loading

క్యాన్సర్ వ్యాధికి ప్రత్యామ్నాయ ట్రీట్మెంట్లు

 • Home
 • Blog
 • క్యాన్సర్ వ్యాధికి ప్రత్యామ్నాయ ట్రీట్మెంట్లు
96_ Alternative treatments for cancer

క్యాన్సర్ వ్యాధికి ప్రత్యామ్నాయ ట్రీట్మెంట్లు

alternative-treatment-for-cancer-telugu

 

‘క్యాన్సర్’ అనగానే అందరూ సహజంగా చెప్పేది ఒక్కటే… ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇది అంత సులభంగా లొంగే వ్యాధి కాదని. ఒకవేళ ఏదైనా ట్రీట్మెంట్ కు లొంగినట్టు అనిపించినా కూడా చికిత్స పూర్తయిన తర్వాత ఈ వ్యాధి మళ్ళీ పునరావృతం అవుతుండడం సహజంగానే మనం చూస్తుంటాం.  అలాంటప్పుడు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో ఫలానా ట్రీట్మెంట్ అయితే బాగుంటుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అత్యధిక క్యాన్సర్ బాధితులలో జరిగేది ఇదే. సరైన ట్రీట్మెంట్ ఎంచుకోవడంలోనే క్యాన్సర్ నయమవడమనేది ఆధారపడి ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే క్యాన్సర్ కణాలు విస్తరిస్తుండడంతో ఆ లక్షణాలు మనలో భయాన్ని కలిగించి తొందరగా ఏదో ఒక ట్రీట్మెంట్ వైపు మొగ్గు చూపేలా చేస్తుంటుంది. ఎంత కచ్చితమైన ట్రీట్మెంట్ ఎంచుకున్నామన్నదాని పైనే క్యాన్సర్ తగ్గుముఖం పట్టడమన్నది ఆధారపడి ఉంటుంది.  

 

క్యాన్సర్ ట్రీట్మెంట్లకు రామబాణం

సాధారణంగా క్యాన్సర్ వ్యాధి కంటే వ్యాధి వలన కలిగే గుణాలు శరీరాన్ని మరింత బాధపెడుతూ ఉంటాయి. కొన్ని రకాల వైద్యవిధానాలలో మొదటగా ఈ గుణాలను కనిపించకుండా చేస్తుంటారు. క్యాన్సర్ బాధితులకు అదే పెద్ద ఉపశమనం లాగా అనిపించి ఆ ట్రీట్మెంట్లకే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఆ తరహా ట్రీట్మెంట్లలో గుణాలు వెంటనే అదృశ్యమైపోతూ ఉంటాయి కానీ వ్యాధిమూలాలు మాత్రం అలాగే ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆనుపాన ట్రీట్మెంట్ గా చెప్పబడే ఆయుర్వేద వైద్యానికి ఉపవేదమైన రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ చికిత్సలో అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. రసాయన ఆయుర్వేదం ప్రధానంగా శరీరంలో ఇమ్యునిటీ స్థాయిలను పెంచి అప్పుడు వ్యాధి మూలాలను గురిపెడుతుంది. 

 

దేశమైనా.. దేహమైనా.. రక్షణ వ్యవస్థ తప్పనిసరి        

మానవ శరీరంలో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ రక్షణ కల్పించే పాత్రను ఇమ్యునిటీ అనే ఈ డిఫెన్స్ వ్యవస్థ పోషిస్తుంది. బయటనుంచి శత్రు కణాలు శరీరంలోకి ప్రవేశించకుండా ఈ వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ ఇమ్యునిటీ వ్యవస్థ బలంగా ఉంటే చాలు ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. ఒకవేళ ఏవైనా అనారోగ్యాలు ఎదురైనా కూడా ఈ వ్యవస్థ రక్షణగా నిలిచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాంటిది క్యాన్సర్ కణాలు వంటి బలమైన శత్రుసైన్యం ఎదురైనప్పుడు ఈ వ్యవస్థ ఒక్కోసారి బలహీనపడే అవకాశముంటుంది. అటువంటి పరిస్థితుల్లో రసాయన ఆయుర్వేదం ఈ వ్యవస్థను బలోపేతం చేసి క్యాన్సర్ కణాలకు సైతం ఎదురు నిలుస్తుంది. ఒకపక్క ఇమ్యునిటీని పెంచుతూనే మరోపక్క క్యాన్సర్ కణాలపై సమర్ధవంతంగా పోరాడుతుంది రసాయన ఆయుర్వేదం. అందుకే రసాయన వైద్యాన్ని చక్కటి అనుపానంగా వర్ణిస్తూ ఉంటారు వైద్య నిపుణులు.    

 

అసలు క్యాన్సర్ వ్యాధిని నివారించడానికి అందుబాటులో ఉన్న సమర్ధవంతమైన ట్రీట్మెంట్ ఏమిటి? ప్రత్యామ్నాయ ట్రీట్మెంట్లు ఏమిటి? ఈ వివరాలను ఒకసారి చూద్దాం. 

 

అదేమీ ట్రయల్ రూమ్ కాదు

క్యాన్సర్ ట్రీట్మెంట్లో అత్యంత విశ్వసనీయత ఉన్న ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది రసాయన ఆయుర్వేదం మాత్రమే. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ప్రధానంగా కణాల వ్యవహారశైలిని బట్టి ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించి క్యాన్సర్ బాధితులు కూడా కాలయాపన చేయకుండా వీలైనంత తొందరగా నమ్మకమైన ట్రీట్మెంట్‌ను ఎంచుకుంటే మంచిది. అలా కాకుండా ఇది కాకపొతే అది అనుకుంటూ షోరూంలో బట్టలను ట్రై చేసినట్లు ట్రయల్ వేస్తూ పొతే శరీరంలోని జవసత్వాలు పూర్తిగా క్షీణిస్తాయి. అసాధారణ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. ఒక్కో రకమైన ట్రీట్మెంట్లో ఔషధాలు ఒక్కో రీతిగా పనిచేస్తుంటాయి. వీటిలో క్యాన్సర్ కణాలను కాకుండా వాటి వలన ఏర్పడే గుణాలను తగ్గుముఖం పట్టించే వైద్యా విధానాలు కొన్నైతే ఏమాత్రం ప్రభావం చూపలేని వైద్యాలు కొన్ని. 

 

తప్పు వాళ్ళది కాదు

ఏ ట్రీట్మెంట్ వాడుతున్నా చాలమంది క్యాన్సర్ బాధితులు తమకు తొందరగా నయమవుతుందన్న ఆశతోనే ఉంటుంటారు. ఫలానా మెడిసిన్ వాడితే తొందరగా నయమవుతుందని చెబితే చాలు ఆ మెడిసిన్ వాడుతూ ఉంటారు. మరొకటి వాడితే ఇంకా బాగుంటుందని చెబితే ఆ మెడిసిన్ వైపు మళ్ళుతుంటారు. ఇది నిజంగా వారి తప్పు కాదు. క్యాన్సర్ మహమ్మారిని జయించి ఎలాగైనా బ్రతకాలన్న పట్టుదలే వారిని ఈ నిర్ణయం తీసుకునేలా చేస్తుంటుంది. ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కాంప్లిమెంటరీగానో, ప్రత్యామ్నాయంగానో మరో ట్రీట్మెంట్ వైపు మొగ్గుచూపడానికి ఇదే ప్రధాన కారణం. 

 

