క్యాన్సర్‌కు రసాయన ఆయుర్వేద చికిత్స – జీవన విధానం

You are currently viewing క్యాన్సర్‌కు రసాయన ఆయుర్వేద చికిత్స – జీవన విధానం

శరీరంలో క్యాన్సర్ తో సహా ఏ వ్యాధి అయినా సెల్యులర్ పవర్ హౌజ్ గా పిలవబడే మైటో కాండ్రియా దగ్గర నుండే మొదలవుతుందట. ఆయుర్వేదంలో అగ్ని మూలకంతో ఈ మైటోకాండ్రియా ను పోలుస్తారు. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలోని అగ్ని సమతుల్యంగా ఉన్నంతవరకు ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారట.

క్యాన్సర్ విషయంలో కూడా ఒక సాధారణ కణం కొన్ని చెడు సిగ్నల్స్ అందటం వల్ల క్యాన్సర్ కణం గా మారుతుంది. ఈ సమస్యకు రసాయన ఆయుర్వేదం అనేది సమస్య మొదలైన ప్రదేశం నుండి చికిత్స మొదలుపెడుతుంది. క్యాన్సర్ విషయంలో ఆయుర్వేదం, కణాలకు రివర్స్ సిగ్నలింగ్ ద్వారా కణాలను మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురాగలదు.

రసాయన ఆయుర్వేద క్యాన్సర్ చికిత్స సమయంలో సరైన ఆయుర్వేద నియమాలతో కూడిన సరైన జీవన విధానం పాటించటం ఎంతో ముఖ్యం.

ఈ నాలుగు సూత్రాలు రసాయన ఆయుర్వేద క్యాన్సర్ చికిత్స సమయంలో పాటించదగ్గవి.

1. సరైన ఆహార నియమాలు పాటించండి

ఆయుర్వేద చికిత్సా సమయంలో సరైన పోషకాలు ఉన్న ఆహరం సరైన సమయానికి సరిపోయేంత తినాలి. క్యాన్సర్ చికిత్స సమయంలో శరీరానికి సరైన పోషకాలు అందేలా తింటూనే యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఆహారం విషయంలో ఈ నియమాలను గుర్తుంచుకోండి.

  • వంట చేయడానికి ముందు కూరగాయలు & పండ్లను సరిగ్గా కడగాలి.
  • రొట్టెలను చేసుకోవటానికి
    గోధుమ పిండి ఉపయోగించవచ్చు. జోవర్, బజ్రా, రాగి, మొక్కజొన్న తో తయారు చేసిన రోటి కూడా అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంది. వైట్ బ్రెడ్, నాన్, రూమాలి రోటి మరియు ఇతర మైదా వాడకాన్ని తగ్గించండి.
  • తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు మరియు కూరగాయలను ప్రతిరోజూ తింటూ ఆహారంలో రోజుకు
    50-100
    గ్రాములు ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.
  • ఆహారంలో స్థానికంగా లభించే సీజనల్ ఫ్రూట్స్ మరియు ఆకు కూరగాయలను తినాలి.
  • సాధ్యమైనంతవరకు తాజాగా తయారుచేసిన ఆహారాన్ని తినండి. రీహీటింగ్ మరియు రిఫ్రిజిరేటింగ్ చేయటం వల్ల ఆహారాలు రుచి మరియు పోషణను కోల్పోతాయి.
  • మీకు ఆకలిగా అనిపించినప్పుడే
    తినండి, అలా అని భోజన సమయాలను పట్టించుకోకుండా ఉండకండి. క్రమం తప్పకుండా భోజనం తీసుకునే అలవాటు చేసుకోండి.
  • అతిగా తినడం మానుకోండి. అలాగే వేగంగా లేదా చాలా నెమ్మదిగా తినడం కూడా
    మంచిది కాదు. తొందరపడి తినే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు.
  • ఎక్కువ లేదా చాలా తక్కువ నీరు తాగవద్దు. గోరువెచ్చని నీటిని త్రాగటం జీర్ణ శక్తిని పెంచడానికి, జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి అలాగే వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి సహాయపడుతుంది.
  • మనస్సు సరిగ్గా లేనప్పుడు తినటం ప్రిఫర్ చేయకండి ఎందుకంటే మీరు తక్కువ లేదా అధికంగా తినే అవకాశం ఉంటుంది.
  • భోజనం తర్వాత వెంటనే నిద్రపోకండి. నిద్రకు కనీసం రెండు గంటల ముందు ఆహరం తినండి.
  • వేయించిన ఆహారాన్ని మానేయటం మంచిది, నెయ్యి తీసుకోవడం కూడా
    పరిమితం చేయండి,
  • ఆహారంలో నూనెలు, ఉప్పు మరియు చక్కెర ఎక్కువగా తీసుకోకండి.
  • కార్బోనేటెడ్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం మానేయటం మంచిది.
  • పాలు, వెన్న, లస్సీ, కొబ్బరి నీరు మొదలైన వాటి తీసుకోవడం పెంచండి.
  • ఆహారాన్ని తీసుకునేటప్పుడు, దృష్టిని ఇతర విషయాలపై మళ్లించకూడదు.
  • భోజనం తరువాత నోరు శుభ్రం చేసి చేతులతో నీటితో పూర్తిగా కడగాలి.

2. సరైన సమయానికి సరిపడా నిద్ర

క్యాన్సర్ చికిత్స సమయంలో సరైన ఆరోగ్యానికి సరైన నిద్ర అనేది అన్నిటికంటే ముఖ్యమైనది.

అలాగే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వటానికి, సరైన బరువులో ఉండటానికి, రోగనిరోధకశక్తి పెరగటానికి ఇలా
అన్నిటికీ నిద్ర అవసరం. శరీరానికే కాదు మెదడుకు, మానసిక ఆరోగ్యానికి కూడా నిద్ర ప్రభావం ఉంటుంది.

నిద్ర విషయంలో ఈ నియమాలను గుర్తుంచుకోండి.

  • రోజూ ఒకే సమయానికి నిద్ర పోవటం అలవాటు చేసుకోండి. ఎక్కువ సమయం రాత్రి లేచి ఉండటం మంచిది కాదు. నిద్ర పోయే సమయానికి ఒక గంట ముందుగానే లైట్స్ ఆర్పేయండి. అలాగే మొబైల్ కూడా ఉపయోగించటం ఆపేసి దూరంగా పెట్టండి.
  • నిద్ర పోవటానికి వదులుగా ఉండే కాటన్
    దుస్తులు ధరించండి.
  • ఏదైనా పని కోసమో, సినిమా లేదా మొబైల్ ధ్యాసలో నిద్రను ఆపుకోకండి.
    ఒకే నిద్ర షెడ్యుల్ ను పాటిస్తూ రోజుకు కనీసం ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి.
  • నిద్ర బాగా రావటానికి పడుకునే ముందు పాలు తాగడం మరియు పాదాలకు మసాజ్ చేయటం సహాయపడుతుంది.
  • ఏ రోజు నిద్ర ఆరోజే పోవాలి, తరువాతి రోజు సెలవు కదా అని ఈరోజు నిద్ర మానేసి ఉండటం మంచిది కాదు. దీని వల్ల
    సర్కేడియన్ రిథం
    డిస్టర్బ్ అయ్యి మరిన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు.

3. యోగా మరియు వ్యాయామం

యోగా మరియు వ్యాయామం క్యాన్సర్ చికిత్సా సమయంలో శరీరానికి మరియు మనసుకు బలాన్నిస్తాయి. రోజూ తగినంత శారీరక శ్రమ వల్ల చురుగ్గా ఉంటూ త్వరగా కోలుకోగలరు. వీలును బట్టి వ్యాయామాలను ఎంచుకోవాలి.

వ్యాయామం మరియు యోగా విషయంలో ఈ సూచనలు సహాయపడగలవు.

  • రెగ్యులర్ స్ట్రెచింగ్ అనేది
    ఫ్లెక్సిబిలిటీ
    ని మెరుగుపరుస్తుంది. ఇది కండరాలకు రక్తం మరియు ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచడానికి మరియు శరీరం త్వరగా
    కోలుకోవడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ చికిత్స నుండి కోలుకుంటున్నప్పుడు స్ట్రెచింగ్
    వ్యాయామాలు సహాయపడతాయి.
  • బ్యాలెన్స్ కోల్పోవడం క్యాన్సర్ యొక్క దుష్ప్రభావం కావచ్చు. రోజువారీ కార్యకలాపాలకు సురక్షితంగా తిరిగి రావడానికి అవసరమైన పనితీరు మరియు మొబిలిటీ తిరిగి పొందడానికి
    బ్యాలెన్స్ వ్యాయామాలు
    బాగా సహాయపడతాయి.
  • ఏరోబిక్ వ్యాయామం దీనినే
    కార్డియో
    అని కూడా పిలుస్తారు, ఇది మీ హృదయ స్పందన రేటును పెంచే ఒక రకమైన వ్యాయామం. ఇది మీ గుండె మరియు ఊపిరితిత్తులను బలపరుస్తుంది మరియు చికిత్స సమయంలో మరియు తర్వాత మీరు తక్కువ అలసటను అనుభవించడంలో సహాయపడుతుంది. వాకింగ్ అనేది ఏరోబిక్ వ్యాయామం చేయడానికి మంచి మార్గం.
  • క్యాన్సర్ సమయంలో ఒక వ్యక్తి మజిల్ మాస్ ని కోల్పోవడం తరచుగా జరుగుతుంది. అలాంటప్పుడు
    స్త్రెంత్ ట్రెయినింగ్
    బలమైన కండరాలను నిర్వహించడానికి మరియు నిర్మించడంలో సహాయపడుతుంది. కండర ద్రవ్యరాశిని పెంచడం సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, అలాగే అలసటను తగ్గిస్తుంది మరియు రోజువారీ కార్యకలాపాలను సులభతరం చేస్తుంది.
  • క్యాన్సర్‌తో బాధపడేవారికి యోగా
    మానసికంగా, శారీరకంగా సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. యోగా క్యాన్సర్‌తో నేరుగా పోరాడలేనప్పటికీ,
    ఇది వ్యాధి యొక్క కొన్ని దుష్ప్రభావాలను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచగలదు.

4. పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోండి మరియు ధైర్యాన్ని కోల్పోకండి

చికిత్స సమయంలో క్యాన్సర్ నయం అవుతుందని నమ్మటం, చికిత్స విషయంలో సానుకూల దృక్పథం మంచిది. రసాయన ఆయుర్వేద చికిత్స క్యాన్సర్ మూలల నుండి పనిచేస్తుంది. చికిత్స సమయంలో ధైర్యంగా నమ్మకంగా ఉండటం త్వరగా కోలుకోవటానికి సహాయపడుతుంది. నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టి పాజిటివ్ గా ఆలోచిస్తూ ప్రస్తుతం లోనే జీవిస్తూ జీవన శైలిని సరైన దారిలో పెట్టగలిగితే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలం. క్యాన్సర్ సమయంలో మందులతో పాటు
మన మనసు కూడా మన శరీరాన్ని కూడా క్యూర్ చేయగలదు అనే విషయాన్నీ గుర్తుంచుకోండి.

రసాయన ఆయుర్వేద చికిత్స సమయంలో ధైర్యంగా ఉండటానికి
పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ హాస్పిటల్ యుట్యూబ్ చానల్
లో ఉన్న క్యాన్సర్ సర్వైవర్ స్టోరీస్ చూడండి.

ఇవి మీకు మానసికంగా ధృడంగా ఉండటానికి, క్యాన్సర్ తగ్గుతుంది అన్న నమ్మకాన్ని ఇవ్వటానికి సహాయపడతాయి.

సరైన జీవన విధానాన్ని పాటిస్తూ సరైన రసాయన ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ చివరి స్టేజీ క్యాన్సర్ ఉన్నా సరే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చిన వారు

పునర్జన్ ఆయుర్వేద లో ఎందరో ఉన్నారు. రసాయన ఆయుర్వేద చికిత్స క్యాన్సర్ ను నయం చేయగలదు అనటానికి వారే ఒక ఉదాహరణ. సరైన జీవన శైలి మరియు సరైన వైద్యం క్యాన్సర్ ను కూడా నయం చేయగలదు. మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్స్ ఫాలో అవ్వండి.

Also read: హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ క్యాన్సర్ కి సరియైన పరిష్కారాన్ని అందిస్తుందా?