loading

నిద్రనిచ్చే మెలటోనిన్ కోసం కేవలం మీ గదిలో వెలిగే  లైట్ కలర్ మార్చండి చాలు !

 • Home
 • Blog
 • నిద్రనిచ్చే మెలటోనిన్ కోసం కేవలం మీ గదిలో వెలిగే  లైట్ కలర్ మార్చండి చాలు !
For sleep-inducing melatonin

నిద్రనిచ్చే మెలటోనిన్ కోసం కేవలం మీ గదిలో వెలిగే  లైట్ కలర్ మార్చండి చాలు !

For sleep-inducing melatonin

 

ఈ రోజుల్లో సరిగ్గా నిద్ర రావడమే వరమని అనుకునే వాళ్ళు ఇంకా మన మధ్యలోనే ఉన్నారు. 

 

మనిషికి నిద్ర అనేది ఒక సహజ ప్రక్రియ. ఇక అలాంటి ఒక న్యాచురల్ ప్రాసెస్ కూడా సరిగ్గా జరగక ఇబ్బంది పడుతున్నారంటే అది ఆలోచించాల్సిన విషయమే.

 

ఈ నిద్ర మన ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపుతుంది. సరైన నిద్ర అనేది మన జీవితంలో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంలో సహాయం చేస్తుంది. అదే ఒకవేళ నిద్ర సరిగ్గా లేకుంటే దీర్ఘ కాలంలో  లెక్కలేనన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. 

 

మరి సరిగ్గా నిద్ర పట్టాలంటే ఎం చేయాలి ? అని నిద్ర పట్టని ప్రతీ ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఇంటర్నెట్ లో వెతికే ఉంటారు, రకరకాల చిట్కాలను ట్రై చేసి కూడా ఉంటారు. 

 

కానీ అవన్నీ అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. 

 

మరిప్పుడెం చేయాలి అంటారా ?

 

ఒక సింపుల్ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి చాలు! ఇది మీకు పని చేయొచ్చు.

 

అదేంటంటే మీ ఇంట్లో నైట్ టైం వేసుకునే లైట్ అనేది తెలుపు రంగు కాకుండా ఎరుపు లేదా ఆరెంజ్ కలర్ ఉండేలా చూసుకోండి. మీరు పడుకునే ముందు ఒక గంట సేపు మీ రూమ్ లో ఈ రెడ్ కలర్ లైట్ ని వేసి ఉండండి. ఇదే నిద్ర కోసం అందరూ చేయగలిగే సింపుల్ ట్రిక్ !

 

ఇదేం వింత ట్రిక్ అనుకోకండి.

 

దీని వెనక సైంటిఫిక్ గా ఒక బలమైన కారణం ఉంది.

 

మనకు నిద్రను ఇచ్చే హార్మోన్ ను మెలటోనిన్ అంటాం. ఈ హార్మోన్ అనేది మన ఇరవై నాలుగు గంటల రోజులో సర్కేడియన్ రిధం ను అనుసరించి, సాయంకాలం నుండి మనలో విడుదల అవ్వడం మొదలవుతుంది. చాలా మందికి నిద్ర పట్టకపోవడానికి కారణం ఈ మెలటోనిన్ హార్మోన్ సరిగ్గా విడుదల అవ్వకపోవడమే !

 

ఇక అసలు విషయానికి వస్తే ఈ మెలటోనిన్ అనే హార్మోన్ మనం ఎరుపు రంగు కాంతి లో ఉన్నప్పుడు ఎక్కువగా విడుదల అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సింపుల్ గా మన సాయంత్రం సూర్యాస్తమయం కూడా ఎరుపు వర్ణం లోనే ఉంటుంది కదా. సైంటిఫిక్ గా కూడా సరైన నిద్ర కోసం ఈ  రెడ్ లైట్ థెరపీ ని ఇరవై మంది అథ్లెట్ల పై ముప్పై నిమిషాలు ఈ ఎరుపు రంగు కాంతిలో రాత్రి ఉండే లాగా ఒక పద్నాలుగు రోజుల పాటూ పరిశోధన చేసారు. అందులో రిజల్ట్ గా వారి మెలటోనిన్ లెవల్స్, నిద్ర నాణ్యత చాలా పెరిగాయి.

 

ఈ ఎరుపు రంగు కాంతిలో రాత్రి పడుకోవడం వల్ల  మనం ఉదయం నిద్ర లేచాక తల బరువుగా అనిపించడానికి కారణం అయ్యే  స్లీప్ ఇనర్షియా అనేది తగ్గుతుందట. ఇంకో విషయం ఏంటంటే ఈ రెడ్ లైట్ థెరపీ మన ఆరోగ్యంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించే గట్ బ్యాక్టీరియా పై కూడా మంచి ప్రభావం చూపుతుందట.

 

ఈ సారి వైట్ లైట్ బదులు మీ ఇంట్లో పడుకునే ముందు ఒక గంట సమయం ఈ ఎరుపు వర్ణపు కాంతి ఇంట్లో  ఉండేలా చూడండి. మీ నిద్ర విషయంలో మంచి మార్పును మీరూ గమనించవచ్చు. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలు తెలుసుకోవటానికి పునర్జన్ ఆయుర్వేద బ్లాగ్ ను ఫాలో అవ్వండి.

Book Appointment


  Follow On Instagram

  punarjan ayurveda hospital logo

  Punarjan Ayurveda

  16k Followers

  We have a vision to end cancer as we know it, for everyone. Learn more about cancer Awareness, Early Detection, Patient Care by calling us at +(91) 80088 42222

  Call Now