ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఉంటుంది. దానికోసం రకరకాల ప్రయోగాలు కూడా చేస్తుంటాం. ఇక డాక్టర్లు వారానికి వీలైనన్ని ఎక్కువ రకాల కూరగాయలు డైట్ లో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు. మనమైతే మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొంటున్నాం కానీ అందులో ఆరోగ్యానికి బాగా మేలు చేసే కూరగాయలేవో ఎంత మందికి తెలుసు?
మన వెజిటేబుల్ మార్కెట్ లో సూపర్ ఫుడ్స్ లా మన ఆరోగ్యానికి సహాయపడే కూరగాయల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది.
ఇది పూర్తిగా చదివండి, మీరు తినే కూరగాయల్లో సూపర్ ఫుడ్స్ ఉన్నాయో లేవో మీకే తెలుస్తుంది!
బ్రోకలి
ఈ బ్రోకలీ అనేది మన ట్రెడిషనల్ వెజిటేబుల్ కాదు కానీ అర్బన్ వెజిటేబుల్ అనవచ్చు. ఎందుకంటీ పట్టణాల్లో ఇది ఎక్కువగా ఉపయోగిస్తారు, అలాగే దీని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ కూరగాయ ఎందుకు సూపర్ ఫుడ్ గా ఉందో ఇప్పుడు చూద్దాం.
ముందు కొంచం ఈ బ్రోకలి హిస్టరీ లోకి వెళితే.. ఈ కూరగాయ మన భారతీయులకు ఈ మధ్యే పరిచయం అయింది. ఇది మన నేటివ్ వెజిటేబుల్ కాదు. 1990 లో రైతు కుటుంబంలో జితేంద్ర లద్కట్ అనే వ్యక్తి ఈ బ్రోకలీ విత్తనాలను కెన్యా నుండి ఇండియా కు తీసుకువచ్చి వ్యవసాయం చేసాడు. అలా ఇది మన ఇండియాలో ఒక ఎక్సోటిక్ వెజిటేబుల్ గా మారిపోయింది.
ఇక పోషకాల విషయానికి వస్తే ఈ బ్రోకలీ అనేది తక్కువ క్యాలరీలు మరియు అధిక మైక్రో న్యూట్రియంట్లు ఉన్న ఒక కూరగాయ. ఇందులో విటమిన్ కే మరియు విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే లుటేయిన్ మరియు జియజంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. ఇంకా ఈ బ్రోకలీ లో సల్ఫోరఫెన్ అనే ఒక గ్లుకోసినోలేట్ ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది గట్ మరియు లివర్ లో ఎంజైమ్స్ స్టిములేట్ చేయడంలో సహాయపడుతుంది.
ఇంకా ఈ బ్రోకలీ లో ఉన్న కోలిన్ అనే కాంపౌండ్ మన బ్రెయిన్ మరియు మెమొరీ ఎదుగుదలకు సహాయపడుతుంది. ఇక ఇందులో నెగిటివ్ ఎం లేదా అంటే.. చిన్న లోపం ఉంది. ఏంటంటే ఇదివరకే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారికి ఇది ఆ సమస్యను మరింత పెంచడంలో ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ ఒక్క విషయం పక్కన పెడితే అత్యధిక మైక్రో న్యూట్రియంట్లతో ఈ బ్రోకలి అర్బన్ వెజిటబుల్స్ లో ఒక మంచి హేల్తీ సూపర్ ఫుడ్.
క్యారెట్
క్యారెట్ మన అందరికీ తెలిసిందే. ఇది పచ్చిగా తిన్నా, వండుకొని తిన్నా రుచిగా ఉండే ఒక వెజిటేబుల్. ఇక ఈ క్యారెట్ ఒక సూపర్ ఫుడ్ అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ముందు కొంచం ఈ క్యారెట్ హిస్టరీ లోకి వెళితే.. ఇప్పుడు మనం ఎక్కువగా తింటున్న క్యారెట్లు పంతొమ్మిదో శతాబ్దం వరకు మన దేశం లో ఒక కామన్ వెజిటేబుల్ కాదు. పర్షియా లేక ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండియా కు బ్రిటీష్ పీరియడ్ లో ఈ క్యారెట్లు వచ్చాయి. మనకు కేవలం ఆరెంజ్ కలర్ లో ఉండే ఈ క్యారెట్లు మాత్రమే తెలుసు. కానీ ఇవి తెలుపు, పసుపు, పర్పుల్ వంటి రంగులలో కూడా ఉంటాయి.
