స్వయంకృత అపరాధాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు, రసాయన ఆయుర్వేదం పరిష్కారం చూపగలదా?

You are currently viewing స్వయంకృత అపరాధాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు, రసాయన ఆయుర్వేదం పరిష్కారం చూపగలదా?
 • “లైఫ్ స్టైల్ డిసీజ్”

అనేది ప్రస్తుతం హెల్త్ కేర్ విభాగంలో ఎక్కువగా వినపడుతున్న పేరు. ఈ రకమైన ఆరోగ్య సమస్యలు మనిషి జీవితంలో ఒక సడన్ బ్రేక్ లాగా మారిపోయాయి. ఇక ఈ సమస్య రాగానే జీవితంలో అప్పటి వరకూ ఉన్న రూల్స్ అన్నీ మారిపోతాయి. మారుతున్న కాలంతో పాటూ, అడ్వాన్స్ అవుతున్న టెక్నాలజీ తో పాటూ మన శరీరంలో సమస్యలు కూడా అడ్వాన్స్ అయ్యి కొత్తగా మారి కూర్చున్నాయి. వాటినే మనం ఈ “లైఫ్ స్టైల్ డిసీజ్” లేదా జీవన విధానంలో మార్పుల వల్ల సంభవించే ఆరోగ్య సమస్యలు అంటున్నాం. ఉదాహరణకు మధుమేహం, ఊబకాయం, డిప్రెషన్. స్ట్రోక్, లివర్ సిరోసిస్, కొన్ని రకాల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి వాటిని లైఫ్ స్టైల్ డిసీజెస్ అనవచ్చు.

 

 • లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎందుకు వస్తాయి?

ఈ సమస్యలకు కారణం ఒకటి అని మనం చెప్పలేము. తినే జంక్ ఫుడ్ నుండి పీల్చే కాలుష్యపు గాలి దాకా ఏదైనా కారణంగా మారే అవకాశం ఉంది. ఇక ఈ సమస్యలకు ఇప్పుడు ఉన్న వైద్యం చికిత్స చేయగలుగుతుంది కానీ పూర్తిగా తగ్గించడం అన్ని చోట్లా వీలుపడట్లేదు. ఆ సమస్య తీవ్రత కొద్ది వరకు తగ్గించడమో, లేదా ఆ సమస్యను అలాగే తగ్గకుండా పెరగకుండా మేనేజ్ చేస్తూ గడిపెయడమో ఇప్పుడు మనం చేస్తున్నాం.

 

 • ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకూడదు అంటే ఎం చేయాలి?

ఈ సమస్యలు అసలు మనకు రాకూడదు అంటే మనకు ఉన్నది ఒకే దారి అదే సరైన జీవన శైలిని అనుసరించడం. ఆయుర్వేదం చెప్పినట్టు రోజూ ప్రత్యెక దినచర్యతో, కాలానుగుణంగా సరైన రుతుచర్య తో జీవించాలి. అలాగే మనలోని మలినాన్ని శుద్ధి చేయడానికి పంచకర్మను, దీర్ఘాయుష్షు కోసం రసాయన ఆయుర్వేదాన్ని ఎంచుకోవాలి. మనం సంపూర్ణ ఆయుర్వేద నియమాలను పాటించినప్పుడు మనకు ఈ జీవన విధానం వల్ల సమస్యలు తలెత్తవు. ఒక వేళ ఇదివరకే ఈ జీవన విధానంమలో లోపాల వల్ల వచ్చిన సమస్యలు ఉన్నట్లయితే వాటికి కూడా రసాయన ఆయుర్వేదంలో ఉత్తమమైన చికిత్స ఉంది.

 

 • ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ పై రసాయన ఆయుర్వేదం ప్రభావం చూపుతుందా?

మన భారతదేశంలో ఎనలేని జ్ఞాన సంపద ఉంది. మన పూర్వికులు మనకు అందించిన జ్ఞాననిధి లోని ఆయుర్వేదం మన ఆరోగ్యమైన జీవితానికి మూలం. ఈ ఆయుర్వేదంలోని రసాయన ఆయుర్వేద విభాగంలో లోహాలు మరియు ఖనిజాల నుండి చేయబడిన రస ఔషధాలను వ్యక్తి ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేద వైద్యులు ఉపయోగిస్తారు.

ఈ రసాయన ఆయుర్వేదం అన్ని రకాల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ పై కూడా ఉత్తమమైన ఫలితాలను ఇవ్వగలదు. క్యాన్సర్ ను సైతం నయం చేసే గుణం ఈ రసాయన ఆయుర్వేదం సొంతం. కొన్ని జీవనవిధానంలోని సమస్యలకు ఆయుర్వేద వైద్యులు ఉపయోగించే రసాయన ఔషధాలను క్రింద మీరు చూడవచ్చు.

 

 

ఆరోగ్య సమస్యరసాయన ఔషధం
గుండె సమస్యలుహేమామృత రస, హృదయార్నవ రస
ఊబకాయంమేదోహర విధంగాది లోహ, ఆరోగ్యవర్ధిని వటి
మధుమేహంవాంగేశ్వర రస, బహుమూత్రాంతక రస
అసిడిటీసూత్శేఖర రస, రస కండుగ్ధ రస
కీళ్ళ వాతంరామబాణ రస, నిత్యానంద రస

వివిధ జీవన విదానంలో లోపాల వల్ల ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలైన మధుమేహం మరియు ఊబకాయానికి రసాయన ఆయుర్వేదం చూపే పరిష్కారాలను

ఉదాహరణలుగా చూద్దాం.

