loading

అధికంగా లభించే గ్లూకోజ్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

  • Home
  • Blog
  • అధికంగా లభించే గ్లూకోజ్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
How does excess glucose affect cancer risk

అధికంగా లభించే గ్లూకోజ్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

How does excess glucose affect cancer risk

 

మానవ శరీరంలో క్యాన్సర్ కణాల వృద్ది చెందడంలో, రక్తంలో ఉండే ఆధిక గ్లూకోజ్ ఒక ముఖ్యమైన కారణం.

 

గ్లూకోజ్ అనేది అన్ని కణాల పెరుగుదల కోసం ఉపయోగపడుతుంది. మన తీసుకున్న ఆహారం చివరకు గ్లూకోజ్గా జీవక్రియ చేయబడుతుంది మరియు శక్తి ఉత్పత్తికి, సెల్ పెరుగుదలకు సహాయపడుతుంది. క్యాన్సర్ను నియంత్రించడం మరియు నివారించడంలో ఆహార పరిమాణ నియంత్రిణ ప్రధానంగా సహాయపడతాయి.

 

మనం ఒక కణం యొక్క జీవక్రియను తెలుసుకుంటే, ప్రతి కణం రెండు విధానాలను అనుసరించడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

  • ఆక్సీకరణ ఫాస్ఫోరైలేషన్ (Oxidative phosphorylation): ఆక్సిజన్ సమక్షంలో ఒక గ్లూకోజ్ మలిక్యుల్ 36 ATP లుగా విభజించబదుతుంది. ఇది మైటోకాండ్రియాలో జరుగుతుంది.

 

  • గ్లైకోలిసిస్ (Glycolysis): ఇక్కడ ఒక గ్లూకోజ్ మలిక్యుల్ లాక్టిక్ ఆసిడ్ మరియు 2 ATP లుగా విభజించబదుతుంది. ఇది అన్ని కణాలలో జరుగుతుంది. సాధారణంగా శరీరంలో గ్లూకోజ్ లేదా ఆక్సిజన్ స్థాయిలు తగ్గినప్పుడు సెల్ ఈ మార్గాన్ని పాటిస్తుంది.

 

శక్తిని తయారుచేసేదానికి ప్రతి కణం గ్లైకోలిసిస్ కంటే ఆక్సీకరణ ఫాస్ఫోరైలేషన్ పధతిని ఎంచుకుంటుంది. తక్కువ ATPలు ఉత్పత్తి అవుతున్న, క్యాన్సర్ కణాలు గ్లైకోలిసిస్ పదతినే పాటిస్తుంది. ఎందుకంటే క్యాన్సర్ కణాల వృద్ధికి గ్లూకోజ్ని ఉపయోగించుకుంటుంది. దీనిని “Warburg effect” అని అంటారు.

 

గ్లూకోజ్ను, క్యాన్సర్ కణాలు తమ పెరుగుదల కోసం ఉపయోగిస్తుంది, కానీ శక్తి ఉత్పత్తి కోసం కాదు. ఎందుకంటే ఇది వాటి సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ, క్యాన్సర్ని అభివృద్ధిని చేసేలా సహాయం చేస్తుంది. కాబట్టి, క్యాన్సర్ కణాలు ఆక్సీకరణ ఫాస్ఫోరైలేషన్ కంటే గ్లైకోలిసిస్ మార్గాన్నే ఇష్టపడతాయి.

 

అందువల్ల పురాతన కాలం నుండి, చాలా మంది ప్రఖ్యాత ఆయుర్వేద నిపుణులు మన ఆహారాన్ని తగిన మోతాదులలో తీసుకోవాలి. ఎక్కువ ఆహారం తీసుకోవడం, మానవ శరీరానికి ఎటువంటి సహాయం చేయదు. క్యాన్సర్ కణాలు ఎక్కువ గ్లూకోజ్ని వాటి అభివృద్ధికి ఉపయోగిస్తాయి కాబట్టి, క్యాన్సర్ వచ్చిన వారు తమ బరువును చాలా త్వరగా కోల్పోతారు.

 

శరీరానికి ఎక్కువ ఆహారం అందించడం అనేది అగ్నికి నెయ్యిని అందించడం లాంటిది, ఏ విధంగా నెయ్యి అగ్నిని పెంచుతుందో. అలా ఎక్కువ ఆహారం క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

 

“ఆహారం మితంగా తీసుకుంటే ఆరోగ్యం, అమితంగా తీసుకుంటే విషం”

 

Also Read:మైగ్రేషన్ క్యాన్సర్ రావడంలో కీలక పాత్ర పోషిస్తుందా?

Book Appointment

    Follow On Instagram

    punarjan ayurveda hospital logo

    Punarjan Ayurveda

    16k Followers

    We have a vision to end cancer as we know it, for everyone. Learn more about cancer Awareness, Early Detection, Patient Care by calling us at +(91) 80088 42222

    Call Now