కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని తగ్గించే సూపర్ ఫుడ్స్

You are currently viewing కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని తగ్గించే సూపర్ ఫుడ్స్

మన శరీరంలో కిడ్నీలు ఒక ఫిల్టర్ వ్యవస్థ లాంటివి. అసలు వీటి పనేంటంటే మన రక్తం లోని మలినాలను తొలగించటం. ప్రతీ నిమిషం గుండె పంప్ చేసిన ఒక లీటర్ రక్తాన్ని కిడ్నీలు ఫిల్టర్ చస్తాయి. కిడ్నీలు సరిగ్గా పని చేస్తే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది,అందుకే కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఆహారాన్ని ఎంచుకోవటం ముఖ్యం. కిడ్నీలు బాగా పని చేస్తున్నయంటే మనిషి దాదాపుగా ఆరోగ్యంగా ఉన్నట్టే..

మరి కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఏమైనా సూపర్ ఫుడ్స్ ఉన్నాయా అని అడిగితే..సింపుల్ గా మన ఆహారంలో మనకు తెలియని కిడ్నీ సమస్యలు రాకుండా నివారించే ఆహారాలు ఎన్నో ఉన్నాయి. ఇవి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తూ కిడ్నీ సమస్యల ప్రమాదం నుండి రక్షిస్తాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆహారాలు తినాలో తెలుసుకోవటం ఎంత ముఖ్యమో,

 ఏ ఆహారాలు ఎక్కువగా  తినకూడదో కూడా తెలుసుకోవటం ముఖ్యం.

అధిక సోడియం ఆహారాలు 

కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి ఎక్కువ సోడియం ఉన్న ఆహారాలు ప్రమాదకరం, ఎందుకంటే ఇవి కిడ్నీలను మరింత బలహీనపరచగలవు.ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఎక్కువగా సోడియం ఉంటుంది.

అధిక ఫాస్పరస్ ఆహారాలు

ఆరోగ్యమైన కిడ్నీలు రక్తంలో ఉండే అధిక ఫాస్పరస్ ను తొలగించగలవు కానీ కిడ్నీ సమస్యలు ఉంటే ఇది ప్రమాదకరంగా మారవచ్చు. దీర్ఘకాలం రక్తంలో అధికంగా ఫాస్ఫరస్ ఉండటం కూడా  ఆరోగ్యానికి మంచిది కాదు.డార్క్ కలర్ ఉన్న సోడాలలో ఈ ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది.

అధిక పొటాషియం ఆహారాలు 

కిడ్నీ సమస్య ఉన్నట్లయితే శరీరంలో అధిక పొటాషియం సులభంగా బయటికి వెళ్ళదు. దీని వల్ల రక్తంలో అధిక పొటాషియం ఉండిపోయి సమస్య సృష్టిస్తుంది.

వీటితో పాటు చక్కర కలిపినా ఆహారాలు,మరియు ముఖ్యంగా ఆల్కహాల్ కూడా కిడ్నీ పని తీరు పై చెడు ప్రభావం చూపిస్తుంది. 

కిడ్నీ ఆరోగ్యానికి సహాయపడే  ఔషధం లాంటి పది ఆహారాలు 

మొదటిది నీరు

Water

నీరు ఆహరం కాకపోవచ్చు కానీ కిడ్నీలు సరిగ్గా పని చేయటానికి ఎప్పటికప్పుడు సరిగ్గా నీరు త్రాగాలి, సింపుల్ గా చెప్పాలంటే రోజుకు మహిళలు అయితే ఎనిమిది గ్లాసులు, పురుషులు అయితే పదమోదూ గ్లాసుల నీరు త్రాగాలి.నీరు త్రాగాకపోవటం వల్ల వచ్చే డీహైడ్రేషన్ కిడ్నీ ఫెయిల్యూర్ కి లేదా కిడ్నీల సమస్యలకు కారణం అవ్వచ్చట. అందుకని కిడ్నీ ఆరోగ్యానికి నీరు చాలా  ముఖ్యమైనది.

రెండవది నిమ్మ రసం

Refreshing drink

నిమ్మరసం లో ఉండే విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ అనేది శరీరంలోని అంతర్గత పి హెచ్ స్థాయిలను నియంత్రిస్తుంది,దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నిమ్మ రసం కిడ్నీ సమస్యల్లో మంచి ప్రభావం చూపగలదట. ఉదయాన్నే ఒక గ్లాసు నీళ్ళు కలిపిన నిమ్మ రసం త్రాగటం కిడ్నీ ఆరోగ్యానికి మంచిది.

మూడవది క్యాబేజ్

Green lettuce

 క్యాబేజ్ అనే కూరగాయ ఆరోగ్యాన్ని కాపాడే ఫైటో కెమికల్స్ తో నిండి ఉంది. క్యాబేజ్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికాల్స్ పై ప్రభావం చూపి క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గించాగలవట. అలాగే క్యాబేజ్ లో ఉండే విటమిన్ సి, విటమిన్ కే, మరియు ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే క్యాబేజ్ లో ఉండే ఇండోల్ 3 కార్బోనైల్ అనే యాంటీ ఆక్సిడెంట్ లివర్ ను కూడా డిటాక్స్ చేయగలడట. కిడ్నీ ఆరోగ్యానికి తక్కువ పొటాషియం గల ఈ క్యాబేజ్ మంచి చాయిస్ అనే చెప్పాలి.

నాలుగవది కాలీఫ్లవర్

Cauliflower

కిడ్నీ ఆరోగ్యాన్ని సంరక్షించటంలో కానీ, కిడ్నీ సమస్యలను నివారించటంలో కానీ కాలీఫ్లవర్ ఒక సూపర్ ఫుడ్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇది శరీరం లోని టాక్సిన్స్ ను బయటకు పంపించేయటానికి సహాయపడుతుంది.కాలీఫ్లవర్ లో ఉండే విటమిన్ సి, ఫోలేట్ మరియు ఫైబర్ కిడ్నీ ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే ఈ కాలీఫ్లవర్ ను కిడ్నీ సమస్యలకు ఒక న్యాచురల్ రెమెడీ గా పేర్కొంటారు.

ఐదవది ఉల్లిపాయ

red onion

శరీరంలో ఎక్కువ క్రియేటిన్ ఉండి కిడ్నీలు సరిగ్గా పని చేయని వాళ్లకు ఈ ఉల్లిపాయ చాలా మంచిది అనే చెప్పాలి.ఉల్లిపాయలో ఉండే ప్రోస్టా గ్లండిన్, రక్తం లోని విస్కాసిటి ని తగ్గించి రక్త పోటును నివారిస్తుంది తద్వారా కిడ్నీ సమస్యల పెరుగుదలను నియంత్రిస్తుంది. అలాగే ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె జబ్బు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించగలదట. పొటాషియం తక్కువగా ఉండటం వల్ల ఉల్లిపాయలు మంచి కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్స్ గా ఉంటాయి.

ఆరవది వెల్లుల్లి

Garlic

వెల్లుల్లి ఉపయోగించడం దాదాపు అందరి ఇళ్ళల్లో సర్వ సాధారణం. వెల్లుల్లి లో ఉండే పోషకాలు కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రభావం చూపిస్తాయి.వెల్లుల్లి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్తీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, కిడ్నీ సమస్యలను పెరగనివ్వకుండా నేమ్మదించగలవు. అలాగే వెల్లుల్లి లో ఉండే అల్లిసిన్, కిడ్నీ వ్యాధుల పై ప్రభావం చూపగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా వెల్లుల్లి లో ఉండే డై యురిటిక్ ప్రాపర్టీస్, టాక్సిన్లను తొలగించమని కిడ్నీలకు సిగ్నల్స్ పంపగలదట.

ఏడవది ముల్లంగి

white radishes

ముల్లంగి అనేది ఒక మంచి డిటాక్స్ ఫుడ్. ముల్లంగి లో తక్కువ పొటాషియం మరియు తక్కువ ఫాస్పరస్ ఉండటం వల్ల ఇది మంచి కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్ అవుతుంది.  ముల్లంగి లో ఇండోల్ -3-కార్బినాల్ మరియు 4-మిథైల్థియో -3-బ్యూటెనిల్-ఐసోథియోసైనేట్ ఉండటం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపించటానికి అలాగే కిడ్నీ సరిగ్గా పని చేయటానికి బాగా సహాయపడగలదు. పచ్చి ముల్లంగి కంటే ఉడకబెట్టిన ముల్లంగిలోనే తక్కువ పొటాషియం ఉంటుంది, అందుకని వండుకొని తింటేనే కిడ్నీ ఆరొగ్యనికి  మంచిది.

ఎనిమిదవది యాపిల్ పండ్లు

Red apples

యాపిల్ పండ్లలో కిడ్నీ కి హాని కలిగించే సోడియం, పొటాషియం, మరియు ఫాస్ఫరస్ తక్కువగా ఉంటాయి, అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నా కూడా యాపిల్ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. యాపిల్ పండ్లు కిడ్నీ లో బ్యాక్టీరియా పెరగకుండా కూడా నియంత్రించగలవట. అలాగే వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కిడ్నీ సమస్యల పై ప్రభావం చూపగలవట. యాపిల్ పండ్లలో ఉండే విటమిన్లు, ఫైబర్ మరియు మినరల్స్ మంచి పోషకాలను శరీరానికి అందిస్తాయి. ఈ కారణాల వల్ల కిడ్నీ ఆరోగ్యానికి కూడా యాపిల్స్ తినటం మంచి విషయమే!

తొమ్మిదవది పైనాప్పిల్

pineapple

పైనప్పిల్ పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి 6 మరియు మ్యంగనీజ్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.కిడ్నీ కి సమస్య వచినప్పుడు శరీరంలో మలినాలు ఫిల్టర్ అవ్వటం కష్టం అవుతుంది.అలాంటప్పుడు కిడ్నీకి హాని చేసే పొటాషియం సోడియం వంటివి తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. పైనాప్పిల్ లో ఉండే బ్రోమెలైన్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది అలాగే జీర్ణ క్రియ కు ఎంతగానో సహాయపడుతుంది. పైనప్పిల్ లో ఉండే పెప్తిడ్స్ మరియు యాంటి ఆక్సిడెంట్లు శరీరంలో క్రియేటిన్ స్థాయిలను తగ్గించి కిడ్నీ పనితీరును మెరుగు పరచాగాలవని ఒక అధ్యయనంలో తేలింది.

పదవది కేల్

Kale

కేల్ అనేది ఆకుకూరలలో ఒక రకం. ఈ కేల్ తక్కువ పొటాషియం ఫుడ్ అవ్వటం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నా సరే తినవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఏ,విటమిన్ సి మరియు క్యాల్షియం సహా ఇతర మినరల్స్ కిడ్నీ సరిగ్గా పని చేయటంలో సహాయపడతాయి. అలాగే కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణం మధుమేహం, ఈ ఆకు కూర షుగర్ లెవల్ ను నియంత్రించడంలో సహాయపడి మధుమేహం పై ప్రభావం చూపగలదట.ఈ విధంగా కిడ్నీ ఆరోగ్యానికి ఈ ఆకుకూర ఎంతగానో సహాయపడుతుంది.