జీవితంలో క్యాన్సర్ రిస్క్ ను తగ్గించే ఐదు అలవాట్లు..

You are currently viewing జీవితంలో క్యాన్సర్ రిస్క్ ను తగ్గించే ఐదు అలవాట్లు..

క్యాన్సర్ ను పూర్తిగా నివారించలేమన్న సంగతి తెలిసిన విషయమే..

కానీ ఒకటిలో మూడోవంతు క్యాన్సర్ లను అయితే ఖచ్చితంగా నివారించగలం. ఎందుకంటే ఇవి మనం జీవితంలో తెలిసి తెలియక చేసే తప్పిదాల వల్ల, మన అలవాట్ల వల్ల సంభవించేవి. అందుకని కొన్ని అలవాట్లను సరిదిద్దుకొని జీవనవిధానాన్ని మరింత ఆరోగ్యంగా మార్చుకోవటం వల్ల క్యాన్సర్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు. క్యాన్సర్ నివారణకు మన చేతుల్లో ఉన్నది, మనం చేయగలిగింది,మన జీవన శైలిని ఆరోగ్యంగా మార్చుకోవటం మాత్రమే!

క్యాన్సర్ నివారణలో అత్యంత కీలక పాత్ర పోషించే ఐదు అలవాట్లు 

ఆహార అలవాట్లు సరిచేసుకోండి  

క్యాన్సర్ నివారణ  లో ఆహార అలవాట్ల పాత్ర చాలా ముఖ్యమైనది. సరైన పోషకాలు నిండిన ఆహారాన్ని సరిపడా సమయానికి తింటే ఆరోగ్యంగా ఉండగలం. ఈ ఆహరం విషయంలో మనం  చేసే తప్పిదాలు మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నేట్టేయగలవు.

క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవటానికి ఎం తినాలి? అనేదే మీ ప్రశ్న అయితే..మన రోజూ వారి ఆహారంలోనే ఎన్నో యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ ఉన్నాయి, వాటిని మన ఆహారంలో భాగం చేసుకొని సరైన యాంటీ క్యాన్సర్ డైట్ ను అనుసరిస్తే ఆహార అలవాట్ల వల్ల సంభవించే నష్టాల నుండి తప్పించుకోవచ్చు.

ఈ యాంటీ క్యాన్సర్ డైట్ కి కొన్ని ముఖ్యమైన గైడ్ లైన్స్ ఉన్నాయి అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం

కూరగాయలు మరియు పండ్లు అధికంగా తీసుకోవాలి

colorful veggies frame with

పండ్లు మరియు కూరగాయలు అనేవి  విటమిన్లు మరియు పోషకాలతో నిండి ఉన్నాయి, ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన లేదా చక్కెర పదార్థాలను తినడానికి బదులుగా, పండ్లు మరియు కూరగాయలను స్నాక్స్ గా తినండి. మెడిటేరియన్ డైట్ లో క్యాన్సర్-ఫైటింగ్  ఫుడ్స్ ఉంటాయి మరియు ప్రధానంగా పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు మరియు గింజలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలపై ఈ డైట్  దృష్టి పెడుతుంది. 

గ్రీన్ టీ త్రాగండి

hot drink cup tea drink nutritional

గ్రీన్ టీ  అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు క్యాన్సర్ వ్యతిరేక ఫుడ్స్ లో ముఖ్యమైన భాగం. గ్రీన్ టీ క్యాన్సర్ నిరోధక ఆహారం. ఇది కాలేయం, రొమ్ము, ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, అన్నవాహిక మరియు చర్మ క్యాన్సర్లను నివారిస్తుంది. గ్రీన్ టీలో ఉండే ఎపిగాల్లోకాటెచిన్-3-గాలేట్ అనే నాన్‌ టాక్సిక్ కెమికల్ క్యాన్సర్ పెరుగుదలలో కీలకమైన ఎంజైమ్ అయిన యూరోకినేస్‌పై పనిచేస్తుందని పరిశోధకులు నివేదిస్తున్నారు. ఒక కప్పు గ్రీన్ టీలో 100 నుండి 200 మిల్లీగ్రాముల ఈ  యాంటి ట్యూమర్ పదార్ధం ఉంటుంది.

