Stage 4 Cancer: చివరి దశ క్యాన్సర్ నయం చేయవచ్చా

You are currently viewing Stage 4 Cancer: చివరి దశ క్యాన్సర్ నయం చేయవచ్చా

పునర్జన్ ఆయుర్వేద కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ కారకాలు, నివారణ, చికిత్స గురించి రసాయన ఆయుర్వేద పద్ధతిలో పరిశోధనాభివృద్ధి  కొనసాగిస్తూ ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.  4వ స్టేజి క్యాన్సర్ లో   క్యాన్సర్ సోకిన అవయవం నుండి , శరీరంలోని  ఇతర భాగాలకు పాకుతుంది .దీనినే మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు . సాధారణంగా మెటాస్టాటిక్ క్యాన్సర్ ను క్యూర్

చెయ్యడం క్లిష్టతరం అని చెప్పపచ్చు కానీ అసంభవం కాదు. ఈస్టేజి క్యాన్సర్ బాధితులు వచ్చిన

క్యూర్  చేసే  ప్రయత్నం  చేస్తోంది  పునర్జన్  ఆయుర్వేద  హాస్పిటల్.  ఏ స్టేజి లో వున్న క్యాన్సరైనా వ్యాధి మూలాలు కనిపెట్టి వ్యాధి పునరావృతం కాకుండా చికిత్స చెయ్యడానికి  ఆయుర్వేద వైద్య విధానం దోహదపడుతుంది.

 క్యాన్సర్ చివరి దశకు చేరుకుంటే నయం చేయవచ్చా

క్యాన్సర్  పేరు వినగానే భయపడేవారు ఇక చివరి దశ అంటే బ్రతుకు పై ఆశ వదులుకుంటారు .కానీ ఆయుర్వేద వైద్యం దీని గురించి ఏమని చెబుతుందో తెలుసుకుందాం

చివరిదశ క్యాన్సర్ వ్యాధికి ఆయుర్వేదంలో వంద శాతం చికిత్స చేసే అవకాశముంది. క్యాన్సర్ బాధితుల శారీరక ఆరోగ్య పరిస్థితి, మానసిక స్థితిగతులను బట్టి ఆయుర్వేద చికిత్సా విధానం ఆధారపడి ఉంటుంది. రోగియొక్క రోగనిరోధక శక్తి… మందులకు బాధితుడు ప్రతిస్పందించే తీరుపై ఆయుర్వేద వైద్యం ఆధారపడి ఉంటుంది.

ప్రచారంలో ఉన్న అనేక రుజువుల్లేని ఆరోపణల కారణంగా ఒకవిధంగా చెప్పాలంటే ఆయుర్వేద వైద్యాన్ని పూర్తిగా విశ్వసించే ధైర్యం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే వైద్య నిపుణులు అల్లోపతి వైద్యాన్ని చేయించుకుంటూనే అనుపానంగా ఆయుర్వేద చికిత్స చేయించుకుంటే మంచి ఫలితాలుంటాయని చెబుతుంటారు.

క్యాన్సర్ చికిత్సా విధానంలో శాశ్వత పరిష్కారమన్నది చాలా అరుదుగా వింటుంటాం. కానీ ఆయుర్వేదంలో కచ్చితమైన చికిత్స తోపాటు శాశ్వత చికిత్స కూడా సాధ్యమే. కానీ అది పూర్తిగా రోగి రెస్పాండ్ ఆయ్యే విధానం మీద ఆధారపడి ఉంటుంది. రోగి ఇమ్యునిటీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకి నాల్గవ దశ క్యాన్సర్నే తీసుకుందాం. ఈ దశలో క్యాన్సర్ ఎక్కడ మొదలైందో అక్కడ నుండి లింఫ్ నాళాల ద్వారా దూరంగా ఉన్న ఇతర శరీర భాగాలకు పాకుతుంది. ఈ దశలో చికిత్సకంటే ముందు అవగాహన చాలా అవసరం. అంతకంటే ఎక్కువగా మానసిక ఆరోగ్యమెంతో ముఖ్యం. ఆరోగ్యకరమైన కణాలను మించి క్యాన్సర్ కణాలు రెట్టించిన వేగంతో విస్తరిస్తాయి. శరీరానికి అందే ఆహారమేంటి? మందులేంటి? అన్నిటినీ ఈ క్యాన్సర్ కణాలు తమకోసం వినియోగించుకుంటూ ఉంటాయి. దీంతో రోగి అంతకంతకూ నీరసంగా అయిపోతుంటారు

చికిత్స  సమయంలో రోగి తీసుకోవలసిన జాగ్రత్తలు.

