స్పైరులీనా అనేది ఒక బ్లూ గ్రీన్ ఆల్గే. ఇది ఒక రకమైన సైనోబాక్టీరియ. చూడటానికి పచ్చగా నాచు లాగానే ఉంటుంది, నీళ్ళలోనే ఇది పెరుగుతుంది.ఇక విషయానికి వస్తే ఈ స్పైరులీనాలో ఎన్నో పోషకాలు ఉన్నాయి అందుకని ఇది ఆరోగ్య సమస్యలపై మంచి ప్రభావం చూపగలదు.
స్పైరులినా లో ఉండే పోషకాలు
ఈ స్పైరులీనాలో ఉండే పోషకాల విషయానికి వస్తే,
ముందుగా స్పైరులీనా ప్రోటీన్‌కు మంచి సోర్స్. ఒక టేబుల్ స్పూన్ స్పైరులీనా లో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక విటమిన్ల విషయానికి వస్తే ఇందులో విటమిన్లు A, B, C, D, E మరియు K వంటి అనేక విటమిన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, కాల్సిఫిరోల్ మరియు బీటా-కెరోటిన్ వంటి ముఖ్యమైన విటమిన్లు కూడా ఉంటాయి. ఇక మినరల్స్ లో స్పైరులీనా మెగ్నీషియం, ఐరన్, జింక్, కాల్షియం మరియు సెలీనియంలను కలిగి ఉంటుంది. ఇది ఫోస్ఫరస్, పొటాషియం మరియు మాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలకు కూడా మంచి సోర్స్. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉన్నాయి.
ఇన్ని పోషకాలు ఉండటం వల్ల ఈ స్పైరులీనా మంచి ఆయుర్వేద వనమూలిక గా పరిగణించబడుతుంది.
ఇక స్పైరులీనా ఆరోగ్య సమస్యలపై ఎలా ప్రభావం చూపుతుంది?
- స్పైరులీనా లోని పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. పొటాషియం ఒక ఎలక్ట్రోలైట్, ఇది శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరంలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి మరియు పొటాషియం స్థాయిలు తక్కువగా ఉంటాయి. స్పిరులినాలోని పొటాషియం సోడియం స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, దానివల్ల రక్తపోటు తగ్గుతుంది. కొన్ని అధ్యయనాలు స్పైరులీనా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నాయి. ఒక అధ్యయనంలో, హైపర్టెన్సివ్ వ్యక్తులు 12 వారాలు దీనిని తీసుకున్న తర్వాత వారి రక్తపోటు తగ్గినట్లు తేలింది. మరొక అధ్యయనంలో, స్పిరులినా తీసుకున్న హైపర్టెన్సివ్ వ్యక్తులు వారి రక్తపోటు మందులను తక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కనుగొనబడింది.
- ఇక క్యాన్సర్ విషయానికి వస్తే, స్పైరులీనా లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్మ్యునిటీ ని పెంపొందించేందుకు తోడ్పడతాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ ఇమ్మ్యునిటీ ని బలహీనపరుస్తాయి, కాబట్టి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అలాగే క్యాన్సర్ కణాలను పై కూడా ఇవి ప్రభావం చూపగలవు. కొన్ని అధ్యయనాలు స్పైరులీనా క్యాన్సర్ కణాల మరణాన్ని కూడా ప్రోత్సహించగలదని సూచిస్తున్నాయి. అలాగే స్పైరులీనా లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా స్పైరులీనా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
- కొన్ని అధ్యయనాలు స్పైరులీనా మధుమేహం నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతున్నాయి. ఒక అధ్యయనంలో, డయాబెటిస్ ఉన్న వ్యక్తులు 12 వారాలు దీనిని తీసుకున్న తర్వాత వారి రక్తంలోషుగర్ లెవల్స్ తగ్గినట్లు కనుగొనబడింది.
స్పైరులీనా దుష్ప్రభావాలు
ఒకవేళ అధికంగా తీసుకున్నట్లయితే స్పైరులీనా ఈ దుష్ప్రభావాలను చూపవచ్చు.
- జీర్ణ సమస్యలు, విరేచనాలు, వాంతులు మరియు కడుపు నొప్పి
- స్పైరులీనాలోని థైరాయిడ్ హార్మోన్లను పోలి ఉండే పదార్థాల వల్ల హైపర్ థైరాయిడిజం
- అలెర్జీ ప్రతిచర్యలు, దురద, వాపు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
- నరాల సమస్యలు, తలనొప్పి.
చివరగా
ఈ విధంగా ఎన్నో ఆరోగ్య సమస్యలపై ప్రభావం చూపే శక్తి స్పైరులీనా లో ఉంది. స్పైరులీనా ను టాబ్లెట్లు, క్యాప్సూల్స్, పౌడర్ లేదా సిరప్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఏదైనా సారీ మితంగా తీసుకుంటేనే ఔషధం మితిమీరితే సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకని దీనిని ఉపయోగించే ముందు వైద్యుడి సలహా తీసుకోవటం మంచిది.
Also Read: స్వయంకృత అపరాధాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు, రసాయన ఆయుర్వేదం పరిష్కారం చూపగలదా?