థైరాయిడ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు, కారణాలు మరియు చికిత్సా విధానం

You are currently viewing థైరాయిడ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు, కారణాలు మరియు చికిత్సా విధానం

థైరాయిడ్ గ్రంధి అంటే ఏమిటి..?

థైరాయిడ్ గ్రంధి సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి మెడకు ముందు భాగంలో ట్రాకియా చుట్టూ అల్లుకుని ఉంటుంది. థైరాక్సిన్, ట్రైడో థైరాక్సిన్, టి ఎస్ హెచ్, కాల్సిటోనిన్ వంటి కీలకమైన హార్మోన్ ల మధ్య సమతుల్యాన్ని నీయంత్రించడంలో చేయడంలో థైరాయిడ్ గ్రంధి కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీర నిర్మాణం, ఎదుగుదలలో ఈ హార్మోన్లు నిర్ణయాత్మక పాత్రను పోషిస్తూ ఉంటాయి.

థైరాయిడ్ క్యాన్సర్ కి గల కారణాలు..?

థైరాయిడ్ గ్రంథిలో ఉన్న కణజాలంలో  ఎప్పుడైనా అసంబద్ధమైన జన్యుమార్పు చోటు చేసుకున్నప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ వస్తుంటుంది. ఈ జన్యుమార్పు కారణంగా క్యాన్సర్ కణాలు వాటంతటవే హెచ్చించుకోవడం మరియు ఒకచోట గుంపులా చేరి గడ్డలా మారడం వంటివి జరుగుతుంటాయి. అలాగే ఒక్కోసారి చుట్టుపక్కల ఉన్న కణజాలాల్లోకి లింఫ్ నాళాల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ దశనే మెటాస్టాటిస్ అంటారు.

థైరాయిడ్ క్యాన్సర్ లోని రకాలు

థైరాయిడ్ క్యాన్సర్ నాలుగు రకాలు. వయసు ఆధారంగా లేదా వయసును బట్టి వీటి ప్రభావం ఆధారంగా థైరాయిడ్ క్యాన్సర్లను విభజించడం జరిగింది. వీటిలో మొదటిది పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్, రెండవది ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్, మూడవది అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్, నాలుగవది మెడుల్లరీ థైరాయిడ్ క్యాన్సర్. ఈ నాలుగే కాకుండా థైరాయిడ్ లింఫోమా, థైరాయిడ్ సార్కోమ అనే రెండు అరుదైన థైరాయిడ్ క్యాన్సర్లు కూడా ఉన్నాయి.

పాపిల్లరీ  థైరాయిడ్ క్యాన్సర్ సాధారణంగా 30 నుండి  40 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వారికి వస్తుంది. ఫాలీక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ 50 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్  అరుదుగా వస్తుంది. 60 ఏళ్లు పైబడిన వారికి ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెడుల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ సాధారణంగా థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన C- కణాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన క్యాన్సర్ వచ్చినప్పుడు రక్తంలో కాల్సిటోనిన్ శాతం పెరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ లింఫోమా, థైరాయిడ్ సర్కోమా చాలా అరుదుగా వస్తుంటాయి.

థైరాయిడ్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు :

రక్త పరీక్షలు నిర్వహించినపుడు రక్తంలో TSH, T3, T4  విలువలను, కాల్సిటోనిన్ విలువలను పరిగణలోకి తీసుకుని  థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును నిర్ధారిస్తారు. ఆ తరువాత థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ కణాలు ఉన్నాయే లేదో గుర్తిస్తారు. అలాగే సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పెట్ సీటీస్కాన్ వంటి పరీక్షలు కూడా నిర్వహించి, ఈ క్యాన్సరు కణాలకు వేరే చోటకి వ్యాప్తి చెందే గుణం కలిగి ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఈ పరీక్షల ఆధారంగా థైరాయిడ్ క్యాన్సర్ ఎన్నో స్టేజ్ లో ఉందో కూడా నిర్థారిస్తూ ఉంటారు పాథాలజీ నిపుణులు. ఇక థైరాయిడ్ క్యాన్సర్లను గుర్తించే విధానంలో చివరిగా బయాప్సీ అనే పరీక్ష చేయడం జరుగుతుంటుంది. థైరాయిడ్ గ్రంధి వద్ద ఉన్న  కణాలు క్యాన్సర్ కు సంబంధించినవా కాదా అన్నది తెలుసుకునేందుకు ఈ పరీక్ష చేస్తారు.

థైరాయిడ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు :

థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కొన్ని అసాధారణ లక్షణాలు కనిపిస్తుంటాయి. అవి

  • మొహం ఉబ్బడం – మొహం నీరు పట్టినట్టుగా ఉబ్బుతూ ఉంటుంది. పడుకుని లేచిన తర్వాత ఇది మరీ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది
  • దీర్ఘకాలిక మలబద్ధకం – సహజంగా ఉండే మలబద్దకం వేరు థైరాయిడ్ క్యాన్సర్ల వలన కలిగే మలబద్దకం వేరు.
  • బరువు తగ్గడం – తీసుకుంటున్న ఆహారం శరీరానికి పోషకాలు అందించకపోవడం వలన కాదు గానీ క్యాన్సర్ కణాల ఆకలికి ఈ పోషకాలు శరీరానికి అందవు. ఫలితంగా బరువు తగ్గుతుంటారు.
  • ప్రతిరొజూ నీరసంగా ఉండటం, ఉన్నట్టుండి గొంతు మారడం, ఆడవారిలో రుతుక్రమం దెబ్బతినడం, గొంతు వద్ద వాపు వంటి అసాధారణ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

కారణం లేకుండా ఎప్పుడైనా గొంతు మారినట్లు అనిపించినా, గొంతు దగ్గర నొప్పి కలిగినా జాగ్రత్తపడాల్సి ఉంటుంది.  ఒకవేళ ఈ నొప్పి కనుక ధీర్ఘకాలికంగా ఉంటే వెంటనే డాక్టరుని కలిసి పరీక్షలు చేయించుకుంటే తొందరగానే థైరాయిడ్ క్యాన్సర్ల నుండి బయటపడే అవకాశముంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ బయటపడినప్పుడు మొట్టమొదటిగా ఆహారానికి సంబంధించిన జాగ్రత్తలు పాటించాలి. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా థైరాయిడ్ గ్రంధిని ఆరోగ్యంగాఉంటుంది.

థైరాయిడ్ క్యాన్సర్ యొక్క నివారణ

థైరాయిడ్ క్యాన్సర్లు రాకుండా కూడా జాగ్రత్తపడాలంటే శరీరంలో అయోడీన్ విలువలను నియంత్రణలో ఉంచుకుంటూ ఉండాలి. ప్రతిరోజూ ఆకుకూరలను తినడం ద్వారా థైరాయిడ్ క్యాన్సర్ల బారిన పడకుండా ఉండవచ్చు. ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లు వంటి ఆహరo తీసుకోకూడదు. బెర్రీలు, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు ఎక్కువగా తింటూ ఉండాలి.

థైరాయిడ్ క్యాన్సర్లకు ఆయుర్వేదం ఏ విధంగా పనిచేస్తుంది.

ఆయుర్వేద చికిత్స మొదటిగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఆరోగ్యకరమైన జీవక్రియకు దోహదపడుతుంది.  శిలాజిత్, శంఖపుష్పి, త్రికటు, జటామాన్షి, గులాంచ మొదలైన  అనేక మూలికలు థైరాయిడ్ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంటాయి. అదే విధంగా యోగరాజ్ గుగ్గులు, కాంచనరగుగ్గులు, త్రిఫలాద్య గుగ్గులు వంటి మందులు థైరాయిడ్ క్యాన్సర్‌లకి అద్భుతంగా పనిచేస్తాయి.

రోగిని పరిశీలించిన తర్వాతే డాక్టర్ సరైన ఔషధాన్ని నిర్ణయిస్తూ ఉంటారు. రోగి శారీరక ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అనుభూత యోగాలు ఉంటాయి. రసాయన ఆయుర్వేదంలో థైరాయిడ్ క్యాన్సర్లకు ఈ విధంగా చక్కటి ఉపశమనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో అసాధారణంగా కనిపించే థైరాయిడ్‌కి పంచకర్మ వంటి చికిత్స కూడా ఉపయోగ పడుతుంటుంది.

ఇవే కాకుండా, వ్యాధి రహిత జీవితాన్ని కొనసాగించడానికి క్రమం తప్పకుండా ప్రాణాయామం, వ్యాయామాలు చేస్తూనే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి.

 

పునర్జన్ ఆయుర్వేదతో క్యాన్సర్ నియంత్రణ:

క్యాన్సర్ ట్రీట్మెంట్లో గడిచిన పదేళ్లుగా అసాధారణ ట్రీట్మెంట్ అందిస్తూ వ్యాధి నివారణలో ఎంతో మెరుగైన ఫలితాలనిస్తూ ముందుకు సాగుతోంది పునర్జన్ ఆయుర్వేద.

చాలామంది క్యాన్సర్ బాధితులు మా మెడిసిన్ వాడి లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్న వాళ్ళున్నారు. ఒకపక్క క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్ అందిస్తూనే మరోపక్క వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.

ముఖ్య గమనిక :

ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Also read: అధికంగా లభించే గ్లూకోజ్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?