పేగు(కొలోన్ ) క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స

You are currently viewing పేగు(కొలోన్ ) క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స

పెద్దపేగు క్యాన్సర్ ను కొలోన్ క్యాన్సర్ లేదా కొలొరెక్టల్ క్యాన్సర్ అంటారు. ఈ రకమైన క్యాన్సర్ వచ్చినప్పుడు గడ్డలు పెద్దపేగులో ఎక్కడైనా ఏర్పడే అవకాశముంది. పెద్దపేగు క్యాన్సర్లలో 65  శాతం రెక్టమ్ భాగంలోనూ 20 శాతం ట్రాన్స్ వెర్స్ కొలోన్ (అడ్డ పేగు) లోనూ, 15 శాతం క్యాన్సర్లు పెద్దపేగు మొదలు భాగమైన సీకం వద్ద వస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది.

మన శరీరంలో జీర్ణవ్యవస్థ అత్యంత ప్రాముఖ్యమైనది.

సాధారణంగా అన్నవాహిక దగ్గర మొదలయ్యే జీర్ణప్రక్రియ పెద్దపేగు దగ్గర ముగుస్తుంది. పెద్దపేగు నిర్మాణం సీకం(కుడివైపు కోలన్)తో మొదలై ట్రాన్స్ వెర్స్ పేగు (అడ్డ పేగు), లెఫ్ట్ కొలోన్, సిగ్మాయిడ్ కొలోన్, పురీషనాళం లేదా రెక్టమ్ వరకు ఉంటుంది.

అన్నవాహిక నుండి మలద్వారం వరకు జీర్ణప్రక్రియ జరిగే ఈ అవయవ సముదాయాన్ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటారు. నోటిద్వారా తీసుకున్న ఆహారం అన్నవాహిక నుండి కడుపులోకి చేరుతుంది. కడుపులో  జీర్ణమైన ఆహారం అక్కడి నుండి చిన్నపేగులోకి వెళ్తుంది. చిన్నపేగు ఆహారంలోని పోషకాలను మలినాలను వేరు చేసి పోషకాలను రక్తంలోకి, మలినాలను పెద్దపేగులోకి పంపిస్తుంది. ఈ మలినం మలంగా మారి రైట్ కొలోన్ లేదా సీకం (పైకి వెళ్ళే పేగు) ద్వారా పెద్దపేగులోకి ప్రవేశించి ట్రాన్స్ వెర్స్ కొలోన్, లెఫ్ట్ కొలోన్ (కిందకి వెళ్ళే పేగు), సిగ్మాయిడ్ కొలోన్, రెక్టమ్ ద్వారా మలద్వారం నుండి బయటకు వెళ్తుంది. పెద్దపేగు శరీరానికి కావాల్సిన నీటిని, లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను అందిస్తుంటుంది. ఇది పెద్దపేగు యొక్క నిర్మాణం మరియు పనితీరు.

కొలోన్ క్యాన్సర్ కారణాలు

పెద్దపేగు క్యాన్సర్ రాకుండా నివారించాలంటే ముందు దీని కారణాలు, లక్షణాలు తెలియాలి.

అసలు పెద్ద పేగు కేన్సర్ రావడానికి కారణాలేంటి?

పెద్దపేగు క్యాన్సర్ రావడానికి ఫలానా కారణాలున్నాయని చెప్పడం కష్టం. కానీ ఇంతవరకు వచ్చిన పేగు క్యాన్సర్ కేసుల ఆధారంగా ఈ కారణాల వలన ఈ క్యాన్సర్ వస్తుందని మాత్రం చెప్పవచ్చును.

  1. పెద్దపేగు క్యాన్సర్ ఎక్కువగా 50 ఏళ్ళు పైబడిన వారిలోనే చూస్తుంటాము. ఈ వయసు వారిలో పేగులోపలి గోడల మీద పులిపిర్లు ఏర్పడుతుంటాయి. ఈ పులిపిర్లులో ఎక్కువ శాతం ప్రమాదరహితమైనవే ఉంటాయి. కొన్ని పులిపిర్లు మాత్రం క్యాన్సరుకు దారితీస్తుంటాయి.
  2. కొంతమందికి పెద్దపేగు లోపల పూతలా ఏర్పడుతుంటుంది. వీటిని అల్సర్ పుండ్లు అంటుంటారు. ఇవి ఉన్నవాళ్ళకు పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
  3. కుటుంబ చరిత్రలో పెద్దపేగు క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కొంత జాగ్రత్త వహించాలి. అలాంటి వారికి కూడా పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి.
  4. గతంలో పేగు క్యాన్సర్ వచ్చి చికిత్స చేయించుకుని తగ్గినవారికి ఇది మళ్ళీ వచ్చే సూచనలున్నాయి.
  5. ఆహారపు అలవాట్లు అస్తవ్యస్తంగా ఉన్నవారికి ఎక్కువగా పేగు క్యాన్సరు వస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు వంటి పీచు పదార్ధం ఉన్న ఆహారం తక్కువగా తింటూ నిల్వచేసిన ప్రాసెస్ చేసిన మాంసం తినేవారికి పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. జంక్ ఫుడ్ తినడం వలన పెద్దపేగులో పుండ్లు పడి క్యాన్సర్ గా మారే అవకాశముంది. గోడలకు పోస్టర్లు అంటించడానికి వాడే మైదా పిండి పదార్ధాలు… సమోసాలు, మైసూర్ బజ్జీలు, కేకులు, బన్నులు, పిజ్జాలు, నూడుల్స్ వంటివి తినడం కారణంగా జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఇవి ఒక్కోసారి క్యాన్సరుకు దారితీస్తాయి.
  6. మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్నవారిలో, శరీర అలసట లేనివారిలో, స్థూలకాయం ఉన్నవారిలో పేగు క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాము.
  7. వ్యాయామం చేయకపోవడం, శరీరాన్ని కదలనీయకుండా స్థిరంగా ఉంచడం వలన పెద్దపేగులో ఇబ్బందులు రావచ్చు. అస్తవ్యస్తమైన జీవనశైలి కూడా పెద్దపేగు క్యాన్సరుకు కారణం కావచ్చు.