టొమాటో క్యాన్సర్ ను నిరోధించగలదు 

tomatoes

టొమాటో లోని యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధన నిర్ధారిస్తుంది. లైకోపీన్ అనేది క్యాన్సర్ నిరోధక పోషకం, ఇది ప్రోస్టేట్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్‌ల నుండి రక్షణ కు సహాయపడుతుంది. టమాటాలను ఉడికించినప్పుడు లైకోపీన్ విడుదల చేయబడుతుంది.

ఆలివ్ నూనె ఉపయోగించండి

close up organic olive oil olives

మధ్యధరా దేశాలలో, ఈ మోనోశాచురేటెడ్ కొవ్వు ఉన్న ఆలివ్ నూనె వంట మరియు సలాడ్ నూనెలలో ఉపయోగించబడుతుంది ఎందుకంటే ఇది క్యాన్సర్ నిరోధక ఆహారం. దీని కారణంగా మధ్యధరా దేశాలలో, రొమ్ము క్యాన్సర్ సంభవం యునైటెడ్ స్టేట్స్ కంటే 50% తక్కువగా ఉంది.

వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు ఉపయోగించండి

blue onion garlic white

వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు నైట్రోసమైన్‌ల ఉత్పత్తిని నిరోధిస్తాయి, ఇవి శరీరంలోని అనేక భాగాలపై దాడి చేసే శక్తివంతమైన కార్సినోజెన్‌ల పై ​​దాడి చేస్తాయి. నిజానికి, వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు వేడిగా ఉన్నప్పుడు , అందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు క్యాన్సర్ నుండి రక్షిస్తాయి.

 సాల్మన్, ట్యూనా మరియు హెర్రింగ్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ఒక రకమైన కొవ్వు ఆమ్లం. ఒకవేళ చేపలను మీరు చేపలను తినకపోతే, మీరు దాని స్థానంలో  ఒమేగా-3ని జోడించడానికి అవిసె గింజలను తీసుకోవడం మంచిది.

మానసిక ఒత్తిడి తగ్గించుకోండి 

వాస్తవానికి మానసిక ఒత్తిడి వల్ల క్యాసర్ వస్తుంది అనటానికి నిరూపణ లేదు, కానీ క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశం ఉన్న అలవాట్లకు ఒత్తిడి కారణం అవ్వచ్చు ఆవిధంగా పరోక్షంగా క్యాన్సర్ నివారణకు మానసిక ఒత్తిడి లేని జీవితం సహాయపడుతుంది. అందుకే ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం క్యాన్సర్ నివారణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

మానసిక ఒత్తిడి వల్ల శరీరం ఇమ్మ్యునిటీ కోల్పోతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి, దాని కారణంగా క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఉందట. 2017లో జరిగిన ఒక స్టడీ లో వర్క్ ప్లేస్ స్ట్రెస్ అధికంగా ఉండే వాళ్ళలో 65ఏళ్ళ లోపు ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ పెరిగిందట.

ఇక స్ట్రెస్ వాళ్ళ క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశం ఉన్న అలవాట్లు కూడా జీవితంలో భాగం అవ్వచ్చు.

స్ట్రెస్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువగా ధూమపానం మరియు మద్యపానం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అధిక మానసిక ఒత్తిడి వల్ల ఆహార అలవాట్లలో కంట్రోల్ లేక పోషకాహార లోపానికి కానీ ఊబకాయానికి కానీ గురవుతున్న వారు కూడా ఉన్నారు. ఈ విధంగా మానసిక ఒత్తిడి పరోక్షంగా క్యాన్సర్ కు ప్రధాన కారణంగా కూడా మారే అవకాశం లేకపోలేదు.

