రసాయన ఆయుర్వేదం అంటేనే పునరుజ్జీవం. క్యాన్సర్ కణాలతో పాటు ఇతర ట్రీట్మెంట్ల వలన కలిగే దుష్ప్రభావాలను కూడా నియంత్రించి శరీరానికి కొత్త జీవాన్నిస్తుంది రసాయన ఆయుర్వేదం.
క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ముందుగా అందరూ భయపడేది దానివలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించే. ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏయే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పడతాయోనన్న భయం పేషెంట్లను సహజంగానే వెంటాడుతూ ఉంటుంది. రసాయన ఆయుర్వేదం కేవలం క్యాన్సర్లకు మాత్రమే కాదు.. ఇతర ట్రీట్మెంట్ల వలన కలిగే దుష్ప్రభావాలను కూడా క్రమక్రమంగా నయం చేసుకుంటూ వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ వలన దెబ్బతిన్న పేషెంట్ శరీర స్థితిగతులను, అవయవాలను ముందు యధాస్థితికి తీసుకువస్తూనే సమాంతరంగా క్యాన్సర్ కణాలపై పోరాడుతుంది రసాయన ఆయుర్వేదం. అవయవాలు దెబ్బతిననంత వరకు ఎలాంటి స్థితిలో ఉన్న క్యాన్సర్ పేషెంట్కైనా రసాయన ఆయుర్వేదం పునర్జన్మనిస్తుంది. అందుకే రసాయన ఆయుర్వేద వైద్యాన్ని దైవ వైద్యం అని కూడా అంటుంటారు.
క్యాన్సర్ అంటే భయపడే పరిస్థితులు ఏర్పడటానికి ప్రధాన కారణం అవగాహనారాహిత్యంతో తీసుకునే క్యాన్సర్ ట్రీట్మెంట్లేనని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎలాంటి క్యాన్సర్ అయినా ముందు వాటిని తొలగంచే ప్రక్రియలో భాగంగా పూర్తిగా క్యాన్సర్ కణాలను తొలగించలేకపోవడం.. క్యాన్సర్ కణాలకు చికిత్స చేసే క్రమంలో ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతినడం.. శరీర పరిస్థితిని గమనించకుండా క్లిష్టమైన ట్రీట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఇమ్యునిటీ శిధిలావస్థకు చేరడం వంటి దుష్ప్రభావాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒకసారి పటుత్వం కోల్పోయిన తర్వాత ఎంతటి నాణ్యమైన వైద్యం అందించినా శరీరం చలించదు. అలాంటి పరిస్థితులలో సైతం క్యాన్సర్ బాధితులకు భరోసానిచ్చి శరీరానికి కొత్త శక్తినిచ్చే వైద్యం ఏదైనా ఉందంటే అది ఒక్క రసాయన ఆయుర్వేదం మాత్రమే.
Also read: ఈ రసాయన ఆయుర్వేద క్యాన్సర్ చికిత్స కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా?