క్యాన్సర్ పై ప్రభావం చూపగలవని శాస్త్రీయంగా నిరూపించబడిన ఆయుర్వేద మూలికలు

You are currently viewing క్యాన్సర్ పై ప్రభావం చూపగలవని శాస్త్రీయంగా నిరూపించబడిన ఆయుర్వేద మూలికలు

ఆయుర్వేదం మన ప్రాచీన సమగ్ర వైద్య విధానం. ఇది భారతదేశంలోని హిమాలయాల ప్రాంతాలలో వేల సంవత్సరాల క్రితం ఆధ్యాత్మికంగా చైతన్యం చెందిన ఋషుల అనంతమైన జ్ఞానం నుండి ఆవిర్భవించిందని భారతీయుల నమ్మకం. ఈ జ్ఞానం గురువు నుండి శిష్యుడికి నోటిమాటల ద్వారా చెప్పబడి, చివరికి సంస్కృత గ్రంధాలలో రాయబడింది.

 ఇక ప్రస్తుతం ప్రపంచం క్యాన్సర్ వ్యాధికి చికిత్స సరైనది లేక భయపడుతున్నారు. కానీ ఆయుర్వేదంలో ఎప్పుడో క్యాన్సర్ ను తగ్గించడానికి సంబంధించిన ఎన్నో రచనలు ఉన్నాయి. క్యాన్సర్ ను తగ్గించే మూలికలు, చికిత్సల గురించి కూడా ఆయుర్వేద గ్రంధాలలో వివరించబడి ఉంది. అది మన అదృష్టం.  

ఆయుర్వేదానికి కొన్ని లక్ష్యాలు మరియు సూత్రాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఆయుర్వేదం యొక్క ప్రధాన లక్ష్యాలు

 • ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరియు జీవితకాలాన్ని పెంచడం
 • అనారోగ్యం యొక్క రిస్క్ ను తగ్గించడం
 • అనారోగ్యం నుండి వచ్చే నొప్పిని తగ్గించడం
 • శరీరానికి సహజంగా నయం అయ్యే గుణాన్ని పెంచడం

 

ఆయుర్వేదం యొక్క ప్రధాన సూత్రాలు

 • సమతుల్యత: ఆరోగ్యం అనేది శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది.
 • ప్రకృతి: ప్రకృతికి అనుగుణంగా జీవించడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు అనారోగ్యం నుండి కోలుకోవడానికి మంచి మార్గం.
 • నివారణ: అనారోగ్యం రాకుండా నివారించడం ఆయుర్వేదం యొక్క ప్రధాన లక్ష్యం.
 • వ్యక్తిగతీకరించిన చికిత్స: ప్రతి వ్యక్తి యొక్క ప్రకృతి మరియు అనారోగ్యం యొక్క లక్షణాల ఆధారంగా ఆయుర్వేదంలో  చికిత్స వ్యక్తిగతీకరించబడుతుంది.

 

 • క్యాన్సర్ పై ఆయుర్వేదం

ఆయుర్వేదం క్యాన్సర్ చికిత్సకు మంచి ఆప్షన్‌గా పరిగణించబడుతుంది, ఇది సాంప్రదాయ చికిత్సలతో కలిసి ఉపయోగించవచ్చు లేదా స్వంతంగా ఉపయోగించవచ్చు. ఆయుర్వేద చికిత్సలు సాధారణంగా సహజమైనవి మరియు తక్కువ దుష్ప్రభావాలు కలిగి ఉంటాయి. అయితే, ఆయుర్వేద చికిత్సలను ప్రారంభించే ముందు సరైన వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. 

ఈ ఆయుర్వేద వైద్యంతో క్యాన్సర్ ను పూర్తిగా నయం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ హాస్పిటల్ లో నాలుగో స్టేజీ క్యాన్సర్ కు కూడా ఆయుర్వేద చికిత్స పొంది క్యాన్సర్ ను నయం చేసుకున్న వాళ్ళున్నారు.

ఆయుర్వేదంలో క్యాన్సర్ పై పోరాడే వందలాది మూలికలు ఉన్నాయి, వాటిలో మనందరికీ అందుబాటులో ఉండే మూడు మూలికల గురించి తెలుసుకుందాం. రోజూ మన వంటింట్లో కనిపించే పసుపు, ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న అశ్వగంధ అలాగే మూడు ఫలాలు కలిసిన అద్భుత ఔషధం త్రిఫల. ఈ మూలికలు క్యాన్సర్ పై ఎలా పనిచేస్తాయో పూర్తిగా తెలుసుకుందాం.

 

పసుపు 

పసుపు అనేది భారతదేశంలోని అనేక వంటకాలలో ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యం. ఇది అల్లం కుటుంబానికి చెందిన ఒక రకమైన మొక్క. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపును చర్మ వ్యాధులు, కీళ్ళు నొప్పులు, జీర్ణశక్తి సమస్యలు మరియు క్యాన్సర్ వంటి పరిస్థితులకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

ఇందులో కర్కుమిన్ అనే ప్రధాన సమ్మేళనం ఉంది, ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలకు కారణం. కర్కుమిన్‌కు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా ఆపగలదు.

పసుపును ఎలా ఉపయోగించవచ్చు అంటే..

పసుపు సాధారణంగా మనకు ఒక పొడి రూపంలో లభిస్తుంది, ఇది వంటకాలలో ఉపయోగిస్తుంటాం. అలాగే ఇది ఒక క్యాప్సూల్ రూపంలో కూడా దొరుకుతుంది, దాన్ని సప్లిమెంట్ గా తీసుకోవచ్చు. అలాగే పసుపును చర్మశుద్ధి చేసేందుకు లేదా గాయాలకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.

పసుపు పై కొన్ని అధ్యయనాలు..

పసుపులో ఔషధ గుణాలున్న పదార్థం కర్కుమిన్, ఇది ప్రయోగశాల పరీక్షలలో క్యాన్సర్ కణాలలో యాంటీ-ట్యూమర్ మరియు యాంటీ-క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉందని చూపించబడింది.

 • కొంతకాలం క్రితం, వివిధ అవయవాలలో ప్రీకాన్సర్ అసాధారణతలతో బాధపడే 25 మంది రోగులకు ఫేజ్-1 క్లినికల్ ట్రయల్‌లో భాగంగా కర్కుమిన్‌ను అందించారు. ఈ ట్రయల్ నుండి కర్కుమిన్ ప్రీ-క్యాన్సర్ మార్పులను క్యాన్సర్‌గా అభివృద్ధి చెందకుండా నిరోధించగలదని తెలుస్తోంది.
 • గత కొన్ని సంవత్సరాలలో క్లినికల్ ట్రయల్స్‌లో ఎక్కువగా, బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ వంటి చికిత్సలకు అదనపు ఏజెంట్‌గా కర్కుమిన్‌ను జోడించడం ద్వారా టర్మరిక్ మరియు క్యాన్సర్ మధ్య నేరుగా సంబంధం ఉందని నిరూపించడానికి పరిశోధనలు జరిపారు.
 • 2008 అధ్యాయనం, పసుపులో ఉండే కర్కుమిన్ క్లోమదశ క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి సహాయపడుతుందని తేల్చింది, కానీ దానికి పెద్ద మొత్తంలో కర్కుమిన్ అవసరం. దీనిని అధిగమించడానికి, క్యాన్సర్‌తో బాధపడే వారికి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయకుండా ఎక్కువ మొత్తంలో కర్కుమిన్‌ను అందించడానికి సహాయపడే అధిక విలువ కలిగిన కర్కుమిన్ రూపమైన థెరాకర్మిన్‌ ను పరిశోధకులు సృష్టించడం జరిగింది.
 • 2009 నాటి మరో అధ్యాయనంలో కర్కుమిన్ వివిధ రకాల క్యాన్సర్ కణాలను వివిధ పద్ధతులలో చంపగలదని తేలింది. కర్కుమిన్ కేవలం క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుంటుంది, కాబట్టి శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు ప్రభావితం కావు. ఇది నేటి క్యాన్సర్ చికిత్సలో ఒక కీలకమైన దశ, ఎందుకంటే కీమోథెరపీ మందులు క్యాన్సర్‌లో ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తాయి.

అంతే కాకుండా, కొన్ని ఇతర అధ్యాయనాలు కూడా అనుకూలమైన ఫలితాలను చూపించాయి. ముఖ్యంగా, తల మరియు మెడ క్యాన్సర్‌కు రేడియేషన్ చికిత్స పొందుతున్న వారిలో నోటి అల్సర్లు నయం చేయడానికి పసుపు నీటితో పుక్కిలించడం సహాయపడుతుందని తేలింది. కానీ పసుపును అధికంగా తీసుకుంటే దుష్ప్రభావాలు కూడా కొన్ని కలిగే అవకాశం ఉంది. అందుకని పసుపును ప్రత్యేకంగా ఉపయోగించేముందు వైద్యుడి సలహా తీసుకోవటం మంచిది.

 

అశ్వగంధ

అశ్వగంధ ఒక ప్రసిద్ధ ఆయుర్వేద మూలిక, ఇది అనేక పేర్లతో పిలువబడుతుంది. అశ్వగంధ వేరు మరియు పండును ఔషధ కారణాల కోసం ఉపయోగిస్తారు. ఇది ఆయుర్వేద, భారతీయ వైద్యం, ఉనాని వైద్యంలో ఉపయోగించబడుతుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలు ఉన్నాయని చూపించే అనేక అధ్యాయనాలు ఉన్నాయి. ఇది శరీరంలో  ఒత్తిడిని తగ్గించడం, ఆలోచన శక్తిని మెరుగుపరచడం, నొప్పిని తగ్గించడం మరియు ఏజింగ్ యొక్క ప్రభావాలను నివారించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. అలాగే అశ్వగంధను  ఎపిలెప్సీ, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, డయాబెటిస్, చర్మ సంబంధ వ్యాధులు, అలసట వంటి పరిస్థితుల కోసం కూడా ఉపయోగిస్తారు.

అశ్వగంధ ఎలా పని చేస్తుందంటే..

అశ్వగంధ, కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ యొక్క స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఇది ఒత్తిడి సంబంధిత లక్షణాలైన ఆందోళన, నిద్రలేమి మరియు అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది స్లీప్ క్వాలిటీని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధ్యాయనాలు చెబుతున్నాయి. 

ఇంకా అశ్వగంధ కీళ్ళ నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుందని కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.అలాగే రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా శరీరాన్ని అనారోగ్యం నుండి రక్షించడానికి అశ్వగంధ సహాయపడుతుంది. ఇది శరీరం యొక్క బ్యాక్టీరియా మరియు వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా  మెరుగుపరుస్తుంది.

 • అశ్వగంధ మరియు క్యాన్సర్ పై అధ్యాయనాలు 
 • క్యాన్సర్ రోగులలో సంభవించే కారణాలు, చికిత్స మరియు దుష్ప్రభావాల నిర్వహణలో అశ్వగంధ యొక్క ప్రయోజనాలను చూపించే అనేక జంతు, మానవ మరియు ల్యాబోరెటరీ అధ్యాయనాలు ఉన్నాయి.
 • కొన్ని అధ్యయనాలలో, అశ్వగంధ సాధారణ కణాలను దెబ్బతీయకుండా రొమ్ము, పెద్ద ప్రేగు, ఊపిరితిత్తులు మరియు కేంద్ర నాడీ వ్యవస్థ లో క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించగలదని తేలింది.
 • అశ్వగంధ యొక్క బయోయాక్టివ్ భాగం – విత్తఫెరిన్ A ను ఆక్సలిప్లాటిన్‌తో కలిసి ఉపయోగించినప్పుడు క్లోమదశ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా సమర్థవంతమైన వ్యూహాత్మకతను అందిస్తుంది.
 • జంతు అధ్యయనంలో, అశ్వగంధ కీమోథెరపీ వల్ల కలిగే న్యూట్రోపెనియాను తగ్గించిందని చూపించింది.
 • 100 మంది రొమ్ము క్యాన్సర్ రోగులపై నిర్వహించిన ట్రయల్‌లో, ఇది క్యాన్సర్ సంబంధిత అలసటకు వ్యతిరేకంగా మరియు జీవిత నాణ్యతలో మెరుగుదలను అశ్వగంధ చూపించింది.

అశ్వగంధ యొక్క న్యూరోప్రొటెక్టివ్ మరియు వ్యతిరేక- లక్షణాలు ఆస్టియో ఆర్థరైటిస్ సంబంధిత కార్టిలేజ్ క్షీణతను నివారించడంలో సహాయపడతాయి. 

అదనపు పరిశోధనల నివేదిక ప్రకారం,  క్రోమోజోమ్ స్థిరత్వం, సైటోటాక్సిక్, ఇమ్యూనోమోడ్యులేటింగ్, కీమోప్రివెంటివ్ మరియు రేడియోసెన్సిటైజింగ్ ప్రభావాలను కూడా చూపిస్తున్నాయి. అశ్వగంధ గురించిన అనేక అధ్యాయనాలు క్యాన్సర్ కు వ్యతిరేకంగా  ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కానీ అశ్వగంధ ను ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవటం మర్చిపోకండి.

 

త్రిఫల 

త్రిఫల అనేది హరితకి (హరద్), బిభీతకి (బహదా) మరియు అమ్లాకి(ఆమ్లా) అనే మూడు మొక్కలతో తయారు చేయబడిన పురాతన ఆయుర్వేద మూలికా ఫార్ములా. త్రిఫలకు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి మరియు మంచి జీర్ణక్రియ కోసం మూలికా కలయికగా త్రిఫల ఉపయోగపడుతుంది. అలాగే ఇది క్యాన్సర్ కణాలను చంపడానికి ప్రేరేపించి, ట్యూమర్ల పరిమాణాన్ని గణనీయంగా తగ్గించింది అని అధ్యాయనాలు చెబుతున్నాయి. త్రిఫల లో ఉన్న మూడు మూలికలు ఎలా పనిచేస్తాయంటే.. 

 • హరితకి: హరితకి (టెర్మినాలియా చెబుల) అనేది మలబద్ధకం, కడుపు ఉబ్బరం మరియు ఆమ్ల డిస్పెప్సియా వంటి జీర్ణశక్తి సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించే పురాతన మూలిక.
 • బిభీతకి: బిభీతకి (టెర్మినాలియా బెల్లెరికా) అనేది జీర్ణశక్తిని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం మరియు బరువు తగ్గించడానికి సహాయపడే మరొక మూలిక.
 • ఆమ్లాకి: ఆమ్లాకి (ఫిలాంథస్ ఎంబ్లికా) అనేది విటమిన్ సి యొక్క గొప్ప వనరు మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.

ఈ మూడు మూలికల కలయిక అయిన  త్రిఫలను జీర్ణశక్తిని మెరుగుపరుస్తూ , రోగనిరోధక శక్తిని పెంచుతూ, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించే శక్తివంతమైన మూలికా మిశ్రమంగా పనిచేస్తుంది.

త్రిఫల మరియు క్యాన్సర్ పై అధ్యాయనాలు 

త్రిఫలలో కనిపించే ఫైటోకెమికల్స్ వ్యాధులను నయం చేయడానికి వైద్యపరంగా ముఖ్యమైనవి. ఆధునిక వైద్య విధానంలో అన్ని మందులు కృత్రిమమైనవి మరియు మానవ మరియు జంతువుల శరీరంలో చాలా దుష్ప్రభావాలను చూపిస్తున్నాయి. త్రిఫలలో క్యాన్సర్ కణాలను నయం చేసే చాలా రసాయన సమ్మేళనాలు ఉన్నాయని పరిశోధనలు  కనుగొన్నాయి. 

 • పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం జరిపిన కొత్త పరిశోధనలో, ఉదర సంబంధిత వ్యాధులకు ఉపయోగించే ఆయుర్వేద ఔషధం త్రిఫల, క్యాన్సర్‌ను నిరోధించగలదని తేలింది.
 • త్రిఫల లో ఉన్న ఎల్లాజిక్ ఆమ్లం అనేది  ఒక ఫినోలిక్ సమ్మేళనం మరియు ఇది కొన్ని కార్సినోజెన్-ప్రేరిత క్యాన్సర్లను నిరోధించడానికి మరియు ఇతర కీమో-నివారణ లక్షణాలు కలిగి ఉండే అవకాశం ఉంది. సర్వికల్ కార్సినోమా కణాలలో సెల్ సైకిల్ ఈవెంట్స్ మరియు అపోప్టోసిస్‌పై ఎల్లాజిక్ ఆమ్లం చూపించే ప్రభావాలను పరిశోధకులు అధ్యాయనం చేశారు.
 • మరోక అధ్యాయనం లో త్రిఫలకు వివిధ జంతువుల నమూనాలలో యాంటి అల్సర్యాంటీపైరేటిక్, యాంటీ-డయాబెటిక్ మరియు యాంటీ-క్యాన్సర్ కార్యకలాపాలు ఉన్నాయని తేలింది. అందువల్ల, ఆ అధ్యాయనం త్రిఫలకు యాంటీ-క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని తెలిపింది..

 

చివరగా చెప్పేదేమిటంటే,

క్యాన్సర్ పై ఆయుర్వేదం ఔషధాలు పనిచేసే అవకాశం ఉన్నట్లు కొన్ని సైంటిఫిక్ రిసర్చ్ల లో తేలినా ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. ఇక ఆయుర్వేదంలో విభాగమైన రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ ను తగ్గించడం పై మరింత మెరుగ్గా పనిచేస్తుంది అని చెప్పడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. అవేమిటో కాదు, రసాయన ఆయుర్వేదం ద్వారా క్యాన్సర్ ను తగ్గించుకున్న వారి కథలే! వాటిని మీరు పునర్జన్ ఆయుర్వేద యుట్యూబ్ చానల్ లో చూడవచ్చు.