loading

Pancreatic Cancer : ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సోకితే మరణం తప్పదా?

  • Home
  • Blog
  • Pancreatic Cancer : ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సోకితే మరణం తప్పదా?
Pancreas Cancer symptoms in Telegu

Pancreatic Cancer : ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సోకితే మరణం తప్పదా?

Pancreas Cancer symptoms in Telegu

క్లోమగ్రంధి క్యాన్సర్:

ప్రస్తుతమున్న క్యాన్సర్లన్నిటిలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ ఈ క్లోమ గ్రంధి క్యాన్సర్. ఈ క్యాన్సర్ సోకిన వారిలో మనుగడ అవకాశాలు చాలా తక్కువ.  అందుకు ఒక్కటే ప్రధాన కారణం. ఆలస్యంగా గుర్తించడం. మిగిలిన క్యాన్సర్లలా క్లోమగ్రంధి క్యాన్సరును ముందుగా గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే క్లోమ గ్రంధి క్యాన్సర్ లక్షణాలు ఇతర వ్యాధులకు సంబంధించినవిగానే ఉంటాయి. ఉదాహరణకి అల్సర్, పచ్చ కామెర్లు, కడుపు నొప్పి, వెన్నులో నొప్పి క్లోమగ్రంధి క్యాన్సర్లోనూ సహజంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఈ లక్షణాలు కనిపించగానే ముందు కడుపునొప్పికి, పచ్చకామెర్లకు, అల్సరుకు చికిత్స చేయించుకుంటాం తప్ప ఇది క్లోమగ్రంధి క్యాన్సరని కనీసం అనుమానించము.

క్లోమ గ్రంధి పని ఏమిటి?

మన శరీరంలో ఉన్న అన్ని గ్రంధుల్లో ఈ క్లోమ గ్రంధి గ్రంధి చాలా ముఖ్యమైనది. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన రసాలను ఈ క్లోమ గ్రంధి ఉత్పత్తి  చేస్తుంటుంది. క్లోమ గ్రంధి చూడటానికి ఒక చేప ఆకారంలో ఉంటుంది. జీర్ణాశయానికి వెనుకభాగంలో ఇది అమర్చబడి ఉంటుంది. ఆహారం జీర్ణం కావడానికి కావాల్సిన ఎంజైములను ఒక వాహిక ద్వారా చిన్నపేగుకు పంపుతూ ఉంటుంది. జీర్ణవ్యవస్థలో అత్యంత కీలకమైన ఇన్సులిన్ ను కూడా ఈ క్లోమగ్రంధే ఉత్పత్తి చేస్తుంటుంది. డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఈ ఇన్సులిన్ శరీరంలో తగినంత ఉత్పత్తి అవుతూ ఉండాలి. ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి కావడం ఆగిపోతుందో ఆ స్థితినే మధుమేహం అంటారు. ఈ స్థితిలోనే కృత్రిమంగా బయటనుండి టాబ్లెట్ల రూపేణా లేదా ఇంజెక్షన్ రూపేణా ఇన్సులిన్ శరీరానికి అందించాల్సి ఉంటుంది.

క్లోమగ్రంధి శరీరానికి మధ్యభాగంలో అత్యంత సురక్షిత ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి దీనికి ఇన్ఫెక్షన్లు రావు అనుకోవడం పొరపాటు. క్లోమగ్రంధిలో సర్వసాధారణంగా పాంక్రియాటైటిస్ వ్యాధిని చూస్తుంటాము. పాంక్రియాటైటిస్ అంటే క్లోమ గ్రంధి వాపు. క్లోమగ్రంధి వాపుకు అనేక కారణాలున్నాయి. మద్యపానం, ధూమపానం, పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడటం, జీర్ణప్రక్రియకు ఇబ్బంది కలిగించే ఆహారం తీసుకోవడం వలన క్లోమగ్రంధిలో వాపు కనిపిస్తుంటుంది. ఇలా పాంక్రియాటైటిస్ వ్యాధికి కొన్ని కారణాలున్నాయి. కానీ పాంక్రియాటైటిక్ క్యాన్సరు రావడానికి ప్రత్యేకించి కారణాలు ఏమీ లేవు.

క్లోమ గ్రంథి క్యాన్సర్ ని గుర్తించడమేలా.?

క్లోమ గ్రంధి దెబ్బతింటే తిన్నది జీర్ణమవడానికి అవసరమైన జ్యూసులు ఉత్పత్తి కావు. ఫలితంగా తిన్న ఆహారం జీర్ణం కాదు. కడుపునొప్పి అసాధారణ స్థాయిలో ఉంటుంది. అల్సర్ మంట ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాల ఆధారంగా పాంక్రియాటిక్ క్యాన్సరును గుర్తించవచ్చు.

క్లోమగ్రంధిలో క్యాన్సర్ కణాలను గుర్తించడానికి ముందుగ CA 19-9 టెస్టు చేసి అసాధారణ కణాలేవైనా ఉన్నాయేమో గుర్తిస్తారు. తదనంతరం సీటీ స్కాన్, ఎమ్మారై, అల్ట్రాసౌండ్ చేస్తే అవి క్యాన్సరుకు సంబంధించినవా కాదా అన్నది నిర్ధారిస్తారు. చివరగా క్లోమగ్రంధి క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి PET సీటీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. దగ్గర్లో ఉన్న లింఫ్ గ్రంధుల్లోకి, లింఫ్ నాళాల్లోకి క్యాన్సర్ కణాలు ఏమైనా వ్యాపించాయా లేదా తెలుసుకొని చికిత్స ప్రారంభిస్తారు. వ్యాధి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుంటే చికిత్స చేయడం సులభతరమవుతుంది.

క్లోమ గ్రంధి క్యాన్సర్ ని గుర్తించడంలో ఆలస్యమైతే.?

ఎక్కువమందిలో క్లోమ గ్రంధి క్యాన్సర్ ఎందుకు ప్రాణాంతకమవుతుంది అంటే ఇది గుర్తించడంలోనే జాప్యం జరుగుతూ ఉంటుంది. అల్సర్ ఉన్నవారికి క్లోమ గ్రంధి క్యాన్సర్ ఉన్నవాళ్ళకు ఒకే లక్షణాలు ఉంటాయి. అల్సర్ కు ట్రీట్మెంట్ చేస్తారు తగ్గిందని అనుకుంటాము… కొన్నాళ్ళకు మళ్ళీ కడుపునొప్పిగా ఉందని డాక్టరు దగ్గరకు పరుగులు తీస్తాము. అంతే తప్ప మనకు గానీ, టెస్టులు చేసినవారికి గానీ క్లోమగ్రంధి క్యాన్సరు ఉందని కనీసం అనుమానం రాదు. కొంతమందిలో పచ్చకామెర్లు లక్షణాలు కనిపిస్తాయి. పచ్చకామెర్లకు చికిత్స చేయించుకుంటారు తప్ప క్లోమ గ్రంధి సమస్య ఉందని కొంచెమైన అనుమానం రాదు. తీరా పాంక్రియాటిక్ క్యాన్సరు గుర్తించే సమయానికి పరిస్థితి చేయి దాటిపోతుంది. అప్పటికే పక్కన ఉన్న లింఫ్ నాళాల్లోకి, లింఫ్ గ్రంధిలోకి వ్యాపించి ఇతర అవయవాలకు కూడా పాకుతుంది.

క్లోమ గ్రంధి క్యాన్సర్ రాకుండా  తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • మద్యపానం, ధూమపానం, అలవాట్లకు దూరంగా ఉండాలి.
  • కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ క్లోమగ్రంధి క్యాన్సర్ ఉంటే వారికి కూడా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
  • కాబట్టి కుటుంబంలో ఎవరికైనా క్లోమ గ్రంధి క్యాన్సర్ చరిత్ర ఉంటే ఎప్పుడైనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
  • ఎర్రమాంసం, ప్రాసెస్ చేసిన మాంసానికి దూరంగా ఉండాలి. పళ్ళు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామం, ప్రాణాయామం క్రమం తప్పకుండా చేయాలి.

చికిత్సా  విధానం:

ఆయుర్వేద వైద్యం ద్వారా క్లోమగ్రంధి క్యాన్సరు చికిత్సకు అద్భుతమైన పరిష్కారముంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్లోమగ్రంధి క్యాన్సరును పూర్తిగా నయం చేయడమే కాకుండా వ్యాధి పునరావృతం కాకుండా ఉండాలంటే ఆయుర్వేదం లోని రసాయన వైద్యమే చక్కటి పరిష్కారం.

ముఖ్య గమనిక :

ఇక్కడ పొందు పరచిన సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Know more about: Best Ayurvedic cancer hospital in Kerala

Book Appointment

    Follow On Instagram

    punarjan ayurveda hospital logo

    Punarjan Ayurveda

    16k Followers

    We have a vision to end cancer as we know it, for everyone. Learn more about cancer Awareness, Early Detection, Patient Care by calling us at +(91) 80088 42222

    Call Now