loading

క్యాన్సర్ ను నివారించే క్రుసిఫరస్ కూరగాయలు

  • Home
  • Blog
  • క్యాన్సర్ ను నివారించే క్రుసిఫరస్ కూరగాయలు
Cruciferous Vegetables Vs Cancer

క్యాన్సర్ ను నివారించే క్రుసిఫరస్ కూరగాయలు

Cruciferous vegetables that prevent cancer

 

క్యాన్సర్ కారకాలలో ఆహారపు అలవాటు కూడా ఒకటి. మనం తీసుకునే ఆహరంలో అధికమైన చెక్కరలు, కొవ్వులు ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు అలాగే పోషక రహిత ఆహారాలు ఉండటం వల్ల ఇవి పరోక్షంగా క్యాన్సర్ కి కారణమవుతున్నాయి. 

అందువల్ల మన ఆహారంలో తక్కువ కొవ్వులు, చెక్కరలు అలాగే పోషకాలు ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. ముఖ్యంగా  మనం నిత్యం వండుకునే కూరాగాయాల్లో కొన్ని క్యాన్సర్ ను నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 

 

మన ఇంట్లో ప్రతీరోజూ రకరకాల కూరగాయలను తెచ్చుకుంటుంటాం. కాని మనం తెచ్చుకునే కురాయగాలలో సగం దేనికొరకు ఉపయోగిస్తున్నామో కూడా మనకి తెలియకపోవచ్చు. అలాంటివే ఈ క్రుసిఫరస్ కూరగాయలు. క్రుసిఫరస్ కూరగాయలు అనేవి బ్రాసికేసి కుటుంబానికి చెందినవి. 

 

క్రుసిఫరస్ కురగాయలంటే ఏమిటి..?

 

cruciferous vegetables

 

బ్రోకలీ, కాలీఫ్లవర్, కాలే, ఆవాలు, టర్నిప్స్, క్యాబేజీ మొదలలైనవి ఈ క్రుసిఫరస్ కూరగాయల జాతికి చెందినవే. 

 

చాలమంది క్యాబేజ్, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయాలను పెద్దగా ఇష్టపడరు. కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని మన ఆహరంలో చేర్చుకోవడం వల్ల అనేకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి దీర్ఘకాలీక వ్యాధులను కూడా నివారించవచ్చు. 

 

క్రుసిఫరస్ కురాగాయాల్లో ఉండే పోషక విలువలు:

 

క్రుసిఫరస్ కూరగాయలలో గ్లూకోసినోలేట్‌లు ఉంటాయి. ఈ గ్లూకోసినోలేట్స్ బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా మన కణాలకు నష్టం జరగకుండా వాటిని రక్షించడంలో సహాయపడతాయి.

అలాగే వీటిలో బీటా-కెరోటిన్, లూటిన్, మరియు జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. మరియు విటమిన్లు సి, ఇ మరియు కె ఉంటాయి వీటితోపాటు మినరల్స్‌తో కూడా పుష్కలంగా ఉంటాయి.      

 

క్రుసిఫరస్ కూరగాయల గురించి అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..?

 

క్రుసిఫరస్ కూరగాయలలో గ్లూకోసినోలేట్‌లు అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి సల్ఫర్ తో నిండిన కెమికల్స్. క్రుసిఫరస్ కూరగాయలు వండేటప్పుడు గాని, నమిలేటప్పుడు లేదా జీర్ణక్రియ సమయంలో గాని ఇందులో ఉండే  గ్లూకోసినోలేట్‌లు ఇండోల్స్, నైట్రిల్స్, థియోసైనేట్‌లు మరియు ఐసోథియోసైనేట్‌లు వంటి యాక్టివ్ కాంపౌండ్స్ ని ఏర్పరుస్తాయి. ముఖ్యంగా ఇండోల్స్ మరియు ఐసోథియోసైనేట్‌లు యాంటీ క్యాన్సర్ ప్రభావాలను కలిగి ఉంటాయి. 

