క్యాన్సర్ కణాల వ్యవహారశైలిని బట్టే క్యాన్సర్లకు ట్రీట్మెంట్ అందించాల్సిన అవసరముంది. గుణానికి అనుగుణంగా స్పందిస్తుంది కాబట్టే రసాయన ఆయుర్వేదం మొట్టమొదటిగా వ్యాధినిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ సోకిన అవయవాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతూనే వ్యాప్తిని అడ్డుకుని క్యాన్సర్ కణాలను నియంత్రించగలుగుతోంది. సాంకేతికతకు అంతుచిక్కని అర్బుదాలకు రసాయన ఆయుర్వేదం ఆయా క్యాన్సర్లను బట్టి ఆయా పరిష్కారమార్గాలను సూచించగలిగింది.
అధునాతన టెక్నాలజీకి అర్బుదరాశుల స్థితిగమనాల పట్ల అవగాహన ఉండి ఉంటే ఈ మహమ్మారి ఇంతగా ప్రబలి ఉండేది కాదు. ప్రాణమున్న క్యాన్సర్ కణాలపై ప్రాణంలేని సాంకేతికత ప్రభావం చూపడం సంగతి అటుంచితే అవయవాల పనితీరుపై వాటి ప్రభావం లేకుండా ఎంతవరకు కట్టడి చేయగలుగుతుందనేదే మనం గమనించాలి. సాకేంతిక పరిజ్ఞానంతో అర్బుదాల పరిణామక్రమం పరిమాణం వంటి విషయాలనైతే గ్రహించగాలుగుతున్నాం కానీ వాటిని హరించే విషయంలో మాత్రం వెనకబడిపోయామనే చెబుతున్నాయి అధ్యయనాలు. కానీ రసాయన ఆయుర్వేదం ప్రయోగాల వైద్యం కాదు ప్రయోజనాల వైద్యమని సిద్ధమునులు ఏనాడో తెలిపారు. క్యాన్సర్ కణాల వ్యవహారశైలి పట్ల సంపూర్ణ అవగాహనతోనే రసాయన ఆయుర్వేదం వాటి స్వభావానికి అనుగుణంగా అనేక అనుభూతయోగాలతో కట్టడి చేయగలుగుతోంది.
ప్రాధమికంగా మానవ శరీరంలో జీవక్రియ సజావుగా సాగితే ఎటువంటి క్యాన్సర్ కణాలు పుట్టే అవకాశమే లేదని చెబుతుంది ఆయుర్వేదం. ఈ విధంగా జీవక్రియ సజావుగా జరగడానికి రసాయన ఆయుర్వేదం అనేక విధాల ఔషధసూత్రాలపైనా విషతంత్రాలపైనా ఆధారపడి సమర్ధవంతంగా వాటిని నియంత్రిస్తోంది. అన్నిటినీ మించి వ్యాధిమూలాలను వెతికి పట్టుకోవడంలో రసాయన ఆయుర్వేదానికి చాలా ప్రత్యేకత ఉంది. అనేక సందర్భాల్లో ఈ విషయం నిరూపితమైంది కూడా. క్యాన్సర్ కణాలు జీవం పోసుకున్న చోట అవి ఆసాధారణ రీతిలో పెరుగుతూ ఉంటాయి. వాటి ఉత్పత్తిని నియంత్రిస్తే తప్ప క్యాన్సర్ గడ్డ పరిమాణం పెరగకుండా కట్టడి చేయలేము. ఒకవేళ అప్పటికే ఈ కణాలు ఒక అవయవం నుండి మరొక అవయవానికి వ్యాప్తి చెందే క్రమంలో ఉంటే ఆ వ్యాప్తిని కూడా అడ్డుకునే శక్తి రసౌషధాలకుంది.
Also read: రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ చికిత్స సమయంలో ప్రత్యేకమైన డైట్ ఉంటుందా?