ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్సా విధానాలు

You are currently viewing ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్సా విధానాలు

Prostate Cancer ప్రోస్టేట్ గ్రంధిలో వచ్చే క్యాన్సరునే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. పురుషుల సంతానోత్పత్తి వ్యవస్థలో ప్రోస్టేట్ గ్రంధి పాత్ర ఎంతో కీలకమైనది. పురుషుల్లో వీర్యం తయారవడానికి అవసరమైన జారుడు పదార్ధాన్ని ప్రోస్టేట్ గ్రంధే ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రోస్టేట్ గ్రంధి మూత్ర నాళాన్ని చుట్టుకుని మలాశాయానికి మూత్రాశయానికి మధ్యలో ఉంటుంది. ఈ గ్రంధిలో ఏ ఒక్క కణంలో జన్యుమార్పు సంభవించినా కణాలు జ్ఞాపకశక్తిని కోల్పోయి అసాధారణ రీతిలో పెరుగుతూ గడ్డలా ఏర్పడటాన్నే ప్రోస్టేట్ క్యాన్సర్ గా పరిగణిస్తారు.

లక్షణాలు :

Symptoms Of Prostate Cancer

ప్రోస్టేట్ క్యాన్సర్ సోకినవారిలో ప్రోస్టేట్ గ్రంధిలో గడ్డ ఏర్పడ్డ కారణంగా కొంత వాపు ఉంటుంది. ఈ వాపు వలన మూత్రనాళం నొక్కుకుపోతుంది. ఫలితంగా మూత్రం సన్నగా రావడం, మూత్రవిసర్జన చేస్తుంటే నొప్పిరావడం, మూత్రాశయం నిండినట్టే ఉంటుంది… కానీ మూత్రవిసర్జనకి పోతే చుక్కలు చుక్కలుగా లేదా సన్నటి ధారలా వస్తుంది. రాత్రిళ్ళు పదేపదే మూత్రవిసర్జన అవుతూండటం, మూత్రంలో రక్తం పడటం, వీర్యంలో రక్తం పడటం వంటివి ప్రోస్టేట్ క్యాన్సర్లో సహజంగా కనిపించే లక్షణాలు.

 

నిర్ధారణ :

ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే ముందుగా డిజిటల్ రెక్టల్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అంటే వేలిని మలద్వారం గుండా లోపలి పంపి ప్రోస్టేట్ గ్రంధి పరిణామాన్ని వేలి స్పర్శతో తెలుసుకుంటారు. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే PSA బ్లడ్ టెస్ట్ చేస్తారు. PSA అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. రక్తంలో ఉండే ఈ యాంటీజెన్ ను ప్రోస్టేట్ గ్రంధి ఉత్పత్తి చేస్తుంది. రక్తంలో PSA స్థాయి అధికంగా ఉంటే అది ప్రోస్టేట్ క్యాన్సర్ గా అనుమానిస్తారు. తర్వాత ట్రాన్స్ రెక్టల్ అల్ట్రా సౌండ్ స్కాన్ నిర్వహించి కణాల వ్యవహార తీరును తెలుసుకుంటారు.   చివరగా బయాప్సీ పరీక్ష నిర్వహించి అప్పుడు ఇది ప్రోస్టేట్ క్యాన్సరా కాదా అన్నది నిర్దారిస్తుంటారు.

 

చికిత్సా విధానాలు :

ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుండి తరచూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.

అవసరాన్ని బట్టి మొదట శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగిస్తారు. దీన్నే ప్రోస్టేటెక్టమీ అంటారు. ఇందులో పొత్తికడుపు మీద కోసి చేసే సర్జరీని రాడికల్ రిట్రో ప్యూబిక్ ప్రోస్టేటెక్టమీ అని వృషణం కింది భాగాలో మలద్వారానికి పైన కోసి చేసేదాన్ని రాడికల్ పెరీనియాల్ ప్రోస్టేటెక్టమీ అంటారు.  లాపరోస్కోపిక్ ప్రోస్టేటెక్టమీ, రోబోటిక్ లాపరోస్కోపిక్ సర్జరీ, ట్రాన్స్ యురేత్రెల్ రిసెక్షన్ ఆఫ్ ది ప్రోస్టేట్ అని పలు రకాల శస్త్రచికిత్సా విధానాల ద్వారా క్యాన్సర్ గడ్డలను తొలగించవచ్చు. ప్రోస్టేట్ గ్రంధిలో శస్త్రచికిత్స చేసేందుకు వీలుకాని ప్రాంతంలో గడ్డ ఏర్పడితే దాన్ని తొలగించేందుకు రేడియేషన్ ఇస్తారు. పురుషులలో ఉత్పత్తయ్యే పురుష సెక్స్ హార్మోన్లు, ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలు వేగంగా వ్యాప్తి చెందడానికి ఉపయోగపడుతుంటాయి. అందుకే ఈ హార్మోన్లు ఉత్పత్తి అవ్వకుండా అరికట్టడానికి హార్మోన్ థెరపీ చేస్తుంటారు. ఇమ్యూనోథెరపీ ద్వారా రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ పై పోరాడేలా చేయడం కూడా చికిత్సా విధానాల్లో ఒకటి. అవసరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో కీమోథెరపీని కూడా ఆశ్రయిస్తుంటారు.

ఇవన్నీ అల్లోపతిలో అందుబాటులో ఉన్న వైద్యాలు. అల్లోపతీని ఆశ్రయిస్తూనే అనుపానంగా కొంతమంది క్యాన్సర్ బాధితులు ఆయుర్వేద వైద్యం కూడా చేయించుకుంటుంటారు. ప్రధానంగా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా క్యాన్సర్ కు చికిత్స చేయించుకునేందుకు ఎక్కువమంది ఆయుర్వేద వైద్యంపై ఆసక్తి చూపుతుంటారు. ఆయుర్వేద రసాయన వైద్యంలో మనిషికి పునర్జన్మను ప్రసాదించేంత శక్తి ఉందని శాస్త్రాలు చెబుతుంటాయి. ఎటువంటి మొండివ్యాధికైనా ఆయుర్వేదంలో అద్భుతమైన, శాశ్వత పరిష్కారాలున్నాయి.

 

రసాయన ఆయుర్వేదంతో క్లోమ గ్రంథిక్యాన్సర్ కి చికిత్స:

క్యాన్సర్ వ్యాధి ప్రధానంగా రోగనిరోధక వ్యవస్థనే లక్ష్యం చేసుకుని వ్యాప్తి చెందుతుంది. ఆయుర్వేద వైద్యంలో రసాయన వైద్యం రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. పునర్జన్ ఆయుర్వేద రసాయన వైద్యం లోని రాసౌషధాలను ప్రయోగించి క్యాన్సర్ మూల కణాల నుండి చికిత్స చికిత్స చేసుకుంటూ వస్తోంది. ఒక పక్క క్యాన్సర్ కణాల విభజనను అడ్డుకుంటూనే రోగ నిరోధక శక్తికి ఆధారంగా నిలుస్తుంది  పునర్జన్ ఆయుర్వేద.

 

ముఖ్య గమనిక :

ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.