ఏళ్ళు గడిచాయి.. క్యాన్సర్లు మాత్రం ప్రబలుతూనే ఉన్నాయి.. ఎందరో ఈ మహమ్మారి బారినపడి అసువులుబాశారు.. ఇంకెన్నో కుటుంబాలు చిధ్రమయ్యాయి.. అర్బుదరాశులపై రామబాణంలా పనిచేసే ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చేసరికి ఎన్ని ప్రాణాలు హరించుకుపోతాయన్న భయం క్యాన్సర్ బాధితులను వెంటాడుతూనే ఉంది. అటువంటి తరుణంలో క్యాన్సర్ వ్యాధికి సరైన పరిష్కారం చూపించడంలో రసాయన ఆయుర్వేదం ముఖ్యపాత్ర పోషిస్తుంది.
క్యాన్సర్లపై ఎక్కుపెట్టిన రామబాణం..
క్యాన్సర్ వ్యాధి మెకానిజాన్ని పరిశీలించి చూస్తే ఒక అవయవంలో పుట్టిన క్యాన్సర్ కణాలు వాటి సంఖ్యని పెంచుకుంటూ పోతుంటాయి. ఒకచోట గడ్డలా ఏర్పడిన ఈ క్యాన్సర్ కణాలు మలిదశలో మరో అవయవాన్ని వెతుక్కుంటూ వెళతాయి. కానీ క్యాన్సర్ పరిభాషలో మొదట క్యాన్సర్ కణాలు ఏర్పడ్డ చోటే ప్రాధమిక క్యాన్సర్లుగా పరిగణిస్తూ ఉంటారు. రసాయన ఆయుర్వేదం ప్రప్రధమంగా ఇమ్యునిటీని పెంచి నేరుగా క్యాన్సర్ కణాలు మొదలైన చోటే గురిపెడుతుంది. ఈ విధంగా వ్యాధిమూలాలను నాశనం చేస్తే కొత్త క్యాన్సర్ కణాలు పుట్టడం ఆగిపోతాయనేది ఒక భావన. అటుపై పుటాల ద్వారా తయారుచేసిన వివిధ రసౌషధాల ప్రయోగంతో క్యాన్సర్ కణాల పైన ప్రభావం చూపడం జరుగుతుంది. రామబాణంలా క్యాన్సర్ మూలాలను నేరుగా లక్ష్యం చేస్తుంది కాబట్టే రసాయన ఆయుర్వేదానికి కూడా విశ్వసనీయత పెరుగుతూ వచ్చింది.
ఈ ట్రీట్మెంటే ఉత్తమం…

అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లకు అనేక రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ట్రీట్మెంట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎక్కడా క్యాన్సర్ బాధితుల సంఖ్య గానీ, క్యాన్సర్లు గానీ తగ్గిన దాఖలాలైతే లేవు. పైపెచ్చు క్యాన్సర్ వలన మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. క్యాన్సర్ కణాల మెకానిజానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అందించకుండా క్యాన్సర్ కణాలను తొలగించే ట్రీట్మెంట్ అందిస్తుండడమే అందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అలా కాకుండా రసాయన ఆయుర్వేద పద్ధతిలో క్యాన్సర్ మెకానిజం అర్ధం చేసుకుని, కణాలకు శక్తిని అందిస్తూ, ఫ్రీ రాడికల్స్ ఉదృతిని తగ్గిస్తూ, అంతర్గత వాపులను నివారిస్తూ చేసే ఈ ట్రీట్మెంట్ క్యాన్సర్లకు మంచి పరిష్కారం అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఆ విశ్వసనీయత ఉంది కాబట్టే రసాయన ఆయుర్వేదాన్ని ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
ఈ వ్యవస్థ బలపడితేనే క్యాన్సర్లు బలహీనపడతాయి
సమకాలీన వైద్యులు ఈ మహమ్మారి ప్రభావానికి ఎన్నో ట్రీట్మెంట్ పద్ధతులను వాడుతున్నా, దానికి అనుపానంగానో సహపానంగానో రసాయన ఆయుర్వేదాన్ని ఆచరించమని చెప్పే స్థితికి రావడం ఒక కొత్త దారిని స్వాగతించడం లాంటిది. ఎందుకుంటే ఇమ్యూనిటీకి ప్రధాన కారణమైన తెల్లరక్త కణాలు నాశనం కాకుండా అడ్డుకుని రక్షణ వ్యవస్థకు రక్షణగా నిలుస్తుంది ఈ రసాయన ఆయుర్వేదం. కానీ క్యాన్సర్ పేషెంట్లకు ఉన్న సమయమే తక్కువగా ఉన్నందున వారు రసాయన ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ క్యాన్సర్ల విషయంలో సమయపాలన పాటించి ఏమాత్రం రసాయన ఆయుర్వేదానికి ప్రాధాన్యతనిచ్చినా క్యాన్సర్ల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా క్యాన్సర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ప్రాణాలను నిలుపుకున్నవారు అనేక మంది ఉన్నారు. అందుకే క్యాన్సర్ చికిత్సలో రసాయన ఆయుర్వేదాన్ని రామబాణం అంటుంటారు.
ట్రీట్మెంట్లు అనేకం.. ఫలితం..?
సహజంగా క్యాన్సర్ అనగానే ఎంతటి గొప్ప ఆంకాలజిస్ట్ అయినా మొదటగా పెరుగుతున్న ఆ కణితిని వెంటనే తొలగించాలని చెబుతారు. అందులో భాగంగా సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ వంటి కొన్ని ట్రీట్మెంట్లను సూచిస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లలో తమదైన గుర్తింపును సాధించాయి. కానీ ఫలితాలను చూస్తే మాత్రం అంతంత మాత్రమే అని సర్వైవల్ రేట్ వివరాలను చూస్తే అర్దం అవుతుంది. ఈ ఒక్కొక్క వైద్యవిధానాల సాధ్యా సాధ్యాలు ఏమిటని చెప్పడం సాధ్యపడకపోయినా క్యాన్సర్ల వలన జరిగే నష్టం మాత్రం పెరుగుతూనే ఉంది. అందుకే ఈ వైద్య విధానాలతో రసాయన ఆయుర్వేద వైద్యాన్ని కూడా ఆచరిస్తే మంచి ఫలితాలను పొందే అవకాశంతో పాటూ, ఇతర వైద్యాల వలన కలిగే ప్రభావాలను తగ్గించగలదని ఎన్నో అధ్యయనాల ద్వారా తెలియచేస్తున్నారు. ఈ విధంగా క్యాన్సర్లు తగ్గుముఖం పడే అవకాశం మనకు ఆయుర్వేదంలోని రసాయన ఆయుర్వేదం ఇస్తుందని గ్రహించి పాటించడం సమాజానికి శ్రేయస్కరం.
Also read: పురుషులలో రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వస్తే ఏంటి పరిస్థితి?
Disclaimer:
This content is for informational purposes only. Read full disclaimer [here]





















