ఆయుర్వేదం ప్రకారం మన అరచేతి ఐదు వేళ్ళలో బొటన వేలు ఆకాశానికి, చూపుడు వేలు వాయువుకి,మధ్య వేలు అగ్నికి, ఉంగరపు వేలు నీటికి మరియు చిటికెన వేలు నేల కి..
ఇలా మన ఐదు వేళ్ళు పంచ భూతాలకు ప్రతిబింబాలట. మన అరచేతి వెళ్ళు మనం ముట్టుకునే ప్రతీ దాని స్పర్శ అనుభూతిని మనకు అందిస్తాయి. మనం అరచేతితో అన్నం ముద్ద కలిపి తింటుంటే పంచభూతాలకు ప్రతిబింబాలైన మన ఐదు వేళ్ళ కలయిక ఏర్పడుతుంది.
మన చేతి వేళ్ళతో ఆహారాన్ని తాకగానే మన వేళ్ళలో ఉండే నరాలు మన బ్రెయిన్ కి మనం తినబోతున్నామనే సిగ్నల్ పంపుతాయి. ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకున్న మన బ్రెయిన్, మన జీర్ణ వ్యవస్థ కు ఆహారం అరగడానికి సహాయపడే యాసిడ్స్ విడుదల చేయమని సంకేతం పంపుతుంది. ఇలా మన వేలి చివర ముట్టుకున్న ఆహారం తాలూకు అనుభూతి మన శరీరంలో అతిపెద్ద సేన్సారీ ఆర్గన్ అయిన చర్మం, మన వేళ్ళ కు ఉండే నరాల ద్వారా మన శరీరానికి అర్థమవుతుంది.
అలా అర్థమయ్యాక మనం చేసే భోజనమే “మైండ్ ఫుల్ ఈటింగ్”.
ఎన్నో వందల ఏళ్ల ముందు నుండే ప్రతీ భారతీయుడు తినడానికి తన అరచేతిని ఉపయోగిస్తున్నాడు. వెస్టర్న్ ప్రపంచం ఆ అలవాటును అనాగరికమని అన్నా కూడా , కొందరు స్వదేశీయులే వెస్టర్న్ కల్చర్ మోజు లో పడి చేతిలో స్పూన్లు, ఫోర్కులు పట్టుకున్నా కూడా ఇంకా అరచేతితో అన్నం గోరు ముద్దలు కలిపి తినిపించే తల్లులు, తమ చేతులతోనే అన్నం కలుపుకొని తినే పిల్లలు మన దేశం లో కనిపిస్తారు. ఇలా తినడం కేవలం మన సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనక కూడా సైన్స్ ఉంది ! అదేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం.
మనం తినే ఆహారాన్ని చేతులతో భుజించడం వల్ల మన శరీరానికి మనం తినే ఆహారపు అనుభూతి ఇతర వస్తువులతో తినే దానికంటే ఎన్నో రెట్లు అధికంగా కలుగుతుంది. దానికి కారణం మనం తినే ముందే మన శరీరానికి తినబోతున్నామనే సిగ్నల్ మన శరీరానికి చేతి స్పర్శ ద్వారా ఇస్తున్నాం గనక ఆ అనుభూతి కలుగుతుంది.
అంతెందుకు మన చేతి వెళ్ళే మన టెంపరేచర్ సెన్సార్లు, ఎందుకో తెలుసా?
మనం తినే ఆహారం వేడిగా ఉందా, చల్లగా ఉందా? ఆ వేడి నీకు సరిపోతుందా?
ఇవన్నీ నీకు స్పూన్ తో తింటే తెలుస్తుందా? లేదు కదా!
అదే నీ అరచేతితో ఆహారం భుజిస్తుంటే నీ వెళ్ళే నీకు ఆ విషయాలన్నీ చెబుతుంది. చల్లారే దాకా ఆగుతావో, లేక అంతే వేడిగా తింటావో అది నీ ఇష్టం. కానీ స్పూన్ తో ఇది సాధ్యపడదు కదా.. మరి నాలుక కాల్చుకునే పోరాపాట్లేందుకు?
సరే ఇంకా సైంటిఫిక్ గా చెప్పాలంటే మన చేతుల పైన ప్రకృతి లోని చెడు సూక్ష్మ జీవుల నుండి మనను కాపాడే గుడ్ మైక్రో ఫ్లోరా ఉంటుందట. చేతి తో తినడం వల్ల ఆ బ్యాక్టీరియా మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మన గట్ లోకి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ను పంపిస్తుందట. ఇంకా చెప్పాలంటే చేతితో తినడం మనం తినే ఆహారం కూడా ఎంత తింటున్నామో అర్థమయ్యేలా మన శరీరానికి సరిపడేంత తినేలా మనకు సహాయం చేస్తుందట. అలాగే మనం ఆహారాన్ని చేతితో కలపడం, తినడం మన చేతి వేళ్ళకు కూడా మంచి వ్యాయామమే! సాంప్రదాయంగా మాత్రమే కాదు శాస్త్రీయంగా కూడా చేతితో తినడం అనేది అత్యంత నాగరికమైన అలవాటు. ప్రపంచం లో ఒకటిలో మూడో వంతు జనాలు ఇప్పటికీ తమ చేతులతోనే ఆహారాన్ని తింటున్నారు. మనం మన అలవాట్లని మార్చుకునే ముందు అర్థం చేసుకోవడం మంచిదేమో? ఆలోచించండి.
మనకు మన ఆహారం తో చాలా పవిత్రమైన అనుబంధం ఉంటుంది. మనం తినే ఆహారం మన ఆలోచనలను, మన క్రియలను నిర్ణయించగలదు. వేదాల ప్రకారం కూడా మనం చేతులతో ఆహారాన్ని తినడం మన మైండ్ ఫుల్ ఈటింగ్ కి సహాయపడుతుందని రాయబడి ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి!
మనం ఏం తింటున్నామో, ఎప్పుడు తింటున్నామో ఎంత ముఖ్యమో.. ఎలా తింటున్నామన్నది కూడా అంతే ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.
Also Read: త్రిఫల చూర్ణం ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం.