చరిత్ర
ప్యాషన్ ఫ్రూట్ పేరు అరుదుగా విని వుంటారు కాని ఈ పండుకి ఘన చరిత్ర వుంది.
ఇది ట్రాపికల్ ప్లాంట్ అంటే ఉష్ణ మండలంలో పెరిగే పండు. ప్రస్తుతం సబ్ ట్రాపికల్ ప్రదేశాలలో కూడా ప్యాషన్ ఫ్రూట్ పండిస్తున్నారు. దక్షిణ అమెరికాకు చెందిన ఈ పండు అమెజాన్ రెయిన్ ఫారెస్టులో పుట్టింది. దీని తీపి, రుచి, అరోమా సువాసన ల వల్ల ఇతర దేశాల వారిని ఆకర్షిస్తోంది. సౌత్ అమెరికా నుండి బ్రెజిల్ అర్జెంటీనా, కెన్యా ,కొలంబియా, ఆస్ట్రేలియాలో కూడా ప్యాషన్ ఫ్రూట్ ని పండిస్తున్నారు.
16వ శతాబ్దంలో పోర్చుగీస్, స్పానిష్ వారు ఈ పండు గురుంచి ఇతర దేశాల వారికి తెలియపరిచారు.
ప్యాషన్ ఫ్రూట్ ప్యాసిఫ్లోరా వైన్ కు చెందినది. ప్యాషన్ పువ్వు జాతికి సంబంధించిన వివిధ ఫలాలలో ప్యాషన్ ఫ్రూట్ ఒకటి. ఇందులో వుండే విశేష గుణాలు, పోషక విలువల వలన పూర్వకాలం నుండే ఆహారంలో తీసుకునేవారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ పండు వ్యాప్తిలోకి వస్తోంది. ప్యాషన్ ఫ్రూట్ ని మన దేశంలో కృష్ణ ఫలం అంటారు.
పోషక విలువలు
ప్యాషన్ ఫ్రూట్ లో పోషకవిలువలు పుష్కలంగా ఉంటాయి. ప్యాషన్ ఫ్రూట్ ఆకుపచ్చ, పసుపు, ఊదా, .రంగుల్లో దొరుకుతుంది. ఒక్కో రంగు పండులో ఒక్కో ప్రత్యేక పోషక విలువలు ఉంటాయి. పండు తొక్క గట్టిగా ఉంటుంది. లోపల గింజలు, గుజ్జు ఉంటాయి. ఈ పండులో విటమిన్ ఏ, సి, పొటాషియం, మెగ్నీషియం , ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
ఇమ్యూనిటీ బూస్టర్
ఇందులో వుండే విటమిన్ సి.కెరోటిన్, క్రిప్టాగ్జాంథిన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
కంటిచూపు
ప్యాషన్ ఫ్రూట్ లో విటమిన్ ఏ,ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటిచూపుని మెరుగుపరుస్తాయి .
స్కిన్ కేర్
చర్మ సమస్యలతో బాధపడేవారు చికిత్స తీసుకుంటూ ప్యాషన్ ఫ్రూట్ ని డైట్ లో చేర్చుకోవాలి. ఈ పండులో వున్న విటమిన్ ఏ, సి, రిబోఫ్లావిన్, కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి
ఆస్తమా వారికి ఆసరా
ప్యాషన్ ఫ్రూట్ లో బయో ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇవి వీజింగ్ సౌండ్స్, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఆస్తమా నుండి రక్షిస్తాయి.
ఎముకలకు ఎంతో మేలు
కృష్ణఫలంలో కాల్షియమ్, మెగ్నీషియం ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వీటి వలన ఎముకలకు బలం చేకూరుతుంది. ప్యాషన్ ఫ్రూట్ యాంటీ ఇంఫ్లమేటరీ గుణం కలిగి ఉంటుంది. కీళ్ల వాపులనుండి ఉపశమనం ఇస్తుంది.
ఆందోళనలకు దూరం
ప్యాషన్ ఫ్రూట్ లో పొటాషియం ఫోలేట్ ఉంటుంది. ఇది మెదడు పనితీరుని, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. దీనివల్ల అల్జీమర్స్ నివారింపబడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది . నిద్రలేమి మాయం చేస్తుంది, తద్వారా ఆందోళన తగ్గుతుంది.
మెరుగైన జీర్ణవ్యవస్థ
జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారు ఫైబర్ వున్న ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. ప్యాషన్ ఫ్రూట్ లో ఫైబర్ మెండుగా ఉంటుంది. తరచూ ఈ పండు తింటూ ఉంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. జీర్ణకోశ సమస్యలు తొలగిపోతాయి.
