రసాయన ఆయుర్వేదం గురించి తెలుసుకునే ముందు క్యాన్సర్ గురించి కొంత అవగాహన అవసరం. క్యాన్సర్ కణాల వ్యవహారశైలి సాధారణ కణాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణ కణాల కంటే కూడా ఇవి రెట్టింపు వేగంతో విభజన చెందుతుంటాయి. మన శరీరంలోకి ఎటువంటి శత్రువు ప్రవేశించినా వెంటనే పసిగట్టే మన ఇమ్యూనిటీ వ్యవస్థ క్యాన్సర్ కణాలతో వీరోచితంగా పోరాడుతుంది. సర్వశక్తులూ ఒడ్డి వీలైనంత వరకు వాటిని నియంత్రించే ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ ఒక్కోసారి వ్యాధిబలం ఎక్కువైనప్పుడు మన రక్షణ వ్యవస్థ కూడా కుదేలైపోతుంది. అటువంటి సమయంలోనే రసాయన ఆయుర్వేదం అక్కరకొస్తుంది. రసాయన ఔషధాలు ప్రధానంగా శరీరంలో దెబ్బతిన్న రక్షణ వ్యవస్థకు ఊతంగా నిలుస్తాయి. రోగనిరోధక శక్తి బలోపేతమైతే శరీర ఓజస్సు పెరిగి వ్యాధి బలవిరోధిత్వం, వ్యాధ్యుత్పాదప్రతిబంధకత్వం మెరుగవుతాయి. కొన్ని రసౌషధాలు ఒకపక్క రోగనిరోధక శక్తిని పెంచుతూనే మరోపక్క క్యాన్సర్ కణాలను నియంత్రిస్తుంటాయి. క్యాన్సర్ కణాలు మరోచోటకి వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడమే కాకుండా వాటిని నాశనం చేస్తుంది రసాయన ఆయుర్వేదం.
వాస్తవానికి మన శరీరంలోనికి ఎటువంటి కొత్త కణాలు ప్రవేశించినా ఇట్టే పసిగడుతుంది మన ఇమ్యూనిటీ. యాంటీబాడీల రూపంలో మన శరీర రక్షకదళం ఎప్పటికప్పుడు క్యాన్సర్ కారకాలపై పోరాడుతూనే ఉంటుంది. శరీరమంతా కళ్ళు చేసుకుని మరీ రక్షణ కల్పించే, ఇంతటి బలమైన వ్యవస్థని సైతం అస్తవ్యస్తం చేస్తాయి క్యాన్సర్ కణాలు. ఈ కణాలు సహజంగా తమ జ్ఞాపకశక్తిని కోల్పోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటాయి. వాటంతటవే సెల్ఫ్ సిగ్నలింగ్ వ్యవస్థని ఏర్పరచుకుని శరీరం వాటిని నియంత్రించే అవకాశమివ్వకుండా అవే శరీరాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. క్యాన్సర్ వ్యాధి ప్రధానంగా శరీర రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసి ఆ తర్వాత మ్యుటేషన్ ప్రక్రియను నిర్విరామంగా కొనసాగిస్తుంది. ఒక్క కణంతో మొదలైన ఈ కణాల విభజన అంతకంతకూ పెంచుకుంటూపోయి గడ్డలుగా ఏర్పడుతుంటాయి.
క్యాన్సర్ కణాలను నియంత్రించాలంటే మొదట మ్యూటేషన్ జరగకుండా నియంత్రించాలి. ఒకపక్క మ్యుటేషన్స్‌ని జరగకుండా నియంత్రిస్తూనే మరోపక్క అవి వేరే చోటకి వ్యాప్తిచెందకుండా కట్టడి చేయాలి. ఈ విధంగామోదట క్యాన్సర్ కణాల విభజనను అడ్డకుంటూనే నిర్వీర్యమైన రోగనిరోధక వ్యవస్థని పునరుత్తేజ పరచాలి. ఈ మూడు సక్రమంగా చేయగలిగితే క్యాన్సర్ కణాలను నాశనం చేయడం సులభతరమవుతుంది. ఇలా శరీరంలోని దెబ్బతిన్న మెటబాలిజాన్ని తిరిగి గాడిలో పెట్టాలి. రసాయన ఆయుర్వేదం ప్రధానంగా ఇదే శైలిలో పనిచేసి క్యాన్సర్ నియంత్రణలో దోహదపడుతుంది.
Disclaimer:
This information on this article is not intended to be a substitute for professional medical advice, diagnosis, treatment, or standard medicines. All content on this site contained through this Website is for general information purposes only.






