క్యాన్సర్ ఎందుకు అంత ప్రమాదకరం?

You are currently viewing క్యాన్సర్ ఎందుకు అంత ప్రమాదకరం?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వ్యాధులతో పోలిస్తే మరణాల పరంగా క్యాన్సర్ అత్యంత భయంకరమైన వ్యాధి. క్యాన్సర్ గురించి ఆలోచించే క్రమములో చాలా మంది ప్రజలు దీనిని ప్రమాదకరమైన వ్యాధిగా భావిస్తారు.

మలేరియా యొక్క ఉదాహరణను తీసుకుందాం, ఇక్కడ ప్లాస్మోడియం పారాసైట్ దోమల నుండి మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది, ఎందుకంటే ఇది వెక్టర్గా పనిచేస్తుంది. ప్లాస్మోడియం కాలేయ కణాలలో నివసిస్తుంది, తరువాత ఎర్ర రక్త కణాలలోకి వ్యాపిస్తుంది, అలా వ్యాధిని వ్యాప్తి చేస్తుంది. అక్కడ నుంచి మరి ఏ ప్రదేశానికి వ్యాప్తి చేసే శక్తీ ఉండదు.

కానీ, క్యాన్సర్ వ్యాప్తి మనలో రెండు విధాలుగా జరుగుతుంది.

  • ఇన్వేషణ్(Invasion): ఒక కణం నుండి పక్కన కణాలు లేదా కణజాలాలకు క్యాన్సర్ వ్యాప్తి చెందుతుంది.
  • మెటాస్టాసిస్(Metastasis): క్యాన్సర్ పురోగతిలో ఇది చాలా కీలకం. ఒక అవయవం నుండి క్యాన్సర్ కణం మానవ శరీరంలోని ఏదైనా అవయవంలోకి వ్యాపించే ఈ ప్రక్రియని మెటాస్టాసిస్ అని అంటారు.

ప్లాస్మోడియం పారాసైట్ యొక్క ఉదాహరణలలో, ఇది కాలేయం మరియు RBCకి వరకే వ్యాపిస్తుంది. అయితే క్యాన్సర్లో, ఇది శరీరంలోని ఏదైనా భాగానికి వ్యాప్తి అయ్యే శక్తి క్యాన్సర్కి ఉంటుంది.అందువల్ల, సమకాలీన చికిత్స ప్రోటోకాల్లో, క్యాన్సర్ పురోగతికి చికిత్స చేయడంలో మరియు నియంత్రించడంలో ఇబ్బందిని మనము కనుగొంటున్నాము.

మనము ఈ మెటాస్టాసిస్ అయ్యే పద్ధతిని గమనిస్తే, రొమ్ము క్యాన్సర్తో బాధపడే వారిలో, వారి రొమ్ములో క్యాన్సర్ కణాలు బాగా వృద్ధి చెంది ఉంటాయి. అవి వేరే భాగాలకు వ్యాప్తి చెందుతాయి. ఇక్కడ రొమ్ము క్యాన్సర్ కణాలు, ఊపిరితిత్తుల కణంలోకి ప్రవేశించి, ఊపిరితిత్తులలో క్యాన్సర్ను అభివృధి అయ్యేలా తయారు చేస్తాయి.

ఊపిరితిత్తుల కణంలో క్యాన్సర్ ఉన్నప్పటికీ, మనం దీనిని మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే పిలుస్తారు. కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ అని పిలవరు. ఊపిరితిత్తులలో క్యాన్సర్ ఉన్నా, ఈ క్యాన్సర్ కణాలకు రొమ్ము క్యాన్సర్ కణాల లక్షణాలను మాత్రమే కలిగి ఉంటుంది. అందుకు రొమ్ము క్యాన్సర్ చికిత్స విధానాన్ని మాత్రమే ఉపయోగించాలి. అది తరుచు వేరే భాగాలకు వ్యాప్తి చెందుతూ ఉండడం వలన చికిత్స విధానం కష్ట తరము అవుతుంది.

కాబట్టి ఇతర వ్యాధులతో పోల్చినప్పుడు, వ్యాప్తి చెందే పరంగా క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా ప్రసిద్ధి చెందింది. ఇన్వేషణ్ కన్నా ఎక్కువగా మెటాస్టాసిస్ క్యాన్సర్ తోనే మనము భాద పడుతుంటాం. కాబట్టి క్యాన్సర్ చాలా ప్రమాదకరము.