క్యాన్సర్ తన ఉనికిని తెలియజేయడానికి శరీరానికి పంపే 8 సంకేతాలు ఇవే

You are currently viewing క్యాన్సర్ తన ఉనికిని తెలియజేయడానికి శరీరానికి పంపే 8 సంకేతాలు ఇవే

ఏ వ్యాధినైనా గుర్తించటానికి శరీరంలో  కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలను బట్టి ఆ వ్యాధి ఉందేమో అని సందేహించి ఆ తరువాత పరిక్షలు చేసి ఆ వ్యాధి నిర్దారించబడుతుంది,

కానీ క్యాన్సర్ విషయంలో వ్యాధి నిర్దారణ అంత సులువు కాదు. 

 

క్యాన్సర్ లక్షణాలు-సంకేతాలు 

చాలా వరకు క్యాన్సర్లు మొదటి దశలో లక్షణాలను చూపించవు, లక్షణాలు కనిపించే సమయానికి క్యాన్సర్ తీవ్రత పెరిగిపోయి ఉంటుంది. లక్షణాలను చూపకపోయినా కొన్ని సంకేతాలను శరీరం చూపిస్తుంది. సంకేతం అంటే చూసే వాళ్లకు మనలో ఏదైనా కొత్తగా కనిపించేలా సన్నగా అయిపోవటమో,చర్మం రంగు మారటమో వంటివి. కానీ  లక్షణాలు వ్యక్తికి అర్థమయ్యేలా ఉంటాయి నీరసం,నొప్పి లాంటివి.అందుకనే సంకేతం అయినా, లక్షణం అయినా ఏదైనా సందేహం రాగానే వైద్యుడిని సంప్రదించటం మంచిది, ముందుగానే క్యాన్సర్ ను నిర్ధారిస్తే క్యాన్సర్ చేసే నష్టం నుండి తప్పించుకునే వీలుంటుంది. 

 

క్యాన్సర్ చూపించే ముఖ్యమైన 8 సంకేతాలు

 1. చర్మం కింద ఒక గడ్డ లాగా ఏర్పడినట్టు అనిపిస్తుంది

 • రొమ్ము కణజాలంలో గడ్డలను తరచుగా మహిళలు కొన్ని సార్లు పురుషులు కూడా గమనించవచ్చు ,శరీరంలో ఆ భాగాన్ని తాకినప్పుడు తేడాను గమనిస్తారు ,అలాంటప్పుడు డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ప్రతీ సారి అది క్యాన్సర్ అవ్వాలని లేదు , అందుకని భయపడకుండా డాక్టర్ ను సంప్రదించి సందేహాన్ని క్లియర్ చేసుకోండి. 

 

 1. చర్మంపై మార్పు కనిపిస్తుంది 

 • చర్మ నిర్మాణం, మొటిమలు, పుట్టుమచ్చలు లేదా పిగ్మెంటేషన్ యొక్క అన్ని మార్పులు చర్మ క్యాన్సర్ కొంత వరకు సంకేతాలు. 
 • మెలనోమాలు చర్మ క్యాన్సర్ సాధారణ రూపాలలో ఒకటి ఇది అసాధారణమైన రంగులు, పరిమాణాలు మరియు ఆకారాలతో చర్మంపై మచ్చలు వంటి లక్షణాలను కలిగి ఉండే అవకాశం ఉంది. 
 • పుట్టుమచ్చలు లేదా మొటిమలు పెద్దగా పెరిగినా, జుట్టు పెరిగినా లేదా వాటి రంగు మరియు ఆకారాలను మార్చుకున్నా వాటి మార్పులను గమనించాలి. 
 • రక్తస్రావాన్ని నివారించడంలో కీలకమైన శరీరంలోని ప్లేట్‌లెట్ కౌంట్‌లో తగ్గుదల యొక్క ఫలితం కారణంగా చర్మం రంగు మారవచ్చు.  ఈ సూచనలు కనిపించినప్పుడు, పరీక్ష కోసం డాక్టర్ ను సంప్రదించటం మంచిది. 