ఈ మానసిక ఒత్తిడి నుండి ఎలా బయట పడాలంటే

ముందు యోగా మరియు మెడిటేషన్ అలవాటు చేసుకోవటం మంచిది, ఎన్నో రిసర్చ్ లు చెప్పింది ఏమిటంటే ఈ యోగా మరియు ధ్యానం వల్ల చాలా వరకు మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండగలరట. 

ఇక వీటితో పాటు పాజిటివ్ గా ఆలోచిస్తూ పాజిటివ్ మనుషుల మధ్యలో ఉండటం కూడా మానసిక ఒత్తిడి తగ్గించటంలో సహాయపడుతుంది.

ఇక మరో విషయం నిద్ర, సరైన ప్రశాంతమైన నిద్ర రోజు మొత్తం ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది, నిద్రలేమి వల్ల రోజంతా చిరాకుగా ఉండి మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఈవిధంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతమైన జీవితం గడపగలిగితే ఆరోగ్యకరమైన అలవాట్లను ఆహ్వానిన్చినట్లే! క్యాన్సర్ నివారణకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.

వ్యాయామం క్రమం తప్పకుండా చేయండి

అధిక స్థాయి శరీర కొవ్వు, లేదా ఊబకాయం ఆరోగ్యమైన జీవితానికి మంచిది కాదు.  కొవ్వు ఈస్ట్రోజెన్ వంటి స్టెరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని కూడా పెంచుతుంది, వీటిలో అధిక స్థాయిలు రొమ్ము క్యాన్సర్‌కు ప్రమాద కారకంగా ఉంటాయి. ఊబకాయం అనేది  లెప్టిన్ మరియు అడిపోనెక్టిన్ వంటి అడిపోసైటోకిన్‌ల అసమతుల్యతకు దారితీస్తుంది, వీటి పెరుగుదల , రోగనిరోధక శక్తి మరియు కణితి నియంత్రణ విధుల్లో పాత్ర పోషిస్తుంది. అధిక శరీర కొవ్వు ఉండటం క్యాన్సర్ ప్రమాదంగా మారే అవకాశముంది.అందుకనే రోజూ కనీసం ముప్పై నిమిషాల వ్యాయామం క్యాన్సర్ రిస్క్ ను తగ్గించగలదు.

రోజూ వ్యాయామంలో చురుకైన నడక మరియు జాగింగ్ మంచిది. వ్యాయామం  యొక్క ప్రయోజనాలు మీ ఇంటెన్సిటీ  మరియు ఫ్రీక్వెన్సీని బట్టి మారుతూ ఉంటాయి.  ప్రతి ఒక్కరూ తమ జీవితానికి బాగా సరిపోయే వ్యాయామ షెడ్యుల్  ఎంచుకోవచ్చు. పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాల మీడియం ఇంటెన్స్  ఏరోబిక్ వ్యాయామం లేదా 75 నిమిషాల తీవ్రమైన ఏరోబిక్ వ్యాయామం పూర్తి చేయాలని సిఫార్సు చేయబడింది. పిల్లలు మరియు యువకులు ప్రతిరోజూ కనీసం 60 నిమిషాలు యాక్టివ్ గా ఉండాలి. క్యాన్సర్ ప్రమాదాన్ని అధిగమించడానికి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ రోజుకు 30 నిమిషాల మితమైన వ్యాయామం అవసరమని  సూచిస్తుంది.

అలాగే వ్యాయామం క్యాన్సర్ రోగులలో రికరెన్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నివారణకు అదనంగా, వ్యాయామం క్యాన్సర్ చికిత్స సమయంలో శారీరక మరియు మానసిక ధృడత్వాన్ని కూడా అందిస్తుంది. వ్యాయామం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి, ఎముకల బలాన్ని మెరుగుపరచడానికి మరియు కండర ద్రవ్యరాశిని పెంచడానికి సహాయపడుతుంది.అందు వలన క్యాన్సర్ నివారణలో వ్యాయామం పాత్ర ప్రత్యేకమైనది.

