తెల్లగలిజేరు / పునర్నవ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

You are currently viewing తెల్లగలిజేరు / పునర్నవ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

ప్రకృతిలో దొరికే చాలా రకాల మొక్కలు ఔషదా గుణాలను కలిగినవే. అటువంటి విలువైన మొక్కలు ఈ భూమిపై కోకొల్లలుగా ఉన్నాయి. ఇంటి చుట్టుపక్కల ఆవరణంలో అనేక రకాలైన మొక్కలు మోలుస్తుంటాయి. కానీ వాటిని చూసి పిచ్చి మొక్కలని వదిలేస్తుంటాం. అటువంటి మొక్కనే తెల్ల గలిజెరాకు లేదా పునర్నవాకు ( Punarnava ) . పునర్నవ అంటే ‘పునరుద్ధరించేది’ అని అర్ధం.దీని శాస్త్రీయ నామం బోరేవియా డిఫ్యూసా. తెల్ల గలిజెరాకుని ఇంగ్లీష్ లో హాగ్‌వీడ్, స్టెర్లింగ్, టార్విన్ కూడా అంటారు. ఈ మొక్కలో ప్రోటీన్లు, విటమిన్ సి, సోడియం, కాల్షియం, ఐరన్ మరియు పునర్నవోసైడ్, సెరాటాజెనిక్ యాసిడ్, హైపోక్సాంథైన్ 9-ఎల్-అరబినోఫురానోసైడ్, బోయవినోన్ ఎ నుండి ఎఫ్, లిరియోడెండ్రాన్, ఉర్సోలిక్ యాసిడ్ మరియు ఒలేనోలిక్ యాసిడ్ వంటి బయోయాక్టివ్ లు పుష్కలంగా ఉంటాయి. 

ఈ మొక్కని ఆయుర్వేద ఔషధాలలో విరివిగా ఉపయోగిస్తుంటారు.తెల్ల గలిజెరు ఆకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే నిజంగానే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాలనుకుంటారు. ఈ మొక్కను రుమటాయిడ్ ఆర్థరైటిస్, జ్వరం, ఎడెమా, కంటి సమస్యలు మరియు కాలేయ రుగ్మతల చికిత్సలో ఉపయోగించబడుతుంది. 

తెల్ల గలిజేరాకులోని బయోయాక్టివ్ సమ్మేళనాలు  త్రిదోషాలను సమతుల్యం చేస్తాయి పిత్త, వాత (అంటే గాలి) మరియు కఫా (అంటే భూమి మరియు నీరు) దోషాలను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. మరియు శరీరం నుండి విషపూరితమైన దోషాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. 

తెల్ల గలిజెరాకు లేదా పునర్నవాకు ( Punarnava ) వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

 

ఆర్థరైటిస్‌కు:

తెల్ల గలిజెరాకు, శక్తివంతమైన అనాల్జేసిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కీళ్ల మరియు కండరాల నొప్పిని తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల ప్రమాదలను తగ్గిస్తుంది.

జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది:

తెల్ల గలిజెరాకు ఒక శక్తివంతమైన డైజెస్టివ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది జీర్ణ రసాల స్రావాన్ని ప్రేరేపిస్తుంది అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అవసరమైన పోషకాలను గ్రహించడానికి ఉపయోగపడుతుంది. 

మధుమేహాన్ని నియంత్రిస్తుంది:

తెల్ల గలిజెరాకు  అద్భుతమైన హైపోగ్లైసీమిక్ గుణం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మూలికను తీసుకున్నప్పుడు ప్యాంక్రియాటిక్ నుండి ఇన్సులిన్ ఉత్పత్తి చురుకుగా ఉంటుంది. ఇది గ్లూకోజ్‌గా స్టార్చ్ విచ్ఛిన్నతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది.

మూత్ర సంబంధిత వ్యాధులని నివారిస్తుంది: 

తెల్ల గలిజెరాకు మూత్ర విసర్జన, మూత్రపిండాల్లో రాళ్ళ్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.  ఈ మూలిక శక్తివంతమైన యాంటీ-స్పాస్మోడిక్, యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మూత్ర నాళంలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది తద్వారా మూత్రవిసర్జన సమయంలో మంట మరియు నొప్పిని తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి దోహదపడుతుంది:

తెల్ల గలిజెరాకు అదనపు కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే  శక్తివంతమైన బయోయాక్టివ్ లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు పెరగడాన్ని నీరోధిస్తాయి.

గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది: 

తెల్ల గలిజెరాకు గుండె జబ్బులకు చికిత్స చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.మరియు మనస్సుని నెమ్మదిపరిచి కార్డియాక్ సిస్టమ్ ని విశ్రాంతపరుస్తుంది. అంతేకాకుండా గుండె దడ మరియు  అరిథ్మియా వంటి వ్యాధులతో బాధపడే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. 

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు అథెరోస్క్లెరోసిస్, గుండెపోటులు, రక్తం గడ్డకట్టడం వంటి ప్రమాదాలని  తగ్గిస్థాయి.

తెల్ల గలిజెరాకు లేదా పునర్నవాకు యొక్క దుష్ప్రభావాలు:

తెల్ల గలిజెరాకు  కొన్ని అలర్జిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి రక్తపోటును పెంచి గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ఇథనాల్ సంబంధిత అలెర్జీలు ఉంటే పునర్నవ మాత్రలు లేదా పొడికి దూరంగా ఉండటం మంచిది. దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భేదిమందుగా కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. అందువల్ల గర్భిణీ స్త్రీలు ఈ మూలికను వాడకూడదు. పునర్నవాకుని  12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇవ్వకూడదు.