అసలేంటి ఈ ఆనుపాన ట్రీట్మెంట్లు

క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఆనుపాన వైద్యాలు వ్యాధికి నేరుగా పరిష్కారం చూపకపోవచ్చు కానీ ఇతరత్రా ట్రీట్మెంట్ల వలన కలిగే దుష్ప్రయోజనాలను నియంత్రించడంలో ఆనుపానవైద్యం ఉపయోగపడుతుంది. ఉదాహరణకి కీమోథెరపీ ట్రీట్మెంట్లో అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిలో తరచుగా నీరసంగా ఉండటం, అలసటగా ఉండటం, ఒళ్ళంతా నొప్పులుగా అనిపించడం, నిద్రలేమి, ఏమి తిన్నా వాంతులవ్వడం, కళ్ళు తిరుగుతుండటం వంటివి సహజంగా మనం గమనించవచ్చు. ఇటువంటి తీవ్ర పరిణామాలకు అద్భుత పరిష్కారాలతో ఉపశమనం కలిగిస్తుంటాయి ఆనుపాన వైద్యాలు. ఇప్పుడైతే అల్లోపతి వైద్యులు కూడా అనుపానంగా ఆయుర్వేదం వైద్యాన్ని వాడమని స్వయంగా బాధితులకు చెబుతున్నారు. ఎందుకంటే  క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కొనే క్రమంలో ఒకరకమైన వైద్యం క్యాన్సర్ కణాలపై నేరుగా పనిచేస్తుంటే అనుపానసహపానాలుగా వాడే వైద్యాలు క్యాన్సర్ కణాలను, వాటివలన కలిగే దుష్ప్రభావాలను కూడా నియంత్రిస్తూ ఉంటాయి. 

 

ఆనుపాన వైద్యాలకు కొన్ని ఉదాహరణలు:

ఆందోళనగా ఉన్నప్పుడు హిప్నోసిస్, మసాజ్, ధ్యానం, సంగీతం వినడం వంటి విధానాలను అనుసరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అలసటగా ఉన్నప్పుడు యోగా చేయడం, విశ్రాంతి తీసుకోవడం వికారంగా ఉండి వాంతులు అవుతున్నప్పుడు, విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు, ఒత్తిడిగా ఉన్నట్లు అనిపించినప్పుడు ఆక్యుపంచర్,హిప్నోసిస్, సంగీతం వినడం వంటివి చేస్తే చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఆక్యుపంచర్ అనేది శరీరానికి నొప్పిని కలిగిస్తుంది కాబట్టి దీనిని హఠయోగంగా పరిగణిస్తుంటారు. అలాగే అరోమాథెరపీలో కూడా చర్మంపై సువాసనలు కలిగిన నూనెలను ఉపయోగించి సుతిమెత్తగా మర్దనా చేయడం ద్వారా త్రిదోషాల్లో ప్రకోపాలను శాంతింపజేయవచ్చు. హిప్నోసిస్ ద్వారా లోతైన ధ్యానం చేస్తూ కూడా కొన్ని అవరోధాలను అధిగమించవచ్చు. మరికొంతమంది వైద్యులు అయితే కొన్ని రకాల ట్రీట్మెంట్లకు మసాజ్ చేస్తే ఉపశమనం కలుగుతుందని సూచిస్తూ ఉంటారు. యోగా, ధ్యానం, సంగీతం వినడం కూడా అనేక సమస్యలకు పరిష్కారంగా చెబుతుంటారు వైద్యులు. 

 

క్యాన్సర్లకు అసలైన పరిష్కారం 

ఇవి క్యాన్సర్ ట్రీట్మెంట్లో అనుపానంగా వాడటానికి ఉపయోగించే కొన్ని అనుపానాలు. వీటివలన కనీస ప్రయోజనాలు ఏమీ లేకపోయినా కూడా వీటిని అనుసరించమని సూచిస్తూ ఉంటారు కొందరు వైద్యులు. ఇవన్నీ ఒక ఎత్తైతే రసాయన ఆయుర్వేదం ఒక్కటీ ఒక ఎత్తు. రసాయన ఆయుర్వేదంలోని శక్తివంతమైన రసౌషధాలు క్యాన్సర్ కణాలను నేరుగా నియంత్రించడంతో పాటు ఇతర ట్రీట్మెంట్ల వలన కలగే దుష్ప్రభావాలను కూడా అదుపులో ఉంచుతాయి. అందుకే రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ ట్రీట్మెంట్లో విశిష్టమైన విశ్వసనీయత కలిగి ఉంది.  

Also Read: హర్మోనల్ ఇంబ్యాలెన్స్ ను నివారించే 5 యోగా ఆసనాలు

Book Appointment


  Follow On Instagram

  punarjan ayurveda hospital logo

  Punarjan Ayurveda

  16k Followers

  We have a vision to end cancer as we know it, for everyone. Learn more about cancer Awareness, Early Detection, Patient Care by calling us at +(91) 80088 42222

  Call Now