ఏ పాత్రలో నీరు త్రాగితే ఎంత ప్రయోజనమో మీకు తెలుసా?

You are currently viewing ఏ పాత్రలో నీరు త్రాగితే ఎంత ప్రయోజనమో మీకు తెలుసా?

నీరు మనకు జీవనాధారము. నీరు మన  శరీరరంలోని ఉష్ణోగ్రతను నియంత్రించడం, అవసరమైన ఎలక్ట్రోలైట్లను సరైన మోతాదులో ఉంచడం, హైడ్రేషన్ వంటి అనేక విధులను నిర్వర్తిస్తుంది. అందుకే నీరు, మనకు అత్యంత ముఖ్యమైన లైఫ్ లైన్. మన దైనందిన జీవితంలో మనము నీరు త్రాగడానికి వేర్వేరు పాత్రలను ఉపయోగిస్తున్నాము. అయినా మనకు వాటి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. కావున నీరు త్రాగేటపుడు ఏ పాత్రల ద్వారా ఎటువంటి ప్రయోజనాలు పొందుతామో అనే విషయాలను తెలుసుకుందాం…

మట్టి కుండ ద్వారా నీరు త్రాగడం 

మన ప్రాచీన భారతీయ సాంప్రదాయం నుంచి మట్టి కుండలను నీరు త్రాగడానికి ఉపయోగిస్తున్నాము. ఇప్పటికి మనము చల్లని నీరు కోసం ఎండాకాలంలో వీటినే వాడుతున్నాము. మట్టి కుండలు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ, అనేక ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.

సహజంగా చలువ చేసే లక్షణం

మట్టి కుండలో సూక్ష్మమైన చాలా రంధ్రాలు ఉంటాయి. ఇది నీటిని సహజంగానే చల్లపరచటంలో సహాయపడుతుంది.   

ఆల్కలీన్ గుణం 

మట్టి లేదా బంక మట్టి అనేది ప్రకృతి పరంగా ఆల్కలీన్ గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది మనము తీసుకునే ఆమ్ల ఆహారాల ద్వారా వచ్చే pHని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. 

మెటబాలిజాన్ని పెంచుట

కుండలో ఎటువంటి రసాయనాలు ఉండవు. అలాగే మట్టిలో సహజంగానే ఉండే ఖనిజాలు కుండ నీరుకి, మన జీవక్రియలను సరిగా పని చేసే శక్తీని కలిగిస్తుంది.

వడదెబ్బను నియంత్రించుట

మట్టిలోని ఖనిజాలు, పోషకాలు కలిసిన కుండ నీరు త్రాగడం వేసవిలో కలిగే వడదెబ్బను నివారించడంలో సహాయం చేస్తుంది.

గొంతుకి సున్నితత్వాన్ని అందించుట 

సహజంగా చల్ల బడిన నీరు గొంతుకు సున్నితమైన అనుభూతిని ఇస్తుంది. ఈ చల్లని నీరు, రిఫ్రిజెరేటెడ్ నీరులా మనకు జలుబు,దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను కలిగించదు.

సహజంగా నీరుని శుద్ధీ చేయుట

ఇది నీటిని సహజంగా చల్లబరచటమే కాకుండా వాటికి ఉండేసుఉక్ సూక్ష్మమైన రంద్రాల ఆకృతి ద్వారా వివిధ కలుషితాల నుండి నీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. 

ఇత్తడి పాత్రల ద్వారా నీరు త్రాగడం 

ఇత్తడి అనేది రాగి మరియు జింక్లను నిష్పత్తిలో కలపబడిన ఒక అల్లోయ్. మన పాత కాలంలో ఇత్తడి పాత్రలను నీరుని నిల్వ ఉంచేడానికి ఉపయోగించేవాలము. ఈ ఇత్తడి పాత్రలలోని నీరు మనకు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