 

 • మధుమేహం పై రసాయన ఆయుర్వేదం

ఈ మధుమేహాన్ని మనం సాధారణంగా షుగర్ అని కానీ, డయాబెటీస్ అని కానీ అంటుంటాం. ఇప్పుడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యల్లో మధుమేహం కూడా ఒకటి. ఈ మధుమేహాన్ని ఆయుర్వేదంలో

మహా రోగ
అని చెప్పబడింది. రసాయన ఆయుర్వేదం లోని రస ఔషధాలు మన రక్తంలో గ్లూకోస్ స్థాయిలను తగ్గించి ఈ మధుమేహం సమస్య నుండి మనను తప్పించగలవు. ఈ మధుమేహ సమస్యలకు పైన సూచించినవే కాకుండా రసాయన ఆయుర్వేద ఔషధాలైన శిలాజిత్, వంగ భస్మం, వసంత కుసుమాకర, చంద్ర ప్రభ వటి వంటివి ఉపయోగిస్తారు.
రసాయన ఆయుర్వేదం లోని ఔషధాలు మన శరీరంలోని త్రిదోషాలైన వాత, పిత్త, కఫ లను సమతుల్యం చేసేలా ఉంటాయి. ఈ
శిలాజిత్
అనే ఔషధం శరీరంలోనీ సప్త దాతువులపై ప్రభావం చూపి మన శరీరం ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరిగేలా ఈ ఔషధాలు పడుతుంది. దానితో పాటే జీవక్రియ మరియు రోగనిరోధక శక్తిని కూడా పరుస్తుంది. ఇక
వంగ భస్మం
మధుమేహం నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే
వసంత కుసుమకార
మన శరీరంలోని అన్ని అవయవాలను మెరుగుపరుస్తూ, త్రిదోషాలను సమతుల్యం చేసి మధుమేహానికి కారణమైన రక్తంలోని గ్లూకోస్ లెవల్స్ ని తగ్గిస్తుంది. అలాగే
చంద్రప్రభ వటి
అనే ఆయుర్వేద ఔషధం కూడా జీవక్రియను మెరుగుపరిచి మధుమేహ లక్షణాలను తగ్గిస్తుంది.

 

 • ఊబకాయం పై రసాయన ఆయుర్వేదం

  ఆయుర్వేదంలో ఊబకాయాన్ని
  స్థౌల్య
  అని పిలవబడింది. ఈ ఊబకాయం ఏర్పడటానికి ముఖ్య కారణం ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో అధిక మేధోధాతు ఉండటం, సింపుల్ గా మన భాష లో చెప్పాలంటే అధికంగా ఫ్యాట్ స్టోర్ అవ్వడం. జీవక్రియ లో అసమతుల్యత వల్ల మన బాడీ మాస్ ఇండెక్స్ పెరిగి అది ఈ ఊబకాయానికి దారి తీస్తుంది. దీనికి ముఖ్య కారణం మన జీవనశైలి మరియు ఆహార విధానం. మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోవడంతో పాటూ మన శరీరానికి కావలసిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆహారం, జంక్ ఫుడ్ రూపంలో తినడం ఈ సమస్యకు కారణమవుతుంది. ఇక రసాయన ఆయుర్వేదంలో ఈ ఊబకాయానికి కూడా సరైన వైద్యం మరియు ఔషధం ఉంది. ఈ రస ఔషధాలు శరీరంలో లిపిడ్ మెటబాలిజంను పెంచడం ద్వారా ఫ్యాట్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.

  ఈ ఊబకాయం సమస్యకు రసాయన ఆయుర్వేద వైద్యులు లోహ భస్మాన్ని ఉపయోగిస్తారు. ఈ
  లోహ భస్మం
  జీవక్రియను మేరుగుపరచడంతో పాటూ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ భస్మాన్ని తేనేతో పాటు తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తుంటారు. అలాగే
  ఆరోగ్యవర్ధిని వటి
  అనే ఔషధం కూడా ఈ ఊబకాయం తగ్గడానికి రసాయన ఆయుర్వేదం లో ఉపయోగిస్తారు. ఈ ఔషధం మన కాలేయం పై ప్రభావం చూపి జీవక్రియ మెరుగయ్యేలా పనిచేస్తుంది. ఇంకా ఈ ఊబకాయం వల్ల తలెత్తే ఫ్యాటీ లివర్ సమస్యకు
  వరుణాది కషాయం
  అనే ఔషధం ఉపయోగిస్తారు. రసాయన ఆయుర్వేదం లోని ఈ ఔషధాలు ఊబకాయం పై మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఎప్పుడూ సరైన ఆయుర్వేద వైద్యం కోసం వైద్యుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

   

  చివరగా,

  ఈ మధుమేహం, ఊబకాయం మాత్రమే కాకుండా రసాయన ఆయుర్వేదం ఇతర లైఫ్ స్టైల్ డిసీజెస్ కి కూడా సరైన పరిష్కారం చూపగలదు. ఆయుర్వేదం అనేది ఎన్నో ఏళ్లుగా మనిషికి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్ని అందిస్తున్న ఒక నిధి. మారుతున్న తరం మనకు కొత్త పోకడలను అలవాటు చేస్తున్నా, దీని వల్ల వచ్చే దుష్ప్రభావాలకు మళ్ళీ ఆయుర్వేదమే సమాధానం చెబుతుంది. అన్ని చోట్లా వ్యాపిస్తున్న ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ను నివారించడానికి ఆయుర్వేదాన్ని మన జీవితంలో ఒక భాగంగా మార్చుకొని, ప్రతీరోజూ ఆచరించాల్సిన అవసరం ఉంది.

  ఆయుర్వేదం మన జీవన ప్రయాణానికి ఓ మంచి మార్గదర్శిగా

  ఎప్పటికీ సహాయం చేస్తూనే ఉంటుంది.