పెద్దపేగు  పేగు క్యాన్సర్ లక్షణాలను ఎలా గుర్తించాలి?

పెద్దపేగు క్యాన్సర్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే దీని లక్షణాలను గుర్తించడం కొంచెం కష్టం.

  1. పైల్స్, ఫిస్టులా వంటి వ్యాధుల లక్షణాలకు దగ్గరగా ఉండడం వలన ఎవరూ పెద్దపేగు క్యాన్సరును ముందుగా గుర్తించలేరు. అనుమానం వచ్చినా అది సాధారణ పైల్స్ అనుకుని ట్రీట్మెంట్ తీసుకుంటారు తప్ప పెద్దపేగు క్యాన్సరని అనుమానించరు. పైల్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అనుమానించాలి.
  2. పెద్దపేగు క్యాన్సర్ వస్తే మొదటగా మలవిసర్జనలో మార్పులు చోటుచేసుకుంటాయి. మలవిసర్జనలో ఎటువంటి మార్పులు కనిపించినా వెంటనే డాక్టరును సంప్రదించాలి.
  3. మలద్వారం వద్ద నొప్పి ఉండడం
  4. ఆహారం తింటున్నా అకారణంగా బరువు తగ్గడం
  5. ఏమి తిన్నా వాంతులు అవుతుండడం
  6. మలం సన్నగా పెన్సిల్ లా లేదా రిబ్బన్ లా అవుతుండడం
  7. మలం నల్లగా అవుతుంటే మలంలో రక్తం పోతున్నట్లు. ఈ లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే అప్రమత్తమవ్వాలి.

కొలోన్ క్యాన్సర్ నివారణ  జాగ్రత్తలు

పెద్దపేగు పాత్ర పూర్తిగా జీర్ణప్రక్రియకు సంబంధించినది కాబట్టి సరైన ఆహారం తీసుకుంటూ  ఆహారపు అలవాట్లను మార్చుకుంటే పెద్దపేగు క్యాన్సరును సులువుగా నివారించవచ్చు.

  1. పీచు పదార్ధం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తింటే సులువుగా జీర్ణమవుతుంది. పెద్దపేగులో ఎటువంటి సమస్యలు ఉండవు.
  2. మైదాపిండి వంటకాలకు స్వస్తి పలకాలి.
  3. రోడ్ల పక్కన తినే అలవాటును పూర్తిగా మానుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్ కూడా పెద్దపేగుకు హాని కలగజేస్తాయి. మసాలా వంటకాలకు దూరంగా ఉండాలి.
  4. పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
  5. క్రమం తప్పకుండా శరీరానికి వ్యాయామం మానసిక ఉల్లాసానికి ప్రాణాయామం చేయాలి.
  6. ఊబకాయం రాకుండా జాగ్రత్తపడాలి.
  7. కాలుష్యానికి దూరంగా ఉండాలి.

రసాయన ఆయుర్వేదంతో కొలోన్ క్యాన్సర్ కి చెక్:

కొలోన్ క్యాన్సర్ కేసుల్లో కూడా రసాయన ఆయుర్వేదం దివ్యంగా పనిచేస్తుంది.  వ్యాధి మూలాల నుంచి రసాయన ఆయుర్వేదం సమర్ధవంతంగా క్యాన్సర్ కణాలను తొలగించుతూనే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.  కాబట్టి భయపడాల్సిన అవసరమేమీ లేదు. కొలోన్ క్యాన్సర్ వచ్చినా కూడా రసాయన ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తే చక్కటి పరిష్కారం లభిస్తుంది.

ముఖ్య గమనిక :

ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Also read: మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు మరియు ప్రీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్లు అంటే ఏమిటి ?