మన శరీరంలో రసాయన ఆయుర్వేద ఔషధం ఎలా పనిచేస్తుంది?

You are currently viewing మన శరీరంలో రసాయన ఆయుర్వేద ఔషధం ఎలా పనిచేస్తుంది?

ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో రసాయన ఆయుర్వేదానికి ప్రత్యేక స్థానముంది. రసాయన ఆయుర్వేదంలో ఎటువంటి మొండి వ్యాధులకైనా, దీర్ఘకాలిక వ్యాధులకైనా నిర్దిష్టమైన చికిత్సా విధానాలున్నాయి. వ్యాధి ఎలాంటిదైనా అది మొదట వ్యాధినిరోధక శక్తి మీదే ప్రభావం చూపుతుంది. కానీ రసాయన ఆయుర్వేదం రెండు విధాలుగా పనిచేస్తుంది. మొదటిగా వ్యాధి నిరోధక శక్తిని పెంచి శరీరం కూడా వ్యాధిపై పోరాడే విధంగా చేయడం, రెండవదిగా ఔషధం నేరుగా వ్యాధిపీడిత అవయవానికి నేరుగా చేరుకుని చికిత్స ప్రక్రియను వేగవంతం చేయడం. ఈ విధంగా ద్వంద్వ ప్రయోజనాలతో రసాయన ఆయుర్వేదం బాధితులకు త్వరితగతిన ఉపశమనం కలిగిస్తుంది.

మానవ శరీరంలో సహజంగా జీవక్రియ దెబ్బతిన్నప్ప్పుడే వ్యాధులు వస్తూ ఉంటాయి. శరీరంలో జీవక్రియ దెబ్బ తిన్నప్పుడు జీవ కణాలు వాటి నియంత్రణ కోల్పోతూ ఉంటాయి. దెబ్బతిన్న ఈ జీవ కణాలు శరీరంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంటాయి. ధాతుదోషంతో మొదలై అవి మెల్లగా శరీరాన్ని తమ నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇలాంటప్పుడే వెలుపల నుండి ఔషధాలను ప్రయోగించి వాటిని నియంత్రించే ప్రయత్నం చేస్తుంటాము. శరీరంలోని ధాతువులను నియంత్రించే ప్రక్రియలో మరే ఇతర వైద్యం కంటే కూడా రసాయన ఆయుర్వేదానికి ఉన్నంత విశ్వసనీయత లేదు.

రసాయన ఆయుర్వేదం ధాతువుల సమతుల్యానికి తోడ్పడి వాటిని పునరుజ్జీవపరుస్తుంది. అందుకే అంటారు రసాయన ఆయుర్వేదం అంటే పునరుజ్జీవం అని. ఈ విధంగా రసాయన ఆయుర్వేదం మృత కణాలకు కొత్త జీవాన్నిచ్చి వాటిని పునరుత్తేజింపజేస్తుంది. ముఖ్యంగా శరీరంలో రసధాతువును ఉత్తేజపరచి శరీర ఓజస్సును పెంచడమే కాకుండా పూర్వపు స్థాయిలో జీవక్రియ జరగడానికి కూడా సహాయ పడుతుంది.