ఆయుర్వేదం, రసాయన ఆయుర్వేదం వేర్వేరు కాదు. అధర్వణ వేదానికి ఉపవేదమైన ఆయుర్వేదంలో రసాయన ఆయుర్వేదం మరో ఉపవేదం మాత్రమే. ఆయుర్వేదానికి ఉన్న ఎనిమిది శాఖల్లో రసాయన ఆయుర్వేదం ఒకటి. జనరల్ మెడిసిన్ కాయ చికిత్స అని, శాస్త్ర చికిత్సను శల్య చికిత్స అని, చెవి, ముక్కు, గొంతు విభాగాలకు సంబంధించిన చికిత్సలను శాలాక్యమని, కౌమారభ్రుత్యం అంటే పీడియాట్రిక్ అని, వాజీకరణ అంటే సెక్సాలజీ అని, భూత చికిత్సను మైక్రో బయాలజీ అని, అగద అంటే టాక్సిక్ సైన్స్గానూ విభజించారు. వీటిలో ఇమ్యునిటీ కోసం ప్రత్యేకించి రసాయన ఆయుర్వేదం ప్రత్యేకించబడింది.
ఆయుర్వేదం లేదా ఆయుష్శాస్త్రం ప్రధానంగా మనసు, శరీరం, ఆత్మల సమన్వయానికి దోహద పడుతూ చక్కటి జీవనశైలిని అలవరుస్తుంది. ఆహార, విహార, వ్యవహారాల విషయంలో ప్రత్యేక దృక్కోణం కలిగి ఉంటుంది. రసాయన ఆయుర్వేదం అయితే మరింత జటిలమైన ఆరోగ్య సమస్యలకు సైతం పరిష్కారాలను చూపుతుంది. సాధారణంగా వ్యాధులు ప్రబలినప్పుడు రోగనిరోధక శక్తి మెల్లిగా తగ్గుతుండటం సహజంగా జరిగే ప్రక్రియ. ఒకపక్క వ్యాధినిరోధక శక్తి కుచించుకుపోకుండా దాన్ని పెంపొందింపజేస్తూ మరోపక్క వ్యాధికి చికిత్స అందించడమే రసాయన ఆయుర్వేదం ప్రత్యేకత.
Also Read: రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ కణాలపై ఎలా పోరాడుతుంది?