ఇక పోషకాల విషయానికి వస్తే ఈ క్యారెట్లలో క్యాలరీ లు తక్కువగా ఉండి, మైక్రో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇదొక మంచి హేల్తీ కూరగాయ అని చెప్పొచ్చు. కెరటినాయిడ్స్ అనే కాంపౌండ్స్ ఈ క్యారెట్ లో అధికంగా ఉంటాయి. ఈ క్యారెట్ లో ఉండే ఆల్ఫా కెరోటిన్ మరియు బీటా కెరోటిన్ కలిసి మన శరీరంలో విటమిన్ A గా మారతాయి. దీని వల్ల మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ సృష్టించే ఆక్సిడేషన్ నివారించడమే కాకుండా మన కంటి ఆరోగ్యానికి కూడా మంచి చేస్తాయి.
ఈ క్యారెట్లు మన శరీరంలో కొన్ని రకాల క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గించి, బ్లడ్ ప్రెజర్ లెవల్స్ అదుపు చేయటంలో కూడా పాత్ర పోషిస్తాయి. ఇవి చాలా సులభంగా మనకు డైజెస్ట్ అయ్యి మన హెల్త్ ని కూడా కాపాడతాయి. అందుకనే క్యారెట్ కూడా ఈ గ్రేడ్ వన్ లిస్టు లో చేర్చబడింది.
వెల్లుల్లి
మన ఇంట్లో మనం ఎక్కువగా వెల్లుల్లి ని ఉపయోగిస్తూనే ఉంటాం. మన పెద్దలు కూడా ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్పడం మీరు వినే ఉంటారు. అసలు ఇది ఎందుకు సూపర్ ఫుడ్స్ లిస్టు లో ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముందు కొంచం ఈ వెల్లుల్లి హిస్టరీ లోకి వెళితే.. ఈ వెల్లులి స్వచ్చమైన భారతీయ నేటివ్ కూరగాయ. ఇది మన దేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల ముందు నుండే ఉపయోగిస్తున్నారు.ప్రాచీన సాంప్రదాయాల ప్రకారం కూడా ఈ వెల్లుల్లి ని మన దేశంలో అమృతం తో పోలుస్తారు. ఈ విషయం మన పురాణాలలో ఒకటైన కశ్యప సంహితలో రాయబడి ఉంది.
ఇక పోషకాల విషయానికి వస్తే వెల్లుల్లి అనేది ఖచ్చితంగా ఒక అరుదైన క్వాలిటీస్ ఉన్న సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. ఈ వెల్లుల్లి లో మైక్రో న్యూట్రియంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో మన ఎముకల కనేక్టివ్ టిష్యూ ఏర్పడటానికి సహాయం చేసే మ్యంగనీస్ ముఖ్యమైనది. ఇంకా ఇందులో రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి సహాయపడే విటామిన్ బీ 6, ఎముకలు మరియు పళ్ళు ధృడంగా ఉండటంలో సహాయపడే క్యాల్షియం, ఇంకా మన శరీరం ఐరన్ సరిగ్గాగ్రహించడానికి సహాయపడే కాపర్ కూడా ఉంటుంది.
అంతే కాకుండా ఈ వెల్లుల్లి లో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ ఆరోగ్యంగా ఉండటానికి మనకు ఎంతగానో సహాయపడతాయి. ఈ వెల్లుల్లి లో ముఖ్యంగా అల్లిసిన్ అనే ఒక ప్రత్యేకమైన కాంపౌండ్ కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నిరోధించగలదట.
ఇంకా చెప్పాలంటే ఈ వెల్లుల్లి లో ఉండే డిలైల్ డై సల్ఫిడ్ యాంటీ ఇంఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉండి హృదయ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అలాగే ఆల్జైమర్స్ వంటి వ్యాధుల రిస్క్ ను కూడా ఈ వెల్లుల్లి తగ్గించగలదట. ఇన్ని కారణాలు ఉన్నాక దీనిని సూపర్ ఫుడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు కదా !
కానీ ఈ సూపర్ ఫుడ్ ని లిమిట్ లోనే తీసుకోవాలి, ఎందుకంటే అధికంగా తిన్నట్లయితే కొన్ని రకాల గ్యాస్ట్రిక్ సముస్యలు వచ్చే అవకాశం ఉంది. అయినా ఈ వెల్లుల్లి స్ట్రాంగ్ ఫ్లేవర్ మానను అతిగా తిననివ్వదు అనుకోండి..కానీ మన జాగ్రత్త లో మనం ఉండాలి కదా!
