loading

ఆయుర్వేదంలోని నిర్దిష్ట ఆహారపు అలవాట్లు క్యాన్సర్ నివారణలో సహాయపడతాయా?

  • Home
  • Blog
  • ఆయుర్వేదంలోని నిర్దిష్ట ఆహారపు అలవాట్లు క్యాన్సర్ నివారణలో సహాయపడతాయా?
Can specific dietary habits in Ayurveda help in cancer prevention

ఆయుర్వేదంలోని నిర్దిష్ట ఆహారపు అలవాట్లు క్యాన్సర్ నివారణలో సహాయపడతాయా?

Can specific dietary habits in Ayurveda help in cancer prevention

 

ఈ భూమి మీద జీవించడానికి ఆహరం అనేది తప్పనిసరి. అందులోను వ్యాధులను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహరం చాలా ముఖ్యం. 

ఆయుర్వేదంలోని నిర్దిష్ట ఆహారపు అలవాట్లు క్యాన్సర్ నివారణలో సహాయపడతాయి. ఆయుర్వేదం ప్రకారం శరీరం యొక్క సమతుల్యత దెబ్బతినడం వల్ల క్యాన్సర్ కలుగుతుందని భావిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా, శరీరం ఆరోగ్యంగా మరియు సమతుల్యంగా ఉండేలా చేయడం ద్వారా క్యాన్సర్‌కు కారణమయ్యే అసమతుల్యతను నివారించడంలో సహాయపడుతుంది.

 

ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత:

 

240 F 92068938 OTdz0IAEAyDB3RFY32vaijjLL3ZhTmGh

 

ఆయుర్వేదం అనేది భారతదేశంలో సుమారు 5,000 సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందిన ఒక పురాతన వైద్య వ్యవస్థ. ఇది “ఆయుష్” అనే సంస్కృత పదం నుండి వచ్చింది, దీని అర్థం “ఆయుష్షు” లేదా “ఆయుర్దాయం”. ఆయుర్వేదం శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడటం మరియు మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది.

 

ఆయుర్వేద వైద్య విధానం సహజమైన కొన్ని రకాల చికిత్సా విధానాలను  ఉపయోగిస్తుంది. అవి ఏమిటంటే, ఔషధం, ఆహారం, యోగా, ధ్యానం మరియు జీవనశైలిలోని మార్పులు. ఆయుర్వేద ఔషధాలు సాధారణంగా ప్రకృతిలో సహజంగా లభించే మూలికలు మరియు ఖనిజాలతో తయారు చేయబడతాయి. ఆయుర్వేద ప్రకారం, ఆరోగ్యకరమైన ఆహారం శరీరంలోని దోషాలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే యోగా మరియు ధ్యానం శరీరం మరియు మనస్సును శాంతపరచడంలో మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా జీవనశైలిలో  మార్పులు అనగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు తగినంత నిద్రపోవడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

 

ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త మరియు కఫ అనే మూడు దోషాలు ఉంటాయి. మన ఆరోగ్యం ఈ మూడు ప్రధాన దోషాల యొక్క సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. 

 

ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలోని దోషాలు:

 

548b2b 018d3bcebe3d4ef2994edbe67f5f75e2mv2

 

వాత దోషం: 

 

వాత దోషం అనేది ఆయుర్వేదంలోని మూడు ప్రధాన దోషాలలో ఒకటి. ఇది శరీరంలోని  వాయు దోషం. ఇది జీర్ణక్రియ, శ్వాసక్రియ, కదలిక మరియు మెదడు యొక్క పనితీరుకి బాధ్యత వహిస్తుంది.

వాత దోషం సమతుల్యంగా ఉంటే, జీర్ణక్రియ, శ్వాసక్రియ, కండరాల ఆరోగ్యం మరియు మెదడు యొక్క పనితీరుకి మెరుగుపరుస్తుంది.  

కాకపోతే వాత దోషం అధికంగా ఉండటం వల్ల అది అనారోగ్యానికి దారితీస్తుంది. వాత దోషం అధికంగా ఉండటం వల్ల కలిగే కొన్నిసమస్యలు:

  • అలసట
  • డయేరియా 
  • మలబద్ధకం
  • కడుపు నొప్పి
  • జలుబు
  • జ్వరం
  • ఇన్ఫ్లమేషన్.

