్ స్కాన్ చేస్తుంటారు.  బోన్ స్కాన్ లో ఏవైనా అసాధారణ లక్షణాలు కనపడితే అప్పుడు మెటబాలిజంలో తప్పు జరిగినట్లు నిర్దారిస్తారు.

ఈ పరిస్థితిలోనే డాక్టర్లు ఇది బోన్ కాన్సర్ ఏమో అని అనుమానించాల్సిన అవసరం ఉంది. అందుకే డాక్టర్లు సాధారణంగా ఎక్కడ ఎముకలు బాధించినా వెంటనే బోన్ స్కాన్ పరీక్ష చేయించమని సూచిస్తుంటారు.

ఇక బోన్ స్కాన్ తర్వాత బోన్ క్యాన్సర్ విషయంలో ప్రధానంగా చేసే మరో కీలకమైన పరీక్ష సీటీ స్కాన్ :

  • ఎముకల్లో లేదా ఎముక కండరాల్లో ట్యూమర్ గాని ఫ్రాక్చర్ గాని వుందేమో అని తెలుసుకోవడానికి సీటీ స్కాన్ చేస్తుంటారు.
  • సీటీ స్కాన్ ట్యూమర్ ఎముకలో ఎక్కడ ఉందో… దాని స్థితిగతులేంటో తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంటారు.
  • సీటీ స్కాన్ చేయడం ద్వారా ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కడైనా జరిగితే దాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
  • ఈ పరీక్ష చేయడం వలన క్యాన్సర్ గడ్డ యొక్క స్థితిగతులను గుర్తించడమే కాకుండా తదనంతర చికిత్స కూడా సులభతరమవుతుంది.

చివరగా సీటీ స్కాన్ కాకుండా బోన్ క్యాన్సర్ నిర్ధారణకు చేసే మరో పరీక్ష MRI (మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్) :

  • మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ టెస్టు శరీరం లోపల భాగాలను ఐస్కాంత తరంగాల ద్వారా తీసిన చిత్రాలతో చూడడానికి ఉపయోగిస్తూ ఉంటారు..
  • దీని వలన నెర్వస్ సిస్టం మరియు సాఫ్ట్ టిష్యూస్ లో లోపాలను తెలుసుకునే వీలుంటుంది.
  • వీటితో పాటు కంటి సమస్యలు, బ్రెయిన్ లోపలి గాయాలు, వినికిడిలో లోపాలతో పాటు ఇంకా ఇతర సమస్యలను కూడా తెలుసుకోవొచ్చు. ఈ పరీక్ష నిర్వహిస్తే చాలు క్యాన్సరును సులభంగా గుర్తించవచ్చు.

బోన్ క్యాన్సరు కి రసాయన ఆయుర్వేదంతో చికిత్స:

క్యాన్సర్లు శరీరంలోని ఇమ్యునిటీని నాశనం చేస్తే… రసాయన ఆయుర్వేదానికి ఇమ్యునిటీని అమాంతం పెంచే శక్తి ఉంది. ఇమ్యునిటీ పెరిగితే క్యాన్సర్లపై శరీరం దానంతటదే పోరాడుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యాన్సర్లపై ప్రత్యక్షంగా పోరాడుతుంది రసాయన ఆయుర్వేదం. నిర్దిష్టమైన ఆహార నియమాలు పాటిస్తూ రసాయన ఆయుర్వేదం పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే బోన్ క్యాన్సర్ ఉన్నవారు ఉపశమనం పొందే అవకాశముంటుంది. చక్కటి అనుభూత యోగాలతో క్యాన్సర్లను ఎదుర్కొనే శక్తిని, ఇమ్యునిటీని డెవలప్ చేసుకునే అవకాశాన్నిస్తుంది రసాయన ఆయుర్వేదం.  కాల్షియం డెవలప్ అవ్వడమే కాకుండా బోన్ మళ్ళీ పూర్వ స్థితికి చేరుకోవడంలో రసాయన ఆయుర్వేదం చక్కగా ఉపయోగపడుతుంది.

ముఖ్య గమనిక :

ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Also read: ఆయుర్వేదం ప్రకారం భావోద్వేగాలతో క్యాన్సర్ కి ఉన్న సంబంధం