రెగ్యులర్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్

క్యాన్సర్ స్క్రీనింగ్‌లు అంటే లక్షణాలు కనిపించక ముందే క్యాన్సర్ సంకేతాలను బట్టి  క్యాన్సర్ ను గుర్తించే పరీక్షలు. కొన్ని స్క్రీనింగ్ పరీక్షలు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించగలవు. దీని వలన చికిత్స సరైన సమయానికి జరిగి క్యాన్సర్ ను నయం చేసుకోగలమని  పరిశోధనలు చెబుతున్నాయి. ఒకవేళ  మీ డాక్టర్ స్క్రీనింగ్ పరీక్షను సిఫార్సు చేస్తే, ఆ సిఫార్సు అంటే మీకు క్యాన్సర్ ఉందని వారు భావించడం లేదు అన్నది గుర్తుంచుకోండి. చాలా మందికి 40 ఏళ్లు వచ్చే వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. క్యాన్సర్ ముప్పు ఉన్న వ్యక్తులు క్యాన్సర్ స్క్రీనింగ్‌ను ముందుగానే ప్రారంభించవచ్చు. మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని మీరు అనుకుంటే, క్యాన్సర్ స్క్రీనింగ్‌ల గురించి మీ వైద్యుడిని అడగండి.

క్యాన్సర్ స్క్రీనింగ్‌లో శారీరక పరీక్ష, ఇమేజింగ్ పరీక్షలు మరియు ప్రయోగశాల పరీక్షలు ఉంటాయి.

  • శారీరక పరీక్ష: డాక్టర్ మీ సాధారణ శారీరక పరీక్ష సమయంలో ఈ పరీక్షను చేయవచ్చు. అసాధారణ గడ్డలు వంటి మార్పుల కోసం మీరు మీ శరీరాన్ని పరిశీలించాలనుకోవచ్చు. వారు మీ ఆరోగ్య అలవాట్లు మరియు మీ కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి ప్రశ్నలు అడుగుతారు.
  • ల్యాబొరేటరీ పరీక్షలు: ఈ పరీక్షలలో రక్త పరీక్షలు, కణజాల పరీక్షలు మరియు క్యాన్సర్ కోసం మూత్ర పరీక్షలు ఉండవచ్చు. ఒక ఉదాహరణ పాప్ స్మెర్స్, ఇది రోగనిర్ధారణ నిపుణులు క్యాన్సర్ సంకేతాల కోసం పరిశీలించగల కణజాలాన్ని సేకరించేందుకు స్క్రీనింగ్ టెస్ట్ ప్రొవైడర్లచే ఉపయోగించబడుతుంది.
  • ఇమేజింగ్ పరీక్షలు: ఈ పరీక్షలు మీ శరీరంలోని ప్రాంతాల ఇమేజెస్ ను తీసుకుంటాయి. క్యాన్సర్ కోసం పరీక్షించడానికి ఉపయోగించే ఇమేజింగ్ పరీక్షకు మామోగ్రఫీ ఒక ఉదాహరణ.
  • క్యాన్సర్ కోసం జన్యు పరీక్ష: మీ జీవసంబంధమైన కుటుంబంలో ఎవరికైనా వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ ఉంటే, మీకు ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందో లేదో తెలుసుకోవడానికి మీ వైద్యుడు జన్యు పరీక్షను సిఫారసు చేయవచ్చు.

ఎలాంటి క్యాన్సర్ సంకేతాన్ని గమనించినా నిర్లక్ష్యం చేయకండి. వైద్యున్ని సంప్రదించండి.

ధూమపానం మరియు మద్యపానాన్ని దూరంగా ఉంచండి

ఆల్కహాల్ మరియు పొగాకు రెండింటినీ ఉపయోగించే వ్యక్తులకు కేవలం ఆల్కహాల్ లేదా పొగాకు ఉపయోగించే వ్యక్తుల కంటే నోటి, ఓరోఫారింక్స్, స్వరపేటిక మరియు అన్నవాహిక క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఐదు రెట్లు ఎక్కువ అదే ఎక్కువగా వినియోగిస్తే ప్రమాదం 30 రెట్లు ఎక్కువ అవుతుందట.

