loading

క్యాన్సర్ చికిత్సకు, సంపూర్ణ విధానానికి యోగా ఎలా  సహాయపడుతుంది?

  • Home
  • Blog
  • క్యాన్సర్ చికిత్సకు, సంపూర్ణ విధానానికి యోగా ఎలా  సహాయపడుతుంది?
How does yoga contribute to the holistic approach in cancer management

క్యాన్సర్ చికిత్సకు, సంపూర్ణ విధానానికి యోగా ఎలా  సహాయపడుతుంది?

How does yoga contribute to the holistic approach in cancer management

 

క్యాన్సర్ అనేది, మనల్ని శారీరికంగానే కాకుండా మానసికంగా మరియు భావోద్వేగంగా కూడా ప్రభావితం చేసేటువంటి వ్యాధి. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అవ్వగానే బాధితులు ఒక రకమైన భావోద్వేగానికి లోనవుతుంటారు. “ఈ వ్యాధి నాకే ఎందుకు వచ్చింది” “చికిత్స బాధకరంగా ఉంటుందా” “చికిత్స అనంతరం పునరావృతం అవుతుందా”  వంటి ప్రశ్నలు తలెత్తుతుంటాయి. కొన్ని సార్లు ఇవి వారిని మానసికంగ కూడా బాధిస్తుంటాయి. అంతేకాకుండా చికిత్స సమయంలో కలిగే నొప్పి లేదా దుష్ప్రభావాల మూలంగా శారీరికంగా బలహీన పడుతుంటారు. అలాంటి సమయంలో వారికి సంపూర్ణ మద్దత్తు అవసరం ఉంటుంది. అంటే శారీరికంగా, మానసికంగా మరియు భావోద్వేగంగా వారిని బ్యాలెన్స్ చేయడం అవసరం. 

 

అలగే కొన్ని రకాల క్యాన్సర్లు మరియు క్యాన్సర్ చికిత్సలు ఎముకలు బలహీనపడటానికి కారణమవుతాయి. తద్వారా ఎముక ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణ యోగా పోసెస్ ఎముకలను సున్నితంగా బలోపేతం చేయడానికి సహాయపడతాయి. 

 

యోగా అనేది భారతదేశంలో పుట్టి వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక సాంప్రదాయమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ. ఇది మన ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా అంటే సంపూర్ణంగా సంరక్షిస్తుంది. ఇది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచడానికి ఉపయోగపడే ఒక సాధన.  

 

క్యాన్సర్ యొక్క శారీరక, మానసిక మరియు భావోద్వేగ వంటి అంశాలను పరిష్కరించడానికి  యోగా సంపూర్ణంగా సహాయపడుతుంది. ఇది  సాంప్రదాయ వైద్య చికిత్సలకు ప్రత్యామ్నాయం కానప్పటికీ, యోగా అనేది మన సంపూర్ణ ఆరోగ్య శ్రేయస్సుకు దోహదపడే ఒక సంపూర్ణమైన చికిత్స. క్యాన్సర్ చికిత్సను తీసుకుంటున్న వారికి యోగా సంపూర్ణ విధానానికి యోగా ఎలా సహాయపడుతుంది అనే మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

 

క్యాన్సర్ బాధితులకు యోగా వల్ల కలిగే శారీరిక ప్రయోజనాలు:

  

క్యాన్సర్ బాధితులకు యోగా యొక్క శారీరిక ప్రయోజనాలు, ఫ్లెక్సిబిలిటీ మరియు ధృడత్వవంతో పాటు శరీరిక పరమైన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాన్సర్ సమయంలో  యోగా శారీరక శ్రేయస్సుకు ఎలా దోహదపడుతుందనే అంశాలను ఇప్పుడు చూద్దాం.

 

ఫ్లెక్సిబిలిటిని మెరుగుపరుస్తుంది:

యోగా వివిధ కండరాల సమూహాలను సున్నితంగా స్ట్రెచ్ చేయడం మరియు బలోపేతం చేసే వివిధ పొసెస్ ను కలిగి ఉంటుంది. 