  •  ఇత్తడిలోని జింక్, కణాల విస్తరణ, కణజాల పునరుత్పత్తి మరియు రోగనిరోధక పనితీరు వంటి ఇంటర్ లింక్డ్ ప్రక్రియలతో మన శరీరంలోని గాయలను నయం చేయగల శక్తిని అందిస్తుంది.
  • రాగి, జింక్ కలయికతో ఉన్న ఇత్తడి, రక్తపోటును మరియు మధుమేహం వంటి ఇతర మెటబాలిక్ రుగ్మతలను నియంత్రిస్తుంది.
  • కొల్లాజెన్ మరియు హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది.
  • జింక్ మాక్యులర్ డిజెనరేషన్ వంటి వయస్సు సంబంధిత కంటి సమస్యలను నివారిస్తుంది. 
  • మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, జ్ఞాపకశక్తి మరియు మానసిక విధులను మెరుగుపరుస్తుంది. 
  • ఇత్తడి మొటిమలు, తామర వంటి చర్మ వ్యాధులను నివారించడంలో సహాయం చేస్తుంది. 
  • జింక్ మెలనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. 
  • జింక్ కొల్లాజెన్ ఏర్పడటాన్ని ప్రేరేపిస్తూ, చర్మంపైన ముడుతలను తగ్గించగలదు. 

రాగి పాత్రల ద్వారా నీరు తాగడం

రాగి ఒక ముఖ్యమైన ట్రేస్ మినరల్. రాగిని పురాతనమైన నాగరికతల సమాజాలలో మరియు భారతీయ ఆయుర్వేద గ్రంథాలలో తాగునీటి కోసం రాగి పాత్రలను ఉపయోగించడాన్ని తెలుపుతున్నాయి. అలాగే 1880 సంవత్సరము నుండి యాంటీ బాక్టీరియల్ లక్షణం కోసం ఉపయోగించబడిన ఏకైక లోహం రాగి. రాగి పాత్రలలో రాత్రిపూట నిల్వ చేసిన నీటిని తీసుకోవడం చాల మంచిదని చెప్తున్నారు. అలాగే మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని తెలుపుతున్నారు.

రాగి గురించి తెలుసుకోవాల్సిన కొన్ని సత్యాలు

  • రాగి మానవ శరీరంలోని దాదాపు 30 ఎంజైమ్లతో ముడిపడి ఉంటుంది. 
  • తగినంత రాగి శరీరంలో లేకపోవడం వలన నెలలు నిండకుండానే జరిగే జననాలకు దారితీయవచ్చు.
  • రాగి లోపం విరేచనాలను కలిగించవచ్చు. 
  • రాగితో పోలిస్తే జింక్ ఎక్కువగా గ్రహించబడుతుంది అందుకే రాగి మరియు జింక్ ఖనిజాలను సమపాళ్ళలో తీసుకోవాలి.    

రాగి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

  • రాగికి యాంటీమైక్రోబియల్, యాంటీ-క్యాన్సర్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. కావున శరీరంలోని టాక్సిన్స్ను తగ్గించడంలో సహాయ పడుతుంది. 
  • రాగి పాత్రలలోని నీరుకి సహజ ఆల్కలీన్ గుణం ఉంటుంది, ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తూ, ఆమ్ల స్వభావాన్ని సమతుల్యం చేస్తుంది.
  • ఆయుర్వేదం ప్రకారం, ఇది శరీరంలో ‘అగ్ని’ అనే జీర్ణ శక్తీని పెంపొందిస్తూ, మనలోని త్రిదోషాలను (వాట, పిట్ట మరియు కఫా) సక్రమంగా నిర్వహిస్తుంది. 
  • ఇది జీవక్రియల మెటబాలిజాన్ని మెరుగుపరుస్తూ, జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో రాగి నీటిని “తామ్ర జలము” అని అంటారు. ఇది కడుపులో డిటాక్సిఫికేషణ్ను చేస్తూ, శుభ్రపరుస్తుంది. రాగి ప్రేగులలో పెరిస్టాల్సిస్ అనే ప్రక్రియను సరిగ్గా నిర్వహించేలా చేస్తుంది.
  • నీటిలోని pHని సమతుల్యం చేస్తుంది
  • రోగనిరోధకశక్తిని పెంచుతుంది 
  • గాయలను నయం చేయడంలో సహాయపడుతుంది 
  • వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది
  • రాగి సముదాయాలు క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తుంది.
  • న్యూరాన్ల చుట్టూ మైలిన్ తొడుగులను ఏర్పరిచే ఫాస్ఫోలిపిడ్ తయారీ ద్వారా మెదడును ప్రేరేపిస్తుంది.
  • థైరాయిడ్ గ్రంధి సరైన పనితీరులో రాగి సహాయపడుతుంది. 
  • రక్తపోటు తగ్గిస్తుంది 
  • ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది
  • రాగి మూర్ఛలను నిరోధించే యాంటీ కన్వల్సెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.
  • రక్తహీనతను నివారిస్తుంది 
  • రాగికి ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్కు  ప్రయోజనకరమైన ఉపశమనాన్ని అందిస్తాయి. రాగి ఎముకలను బలపరిచే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. 

