Cancer Types: క్యాన్సర్ వ్యాధి ఎన్ని రకాలు ? గుర్తించడం ఎలా?

You are currently viewing Cancer Types: క్యాన్సర్ వ్యాధి ఎన్ని రకాలు ? గుర్తించడం ఎలా?

క్యాన్సర్ రకాలు (cancer types) గురించి ప్రధానంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే…  క్యాన్సర్ ఫలానా శరీర భాగాలకు మాత్రమే వస్తుందనేమీ లేదు. క్యాన్సర్ శరీరంలో ఏ భాగానికైనా వచ్చే అవకాశముంది. విడివిడిగా చెప్పుకుంటూ పోతే క్యాన్సర్లో చాలా రకాలున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్,  గర్భాశయ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, క్లోమ గ్రంధి క్యాన్సర్ ఇలా ఇంకాకొన్ని రకాలున్నాయి. క్యాన్సర్ ఫలానా అవయవాలకు మాత్రమే వస్తుందనేమీ లేదు…  కళ్ళకు, గుండెకు కూడా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది.  క్యాన్సర్ కణాలు శరీరంలోని ఏ భాగంలోనైనా వృద్ధి చెందవచ్చు.

మనుషుల ఇంటిపేర్లు తెలియనప్పుడు సాధారణంగా ఊరి పేరుతో పిలుస్తూ ఉంటాం. అలాగే సులువుగా గుర్తుపెట్టుకోవడం కోసం ఊపిరితిత్తులకు వస్తే లంగ్ క్యాన్సర్ అని… బ్రెస్ట్ కు వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అని… ఎముకల మజ్జలో వస్తే బోన్ క్యాన్సర్ అని…రక్తంలో వస్తే బ్లడ్ క్యాన్సర్ అని అంటుంటాం. ఇలా ఏ అవయవానికి క్యాన్సర్ వస్తే ఆ అవయవాన్ని పెట్టి క్యాన్సర్లను పిలుస్తూ ఉంటాం.

అసలు క్యాన్సర్ వ్యాధి (Cancer Types) ఎన్ని రకాలు?

క్యాన్సర్ సంక్రమించే శరీరభాగాల ఆధారంగా గ్రూపులుగా విభజించడం జరిగింది.

  • చర్మం మీద గానీ అవయవాల పొరల మీద గానీ వస్తే కార్సినోమా గ్రూపని
  • ఎముకలకి, కండరాలకి, రక్తనాళాలకి వస్తే సార్కోమా గ్రూపని
  • ఎముక మజ్జలో గానీ రక్తంలో గానీ వస్తే ల్యుకేమియా గ్రూపని
  • రోగనిరోధక వ్యవస్థకు సోకే క్యాన్సరును లింఫోమా & మైలోమా గ్రూపని అంటుంటారు.?
 
 
Cancer Types

Cancer / క్యాన్సర్ వ్యాధిని గుర్తించడం ఎలా?

సుదీర్ఘ కాలంపాటు జ్వరం ఉండటం, ఒక్కసారిగా నీరసం పెరగడం, వాంతులు విరేచనాలు ఎక్కువగా అవుతుండటం, ఆకలి నశించడం, బరువు తగ్గడం, శరీరంపై మచ్చలు ఏర్పడటం, శరీరంపై గడ్డలు ఏర్పడటం, పచ్చ కామెర్లు… మల మూత్రంలో తేడాలు రావడం ఇలా కొన్ని లక్షణాల ఆధారంగా క్యాన్సరును గుర్తించవచ్చు. అత్యధిక శాతం క్యాన్సర్ వ్యాధులు ట్యూమర్స్ లేదా కంతుల ద్వారా గుర్తించడానికి వీలవుతుంది.

అసలు ట్యూమర్స్ అంటే ఏంటి?

మనిషి శరీరంలో జీవకణాలు విభజన ప్రక్రియ ద్వారా  కొత్త కణాలు ఏర్పడుతుంటాయి. పాత కణాలు వయసు చెల్లిన తర్వాత అంతరించిపోతుంటాయి. ఇది శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియ. కానీ కొన్ని కణాలు వయసు అయిపోయిన తర్వాత కూడా నశించకుండా జ్ఞాపక శక్తిని కోల్పోయి మిగిలిపోతాయి.  ఇవి ఒక్కొక్కటిగా పేరుకుపోయి వీటి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. వీటినే మనం ఫ్రీ రాడికల్ సెల్స్ అంటుంటాం. ఇలా పేరుకుపోయిన కణాలు అన్నీ కూడా గడ్డలా ఏర్పడతాయి.  వీటినే మనం ట్యూమర్స్, కంతులు లేదా (Cancer) క్యాన్సర్ గడ్డలు అంటుంటాం.

ఈ ట్యూమర్స్ మళ్ళీ రెండు రకాలు…

మొదటిది బినైన్ ట్యూమర్స్. ఈ రకమైన ట్యూమర్ వలన ఎటువంటి ప్రమాదం లేదు.

ఈ గడ్డల వల్ల క్యాన్సర్ రాదు. చుట్టుపక్కల కణాలకు ఎటువంటి హానీ చేయవు.  ఈ తరహా గడ్డలను చిన్న సర్జరీ ద్వారా కూడాతొలగించవచ్చు. తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ విషయాలు ఎవరైనా మంచి డాక్టరుని సంప్రదించినా చెబుతారు.

రెండవది మాలిగ్నంట్ ట్యూమర్స్ అంటాము.  వీటినే మనం క్యాన్సర్ గడ్డలుగా పరిగణిస్తూ ఉంటాము. ఇవి చాలా ప్రమాదకరం. సాధారణ జీవకణాలకు భిన్నంగా ఇవి వేగవంతంగా వ్యాపిస్తాయి.

వీటిని కూడా శస్తచ్రికిత్స ద్వారా తొలగిస్తుంటారు. కానీ మాలిగ్నంట్ ట్యూమర్లు తొలగించినా మళ్లీ పెరుగుతాయి. ఎక్కడ ఆ గడ్డను తొలగించారో అక్కడే ఇవి పెరుగుతాయి అనుకోవడం పొరపాటు. ఇవి శరీరంలో ఎక్కడైనా రావచ్చు.  అవి కూడా హెచ్చింపు స్వభావంతో మరింత వేగంగా పెరుగుతాయి.  ఇవి శరీరంలో ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశముంది.

రసాయన ఆయుర్వేద చికిత్స:

రోగనిరోధక శక్తికి ఆధారమైన రసాయన ఆయుర్వేద చికిత్సలో క్యాన్సరుకు అద్భుత పరిష్కారాన్ని సూచిస్తోంది పునర్జన్ ఆయుర్వేద. ముందుగానే వ్యాధిని గుర్తించి పునర్జన్ ఆయుర్వేద డాక్టర్లను సంప్రదిస్తే వెంటనే చికిత్స ప్రారంభించి మంచి ఫలితాలను సాధించవచ్చు. ప్రాణాధారమైన ప్రకృతి వైద్యం ఆయుర్వేదాన్ని నమ్ముకుందాం. జీవితకాలాన్ని పొడిగించుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకుందాం.

మీకు ఎవైనా అనుమానాలుంటే మా టోల్ ఫ్రీ నెంబర్ 80088 42222 కి కాల్ చేయండి.

ముఖ్య గమనిక :

ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Also read: పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా “క్యానర్ వెల్ఫేర్ డే” కార్యక్రమం