రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ పెరగకుండా ఎలా ఆపుతుంది?

You are currently viewing రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ పెరగకుండా ఎలా ఆపుతుంది?

ఇంగ్లీషు వైద్యంలో ఎన్నడూ ఎదురుకాని ఈ ప్రశ్న ఆయుర్వేదం అనేసరికి సహజంగానే ఉత్పన్నమవుతుంటుంది. సాధారణంగా క్యాన్సర్ కణాల వ్యవహార శైలిని గమనించినట్లయితే కణాలు హెచ్చించుకునే క్రమంలో వాటి సంఖ్యను అసాధారణంగా పెంచుకుంటూ పోతుంటాయి. సంఖ్యాబలాన్ని పెంచుకున్న ఈ కణాలు మెల్లిగా గడ్డలాగా ఏర్పడుతూ ఉంటాయి. క్యాన్సర్ దశలు మారేకొద్దీ ఆ గడ్డ పరిమాణం అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది. ఒక దశకు చేరిన తర్వాత ఈ కణాలు మరో అవయవానికి చేరడం మొదలుపెడుతూ ఉంటాయి. చివరి దశలో ఈ క్యాన్సర్లు అవయవాల పనితీరును కూడా దెబ్బతీస్తూ ఉంటాయి. చివరకు ఈ క్యాన్సర్లు ఎటువంటి వైద్యానికి కూడా స్పందించని స్థితికి చేరుకుంటాయి. ఈ పరిస్థితిని అరికట్టే క్రమంలో రసాయన ఆయుర్వేదం మొదట క్యాన్సర్ కణాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది.

 

లోహభస్మాలతో తయారైన శక్తివంతమైన మూలికా సమ్మిళితమైన రసౌషధాలు అసంబద్ధమైన కణాలను నియంత్రించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంటాయి. ఒకసారి క్యాన్సర్ కణాల ఉత్పత్తి నిలిచిపోయిన తర్వాత, అలాగే ఎక్కడెక్కడికైతే క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందాయో అక్కడ కూడా కొత్త క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కావడం పూర్తిగా నిలిచిపోతాయి. క్యాన్సర్ కణాలు మళ్ళీ ఉత్తేజితమయ్యేలోపే రోగనిరోధక శక్తికి ఊతంగా నిలిచి దాన్ని బలోపేతం చేస్తుంది. ఈ విధంగా రోగనిరోధక శక్తి మళ్ళీ పూర్వపు స్థాయిలో పునరుత్తేజితమైతే అది క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది.