క్యాన్సర్ పేషెంట్ ఇమ్మ్యునిటీ విషయంలో రసాయన ఆయుర్వేదం పనిచేస్తుందా?

You are currently viewing క్యాన్సర్ పేషెంట్ ఇమ్మ్యునిటీ విషయంలో రసాయన ఆయుర్వేదం పనిచేస్తుందా?

ఆయుర్వేద వైద్యంలో ఇమ్యునిటీని పెంపొందించగల ఏకైక శాస్త్రం రసాయన ఆయుర్వేదం శాస్త్రం. మన శరీరంలో సహజంగా ఉండే ఇమ్యునిటీ వ్యవస్థ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ శరీరానికి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఎటువంటి అసంబద్ధమైన కణాలు శరీరంలోకి ప్రవేశించినా అది వెంటనే వాటిని గుర్తుపట్టి వాటిని నాశనం చేస్తుంటుంది. అటువంటిది క్యాన్సర్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తూనే ఇమ్యునిటీ వ్యవస్థను లక్ష్యం చేసుకుని వ్యాధిక్షమత్వ గుణాన్ని నాశనం చేస్తాయి. అలాంటప్పుడు సహజసిద్ధమైన దోషసంహారక గుణమున్న ఔషధాలను ప్రయోగించి రసాయన ఆయుర్వేదం మొదట వ్యాధిక్షమత్వ గుణాన్ని పెంచుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇంత వేగంగా రోగనిరోధక శక్తిని యధాస్థితికి తీసుకొచ్చే విషయంలో రసాయన ఆయుర్వేదం తప్ప మరొకటి లేదు.

 

ఇతరత్రా వైద్య విధానాలలో కూడా చివరి దశలో ఉన్న క్యాన్సర్ బాధితులకు రోగనిరోధక శక్తిని పెంచే క్రమంలో ఇమ్యూనోథెరపీని ఆశ్రయిస్తూ ఉంటారు వైద్యులు. మన శరీరంలో సహజంగా ఉండే రక్షణ వ్యవస్థలో టి-లింఫోసైట్స్, యంటీబాడీ వ్యవస్థను బలోపేతం చేసే బి-లింఫోసైట్లు, కిల్లర్ కణాలు, డెండ్రైటిక్ కణాలని కొన్ని ఉంటాయి. క్యాన్సర్ కణాలు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అవి వీటిని నిర్వీర్యం చేయడం మొదలుపెడతాయి. ఇమ్యూనోథెరపీలో వెలుపల నుంచి ఒక డ్రగ్‌ను శరీరంలోకి పంపించి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్ నిమిత్తం అప్పటికే అనేక మెడిసినల్ డ్రగ్స్ తీసుకున్న శరీరం ఇమ్యూనోథెరపీ డ్రగ్‌కు ఎంతవరకు స్పందిస్తుందన్నది ప్రధాన ప్రశ్న. అందుకే రసాయన ఆయుర్వేదం ప్రత్యేకించి వ్యాధిక్షమత్వ గుణాన్ని పెంచే క్రమంలో రసవాదంలో ఉన్న శక్తివంతమైన, సహజసిద్ధమైన ఔషధాలను ప్రయోగించి ఈ కణాలను ఉత్తేజపరుస్తుంది. తద్వారా శరీరం కోల్పోయిన ఇమ్యునిటీని తిరిగి పొందేలా చేస్తుంది.

 

Also Read: