క్యాన్సర్ చికిత్సలో గోధుమ గడ్డి సహాయం చేయగలదా?

You are currently viewing క్యాన్సర్ చికిత్సలో గోధుమ గడ్డి సహాయం చేయగలదా?

మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది .. పోషక విలువలు గల ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈరోజుల్లో   ఆరోగ్యాభిలాషుల నోట తరచూ వినిపిస్తున్న పేరు గోధుమ గడ్డి, …దీనినే వీటి గ్రాస్ లేదా గ్రీన్ బ్లడ్ అని కూడా అంటారు…. గోధుమ గడ్డిని పరమ ఔషధంగా భావిస్తున్నారంటే ఆరోగ్యం పెంపొందించడం లో  గోధుమ గడ్డి అద్భుతాలు చేస్తోందని గ్రహించాలి. గోధుమ గడ్డి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఆలస్యం చెయ్యకుండా  ఈ వీడియో చూడండి

Wheat Grass గోధుమ గడ్డి చరిత్ర

గోధుమ గడ్డిని పరమ ఔషధంగా ప్రపంచానికి పరిచయం చేసిన మహిళ  అమెరికాకు చెందిన  యాన్ విగ్ మోర్ ..చిన్నవయసులోనే కారు ప్రమాదానికి గురైంది.వైద్యులు 2 కాళ్లు తీసేయాలని సూచించారు.దానికి ఆమె అంగీకరించకపోగా గ్రీన్ ఫుడ్స్  తీసుకుంటూ  హెర్బల్ వైద్యాన్ని పాటిస్తూ తిరిగి పూర్తి ఆరోగ్యాన్ని పొందింది.. మైళ్ళ మారథాన్ లో కూడా పాల్గొన్నది..యాన్ విగ్ మోర్ కు గోధుమగడ్డి రసం ప్రీతికరమైనదని,  .మన ఆధునిక జీవన విధానమే మన అనారోగ్యానికి కారణమంటూ  యాన్ విగ్ మోర్ తన ఆత్మకథ ” వై సఫర్ “అనే పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించింది

రక్తహీనత నివారణకు

శాస్త్రీయంగా గోధుమ గడ్డి ఆకృతి, హిమగ్లోబిన్ ఆకృతి  ఒకే విధంగా  ఉంటాయి.అయితే గోధుమగడ్డి ఆకృతిలో మెగ్నిషియమ్ ఉంటే  , హిమగ్లోబిన్ లో ఐరన్,ఈ చిన్న చిన్న వ్యత్యాసమే ఉంటుంది.. అందువల్ల గోధుమ గడ్డి తీసుకోవడం వలన శరీరంలో హిమాగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.ఎనిమియా పేషంట్లకు గోధుమ గడ్డి జ్యూస్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది… అందుకే వీట్ గ్రాస్ జ్యూస్ ని గ్రీన్ బ్లడ్ అంటారు

 ఆక్సిజన్ అందిస్తుంది

వీట్ గ్రాస్ లో క్లోరోఫీల్ అంటే పత్రహరితం ఉంటుంది. ఈ పత్రహరితం ప్రాణవాయువు ను అందిస్తుంది.. దేహంలో ఆక్సిజెన్ లెవెల్స్ సరిగ్గా ఉంటే అన్ని వ్యవస్థలూ సవ్యంగా పని చేస్తాయి శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సప్లై చేసేది హిమగ్లోబిన్ .గోధుమగడ్డి బ్లడ్ సప్లై ను బూస్ట్ చేస్తుంది  దీనివల్ల .ఆక్సిజన్ సరఫరా సవ్యంగా జరుగుతుంది

క్యాన్సర్ బాధితులకు ప్రయోజనాలు

గోధుమ గడ్డిలో ఆల్కలాయిడ్స్ ,ఫ్లెవనాయిడ్స్ ,యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి..ఆల్కలాయిడ్స్  క్యాన్సర్ కణాల పునరుత్పత్తిని అడ్డుకుంటాయి. యాంటీ ప్రొలిఫరేషన్, కు దోహదపడుతాయి.క్యాన్సర్ వ్యాప్తిని అరికడతాయి..గోధుమగడ్డి యాంటీ మెటాస్టాటిక్ లక్షణం కలిగివుంటుంది .క్యాన్సర్ సోకిన భాగం నుండి ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా రక్షిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్  ను అరికట్టి క్యాన్సర్ కణాల ఉత్పత్తిని అడ్డుకుంటాయి క్యాన్సర్ కణాలను చంపడానికి ,అంటే అపోప్టోసిస్ కు  దోహదపడుతాయి  ఆధునిక క్యాన్సర్  చికిత్స లో  బాధితులు ఎదురుకునే సైడ్ ఎఫెక్ట్స్ నుండి ఉపశమనం పొందడానికి,  రేడియషన్ టాక్సిన్స్ నిర్మూలనకు కూడా గోధుమగడ్డి సహాయపడుతుంది…. ఓరల్ క్యాన్సర్,కోలన్  క్యాన్సర్, లుకేమియా బాధితులకు వీట్ గ్రాస్ దివ్య  ఔషధంగా పనిచేస్తుంది .రోగ నిరోధక శక్తి పెంచి క్యాన్సర్ తో పోరాడే శక్తినిస్తుంది.

ఆర్తరైటిస్ బాధితులకు

వీట్ గ్రాస్ లో వుండే యాంటీ  బ్యాక్ టేరియల్, యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాల వలన ఇన్ఫెక్షన్స్ ,వాపుల నుండి రక్షణ లభిస్తుంది.ప్రత్యేకించి రుమటాయిడ్ ఆర్తరైటిస్ తో బాధపడేవారికి ఉపశమనం ఇస్తుంది.

డయాబెటిస్ పేషంట్లకు

మన శరీరంలో యల్ డి యల్ అంటే లో డెన్సిటీ లిపోప్రొటీన్స్  బాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గింస్తుంది.. ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.టైపు టు డయాబెటిస్ పేషంట్లకు వీట్ గ్రాస్ గొప్ప మేలు చేస్తుంది

ఎలా తీసుకోవాలి

గోధుమ గడ్డి పెంచుకోలేని వారు  పౌడర్ తో జ్యూస్ చేసుకుని తాగావచ్చు. ఒక చెంచా గోధుమ గడ్డి పౌడర్ లో 6 గ్రాముల కార్భో హైడ్రేట్స్,25 క్యాలోరిస్ ,1 గ్రాము ప్రోటీన్లు ,24 మిల్లీగ్రాముల క్యాల్షియమ్,1 గ్రాముఐరన్,3 గ్రాముల ఫైబర్,86 మిల్లీగ్రాముల విటమిన్ కె ఉంటాయి.

ఉదయం నిద్ర లేవగానే మంచి నీరు తాగి ఆ తర్వాత గోధుమగడ్డి జ్యూస్ తాగాలి..కడుపు నిండుగా వున్నప్పుడు తీసుకోకపోవడమే మేలు. అయితే ఫస్ట్ టైం తీసుకునేవారు కొద్ది మోతాదులోనే  తాగాలి.

ఈ జ్యూస్ లో కాస్త తేనె కలుపుకుని తాగవచ్చు లేదా కొబ్బరినీళ్లలో జ్యూస్ కలుపుకుని కూడా తాగవచ్చు.

దుష్ప్రభావాలు

పరిమితికి మించి .గోధుమగడ్డి జ్యూస్ తీసుకుంటే నాసియా , అసాధారణంగా  బరువు తగ్గడం,అజీర్తి ,వాంతులు అవడం వంటి దుష్ప్రభా వాలు  ఎదురుకోవలసి వస్తుంది.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు డైట్ చార్ట్ అనుసారమే తీసుకోవాలి. ఎన్ని పోషకవిలువలు వున్న పదార్ధమైనా  శరీర ఆరోగ్యస్థితిని బట్టి వైద్యనిపుణుల సూచనమేరకు తగిన మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యం పెంపొందుతుందని గుర్తుపెట్టుకోండి

విల్ పవర్ పెరుగుతుంది. మెడిసిన్ అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం వైద్య విధానం లో క్యాన్సర్ చికిత్స వలన ఎటువంటి దుష్ప్రభావాలూ  ఉండవు కాబట్టి రోగి  తన దినచర్య ఒకింత సాధారణ జీవన శైలి లోనే కొనసాగించవచ్చు. ఆహారం  తీసుకోడానికి కూడా ఇబ్బందులు తలెత్తవు.

ఇవి, చివరి దశలో ఉన్న క్యాన్సర్ బాధితులకు సంబంధించిన వివరాలు. వారికి ఆయుర్వేదం కలిగించే ప్రయోజనాల వివరాలు.

ముఖ్య గమనిక :

ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.