loading

కాస్మెటిక్స్( Cosmetics )తో క్యాన్సర్ వస్తుందా !

 • Home
 • Blog
 • కాస్మెటిక్స్( Cosmetics )తో క్యాన్సర్ వస్తుందా !
cosmetics cause cancer

కాస్మెటిక్స్( Cosmetics )తో క్యాన్సర్ వస్తుందా !

కాస్మెటిక్స్ ( Cosmetics ) : క్యాన్సర్ 

అతివలంటే అందం, అందమంటే అతివలు. ఐతే పూర్వకాలంలో  అత్మ సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తే ఈరోజుల్లో  బాహ్య సౌందర్యం కోసం వెంపర్లాడుతూ ఎన్నో సౌందర్య సాధనాలు వాడుతున్నారు. కెమికల్స్ తో తయారు చేసే కాస్మెటిక్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయని, గమనించాలి. కాస్మెటిక్స్ ( Cosmetics )తో క్యాన్సర్ వస్తుందా అనే అంశం గురుంచి తెలుసుకుందాం.

 

2022లో యుయస్  కాస్మెటిక్ పరిశ్రమ యొక్క ఆదాయం దాదాపు 49 బిలియన్ యుయస్. డాలర్లుగా అంచనా వేయబడింది. 2024 సంవత్సరం కల్లా, కాస్మెటిక్స్ వ్యాపారం  లో చలామణి అయ్యే ధనం అక్షరాలా 863 బిలియన్ డాలర్లు. వాణిజ్య రంగ అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ స్థాయిలో కాస్మెటిక్స్ వాడకం ఉంది అంటే అవి దాదాపుగా నిత్యావసర వస్తువల వలె వినియోగిస్తున్నారు. మరి ఇవి ఎంతవరకు సేఫ్ అని ఆలోచిస్తే  కాస్మెటిక్స్  వలన క్యాన్సర్ వస్తుందని మీకు తెలుసా!

 

ముఖ్యంగా మహిళలు  చర్మ సౌందర్యం  కోసం వాడే క్రీములు, లోషన్లు, పర్ ఫ్యూమ్స్, డియోడ్రంట్స్ , షాంపూలు, నెయిల్  పోలిష్, నిత్యం  పెదవులకు  వేసుకునే లిప్ స్టిక్స్, వీటన్నిటిలో హానికారక టాగ్జిన్స్,  కెమికల్స్, కార్సినోజెన్స్  ఉంటాయి. వీటి వాడకం శరీరానికి హాని చేస్తాయి  అల్లర్జీలు, సంతానలేమి నుండి స్కిన్ క్యాన్సర్ వరకు ప్రాణాంతక  దీర్ఘకాలిక వ్యాధులకు గురి చేస్తున్నాయి. కాస్మెటిక్స్ తయారీ లో వాడే  బెంజీన్, ఫార్మల్డిహైడ్స్, భారీ లోహాలు, కోల్ తారు, పారబెన్స్, ఇవన్నీ కార్సినోజెన్స్, అంటే  క్యాన్సర్  కారకాలు.

స్కిన్ క్యాన్సర్

దాదాపుగా  70 శాతం  కాస్మెటిక్స్  లో  ఎదో ఒక  హానికారక కెమికల్ ఉంటుంది, వాటిలో ఒకటి  బెంజీన్ . ఇది   పెట్రోలియం లో కానవస్తుంది. సిగరెట్ పొగ, గ్యాసోలిన్, డిటర్జెంట్లు మరియు పెయింట్‌లో కూడా కనుగొనబడుతుంది. ఇదే బెంజీన్ కాస్మెటిక్స్ లో కూడా వాడుతున్నారు అంటే ఎంత ప్రమాదకరమో  ఆలోచించండి. ఇది చర్మం మరియు జీర్ణవ్యవస్థ ద్వార గ్రహించబడుతుంది. బెంజీన్ ఆరోగ్యం పైన భయానక దుష్ప్రభావం చూపుతుంది.  సాధారణ శ్వాస సమస్య నుండి కేంద్ర నాడీ వ్యవస్థను డిప్రెస్ చేసే లక్షణం కలిగి  ఉంటుంది. అలాగే స్కిన్ క్యాన్సర్, లుకేమియా వంటి క్యాన్సర్లకు  గురి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

2010 వరల్డ్ హెల్త్ అర్గనైజేషణ్  నివేదిక ప్రకారం, బెంజీన్ యొక్క జీవక్రియలు నష్టాన్ని కలిగిస్తాయి. బెంజోక్వినోన్, బెంజీన్ ఆక్సైడ్ మరియు మ్యూకోనాల్డిహైడ్, ప్రత్యేకించి, ఎముక మజ్జలోకి ప్రవేశించి DNA క్రోమోజోమ్‌లను డిస్టర్బ్ చేస్తాయి.సెల్ డామేజ్ చేసి క్యాన్సర్ కు దారితీస్తాయి.

బ్లీచింగ్

అలాగే చర్మం నిగారింపు కోసం వాడే  బ్లీచింగ్ ప్రాడక్ట్స్ లో హైడ్రోక్వినోన్ ఉంటుంది ఇది  పెయింట్ స్ట్రిప్పర్‌కి సమానమైనదిగా  చెప్పబడినది.  ఈ హైడ్రోక్వినోన్ చర్మం పై పొరను తొలగించి, చర్మ క్యాన్సర్  ప్రమాదాన్ని పెంచుతుంది.

వీటితో పాటు హయిర్ స్త్రేయిట్నర్ ,లిప్స్టిక్స్ లో ని ఫార్మాల్ది హైడ్. టాల్కం పౌడర్ తయారీ లోపం వల్ల కలిగే  ఆస్బెస్టాస్ ఇవన్నీ స్కిన్ క్యాన్సర్ ,, సర్వైకల్ క్యాన్సర్,బ్రెస్ట్ క్యాన్సర్ లుకెమియా కు దారితీస్తాయని ఆరోగ్య సంస్థలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

 

కాబట్టి వీలైనంత వరకూ సహజ సౌందర్యం పెంచుకోడానికే . ప్రాధాన్యత ఇవ్వాలి.  ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్న  సహజ సౌందర్య సాధనలు వినియోగించితే అందం ఆరోగ్యం రెండూ మీ సొంతమవుతాయి.

Also Read: టాప్ 8 క్యాన్సర్ ఫైటింగ్ ఫుడ్స్

 

Book Appointment


  Follow On Instagram

  punarjan ayurveda hospital logo

  Punarjan Ayurveda

  16k Followers

  We have a vision to end cancer as we know it, for everyone. Learn more about cancer Awareness, Early Detection, Patient Care by calling us at +(91) 80088 42222

  Call Now