 

 1. కారణం లేకుండా  బరువు తగ్గడం

 

 • ఇటీవల, మీరు వ్యాయామాలు చేయలేదు లేదా ఆహారం తీసుకోలేదు. 

 అయినా మీరు ఒక నెలలో 4 లేదా 5 కిలోల బరువును తీవ్రంగా కోల్పోయారు అనుకుంటే అది ఒక సంకేతం కావచ్చు. 

 • బరువు తగ్గటం కేవలం క్యాన్సర్ కే సంకేతం కాదు థైరాయిడ్ వల్ల కూడా అవ్వొచ్చు ,భయపడకుండా వెళ్లి వైద్యుడిని సంప్రదించటం ఉత్తమం..

 

 1. కడుపు ఉబ్బరం 

 • ఇది చాలా మంది మహిళలు ఎదుర్కొనే సంకేతం అని చెప్పవచ్చు, కొన్ని సార్లు ఇది అజీర్ణం లేదా అలాంటి కొన్ని విషయాల వల్ల సంభవించవచ్చు,కానీ రెండు వారాల కంటే ఎక్కువగా ఈ సమస్య కొనసాగటం అండాశయ క్యాన్సర్, అలాగే జీర్ణశయాంతర క్యాన్సర్లకు సంకేతం. 

 

 1. మానని గాయాలు

 • మీరు మీ చర్మం ఉపరితలంపై కోత లేదా ఇతర గాయం కలిగి ఉంటే మరియు అది నయం కావడానికి చాలా సమయం తీసుకుంటుంటే అది మీ శరీరంలో క్యాన్సర్ గా మారే అవకాశం ఉన్నట్టు సంకేతం. 

మీ రోగనిరోధక వ్యవస్థ డిఫెన్స్ జోన్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి, అయితే క్యాన్సర్ చిన్న గాయాలకు వచ్చే ముందు అన్ని శారీరక రిసోర్సెస్ ఉపయోగించదానికి  ప్రాధాన్యతనిస్తుంది.  అలాంటప్పుడు జాగ్రత్తగా గాయాన్ని శుభ్రంగా ఉంచడం మరియు ముందు జాగ్రత్త చర్యగా రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. ఐదు రోజుల తర్వాత ఎటువంటి మెరుగుదల లేకుంటే, తదుపరి గైడెన్స్ కోసం మీ వైద్యుడిని సంప్రదించండి. 

 

 1. దురద లేదా చికాకు కలిగించే చర్మం

 

 • రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్‌ను శరీరంలో బ్యాక్టీరియాలాగా పరిగణిస్తుంది. తెల్ల రక్త కణాలు దానిని తొలగించడానికి ప్రయత్నిస్తాయి, ఇది ప్రభావిత ప్రాంతానికి రక్త ప్రసరణను పెంచుతుంది. ఫలితంగా, ఆ ప్రాంతం వెచ్చగా అనిపించవచ్చు, ఎర్రగా కనిపించవచ్చు, రంగు మారవచ్చు, బిగుతుగా అనిపించవచ్చు లేదా దురదగా మారవచ్చు.

 

 1. నాలుక లేదా నోరు గడ్డలు

 • నోటి క్యాన్సర్లు సంవత్సరానికి సుమారుగా మూడు శాతం లేదా 53,000 మంది అమెరికన్లకు వస్తున్నాయట.  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, నాలుక, చిగుళ్ళు, బుగ్గల లోపల కణజాలం, నాలుక కింద మరియు గొంతు దగ్గర నోటి వెనుక భాగంలో గాయాలు ఏర్పడవచ్చు. 

అందుకని ఎలాంటి అనుమానం ఉన్నా, నోటిలో పుండ్లు వంటివి తగ్గకుండా ఉండటం గమనిస్తే వైద్యుడిని సంప్రదించటం మంచిది. 