క్యాన్సర్ నుండి రక్షణ
శరీరంలో ఫ్రీ రాడికల్ సెల్స్ వలన క్యాన్సర్ వ్యాప్తి అవుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ను నిరోధించడంలో ప్యాషన్ పువ్వు యాక్టీవ్ గా పనిచేస్తుంది. ప్యాషన్ పువ్వులో క్రిసిన్ అనే పదార్ధం ఉంటుంది. ఆ పదార్ధం యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగివుంటుంది. ఇది క్యాన్సర్ వ్యాప్తి చేసే ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తుంది. ప్యాషన్ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా వున్నాయి. అందువల్ల ప్యాషన్ ఫ్రూట్ క్యాన్సర్ వ్యాప్తిని తగ్గిస్తుంది. ఈ పండులో కీలక పదార్ధం పైసిఅటనాల్. ఇది కొలొరెక్టల్ క్యాన్సర్ కణాలను చంపినట్లు తేలింది. తాజా పళ్లరసం తాగితే శక్తి లభిస్తుంది. క్యాన్సర్ చికిత్సల వల్ల బలహీనపడేవారు ప్యాషన్ ఫ్రూట్ జూస్ తాగితే శక్తి తక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ కంట్రోల్
ప్యాషన్ ఫ్రూట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ పండు తిన్నాక పండులోని షుగర్ మెల్లగా రక్తంలో కలుస్తుంది. ఇది ఇన్సులిన్ లెవెల్స్ ని మెయిన్ టెయిన్ చెయ్యడానికి దోహదపడుతుంది. షుగర్ పేషంట్స్ లో మూడ్ స్వింగ్స్ తగ్గించి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుతుంది.
బిపి కంట్రోల్
ప్యాషన్ ఫ్రూట్ లో పొటాషియమ్ అధికంగా ఉంటుంది. దీనివలన రక్తనాళాలు విస్తరించుకుంటాయి. హైపర్ టెన్షన్ కు చెక్ పెడుతుంది. ఇది గుండెకు కూడా మేలు చేస్తుంది
ప్యాషన్ ఫ్రూట్ లోని పైసిఅటనాల్ వలన, ప్యాషన్ ఫ్రూట్ తొక్క తిన్నా హైపెర్ టెన్షన్ పేషంట్లకు మేలు జరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
బరువు తగ్గడానికి
ప్యాషన్ ఫ్రూట్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషక విలువలు ఉంటాయి. క్యాలరీస్ తక్కువ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఒక్క పండు తింటే చాలు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ప్యాషన్ ఫ్రూట్ వేరే ఆహారానికి ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు నిశ్చింతగా ప్యాషన్ ఫ్రూట్ తినవచ్చు.
ప్యాషన్ ఫ్రూట్ తో ఐస్ టీ
ప్యాషన్ ఫ్రూట్ తొక్క గట్టిగా ఉంటుంది. పండు లోపల మెత్తటి గుజ్జు, గింజలు ఉంటాయి, గుజ్జు, గింజలు తినవచ్చు. జూస్ తయారు చేసుకోవచ్చు. ప్యాషన్ ఫ్రూట్ తో స్మూథీస్ చెయ్యవచ్చు. పండుని కట్ చేసి డెసెర్ట్స్ లో డ్రస్సింగ్ కి వాడవచ్చు, మిల్క్ షేక్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఈ పండు సువాసన, తీపి, పులుపు రుచుల సమ్మేళనం వల్ల అందరూ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ప్యాషన్ ఫ్రూట్ ఐస్ టీ ప్రాచుర్యం పొందుతోంది. ముందు గ్రీన్ టీ చేసుకుని అందులో కాస్త తేనె కలిపి టీ ని చల్లారపెట్టాలి. టీ చల్లారిన తరువాత పండు గుజ్జు, ఐస్ క్యూబ్స్ వేసి తాగేయడమే, దీనినే ప్యాషన్ ఫ్రూట్ ఐస్ టీ అంటారు. ప్రస్తుతం మార్కెట్లో ప్యాషన్ ఫ్రూట్ టీ బ్యాగ్స్ లభ్యమవుతున్నాయి. ఈకామర్స్ సైట్లలో, కూడా అందుబాటులో వున్నాయి.
పండు రంగునుబట్టి ప్రయోజనం
పసుపురంగు ప్యాషన్ ఫ్రూట్ ని గువడిల్లా అంటారు. నల్ల ఫ్యాషన్ ఫ్రూట్ ని గ్రానడిళ్ల అంటారు పసుపు రంగు ప్యాషన్ ఫ్రూట్ తింటే చర్మం మృదువుగా ఉంటుంది. మీరు ఎప్పుడూ యాంగ్ గా కనిపిస్తారు.
ఊదారంగు ప్యాషన్ ఫ్రూట్ చల్లని ప్రదేశం వారు తింటారు. పసుపు లేదా గోల్డెన్ రంగు ప్యాషన్ ఫ్రూట్ ట్రాపికల్ ల్యాండ్ వేడి ప్రదేశాలలో ఉండేవారు తింటారు. అన్ని రంగుల ప్యాషన్ ఫ్రూట్ లో తినగలిగే గుజ్జు, గింజలు ఉండడం విశేషం. ఈ పండుని గింజలతో ,గింజలు లేకుండా కూడా తినవచ్చు.
ప్రకృతిలో లభించే తాజా పండ్లు రోజూ తీసుకుంటే ఆరోగ్యాంగా ఆనందంగా జీవించవచ్చు. మరి ఇన్ని పోషక విలువలు, ప్రత్యేకతలు వున్న ప్యాషన్ ఫ్రూట్ ని మీ డైట్ లో భాగం చేసుకోండి,హెల్దీగా వుండండి.
ముఖ్య గమనిక :
ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Also Read: భారతీయ సాంప్రదాయ ఆహారంలో అన్నం తినే అలవాటు వెనక ఉన్న సైన్స్!
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.