శస్త్రచికిత్స, రేడియేషన్ లేదా కీమోథెరపీ కారణంగా క్యాన్సర్ బాధితులు దృఢత్వం లేదా ఫ్లెక్సిబిలిటిని కోల్పోతే ఇది ప్రత్యేకంగా సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. 

 

బలాన్ని మెరుగుపరుస్తుంది:

శరీరాన్ని బలంగా ఉంచడానికి యోగాలోని అనేక రకమైన పోసెస్ ను చేస్తున్నప్పుడు,  వివిధ కండరాల సమూహాలను ఉపయోగించడం జరుగుతుంది. చికిత్స సమయంలో కండరాల బలహీనత లేదా అలసటకు గురౌతున్న వారికి ఇది చాలా ముఖ్యం.

 

కీళ్ల ఆరోగ్యం:

సున్నితమైన యోగా ఆసనాలు కీళ్ల యొక్క ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి. హార్మోన్ థెరపీ లేదా దీర్ఘకాలికంగా ఇన్ యాక్టివ్ గా ఉండేటువంటి  కొన్ని క్యాన్సర్ చికిత్సల వల్ల కలిగే అసౌకరాన్ని ఇవి తగ్గించడంలో సహయపడతాయి.

 

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది:  

కొన్ని యోగా పోసెస్ మరియు బ్రీథింగ్ ప్రాక్టీస్ లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మెరుగైన రక్త ప్రసరణ శరీరం అంతటా కణాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. తద్వారా ఇది శరీర సంపూర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది. 

 

శోషరస వ్యవస్థను స్టిమ్యులేట్ చేస్తుంది:

రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరుకి మరియు మన శరీరంలో ఉండే ద్రవాలను బ్యాలెన్స్ చేయడానికి శోషరస వ్యవస్థ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. యోగా యొక్క సున్నితమైన పోసెస్ మరియు స్ట్రెచస్ శోషరస వ్యవస్థను ప్రేరేపిస్తాయి. తద్వారా ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి.

 

నొప్పిని తగ్గిస్తుంది:

యోగా లోని సున్నితమైన పొసెస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ సమయంలో ఉండే నొప్పిని గాని చికిత్స మూలాన కలిగే నొప్పిని లేదా అసౌకర్యాన్ని తగ్గించడానికి యోగా నాన్-ఫార్మకోలాజికల్ విధానంగా సహాయపడుతుంది. 

 

ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతుంది: 

సున్నితమైన యోగా పొసెస్ ను ప్రాక్టీస్ చేయడం, ముఖ్యంగా శ్వాస నియంత్రణపై దృష్టి పెట్టడం వల్ల ఎనర్జీ లెవెల్స్ ను పెంచడంలో సహాయపడుతుంది. వ్యాధి మరియు దాని చికిత్స రెండింటి యొక్క సాధారణ దుష్ప్రభావాల వల్ల అలసటగా ఫీల్ అయ్యే వారికి ఇది చక్కగా  సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

 

క్యాన్సర్ బాధితులు వారి యొక్క ఆరోగ్య సంరక్షణ బృందం పర్యవేక్షణలో యోగాను చేయడం చాలా ముఖ్యం. ప్రత్యేకించి వారికి శారీరక నిర్దిష్ట  పరిమితులు లేదా ఆందోళనలు ఉన్నవారికి అయితే ఇది మరీ ముఖ్యం. 

 

క్యాన్సర్ బాధితులకు యోగా వల్ల కలిగే భావోగ్వేద ప్రయోజనాలు:

 

మైండ్‌ఫుల్‌నెస్ మరియు మెడిటేషన్:

యోగాలో తరచుగా మైండ్‌ఫుల్‌నెస్ మరియు మెడిటేషన్ వ్యాయామాలు ఉంటాయి, ఇవి క్యాన్సర్ తో బాధపడే వారికి ఒత్తిడిని తగ్గించడంలో మరియు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోడానికి మానసికంగా సహాయం చేయడంలో ఉపయోగపడతాయి. ఈ మైండ్‌ఫుల్‌నెస్ అనేది మనల్ని ప్రస్తుత మూమెంట్స్ లో ఉండటానికి మరియు అతిగా ఆలోచించడకుండా ఉండటానికి సహాయపడుతుంది. 