పిత్త దోషం:

 

పిత్త దోషం అనేది శరీరంలోని అగ్ని దోషం. ఇది జీర్ణక్రియ, జీవక్రియ మరియు రోగనిరోధక వ్యవస్థ యొక్క ఆరోగ్యానికి సంబందించినది. 

పిత్త దోషం సమతుల్యంగా లేకపోవడం వల్ల ఈ సమస్యలకు కలగవచ్చు.

  • జ్వరం
  • దురద
  • చర్మ వ్యాధులు
  • అతిసారం
  • మలబద్ధకం
  • ఇన్ఫ్లమేషన్
  • కోపం
  • చిరాకు

కఫ దోషం:

 

కఫ దోషం అనేది ఆయుర్వేదంలోని మూడు ప్రధాన దోషాలలో ఒకటి. ఇది శరీరంలోని జల దోషం. ఇది శరీరం యొక్క పోషణ మరియు ఉష్ణోగ్రత  నియంత్రణ పై  బాధ్యత వహిస్తుంది.

కఫ దోషం సహజంగానే శరీరంలో ఉంటుంది. కాకపోతే ఈ దోషంలో అసమతుల్యత ఏర్పడటం వల్ల అది అనారోగ్యానికి దారితీస్తుంది. 

కఫ దోషం అసమతుల్యత వల్ల ఈ సమస్యలు కలగవచ్చు:

 

  • అలసట
  • డయేరియా 
  • మలబద్ధకం
  • కడుపు నొప్పి
  • జలుబు
  • జ్వరం
  • శ్వాసకోశ వ్యాధులు
  • మెదడు యొక్క పనితీరు మందగించడం. 

ఈ మూడు దోషాలు సమతుల్యంగా ఉన్నప్పుడు, మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాకపోతే ఈ దోషాలలో అసమతుల్యత ఏర్పడటం వల్ల అనారోగ్యానికి దారితీయవచ్చు. 

 

క్యాన్సర్ నివారణకు ఆయుర్వేద విధానం:

 

ఆయుర్వేదం ప్రకారం, క్యాన్సర్‌తో సహా ఏదైనా వ్యాధి నివారణ అనేది శరీరంలోని వాత, పిత్త మరియు కఫ దోషాలను సమతుల్యం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు ఈ దోషాలలో అసమతుల్యత వ్యాధులకి కారణమవుతుందని నమ్ముతారు. క్యాన్సర్‌ను నివారించడానికి ఇది రోగనిరోధక శక్తిని మెరుగు పరచడం, మరియు శరీరాన్ని డీటాక్స్ చేయడం వంటి వాటిని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది.

 

ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఆయుర్వేదం యొక్క సూత్రాలు: 

 

ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మరియు వ్యాధులను నివారించడానికి ఆహారం అనేది చాలా ప్రాముఖ్యమైనదని ఆయుర్వేదం నొక్కి చెబుతుంది. ఆహారం అనేది వ్యక్తి యొక్క దోశంపై ఆధారపడి ఉంటుంది. దోష అనుగుణంగా  తాజా, ఆహారం, సేంద్రీయ మరియు కాలానుగుణ ఆహారాలు ఉంటాయి. ఇవి తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క వినియోగాన్ని ప్రోత్సహిస్తాయి.  ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, శుద్ధి చేసిన చక్కెరలు మరియు అనారోగ్యకరమైన కొవ్వులను నివారించాలి. 

 

ఆయుర్వేదం ప్రకారం మూడు దోషాలు సమతుల్యంగా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. కాకపోతే వీటిలో అసమతుల్యత ఏర్పడితే అవి అనారోగ్యానికి దారితీస్తాయి. అందువల్ల వీటిని సమతుల్యంలో ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ మూడు దోషాలను సమతుల్యం చేసే నిర్దిష్ట ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

 

వాత దోషాన్ని సమతుల్యం చేయడానికి తీసుకోవాల్సిన నిర్దిష్ట ఆహరాలు: 

 

తృణధాన్యాలు: తృణధాన్యాలలో గోధుమ, చిరుధాన్యాలు, ఓట్స్ మరియు జొన్న వంటి ఆహరాలు వాత దోషానికి సిఫార్సు చేయబడినవి. 