చికిత్సా సమయంలో శరీరానికి, మనసుకి, ఆత్మకి సమప్రాధాన్యాతనిస్తూ జాగ్రత్తలు పాటించాలి. శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి, తగినంత విశ్రాంతిని ఇవ్వాలి, శరీర కదలికల్లో అలసట కనిపించకుండా వ్యాయామం చేయాలి. మానసికోల్లాసానికి యోగా, అనులోమ-విలోమవ్యాయామం, ఓంకార సాధన వంటివి ప్రతిరోజూ చేయాలి. ప్రశాంతత కోసం నిత్యం  ధ్యానం చేస్తుండాలి.

ఆహారం

విధిగా తీసుకునే వైద్యంతో పాటు ఆహారంలో పసుపు, క్యారట్, బీట్ రూట్, ఎండు ద్రాక్ష, కాలీఫ్లవర్, క్యాబేజీ, వెల్లుల్లి వంటివి తీసుకుంటుండాలి. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో ఇవి చక్కగా పనిచేస్తాయి. తాజా కూరగాయలు .పళ్ళ రసాలు తీసుకోవాలి  డైటీషియన్ సూచించిన డైట్ చార్ట్ ఫాలో అవ్వాలి…. సాధారణాంగా క్యాన్సర్ పేషంట్లు బరువు తగ్గుతారు..కాబట్టి బలహీనమవుతారు.ఈ నేపథ్యంలో  పరిమిత మోతాదులో ఆహారం తీసుకుంటూ వెయిట్ బ్యాలన్స్ చెయ్యడానికి ప్రయత్నించాలి.

రసాయన ఔషధాల వలన క్విక్ రిలీఫ్

ఆయుర్వేదంలో క్యాన్సర్ కు అశ్వగంధ లేహ్యము, అమృత భల్లాతకి లేహ్యము, ఆరోగ్యవర్ధిని, అష్ట వర్గ కషాయం, అమృత భల్లాతకి రసం, స్వర్ణమాలిని వసంత రసం, బృహద్వాత చింతామణి వంటి అనేక ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేద వైద్యులు సూచించిన విధంగా ఈ రసాయన ఔషధాలు త్వరితగతిన క్యాన్సర్ నుండి ఉపశమనం కలిగిస్తుంయి.

ఆర్ధిక సౌలభ్యానికి ఆయుర్వేదం.

ఒకప్పుడు సంపన్న కుటుంబాలకే పరిమితమైన క్యాన్సర్ ఇప్పుడు అన్ని ఆర్ధిక వర్గాలవారికి పాకుతోంది ..ఆధునిక క్యాన్సర్ చికిత్సా విధానం సామాన్యుడి నడ్డి విరుస్తోంది.స్థోమత  లేని క్యాన్సర్ బాధితులకు ఆయుర్వేదం ఒక  వరంక్యాన్సర్ వ్యాధికి అందుబాటులో ఉన్న అన్ని వైద్యవిధానాల్లో ఆయుర్వేద వైద్యానికి విశ్వసనీయత ఎక్కువన్నది కాదనలేని నిజం. శరీర సౌకర్యానికి గానీ, మానసిక ఆరోగ్యానికి గాని ఆర్ధిక సౌలభ్యానికి ఆయుర్వేద వైద్యం  ఉత్తమ ఎంపిక, అత్యంత శ్రేష్టమైనది. , ఖర్చు తక్కువ కాబట్టి  అందరూ అనుసరించ తగిన  వైద్యం ఆయుర్వేదం.

చివరి దశలో ఉన్న క్యాన్సర్ బాధితులకు ఆయుర్వేదం కలిగించే ప్రయోజనాలు

చివరి దశలో క్యాన్సర్ బాధితులు మానసికంగా ధృడంగా ఉంటే క్యాన్సర్ల బారి నుండి ఉపశమనం పొంది జీవితకాలాన్ని పొడిగించుకునే అవకాశముందని చెబుతోంది ఆయుర్వేద వైద్యం. వైద్యుల సలహాలు ,సూచనలు పాటిస్తూ ,సానుకూల దృక్పధం తో ప్రయత్నిస్తే  మానసికంగా ఆరోగ్యాంగా వుంటారు.దీనివలన రోగి విల్ పవర్ పెరుగుతుంది. మెడిసిన్ అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం వైద్య విధానం లో క్యాన్సర్ చికిత్స వలన ఎటువంటి దుష్ప్రభావాలూ  ఉండవు కాబట్టి రోగి  తన దినచర్య ఒకింత సాధారణ జీవన శైలి లోనే కొనసాగించవచ్చు. ఆహారం  తీసుకోడానికి కూడా ఇబ్బందులు తలెత్తవు.

ఇవి, చివరి దశలో ఉన్న క్యాన్సర్ బాధితులకు సంబంధించిన వివరాలు. వారికి ఆయుర్వేదం కలిగించే ప్రయోజనాల వివరాలు.

ముఖ్య గమనిక :

ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Know more: Thyroid Cancer Treatment