 

 1. మూత్రవిసర్జనలో మార్పులు

 

 • అదేవిధంగా, సాధారణ ప్రేగు పనితీరు కోసం , మూత్రాశయం పనితీరు చాలా సక్రమంగా ఉండాలి. 

ఈ విషయాలను గమనిస్తూ ఉండండి :

 •  మూత్ర ప్రవాహ శక్తిలో మార్పులు.
 •   మూత్రం రంగు
 •   బలమైన, పుల్లని వాసన
 •   నురుగు ఉనికి
 •   మూత్రంలో రక్తం

 మీరు ఈ సంకేతాలలో దేనినైనా గమనించినట్లయితే,వైద్యుడి ని సంప్రదించండి. 

ఇప్పటివరకు చెప్పిన అన్ని సంకేతాలు క్యాన్సర్ కి మాత్రమే కారణాలు అని కాదు కానీ క్యాన్సర్ కూడా వీటిలో ఉన్న సంకేతాలను చూపుతుంది,అందుకని అప్ప్రమత్తంగా ఉండటం మంచిది. 

 

డాక్టర్ ను సంప్రదించటానికి కొందరు భయాపడుతుంటారు, దానికి కారణాలు..

 • భయం : 

ఉదాహరణకు ఏ రాత్రి ఒకటి గంటలకో మీరు మీ శరీరంలో గమనించిన సంకేతాలను గూగుల్ చేస్తే అవి ఏ బ్రెస్ట్ క్యాన్సర్ వో ఫలితాలు చూపించినట్లైతే అలాంటప్పుడు మీలో భయం మొదలై, ఆందోళన మొదలై డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. 

 అలాంటప్పుడు మీరు మానసికంగా అది క్యాన్సర్ అని నిర్దారించుకొని దాన్ని దాచి పెట్టి బాధపడటం చేస్తుంటారు కానీ  అదే విషయాన్నీ వైద్యుడిని సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోవటం వల్ల  అది మనసులో మీ ప్రశ్న కు సమాధానాన్ని చూపించటమే కాకుండా మీ మానసిక సంఘర్షణ నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది. 

 • ఇది ఖర్చు తో కూడుకున్నది అని :

మధ్యతరగతి కుటుంబాల్లో మనుషులు సాధారణంగా హాస్పిటల్ అనగానే ఖర్చు అని భయపడుతుంటారు,అందుకనే ఎలాంటి సంకేతాలు కనిపించినా అంట త్వరగా వైద్యుడిని సంప్రదించారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే సమస్యను అలా పట్టించుకోనంత మాత్రాన సమస్య తగ్గదు, అది మరింత తీవ్రం అయ్యి ఇంకా ఎక్కువ ఖర్చుకే దారి తెస్తుంది లేదా కొన్ని సార్లు అది పరిష్కారం లేని సమస్యలా మారిపోతుంది. అందుకని వైద్యుడిని సంప్రదించటం ఎప్పుడూ మంచి ఆలోచనే. ఆరోగ్యం కన్నా మించింది ఏదీ లేదని గుర్తుంచుకోండి. 

వైద్యుడితో మాట్లాడటానికి భయపడకండి, సమస్యను స్పష్టంగా చెప్పండి మీరు చెప్పే సమస్య స్పష్టంగా ఉంటేనే వైద్యులు సరైన పరిష్కారం చూపించగలరు, అందుకని ఏ విషయాన్నీ దాచి పెట్టకండి. 

ఈ సంకేతాలు ఉన్నా లేకున్నా క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవటానికి మీ జీవన శైలిని ఆరోగ్యకరంగా మార్చుకోండి.  ధూమపానాన్ని మద్యపానాన్ని దూరంగా ఉంచి సరైన ఆహారం సమయానికి తింటూ ఆరోగ్యంగా ఉండండి.