కూరగాయలు: కూరగాయాల్లో ఆకుపచ్చ బీన్స్, క్యారెట్లు,బెండకాయ , బీట్‌రూట్, తోటకూర, చిలగడదుంపలు మరియు ముంగ్ బీన్స్. వీటిని ఉడికించి వెచ్చగా తినాలి. బ్రోకలీ వంటి గ్యాస్ ఏర్పడే కూరగాయలు వంటివి మానుకోవడం ఉత్తమమని అధ్యయనాలు చెబుతున్నాయి.

సుగంధ ద్రవ్యాలు: అన్ని సుగంధ ద్రవ్యాలు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, మిరియాలు, మిరప, మరియు పసుపు వంటివి తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.

పండ్లు మరియు నట్స్: పండ్లలో అరటిపండ్లు, కొబ్బరి, ఆపిల్, ద్రాక్ష, మామిడి, పుచ్చకాయ, నారింజ, బొప్పాయి, పైనాపిల్, రేగు, బెర్రీ, చెర్రీ, నేరేడు పండు, అవోకాడో, మరియు బాదం, వాల్‌నట్ మరియు జీడిపప్పు వంటివి తీసుకోవచ్చు. 

పాల ఉత్పత్తులు: ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పనీర్ ప్రయోజనకరమైనవి. ఇవి అధిక కొవ్వులను కలిగి ఉంటాయి కనుక వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి. 

వంట కోసం నువ్వుల, కొబ్బరి, బాదం నూనె లేదా నెయ్యి వంటి వాత పసిఫైయింగ్ నూనెలను ఉపయోగించవచ్చు. హైడ్రేటెడ్‌గా ఉండి, ఫిల్టర్ చేసిన వెచ్చని లేదా వేడి నీటిని తాగండి. హెర్బల్ టీస్ కూడా వాత దోషానికి మంచివి.

 

పిత్త దోషాన్ని సమతుల్యం చేయడానికి తీసుకోవాల్సిన నిర్దిష్ట ఆహరాలు: 

 

పండ్లు మరియు కూరగాయలు: పింక్ ఫ్రూట్స్, యాపిల్స్, బెర్రీలు, పుచ్చకాయ, క్యారెట్లు, బీట్రూట్లు, క్యాబేజీ, మరియు బ్రోకలీ వంటి పండ్లు మరియు కూరగాయలు పిత్త దోషాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 

 

చిక్కుళ్ళు మరియు ధాన్యాలు: చిక్కుళ్ళు, బఠానీలు, పప్పులు, గోధుమ, బార్లీ, మరియు ఓట్స్ వంటి చిక్కుళ్ళు మరియు ధాన్యాలు పిత్త దోషాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 

పాలు మరియు పాల ఉత్పత్తులు: పాలు మరియు పాల ఉత్పత్తులు పిత్తాన్ని తగ్గించడంలో సహాయపడే కాల్షియం మరియు ప్రోటీన్‌లో సమృద్ధిగా ఉంటాయి. పిత్త దోషం ఉన్న వ్యక్తులకు ఉత్తమమైన పాల ఉత్పత్తులు పాలు,పెరుగు మరియు మజ్జిగ. 

పిత్త దోషాన్ని తగ్గించడానికి సహాయపడే కొన్ని ఆహారాలను నివారించడం కూడా ముఖ్యం. అందులో ముఖ్యంగా మిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొబ్బరి, మాంసం, మరియు కెఫిన్ వంటివి కీలకం. 

 

కఫ దోషాన్ని సమతుల్యం చేయడానికి తీసుకోవాల్సిన నిర్దిష్ట ఆహరాలు: 

 

పండ్లు: కఫ దోషాన్ని సమతుల్యం చేయడానికి నారింజ, నిమ్మ, ద్రాక్ష, కమలా, బొప్పాయి, జామ, దానిమ్మ, చెర్రీలు మొదలైన పండ్లు సహాయపడతాయి.

