loading

Cervical Cancer: సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స

 • Home
 • Blog
 • Cervical Cancer: సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స
Cervical-cancer-in-telugu

Cervical Cancer: సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స

Cervical-cancer-in-telugu

Cervical Cancer: సర్వైకల్ క్యాన్సర్ 

ఒకప్పుడు డబ్బున్న కుటుంబాల్లో మాత్రమే కనిపించే క్యాన్సర్ వ్యాధి కాలక్రమేణా తరగతి భేదం లేకుండా అన్ని తరగతుల వారిలో కనిపించడం మొదలైంది. మనకు ఉన్నట్లు వ్యాధికి ఈ తారతమ్యాలు లేకపోవడం దురదృష్టకరం. అనేకమంది అవగాహన లేక, కనీస జాగ్రత్తలు పాటించక క్యాన్సర్ బారిన పడుతున్నారు. దుర్భరమైన జీవన విధానం, శుభ్రత లోపించిన ఆహారపు అలవాట్లు కారణంగా క్యాన్సర్ కోరల్లో చిక్కుకుంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఆడవారిలో ఎక్కువగా కనిపించేది సర్వైకల్ క్యాన్సరే. సర్వైకల్ క్యాన్సర్ (cervical cancer symptoms) గురించి తెలుసుకునే ముందు సర్విక్స్ యొక్క నిర్మాణం గురించి తెలుసుకోవాలి. సర్విక్స్ గర్భాశయాన్ని యోనితో అనుసంధానం చేస్తుంది. సర్విక్స్ గర్భాశయానికి కింది భాగంలో పెల్విస్ లోపల ఉంటుంది.  స్త్రీలకు నెలసరి సమయంలో గర్భాశయం నుంచి వెలువడిన రక్తం సర్విక్స్ ద్వారానే యోనిలోకి ప్రవేశించి బయటకు వస్తుంటుంది. సంభోగం జరిగే సమయంలో పురుషుడు వదిలిన వీర్యం సర్విక్స్ ద్వారానే గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది. స్త్రీలు గర్భం దాల్చినప్పుడు గర్భంలో ఉన్న బిడ్డ జారిపోకుండా సర్విక్స్  గర్భాశయ ముఖద్వారాన్ని గట్టిగా పట్టి ఉంచుతుంది.

సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer) ఎందుకు వస్తుంది.?

ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుందనే వివరాలపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. కానీ కొన్ని కారణాల వలన మాత్రం కొంతమంది స్త్రీలలో సర్వైకల్ క్యాన్సర్ వస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు.

 • సాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ గ్రామీణ ప్రాంతాల్లోనూ, వెనుకబడిన ప్రాంతాల్లోనూ ఉన్న స్త్రీలకు ఎక్కువగా వస్తుంటుంది.
 • జననేంద్రియాల వద్ద శుభ్రత పాటించక పోతే కలిగే ఇన్ఫెక్షన్ల వలన, హ్యూమన్ పాపిలోమా వైరస్ వలన సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటుందని నిరూపితమైంది.
 • కొంతమంది స్త్రీలు ఎక్కువమంది పురుషులతో సంభోగం చేస్తుంటారు. దానివలన వచ్చే ఇన్ఫెక్షన్లు క్యాన్సర్గా మారే అవకాశముంది.
 • రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలోనూ,
 • గర్భ నిరోధక మందులు వాడే స్త్రీలలోనూ,
 • అధిక సంతానం ఉన్న స్త్రీలలోనూ,
 • పొగతాగే అలవాటు ఉన్న స్త్రీలలోనూ ఇంకా సుఖవ్యాధులు ఉన్న స్త్రీలలో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాము.
Cervical-Cancer-symptoms-and-signs-in-telugu

Cervical Cancer Symptoms – సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు:

 • సర్వైకల్ క్యాన్సరును కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు.
 • వాటిలో ప్రధానంగా పొత్తికడుపులో నొప్పి రావడం,
 • సంపర్కం చేస్తున్న సమయంలో నొప్పి కలగడం,
 • నెలసరికి నెలసరికి మధ్యలో రక్తస్రావం కావడం,
 • నెలసరి గడువు ముగిసిన తర్వాత కూడా రక్తస్రావం కొనసాగుతూ ఉండడం,
 • యోని నుంచి అసాధారణ రీతిలో రక్తస్రావం కావడం,
 • తెల్లటి డిశ్చార్జి రావడము,
 • మెనోపాజ్ దశలో కూడా బహిష్టు స్రావం అవుతుండడం,
 • గర్భాశయ ముఖద్వారం నుంచి దుర్వాసన రావడం వంటి లక్షణాలను బట్టి సర్వైకల్ క్యాన్సర్ ను గుర్తించవచ్చు.

వీటిలో ఏ లక్షణం కనిపించినా ప్రారంభదశలోనే డాక్టరును సంప్రదిస్తే  వ్యాధి నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు చేస్తారు.

నిర్థారణ పరీక్షలు:

పాప్ స్మియర్ టెస్ట్:

సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer) పరీక్షల్లో ప్రధానంగా పాప్ స్మియర్ టెస్ట్ చేస్తుంటారు.  స్పెక్యులమ్ అనే పరికరం ద్వారా  సర్విక్స్ లో  సహజంగా ఉత్పత్తయ్యే మ్యూకస్ ముద్దను  సేకరించి దానిని పరీక్ష నిమిత్తం పంపుతారు.

క్లినికల్ టెస్టింగ్:

పద్ధతిలో పరీక్ష నిర్వహించి సర్వైకల్ క్యాన్సర్ పాజిటివ్, నెగటివ్ గా నిర్ధారిస్తూ ఉంటారు.  ఒకవేళ పాజిటివ్ అని నిర్ధారణ అయితే అది ఎన్నో దశలో ఉందనే వివరాలు తెలుసుకోవడం కోసం మరిన్ని పరీక్షలు నిర్వహిస్తుంటారు. సర్వైకల్ క్యాన్సర్ (cervical cancer symptoms) తీవ్రతను గుర్తించిన తర్వాత దానిని నయం చేయడానికి పలు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer) చికిత్సా విధానం:  

కోన్ బయాప్సీ, లేజర్ బీమ్ ట్రీట్మెంట్, శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి విధానాలతో సర్వైకల్ క్యాన్సర్ కు చికిత్స చేస్తుంటారు.  ప్రాథమిక చికిత్స పూర్తయిన తర్వాత క్యాన్సర్ కణాలు తొలగించాక  ఫాలోఅప్ ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటూ ఉండాలి.  పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే చికిత్స అనంతరం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జాగ్రత్త పడవచ్చు.

ప్రారంభ దశలోనే గుర్తిస్తే సర్వైకల్ క్యాన్సర్ 95 శాతం మందికి నయమైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆలస్యం చేస్తే మిగిలిన క్యాన్సర్ల లాగే సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా జటిలమవుతుంది. ప్రాణాపాయం కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు.

క్యాన్సర్ ఏదైనా ఎప్పుడు గుర్తించామన్న దాని మీదే పరిష్కారం ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్లో ఉన్న ప్రధాన సమస్య కూడా ఇదే. చిన్న చిన్న అనారోగ్యాలను నిశితంగా గమనించి పరీక్షిస్తే తప్ప క్యాన్సరును ప్రారంభ దశలో గుర్తించడం దాదాపు అసాధ్యమే. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యాన్ని దరి చేరనీయక వ్యాధి చిన్నదైనా సొంత వైద్యాలకు తావివ్వక డాక్టరును సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. సమస్య తీవ్రతను మనము గుర్తించలేకపోవచ్చు కానే డాక్టర్లు తప్పక గుర్తిస్తారు.

మిగిలిన క్యాన్సర్ల కంటే సర్వైకల్ క్యాన్సరర్లో ఒక ప్రయోజనముంది. క్యాన్సర్ రాక ముందే పాప్ స్మియర్ టెస్టు చేయడం ద్వారా ఈ వ్యాధిని తెలుసుకోవచ్చు, వ్యాధి వచ్చే సూచనలను ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష చేయడం వలన సర్వైకల్ క్యాన్సరు రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు.

cervical cancer ayurvedic treatment - punarjan ayurveda

ఆయుర్వేద వైద్యం:

ఆయుర్వేద వైద్యంలో సర్వైకల్ క్యాన్సరుకు అద్భుతమైన చికిత్స అందుబాటులో ఉంది. రోగనిరోధక శక్తికి ఆధారమైన రసాయన వైద్యంలో రోగికి అటు వ్యాధికి చికిత్స అందిస్తూనే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది పునర్జన్ ఆయుర్వేద. ఒక్క సర్వైకల్ క్యాన్సరే కాదు రకరకాల క్యాన్సర్లతో బాధపడుతున్న ఎందరో బాధితులు పునర్జన్ ఆయుర్వేద ద్వారా శాశ్వత ఉపశమనాన్ని పొందారు. పొందుతున్నారు కూడా.

సర్వైకల్ క్యాన్సరుకు సంబంధించి మీకున్న సందేహాలను మా టోల్ ఫ్రీ నెంబరు 8008842222 కి కాల్ చేసి అడగండి.

Know more about: Best cancer hospital in Kerala

Book Appointment


  Follow On Instagram

  punarjan ayurveda hospital logo

  Punarjan Ayurveda

  16k Followers

  We have a vision to end cancer as we know it, for everyone. Learn more about cancer Awareness, Early Detection, Patient Care by calling us at +(91) 80088 42222

  Call Now