కేల్
ఇది కూడా మనకు ముందు నుండి పరిచయం ఉన్న వెజిటేబుల్ కాదు. క్యాబీజీ కుటుంబానికి చెందిన ఈ కేల్ అనే ఆకు కూర సిటీ లో ఎక్కువగా తినే ఒక హేల్తీ లీఫీ వెజిటేబుల్ అని చెప్పొచ్చు. పోషకాలు అధికంగా ఉండటం, క్యాలరీలు తక్కువగా ఉండటం ఈ కేల్ ను సూపర్ ఫుడ్ ను చేసేసాయి. అసలెందుకు ఈ కేల్ మన ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు చూద్దాం.
ముందు కొంచం ఈ కేల్ హిస్టరీ లోకి వెళితే.. మధ్యధరా ప్రాంతంలో పుట్టిన ఈ కేల్ అనేది చాలా రీసెంట్ గా ఒక పది,పదిహీనేళ్ళ ముందు నుండే మన దేశం లో ఒక పాపులర్ వెజిటేబుల్ గా మారింది. ఇది కూడా మనకు పంతొమ్మిదవ శతాబ్దం లోనే మనకు పరిచయం అయింది. ఎక్కువగా దీనిని పిజ్జా లలో ఉపయోగించే వాళ్ళు. ఇక అధిక పోషకాలు ఉండటం వల్ల మన ఇండియన్స్ దీనిని ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టారు.
ఈ కేల్ అనే అర్బన్ వెజిటేబుల్ లో ముఖ్యమైన పోషకం విటామిన్ K. ఈ విటామిన్ మన శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి, ఎముకలు బలంగా ఉండటానికి సహాయం చేస్తుంది. ఇక ఈ కేల్ లో ఉండే కెరోటినాయిడ్స్ మన ఐ హెల్త్ కి బాగా సహాయపడతాయి. అలాగే ఈ కేల్ లో ఉండే కోర్సేటిన్, కేమ్ఫేరాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ తో పోరాడటానికి, అలాగే ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి పనిచేస్తాయి. ఇంకా ఇది క్యాన్సర్ నివారణలో కూడా హెల్ప్ చేస్తుంది.
ఇవి మాత్రమే కాకుండా ఈ కేల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న సల్ఫ్రోఫేన్, డీటాక్సిఫికేషన్ కు సహాయపడే ఇండోల్ -౩- కార్బోనైల్ వంటి మంచి పోషకాలు ఈ కేల్ ని మరింత ప్రత్యేకమైన ఆకుకూర గా చేసాయి. ఈ కేల్ ని పచ్చిగా తింటేనే ఎక్కువ పోషకాలు మనకు లభిస్తాయట మరి.
ఇక ఈ అర్బన్ వెజిటేబుల్ విషయంలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఇదివరకే థైరాయిడ్ సమస్య తో బాధపడుతున్న వారికి ఈ కేల్ ఆ సమస్యను మరింత తీవ్రం చేసే అవకాశం ఉందట. వండకుండా రా’ గా తినే వెజిటబుల్స్ పోషకాలలో కేల్ స్థాయికి మరేది తూగలేదట. ఇది ఈ సూపర్ ఫుడ్ కేల్ ప్రత్యేకత మరి.
పాలకూర
ఈ పాలకూర అనేది మనందరి ఇళ్ళలో సాధారణంగా తినే ఆకుకూర గా ప్రతీ ఒక్కరికీ సుపరిచితమే. కానీ ఇది సూపర్ ఫుడ్ ఏంటి అని మీలో కొందరికి అనుమానం రావచ్చు. కానీ ఈ పాలకూర క్వాలిటీస్ దీనిని సూపర్ ఫుడ్ గా మార్చేసాయి మరి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ముందు కొంచం ఈ పాలకూర హిస్టరీ లోకి వెళితే.. పర్షియా ప్రాంతంలో పుట్టిన ఈ ఆకుకూర మన భారత దేశానికి ఏడో శతాబ్దం లోనే అలవాటైంది. ,మన పూర్వికులు కూడా ఈ పాలకూర ను తినేవారు. ఇక తరువాత చైనా, నేపాల్ కు పరిచయమై అరబ్స్ ద్వారా ప్రపంచమంతా ఈ కూరగాయ చేరింది. ఒక విధంగా ఇండో-చైనీస్ ప్రాంతంలో పుట్టిన ఈ కూరగాయ మన నేటివ్ వెజిటేబుల్ అనవచ్చు.