కూరగాయలు: క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, టమాటా, మిరియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి మొదలైన కూరగాయలు శరీరంలో కఫాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ధాన్యాలు: ఇక ధాన్యాలలో ఓట్స్, ఓట్మీల్, బార్లీ, సోయాబీన్, కంది మొదలైన ధాన్యాలు కఫాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

పప్పులు: శనగలు, పెసలు, బఠానీలు, మినప్పప్పు మొదలైన పప్పులు కఫాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

నట్స్ మరియు సీడ్స్: బాదం, జీడిపప్పు, వాల్‌నట్, పిస్తా పప్పు, మొదలైన నట్స్ మరియు సీడ్స్ కఫాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

సుగంధ ద్రవ్యాలు: అల్లం, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు కఫాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

కఫ దోషాన్ని తగ్గించడానికి, ఈ ఆహారాలను తగిన మోతాదులో తీసుకోవాలి. అలాగే, వేడిగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. కఫ దోషం ఉన్నవారు చల్లని ఆహారాలు, పానీయాలు మరియు పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఆరోగ్యంగా ఉంటానికి నివారించవలసిన ఆహారాలు:

 

చక్కెర పానీయాలు మరియు అధికంగా ప్రాసెస్డ్ ఆహారాలు తగ్గించాలి.

 

చక్కెర పానీయాలు మరియు అధికంగా ప్రాసెస్డ్ ఆహారాలు ఎక్కువగా ఉండే ఆహారం ఊబకాయానికి కారణం అవుతుంది, ఇది కొన్ని క్యాన్సర్లకు రిస్క్ ఫ్యాక్టర్. బ్యాలేన్సుడ్ డైట్ మరియు శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం క్యాన్సర్ నివారణకు ముఖ్యమైనది.

 

చక్కెర పానీయాలు మరియు అధికంగా ప్రాసెస్డ్ ఆహారాలు క్యాన్సర్ ప్రమాదంగా మారటానికి కారణాలు:

 

షుగర్ డ్రింక్స్ మరియు ప్రాసెస్ చైసిన ఆహారాలు: సోడాలు, కృత్రిమ చక్కెర కలిపిన పండ్ల రసాలు మరియు ఎనర్జీ డ్రింక్స్ వంటి పానీయాలు తాగడం వల్ల బరువు పెరుగటం మరియు ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల ఎటువంటి ముఖ్యమైన పోషకాలను అందించకపోవడమే కాకుండా కేలరీలను కూడా పెంచుతుంది.  ఇక ప్రాసెస్ చేసిన ఆహరాలకు దూరంగా ఉండటం మేలు. ఎందుకంటే వీటిలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. తద్వారా ఊబకాయం కలిగే అవకాశం ఉంటుంది. ఊబకాయం అనేది స్త్రీ జననేంద్రియ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మరియు ఇతర క్యాన్సర్లతో సహా అనేక రకాల క్యాన్సర్‌లకు ప్రమాద కారకం.

 

ఊబకాయం మరియు క్యాన్సర్ ప్రమాదం: సంపూర్ణ ఆరోగ్యం కొరకు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం చాలా ముఖ్యం మరియు క్యాన్సర్ నివారణలో బరువు కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఊబకాయం దీర్ఘకాలిక  ఇన్‌ఫ్లమేషన్ మరియు హార్మోన్ స్థాయిలలో మార్పులతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్లకి దారితీస్తుంది. 

 

ఆయుర్వేదం ప్రకారం మూడు దోషాలను సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం చాలా కీలకం.ఈ దోషాలలో అసమతుల్యత వల్లనే సాధారణ జలుబు నుండి క్యాన్సర్ వరకు అనేకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కో వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి దోషం మారుతుంటుంది. కనుక మీ శరీరం తత్వాన్ని బట్టి మీ దోషాన్ని తెలుసుకుని ఆయుర్వేద నిపుణుల సలహాల మేరకు ఈ నియమాలను పాటించడం మరచిపోవద్దు.  

 

https://marishafoodcoach.in/10-latest-ayurvedic-foods-for-cancer-prevention-no-chemo-and-radiation/ 

https://te.drvaidyas.com/pages/vata-dosha 

 

Book Appointment

    Follow On Instagram

    punarjan ayurveda hospital logo

    Punarjan Ayurveda

    16k Followers

    We have a vision to end cancer as we know it, for everyone. Learn more about cancer Awareness, Early Detection, Patient Care by calling us at +(91) 80088 42222

    Call Now