 

ఎమోషనల్ గా సమతుల్యంగా ఉండటానికి సహాయపడతాయి:

యోగాలోని ప్రాణాయామాలు ప్రశాంతతను కలిగి ఉండే భావాన్ని ప్రోత్సహిస్తాయి. వీటిని భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కోవటానికి ఒక సాధనంగా ఉపయోగించవచ్చు. శ్వాసపై ద్యాసను కేంద్రీకరించడం వల్ల నాడీ వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు ఎమోషనల్ గా మరింత బ్యాలెన్స్డ్ గా ఉండటానికి సహాయపడతాయి. 

 

మనస్సు-శరీర సంబందాన్ని పెంపొందిస్తాయి: 

శరీరానికి మరియు మనస్సుకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోడానికి యోగా చక్కగా ప్రోత్సహిస్తుంది. కొన్ని సున్నితమైన పోసెస్ తమలోని  భావోద్వేగాన్ని వ్యక్తపరచడానికి సులభతరం చేస్తాయి.  

 

క్యాన్సర్ బాధితులకు యోగా వల్ల కలిగే మానసిక ప్రయోజనాలు:

 

క్యాన్సర్ తో బాధపడే వారికి అనేక గొప్ప మానసిక ప్రయోజనాలను యోగా అందిస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స సమయంలో కలిగే భావోద్వేగ సవాళ్లను ఎదుర్కోవడంలో ఎంతో సహాయకరంగా ఉంటుంది. యోగా మానసిక ఆరోగ్యానికి సహాయపడే కొన్ని మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. 

 

రిలాక్సింగ్ పద్ధతులు: 

యోగాలోని శ్వాస మరియు ధ్యానం వంటి సాధనాలు విశ్రాంతిపై దృష్టి పెడతాయి. ఈ పద్ధతులు క్యాన్సర్ బాధితులు తరచుగా గురయ్యే ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశ వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

 

కార్టిసాల్ నియంత్రణ:

మన శరీరంలో అధిక స్థాయి కార్టిసాల్ హార్మోన్ ఒత్తిడికి కారణమవుతుంది. అందువల్ల ఇవి మన శరీరంలో సమతుల్యంగా ఉండటం మంచిది. రెగ్యులర్ యోగా పోసెస్ ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తాయి. క్యాన్సర్ చికిత్స సమయంలో ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడం అనేది ఆరోగ్యంగా ప్రోత్సాహిస్తుంది. 

 

ముఖ్యంగా ఈ సమయంలో ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం మరియు స్వీయ అంగీకారాన్ని పెంచడాన్ని ఇది  ప్రోత్సహిస్తుంది. మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా విలువైనది.

 

అలసటను దూరం చేస్తుంది:

యోగాలో ఉండే సున్నితమైన ఆసనాల ద్వారా అలసటను దూరం చేయడంలో సహాయపడుతుంది. సరైన శ్వాస సాధనలు ఎనర్జీ లెవల్స్ ను కూడా పెంచడంలో సహాయపడతాయి. 

 

మెరుగైన నిద్ర:

శరీరం రిఫ్రెష్ అవ్వడానికి నిద్ర అనేది చాలా ముఖ్యం. కొన్ని సార్లు చికిత్సను తీసుకుంటున్న సమయంలో అనేక కారణాల వల్ల నిద్రకి భంగం కలగవచ్చు. అందువల్ల క్రమం తప్పకుండా యోగాను చేయడం వల్ల నిద్ర యొక్క నాణ్యతను పెంచడానికి దోహద పడవచ్చు. 

 

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది:

సున్నితమైన యోగా ఆసనాలను క్రమంగా చేయడం అనేది మెరుగైన మానసిక స్థితి మరియు శ్రేయస్సు తో ముడిపడి ఉంటుంది. తద్వారా ఇది జీవన నాణ్యతను మెరుగుపరచడానికి  దోహదం చేస్తుంది.

 

క్యాన్సర్ చికిత్స సమయంలో కానీ చికిత్స అనంతరం కానీ చేయదగిన కొన్ని యోగా  పోసెస్: 

 

మౌంటేన్ పోస్: 

Mountain Pose

 

మౌంటైన్ పోజ్ అనేది ఆరోగ్యం యొక్క శారీరక మరియు భావోద్వేగ సమస్యలను నివారించదానికి ఉపయోగపడే ఒక సంపూర్ణ సాధన. ఇది క్యాన్సర్ బాధితులకి చికిత్స సమయంలో గాని తర్వాత గాని జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సున్నితమైన మరియు సమర్థవంతమైన మార్గాలను అందిస్తుంది.

ఈ ఆసనాన్ని సాధన చేయడం ద్వారా ఆందోళన, ఒత్తిడి నిరాశకు లోనవకుండా ప్రస్తుత క్షణాలను అనుభూతి చెందడానికి అంటే live in the moment అంటారు కదా అలా అనుభూతి చెందడానికి ఉపయోగపడుతుంది. అలాగే తిరిగి పునరుజ్జీవ శక్తి పొందడానికి ప్రేరేపిస్తుంది. 

 

వీరభద్రాసనం:

 

Veerabadhrasanam

 

వీరభద్రాసనంలోని సున్నితమైన స్ట్రెచ్, శరీరం యొక్క  స్టిఫ్ నెస్ ను తగ్గించడంలో మరియు ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ ఆసనం లోతైన శ్వాసను ప్రోత్సహిస్తుంది మరియు శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది, ఇది రికవరీ సమయంలో ఇది కీలకమైనది. అదనంగా, ఇది ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించడాన్ని ప్రోత్సాహిస్తుంది. ముఖ్యంగా ఇది బాధితులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను సమర్థవంతంగా నివారించడంలో అలాగే పూర్తి ఆరోగ్యానికి సానుకూల సహకారం అందించడంలో సహాయపడుతుంది.

 

వృక్షాసన, లేదా ట్రీ పోజ్:

 

Vrukshana

 

వృక్షాసన, లేదా ట్రీ పోజ్ అనేది ఒక ప్రాథమిక యోగాసనం. ఇది క్యాన్సర్ బాధితులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సున్నితమైన మరియు శక్తివంతమైన పోస్ స్థిరత్వం మరియు ఏకాగ్రతను పెంచుతుంది. ఈ పోస్ గ్రౌండింగ్ అనుభూతిని మరియు మానసిక దృష్టి ని పెంచుతుంది.

అంతేకాకుండా, ఈ వృక్షాసన శరీర భాగాలను సున్నితంగా సాగదీయడాన్ని ప్రోత్సహిస్తుంది, తద్వారా ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. ముఖ్యంగా దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల శోషరస ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో పాటు కొన్ని క్యాన్సర్ చికిత్సలతో మూలాన కలిగే ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. మొత్తానికి, ట్రీ పోజ్ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి సంపూర్ణమైన విధానాన్ని అందించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

 

బాలాసన: 

 

Balasana

ఈ ఆసనం క్యాన్సర్ తో బాధపడే వారికి సంకల్పాన్ని మరియు పునరుద్ధరణను అందిస్తుంది. అలాగే జీవితాన్ని నూతనంగా ప్రారంబించడానికి మరియు జీవితంలో స్థిరత్వాన్ని పొందడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది మరియు విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది.వ ముఖ్యంగా సౌకర్యవంతమైన  మరియు పునరుద్ధరణ యొక్క భావాన్ని పెంపొందిస్తుంది. వీటితో పాటు ప్రశాంతతను పెంపొందిస్తుంది.

ఇక చివరగా, క్యాన్సర్ తో బాధపడే వారు యోగాతో సహా ఇతర ఏవైనా వ్యాయామాలను ప్రారంభించే ముందు వైద్యులను లేదా ఆరోగ్య సంరక్షణ బృందాన్ని సంప్రదించడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి వారు మీకు సరైన యోగా ఆసనాలను సూచిస్తారు.  

 

Also Read: హర్మోనల్ ఇంబ్యాలెన్స్ ను నివారించే 5 యోగా ఆసనాలు

Book Appointment

    Follow On Instagram

    punarjan ayurveda hospital logo

    Punarjan Ayurveda

    16k Followers

    We have a vision to end cancer as we know it, for everyone. Learn more about cancer Awareness, Early Detection, Patient Care by calling us at +(91) 80088 42222

    Call Now