క్యాన్సర్ చికిత్సకు ఎన్నిరోజులు పడుతుందన్న ప్రశ్నలో రోజుల వ్యవధిలోనే వ్యాధి నయం కావాలన్న తృష్ణ కనిపిస్తోంది. అది అసాధ్యమైనదేమీ కాదు కానీ వ్యాధి నయం కావడమనేది ఏ రకమైన క్యాన్సర్ వ్యాధి? ఎన్నో స్టేజిలో ఉంది? ఇదివరకు తీసుకున్న ట్రీట్మెంట్ పర్యవసానాలు ఏమిటి? అనే కొన్ని కారణాలపై ఆధారపడి ఉంటుంది. వీటన్నిటినీ మించి శరీరంలో యాంటీబాడీలు, తెల్ల రక్తకణాలు, ఫారిన్ సెల్స్‌ని డిటెక్ట్ చేసే ఏజెంట్లతో కూడిన రక్షణ వ్యవస్థ పనితీరును బట్టి క్యాన్సర్ ఎన్ని రోజుల్లో నయమవుతుందనేది ఆధారపడి ఉంటుంది. శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ పటిష్టంగా ఉండి అది ఫారిన్ సెల్స్‌పై సమర్ధవంతంగా పోరాడితే చాలు క్యాన్సర్ చాలా తొందరగా నయమవుతుంది. అందుకే రసాయన ఆయుర్వేదం అన్నిటికంటే ముందు ఇమ్యునిటీ వ్యవస్థను బలోపేతం చేసేందుకే ప్రయత్నం చేస్తుంది.
క్యాన్సర్ బాధితుల్లో వ్యాధి మొదలైన క్షణం నుండి క్యాన్సర్ కణాలు అనేక విధాలుగా శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. క్యాన్సర్ కణాలు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ప్రప్రధమంగా చేసేది ఇమ్యునిటీని దెబ్బతీయడమే. అటుపై వాటి సంఖ్యను పెంచుకుంటూ వ్యాప్తి చెందడం, అవయవాలను దెబ్బతీయడం చేస్తుంటాయి. రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ కణాలకు అంట సమయం ఇవ్వదు. శరీరంలో దోషాన్ని నివారించే క్రమంలో మొదట యుద్ధానికి రోగనిరోధక శక్తిని సిద్ధం చేస్తుంది. అప్పుడు క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకుని అవయవాల పనితీరు దెబ్బతినకుండా చేసి శరీరానికి కొత్త జీవాన్నిస్తుంది.
Also Read: రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ పెరగకుండా ఎలా ఆపుతుంది?