మన పసుపు కల్తీ అవుతుందా?

You are currently viewing మన పసుపు కల్తీ అవుతుందా?

మన భారతీయ సాంప్రదాయాలకు పసుపు ప్రధానం .. 

మన ఇంటి గడపకు రంగులద్దిన పసుపు ,

వంటింట్లో ఉంటూ వంటకు రుచిని, ఒంటికి ఆరోగ్యాన్ని ఇస్తూ,

మన దిన చర్యలో ప్రతీ రోజూ మనం పలకరించే స్నేహితుడిలా మారింది.

పసుపు లేని వంటలు మనం చూడలేమేమో అనేంతలా మన జీవితాలలో భాగమైంది.

ఇన్నేళ్ళుగా ఎంతగానో సాంప్రదాయంగా ప్రాధాన్యత సంతరించుకున్న పసుపు కేవలం

 మన సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు..మన ఆయుర్వేద ఔషధం కూడా!

మన భారత దేశం పసుపు పండించడంలో, పసుపును ఉపయోగించడంలో, ఇతర దేశాలకు పసుపును ఎక్స్పోర్ట్ చేయటం లో ప్రథమ స్థానం లో ఉంది.

 కానీ ప్రపంచానికి పసుపును పంచుతున్న మనమే..

మన పసుపును స్వచ్చంగా ఉపయోగించుకోలేకపోవడం బాధాకరం. మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అని నమ్ముతున్న పసుపులో కల్తీ జరిపి విక్రయిస్తుండటం మరింత బాధాకరం. తెలియక అదే ఉపయోగిస్తూ అమాయకులు  అనారోగ్యం పాలవ్వడం దురదృష్టకరం.. 

ఈ రోజు మన చుట్టూ పసుపు ఎలా కల్తీ అవుతుందో, దాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోవలసిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంది.

ఈ అవగాహన మీ అందరిలో కలిగించడం కోసం ఇది మా చిరు ప్రయత్నం.

 

సింపుల్ గా ఇక్కడ మనం మూడు విషయాలు తెలుసుకోవాలి. 

ఒకటి అసలు పసుపు ఎలా కల్తీ అవుతుంది? అందులో ఎం కలుపుతున్నారు? అలాగే అది మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేస్తుంది? ఇంకా ఇలా ఎంత శాతం జరిగే చాన్స్ ఉంది. 

ఇక రెండోది ఇది నిజం అని ఎలా నమ్మాలి, ఏమైనా ఆధారాలు ఉన్నాయా?

 ఇక మూడవది ఈ కల్తీ పసుపును మన ఇంట్లోనే ఎలా గుర్తించాలి? సింపుల్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా?

ఈ మూడు విషయాలను మనం క్లియర్ గా ఇప్పుడు చూద్దాం.

ముందు అసలు పసుపు ఎలా కల్తీ అవుతుంది.

సింపుల్ గా మనం చాలా సార్లు పసుపు బాగా బ్రైట్ ఎల్లో కలర్ ఉంటే చాలు అది చాలా క్వాలిటీ అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ బ్రైట్ ఎల్లో కలర్ ఆ పసుపు కి లెడ్ క్రోమేట్ అనే ఒక కెమికల్ కలపడం వల్ల వచ్చి ఉండొచ్చు. మరి అసలు ఆ రంగు కలపడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ దగ్గర ఉన్న పసుపు క్వాలిటీ ది లేకపోయి ఉండొచ్చు, లేదా అందులో బియ్యప్పిండి లాంటిది కలిపి దాని క్వాంటిటీ ని పెంచి ఉండొచ్చు. 

ఉదాహరణకు ఒక కిలో పసుపు చేయడానికి ఏడువందల గ్రాముల పసుపు, అందులో ఒక మూడు వందల గ్రాములు ఎదో పిండి కలిపాం అనుకోండి, అప్పుడు పసుపు రంగు తగ్గుతుంది కదా !

ఆ రంగు పెంచడానికి కెమికల్ అయిన లెడ్ క్రోమేట్ క్రోమేట్ కలుపుతారు.ఇప్పుడు తయారయ్యేది కల్తీ పసుపు. ఇక ఈ లెడ్ క్రోమేట్ కలపడం వల్ల మన ఆరోగ్యం లో సమస్యలు వస్తాయి, కిడ్నీ సమస్యలు, బ్రెయిన్ డ్యామేజ్ అందులో ప్రధానం. ఈ లెడ్  అనేది ముఖ్యంగా మనకు చాలా పెద్ద రిస్క్, ఎందుకంటే మన సౌత్ ఏషియా లో కేవలం 2019 సంవత్సరంలోనే 1 .4 మిలియన్ మరణాలు సంభవించాయి. అందుకని మనకు ఇది ఒక నిజంగా పెద్ద రిస్క్.

ఇక ఈ కల్తీ ఎంత శాతం జరిగే చాన్స్ ఉందో మీరు ఊహించగలరా! సాధారణంగా పెద్ద బ్రాండ్స్ నుండి వచ్చిన ప్రాడక్ట్స్ ని గవర్నమెంట్ టెస్ట్ చేసి ఆమోదిస్తుంది. అలంటి వాటిలో కల్తీ జరిగే అవకాశం లేదు. కానీ లోకల్ గా, ఎలాంటి సర్టిఫికేషన్ లేకుండా దొరికే దగ్గర ఈ సమస్య అయ్యే చాన్స్ ఉంది. ఖచ్చితంగా అన్ని చోట్ల జరుగుతుందని చెప్పట్లేదు కొన్ని చోట్ల జరిగాయి కాబట్టి జరిగే చాన్స్ ఉంది అంటున్నాం. కానీ ఇక్కడ సమస్య ఇండియన్ స్పైసెస్ లో  ఏంటంటే మన దగ్గర కేవలం ఇరవై శాతం మాత్రమే బ్రాండెడ్ ఉండే అవకాశం ఉంది. అందువల్ల మిగతా దగ్గర ఎక్కడైనా కల్తీ అయ్యే అవకాశం ఉంది.

ఇక రెండో విషయం ఇలాంటివి ఎక్కడైనా జరిగాయా అంటే..

అవును అనే చెప్పాలి.

డిసంబర్ 2022 నుండి మార్చ్ 2023 వరకు బీహార్ లో ఎనిమిది రాష్ట్రాల్లో పసుపు శాంపుల్స్ ను పరీక్షిస్తే తేలింది ఏంటంటే అందులో సగం శాంపుల్స్ లో మన ఫుడ్ సేఫ్టీ అథారిటీ సూచించిన దానికంటే నాలుగు వందల రెట్లు ఈ లెడ్ ఉందట. అది ఏంత అంటే 4139 ppm. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఎన్నో వందల టన్నుల కల్తీ పసుపు పట్టుబడుతూనే ఉంది.

ఇప్పుడు మూడో విషయం, మనకు తెలియాల్సింది మనం ఉపయోగించే పసుపులో కల్తీని ఎలా గుర్తించాలో మాత్రమే. ఆ విషయాన్ని ఇప్పుడు క్లియర్ గా చూద్దాం.

ఇది చాలా సింపుల్.. మీరు ఉపయోగించే పసుపు స్వచ్చమైనదా కాదా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేయండి. 

ముందు మీ పసుపు ను ఒక చంచా తీసుకొని ఒక గ్లాస్ లో వేయండి. ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే బెటర్.

తరువాత ఒక స్పూన్ తో పసుపును ఆ గ్లాస్ లో వేయండి. 

పసుపు వేసాక కలపకండి,  కొద్ది సేపు వెయిట్ చేయండి.

ఆ పసుపు ను నీటిలో సెటిల్ అవ్వనివ్వండి.

ఒక వేళ పసుపు నేరుగా వెళ్లి కింద సెటిల్ అయింది, అలాగే నీళ్ళు కూడా లైట్ ఎల్లో కలర్ లో ఉన్నాయి అంటే అది మంచిదే.. 

అదే ఒక వేళ  నీళ్ళు డార్క్ ఎల్లో కలర్ లోకి వచ్చాయంటే మాత్రం ఆ కలర్ కోసం అందులో కల్తీ జరిగి ఉండే అవకాశం ఉంది. ఈ చిన్న టెస్ట్ మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు.

గుర్తుపెట్టుకోండి. నీరు క్లీన్ గా లేకుండా ఏదైనా అందులో సస్పెండ్ అయినట్టు కనిపించినా కల్తీ జరిగినట్టే, తరువాత మంచి పసుపుకు షిఫ్ట్ అయిపొండి. ఈ చిన్న టెస్ట్ తో మీరు పసుపు కల్తీ అయిందా లేదా అనేది కనుక్కోవచ్చు. ట్రై చేసి చూడండి.

ఒకవేళ మీరు పసుపు కొమ్ముల్ని కొంటుంటే గనక, వాటిలో కూడా అందంగా బ్రైట్ గా కనిపించడానికి కల్తీ జరిగే అవకాశం ఉంది. అందుకని వాటిని కూడా ఒక గ్లాస్ నీటిలో వేసి చూడండి. స్వచ్చమైన పసుపు కొమ్ము తన రంగును వదలదు. ఈ టెస్ట్ ద్వారా అది మీకు తెలుస్తుంది. మీరు ఉపయోగించేది మంచిదా కాదా అని.. అలాగే మీరు మార్కెట్ లో పసుపు ను సింపుల్ గా కొద్దిగా చేతిపై వేసి రబ్ చేసి చూడండి. బాగా రబ్ చేసాక కల్తీ లేని పసుపు అయితే మీ చేతి కి ఎక్కడైతే రబ్ చేసారో అక్కడ ఎల్లో కలర్ స్ట్రెయిన్ ఉంటుంది. ఇలాంటి సింపుల్ టెస్ట్లతోనే మీరు మీ పసుపు మంచిదా కాదా అని తెలుసుకోవచ్చు.

ఇక ఇది కేవలం మనందరి అవగాహన కోసం మాత్రమే. మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలి. అది మన బాధ్యత. రుచి కోసమైనా, ఆరోగ్యం కోసమైనా వీలైనంతవరకు ఆర్గానిక్ పసుపు ను ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.