ఇంకా ధూమపానం చేయని వారి కంటే ధూమపానం చేసే వారి జీవితకాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం 22 రెట్లు ఎక్కువ. అయినప్పటికీ, పొగాకును ఉపయోగించని వ్యక్తులు మరియు ఇంట్లో, పనిలో లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో సెకండ్ హ్యాండ్ పొగకు గురైన వ్యక్తులు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సహా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా వరకు నివారించగలం అలవాటు ఉన్నవారు ఇప్పటికిప్పుడు ధూమపానం మానేసినట్లయితే 10 కేసులలో దాదాపు 9 కేసులను నివారించవచ్చట. ధూమపానం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు దాదాపు వెంటనే కనిపిస్తాయి. ధూమపానం మానేసిన 20 నిమిషాల తర్వాత, మీ హృదయ స్పందన రేటు తగ్గుతుంది. 2 నుండి 12 వారాల తర్వాత, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. దగ్గు మరియు శ్వాస సమస్యలు 1-9 నెలల్లో తగ్గిపోతాయి. ధూమపానం మానేసిన పదేళ్ల తర్వాత, ధూమపానం చేసేవారితో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం సగానికి సగం తగ్గుతుంది అని నిపుణులు చెబుతున్నారు. అందుకని ఇది మానేయటం క్యాన్సర్ నివారణలో ముఖ్యమైనది.

ధూమపానం, మద్యపానం మరియు క్యాన్సర్ గురించి ఈ ఫ్యాక్ట్స్ ను గమనించండి

  • ఎక్కువగా ఆల్కహాల్ మరియు స్మోక్ తాగే వారికి నోరు మరియు గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఐదు రెట్లు ఎక్కువ.
  • అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, ఆల్కహాల్ వినియోగం 6 శాతం క్యాన్సర్లతో ముడిపడి ఉంది.
  • ధూమపానం మొత్తం క్యాన్సర్లలో 20% కారణమవుతుంది.
  • ధూమపానం 80% ఊపిరితిత్తుల క్యాన్సర్‌లకు కారణమవుతుంది మరియు యునైటెడ్ స్టేట్స్‌లో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు క్యాన్సర్ ప్రధాన కారణం.
  • మద్యం మరియు ధూమపానం నోటి, గొంతు, అన్నవాహిక, కాలేయం, పెద్దప్రేగు మరియు రొమ్ము క్యాన్సర్‌తో సహా ఇతర క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతాయి.

ఈ ఐదు అలవాట్లను సరిచేసుకోగలిగితే క్యాన్సర్ ను జీవితకాలంలో చాలా వరకు నివారించగలం, ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదని గుర్తుంచుకోండి, సరైన జీవన విధానాన్నే ఎంచుకోండి.

Also read: వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు

REFERENCES 

Https://Www.Who.Int/Europe/News/Item/03-02-2021-World-Cancer-Day-Know-The-Facts-Tobacco-And-Alcohol-Both-Cause-Cancer

Https://My.Clevelandclinic.Org/Health/Diagnostics/24118-Cancer-Screening

Https://Cytecare.Com/Blog/Prevention/Thirty-Minutes-Of-Exercise-A-Day-Can-Keep-Cancer-At-Bay/

Https://Www.Verywellmind.Com/Stress-And-Cancer-The-Relationship-Symptoms-And-Treatments-6361671

Https://Www.Everydayhealth.Com/Cancer-Photos/Top-Foods-To-Fight-Cancer.Aspx

Https://Www.Cancerresearchuk.Org/About-Cancer/Causes-Of-Cancer/Cancer-Myths/Can-Stress-Cause-Cancer

Https://Www.Hemoncnc.Com/Cancer-Treatment/Tobacco-Alcohol-Cessation