 

మూత్రాశయం, రొమ్ము, పెద్ద పేగు, కాలేయం , ఊపిరితిత్తులు మరియు స్టమక్ క్యాన్సర్ ఉన్న ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఇండోల్స్ మరియు ఐసోథియోసైనేట్‌లు, ఎలుకల అవయవాలలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడానికి ఉపయోగపడే సామర్థ్యం ఈ సమ్మేళనాలల్లో ఉన్నట్టు గుర్తించారు.

 

క్యాన్సర్ ని నివారించడానికి ఈ క్రింది సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 

 

  • DNA దెబ్బతినకుండా కణాలను రక్షించడంలో ఇవి సహాయపడతాయి.
  • అలాగే ఇవి క్యాన్సర్ కారకాలను ఇన్ యాక్టివ్ చేయడంలో సహాయపడతాయి.
  • దాంతోపాటు ఇవి యాంటీవైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉంటాయి.
  • అంతేకాకుండా ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ  ప్రభావాలను కలిగి ఉంటాయి.
  • ముఖ్యంగా క్యాన్సర్ కణాల మరణాన్ని(అపోప్టోసిస్) ప్రేరేపిస్తాయి.
  • మరియు క్యాన్సర్ కణితుల్లో కొత్త రక్తనాళాల నిర్మాణాన్ని  (యాంజియోజెనిసిస్) మరియు క్యాన్సర్ కణాల వ్యాప్తిని (మెటాస్టాసిస్‌కు) నిరోధిస్తాయి.

 

కాకపోతే  మనుషులపై చేసిన అధ్యయనాలలో ఇవి మిశ్రమ ఫలితాలను చూపించాయి.

 

క్రుసిఫరస్ కూరగాయలకి మరియు క్యాన్సర్ కి మధ్య ఉన్న సంబంధం: 

 

క్రుసిఫరస్ కూరగాయాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ యొక్క ప్రమాదాన్ని తగ్గించడానికి మధ్య ఉన్న సంబంధంపై పరిశోధకులు కొన్ని పరిశోధనలు జరిపారు. 

 

ప్రొస్టేట్ క్యాన్సర్: ప్రోస్టేట్ అంటే ప్రోస్టేట్ గ్రంధిలో అసాధారణ కణాలు ఏర్పడి క్యాన్సర్ గడ్డగా అభివృద్ధి చెందడం. నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ మరియు యూరప్ లో క్రూసిఫెరస్ కూరగాయల యొక్క రోజువారీ వినియోగంపై పరిశోధనలు చేశారు. ఇందులో ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క ప్రమాదానికి ఎటువంటి సంబంధం కనుగొనబడలేదు. కాకపోతే, కొన్ని కేస్-కంట్రోల్ అధ్యయనాలు ఎక్కువ మోతాదులో క్రూసిఫెరస్ కూరగాయలను తినే వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని తేలిపింది. 

 

కొలరెక్టల్ క్యాన్సర్: మన జీర్ణ వ్యవస్థలో చివరగా ఉండే భాగాన్ని కోలన్‌ అని అంటారు కోలన్ లేదా రెక్టల్ కి వచ్చే క్యాన్సర్‌ను కొలరెక్టల్ క్యాన్సర్‌ అని అంటారు. నెదర్లాండ్స్‌లో ఒకే వయస్సు ఉన్న సమూహనికి చెందిన వ్యక్తుల మీద జరిపిన పరిశోధనలో క్రూసిఫరస్ కూరగాయలు ఎక్కువగా తీసుకునే స్త్రీలకు పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. కాకపోతే ఈ అధ్యయనం పురుషులలో గమనించబడలేదు.

 

రొమ్ము క్యాన్సర్: రొమ్ము క్యాన్సర్, దీనినే బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు. క్రూసిఫరస్ కూరగాయలను ఎక్కువగా తినే స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని కేస్-కంట్రోల్ అధ్యయనం కనుగొంది.

 

క్రూసిఫరస్ కూరగాయలలోని యాక్టివ్ కాంపౌండ్స్ క్యాన్సర్ పై సానుకూల ప్రభావాలను చూపుతాయని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. ఉదాహరణకు, గర్భాశయంపై క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో ఇండోల్ మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఒక అధ్యయనం కనుగొంది. మరికొన్ని అధ్యయనాలు క్రూసిఫెరస్ కూరగాయలలో ఉండే సమ్మేళనాలను ఊపిరితిత్తుల మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తాయని చూపించాయి.

 

ఈ క్రుసిఫరస్ కూరగాయలు కేవలం క్యాన్సర్ కొరకు మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయి. 

 

గుండె జబ్బులను నివారిస్తాయి

పండ్లు మరియు కూరగాయలు గుండె జబ్బుల ప్రమాదానికి తగ్గిస్తాయి. ముఖ్యంగా క్రూసిఫెరస్ కూరగాయలు గుండె జబ్బులని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే వీటిలో ఉండే గ్లూకోసినోలేట్లు మీ LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె సమస్యలు మరియు స్ట్రోక్‌కు దారితీసే కొవ్వు పేరుకుపోకుండా ధమనులను రక్షించడంలో సహాయపడతాయి.

 

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: 

క్రుసిఫరస్ కూరగాయలలో యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. ఇవి వ్యాధికారక క్రిముల నుండి కాపాడి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

 

అధిక బరువుని తగ్గిస్తుంది: 

ప్రతిరోజూ 30 గ్రాముల ఫైబర్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి మరియు రక్తపోటును తగ్గించడానికి అలాగే ఊబకాయం మరియు మధుమేహ యొక్క  ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. క్రూసిఫరస్ కూరగాయల్లో మన రోజువారీ మోతాదులో దాదాపు 20% ఫైబర్ ఉంటుంది. 

 

రక్తంలో చెక్కర స్తాయిని తగ్గిస్తుంది: 

క్రుసిఫరస్ కూరగాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం చెక్కర యొక్క శోషణను నెమ్మదిపరుస్తుంది. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లో వచ్చే స్పైక్ ని నివారిస్తుంది. 

2016 చైనాలో జరిపిన ఒక అధ్యయనంలో క్రూసిఫరస్ కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని కనుగొంది. తద్వారా రక్తంలో చక్కెరను స్తాయిని కంట్రోల్ చేయడానికి  శారీరక శ్రమతో  పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ  ప్రతిరోజూ ఒకటి లేదా రెండు క్రూసిఫెరస్ కూరగాయలను ఆహరంలో చేర్చుకోవాలి. 

 

క్రుసిఫరస్ కూరగాయల యొక్క సైడ్ ఎఫ్ఫెక్ట్స్: 

 

క్రూసిఫరస్ కూరగాయలు ఆరోగ్యకరమైనవి మరియు పోషకవిలువలు కలిగినవి. కాకపోతే వీటిలో థియోసైనేట్‌లను ఉంటాయి. ఇవి అయోడిన్ శోషణను నిరోధించగలవు. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కూరగాయలను వీటికి దూరంగా ఉండటం మంచిది. వీటిని మొతాదుకి మించి తీసుకోవడం వల్ల గ్యాస్ మరియు థైరాయిడ్ వంటి సమస్యలు కలగవచ్చు.

 

చూశారుగా క్రుసిఫరస్ కురగాయాల యొక్క పోషక విలువలను, అందువల్ల ఇక మీదట వీటిని మన ఆహరంలో చేర్చుకుని ఈ ప్రయోజనాలను పొందుదాం. ఒకవేళ మీరు కనుక ఏదైనా చికిత్సను తీసుకుంటునట్లైతే వీటిని వినియోగించేముందు డాక్టర్ సంప్రదించడం మరిచిపోవద్దు. 

 

https://www.healthshots.com/healthy-eating/nutrition/cruciferous-vegetables-nutritious-foods-you-need-to-balance-hormones/ 

https://www.cancer.gov/about-cancer/causes-prevention/risk/diet/cruciferous-vegetables-fact-sheet 

https://www.24mantra.com/blogs/health-and-nutrition/cruciferous-vegetables-and-cancer-prevention/ 

 

       

Book Appointment

    Follow On Instagram

    punarjan ayurveda hospital logo

    Punarjan Ayurveda

    16k Followers

    We have a vision to end cancer as we know it, for everyone. Learn more about cancer Awareness, Early Detection, Patient Care by calling us at +(91) 80088 42222

    Call Now