ఇక పోషకాల విషయానికి వస్తే ఈ పాలకూర తక్కువ క్యాలరీలు ఉంది అత్యధిక మైక్రో న్యూట్రియంట్లు ఉండే ఒక మంచి హేల్తీ ఆకుకూర. దీనిలో ఉండే ఫోలేట్ DNA మరియు RNA ప్రొడక్షన్ లో సహాయపడుతుంది. ఇంకా ఇందులో ఉండే మెగ్నీషియం కండరాల మరియు నరాల పనితీరును మెరుగుపరుస్తుంది అలాగే ఐరన్, రక్తంలో హిమోగ్లోబిన్ తయారీకి సహాయపడుతుంది. అలాగే ఈ పాలకూరలో ఉండే విటామిన్ బీ 2 మన శరీరంలోని కార్బోహైడ్రేట్స్ ను మన ఎనర్జీ లా కన్వర్ట్ చేస్తుంది. ఇలా పాలకూరలో ఉండే అన్ని పోషకాలు మన ఆరోగ్యానికి ప్రత్యెక బెనిఫిట్స్ ఇస్తాయి.
ఇవి మాత్రమే కాదు, ఈ పాలకూర లో విటామిన్ k, మ్యంగనీస్, క్యాల్షియం కూడా ఉంటాయి. అలాగే బీటా కెరోటిన్, లుటేయిన్ మరియు జియజంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉండటం వల్ల ఇది సూపర్ ఫుడ్ కి ఏ మాత్రం తక్కువ కాదు.
ఇంకా ఈ పాలకూర మన బ్లడ్ ప్రెజర్ లెవల్స్ రెగ్యులేట్ చేయడంలో సహాయం కూడా చేస్తుంది. కానీ ఉన్న ఒకే ఒక్క నేగిటివ్ విషయం ఏంటంటే ఈ పాలకూరలో మనపై చేడు గా ప్రభావం చూపే యాంటీ న్యూట్రియంట్లలో ముఖ్యమైనవైన ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి అధికంగా తీసుకున్నప్పుడు క్యాల్షియం తో కలిసి కిడ్నీ లో రాళ్ళు ఏర్పడటానికి సహాయపడతాయి. కానీ వంట చేసినప్పుడు,బాగా ఉడకబెట్టినప్పుడు ఇందులోని ఆక్సలేట్లు తగ్గుతాయి. ఇక మన హెల్త్ కి ఇంతలా హెల్ప్ చేసే పాలకూర సూపర్ ఫుడ్ కాకుండా ఎలా ఉంటుంది.
చిలగడదుంప
మనకు ఎక్కువగా స్వీట్ పొటాటో పేరుతొ పరిచయం ఉన్న ఈ చిలగడదుంప ఎక్కువ క్యాలరీస్ మరియు మంచి పోషకాలు ఉన్న ఒక మంచి వెజిటేబుల్. ఈ కూరగాయ స్స్టార్చీ కార్బోహైడ్రేట్లకు ఒక మంచి మూలం. ఇక ఈ చిలగడదుంప సూపర్ ఫుడ్ గా ఉండటానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
ముందు కొంచం ఈ చిలగడదుంప హిస్టరీ లోకి వెళితే.. ఐదేళ్ళ క్రితం దాకా ఈ చిలగడదుంప పదహారవ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు మన భారత దేశానికి తీసుకువచ్చారు అనేది ఒక ఫ్యాక్ట్ గా ఉండేది. కానీ రేసేంట్ గ జరిగిన ఒక రీసర్చ్ లో యాభై ఏడు మిలియన్ సంవత్సరాల క్రితమే మన భారత దేశంలో ఈ చిలగడ దుంప పండించే వారని తేలింది. అందుకని ఇప్పుడు ఇది మన ఇండియన్ వెజిటేబుల్ అని నమ్మాల్సిందే మరి.
ఇక పోషకాల విషయానికి వస్తే ఈ చిలగడదుంపలో క్యారెట్ల కంటే ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది విటమిన్ A గా కన్వర్ట్ అయ్యి మన కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అలాగే ఇందులో ఉండే పోషకాలు మనకు ఒక బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉండటంలో సహాయపడతాయి.
ఇంకా ఈ చిలగడదుంపలో విటామిన్ C అధికంగా ఉంటుంది, అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ ని నియంత్రించడంలో సహాయపడే క్లోరోజేనిక్ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే స్టార్చ్ మన గట్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది.
ఇక మన ఈ చిలగడదుంపలో కూడా ఆక్సలేట్ల వంటి యాంటీ న్యూట్రియంట్లు ఉండటం ఒక చిన్న నెగిటివ్ విషయం. ఇవి కూడా బాగా ఉడకబెట్టినప్పుడు తగ్గిపోతాయట. ఇక ఇన్ని మంచి పోషకాలతో మరియు ఆరోగ్యకరమైన స్టార్చ్ తో ఉంది కాబట్టి ఈ స్వీట్ పొటాటో కూడా సూపర్ ఫుడ్స్ లిస్టు లో చేరిందనమాట.
ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్స్ ను ఫాలో అవ్వండి.