స్వచ్ఛమైన మరియు కల్తీ రాగి పాత్రను ఎలా తనిఖీ చేయాలి

  • రాగి మృదువైన లోహం కాబట్టి, సంక్లిష్టమైన డిజైన్లతో ఉండే ఆకృతులను పొందలేము. మీకు ఎక్కడైనా దృఢమైన, సంక్లిష్టమైన డిజైన్లతో ఉండే రాగి పాత్రలు దొరికితే అది స్వచ్ఛమైన రాగి పాత్ర కాదు.
  • రాగి పూతతో కూడిన పాత్రలను నివారించండి. అలాగే స్వచ్ఛమైన రాగి పాత్రలను తీసుకుంటేనే మంచి ప్రయోజనాలను పొందగలము.

రాగి పాత్రలను ఎలా శుభ్రం చేయాలి 

  • ఉప్పు, వెనిగర్, బేకింగ్ సోడా వంటి పదర్థాలతో రాగి పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. 
  • ఆక్సీకరణ కారణంగా రాగి పాత్రల పైన ఆకుపచ్చ లేదా నల్ల మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. అందుకు తరచుగా రాగి పాత్రలను  శుభ్రపరచుకోవడం మంచిది. 

రాగి పాత్రలు వాడేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు  

  • త్రాగునీటి ప్రయోజనాల కోసమే రాగి పాత్రలను ఉపయోగించాలి, కానీ ఆమ్లము, ఆల్కలీన్ గుణాలు కలిగిన ఆహార పదార్థాలను రాగి పాత్రలలో ఉపయోగించకూడదు. 
  • మన శరీరానికి రోజుకి 12 mgల రాగి అవసరము. కాబట్టి, రోజుకు మూడు గ్లాసుల రాగి నీటిని తీసుకుంటే సరిపోతుంది అని తెలుపుతున్నారు. ఎక్కువగా తీసుకుంటే అది రాగి టాక్సిసిటీకి దారితీయవచ్చు. 
  • రాగి పాత్రలను రేఫ్రిజేరటర్లో ఉంచకూడదు.

చివరగా

ప్రధానంగా మానవ శరీరానికి 2-3 లీటర్ల నీరు అవసరం కాబట్టి, ఏ పాత్రలో తీసుకుంటామో అనే దానితో సంబంధం లేకుండా నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. పాత్రల ఎంపిక పూర్తిగా వ్యక్తుల సౌకర్యం, ఇష్టం, ఆర్థిక పరిస్థితితో ఆధారపడి ఉంటుంది. మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల పరంగా చూస్తే మట్టి కుండలు మరియు రాగి పాత్రలలో త్రాగునీరు తీసుకోవడం ఎలప్పుడు గొప్ప ఎంపిక అవుతుంది. ఇప్పుడు త్రాగునీటికి కోసం ఏ పాత్రను ఎంచుకుంటారో ఇక మీ వంతు.

Also Read: సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు మన ఆరోగ్యానికి మంచివి?