అన్ని రకాల క్యాన్సర్లలో నోటి క్యాన్సర్ అత్యంత ప్రాముఖ్యమైనది. ఓరల్ కేవిటీ లేదా ఓరో ఫారింక్స్ భాగాల్లో వచ్చే క్యాన్సర్ నే ఓరల్ క్యాన్సర్ లేదా నోటి క్యాన్సర్ అంటారు. మిగిలిన క్యాన్సర్లతో పోలిస్తే నోటి క్యాన్సర్ (mouth cancer) కొంచెం వేగవంతంగా వ్యాప్తి చెందుతుంది. ఓరల్ కేవిటీ అంటే నోటి లోపల భాగమన్నమాట. ఓరో ఫారింక్స్ అంటే గొంతు వెనకాల భాగం, నాసో ఫారింక్స్ అంటే ముక్కు వెనకాల భాగాలన్నమాట.
నోటి క్యాన్సర్ సాధారణంగా పెదాలు, దంతాలు, చిగుళ్లు, బుగ్గల లోపలి పొరలు, నాలుక కింది భాగం, నోటి అడుగుభాగంలో, నోరు పైభాగమైన అంగటి, టాన్సిల్స్, ముక్కు వెనుక భాగమయిన నాసో ఫారింక్స్ లో వస్తుంటుంది.
నిర్లక్ష్యం చేసే కొద్దీ ఈ తెల్లమచ్చల్లో క్యాన్సర్ కణాలు వృద్ధిచెంది గడ్డగా మారిపోతాయి.
ఈ గడ్డ పెద్దగా నొప్పి ఉండకపోవచ్చు… కానీ ఒక్కోసారి మంట పుడుతున్నట్లుగా అనిపిస్తుంది. కొద్ది రోజులకి ఈ గడ్డ పుండుగా మారుతుంది. చుట్టూ ఉన్న భాగం గట్టిగా తయారై మరి కొద్ది రోజులకి గడ్డ నుంచి రక్తం కారడం మెల్లగా వేరే భాగాలకు వ్యాప్తి చెందడం మొదలవుతుంది. ముదిరే కొద్ది ఈ పుండు చాలా బాధాకరంగా ఉంటుంది.
Mouth Cancer – నోటి క్యాన్సర్ లక్షణాలు:
కొన్ని లక్షణాల ఆధారంగా నోటి క్యాన్సర్ ను ముందుగానే గుర్తించవచ్చు.
- నోటి పైన లోపలి భాగాలలో కనిపించే తెల్ల మచ్చల ఆధారంగా నోటి క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.
- ఒక్కసారి ఈ తెల్ల మచ్చలు ఎర్రగా మారడం లేదా ఎరుపు తెలుపు కలిసిన రంగులో కనబడుతుంటాయి. తెల్ల మచ్చలను ల్యూకో ప్లేకియా అని ఎర్ర మచ్చలను ఎరిత్రో ల్యూకోప్లేకియా అంటారు.
- మచ్చలు ఏర్పడ్డ ప్రాంతాల్లో మాలిగ్నెంట్ కణాలు లేదా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి.
- అలాంటి సందర్భాల్లో నోటి లోపల, పెదవి మీద పొక్కులు రావడం నోటి నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- నోటి క్యాన్సర్ వచ్చిన వారికి దంతాలు వదులు కావడం.
- తింటున్న సమయంలో మింగటానికి ఇబ్బంది కలగడం నొప్పి రావడం వంటివి జరుగుతుంటాయి.
- గొంతు వెనక భాగంలో క్యాన్సర్ గడ్డలు ఏర్పడినప్పుడు చెవిలో నొప్పిగా ఉంటుంది.
- నోటి నుంచి భరించలేనంతగా దుర్వాసన రావడం,
- మాట్లాడటానికి ఇబ్బందిగా ఉండటం,
నోరు లోపల బయట, గడ్డం భాగాలు తిమ్మిర్లు ఎక్కటం వంటి లక్షణాల ఆధారంగా కూడా (mouth Cancer) నోటి క్యాన్సర్‌ను గుర్తించవచ్చు.
నిర్థారణ పరీక్షలు:
ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే డాక్టరును సంప్రదించి పూర్తి పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ ఇన్ఫెక్షన్ అయిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏమాత్రం అనుమానం వచ్చినా అక్కడ నుండి కణజాలాన్ని సేకరించి బయాప్సీ చేస్తారు. బయోప్సీ చేసిన తర్వాతే ఆ కణజాలంలో క్యాన్సర్ సంక్రమణ జరిగిందో లేదో తెలుస్తుంది. ఈ కణజాలం క్యాన్సర్ కు సంబంధించినదేనని నిర్ధారణ కాగానే చికిత్స ప్రారంభిస్తే మంచిది. నోటి కాన్సర్ ముదిరితే నోటి లోపల క్యాన్సర్ కణాలు లింఫ్ గ్రంధుల్లోకి, నాడుల్లోకి చేరి ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది. బయోప్సీ అనంతరం ఎక్స్ రే, సిటి స్కాన్, ఎం.ఆర్.ఐ.స్కాన్, ఎండోస్కోపీ చేయడం ద్వారా నోటిలోని క్యాన్సర్ కణాలు దవడ భాగాలకు, గొంతు భాగాలకు, లింఫ్ నాళాలు, అన్నవాహిక ఇలాంటి భాగాల్లో ఎక్కడైనా వ్యాప్తి చెందాయేమో తెలుసుకుంటారు.
చికిత్సా విధానం:
క్యాన్సర్ వ్యాధి నిర్ధారించి, ఎన్నో దశలో ఉందో గుర్తించిన తర్వాత క్యాన్సర్ గడ్డ యొక్క స్థితిగతులను బట్టి అనుభవజ్ఞులైన ఆయుర్వేద క్యాన్సర్ నిపుణులను సంప్రదించి ప్రకృతి సిద్ధమైన రసాయన వైద్యం ద్వారా క్యాన్సర్ కణాలను తొలగించవచ్చు. వైద్య విధానం ఏదైనా క్యాన్సర్ కణాలకు చికిత్స ఒకే తీరులో ఉంటుంది. కానీ చికిత్స అనంతరం పర్యవసనాలు ఒక్కో విధానంలో ఒక్కోలా ఉంటాయి. ఆయుర్వేద రసాయన వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. పునర్జన్ ఆయుర్వేద రసాయన వైద్యం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కచ్చితమైన ఫలితాలను సాధిస్తోంది. క్యాన్సర్ వ్యాధి ఏ దశలో ఉన్నా శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా మూలాల నుండి చికిత్స చేయడం పునర్జన్ ఆయుర్వేద ప్రత్యేకత.
ముఖ్య గమనిక :
ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.
Also read: క్యాన్సర్ తన ఉనికిని తెలియజేయడానికి శరీరానికి పంపే 8 సంకేతాలు ఇవే