loading

ఆయుర్వేదం : ది మదర్ ఆఫ్ బయో హ్యాకింగ్

  • Home
  • Blog
  • ఆయుర్వేదం : ది మదర్ ఆఫ్ బయో హ్యాకింగ్
46_Vagus nerve on cancer BLOG

ఆయుర్వేదం : ది మదర్ ఆఫ్ బయో హ్యాకింగ్

Reduce your e-time for a healthier life!
Reduce your e-time for a healthier life!

బయో హ్యాకింగ్ అనే పదం ఎక్కడైనా విన్నారా?
ఈ హ్యాకింగ్ అనే పదం మనం ఈ కంప్యుటర్ యుగంలో చాలా సార్లే విని ఉంటాం.
కానీ కొత్తగా ఈ బయో హ్యాకింగ్ ఏంటి అంటారా!

ఈ తరంలో మన జీవన శైలి, మన ఆరోగ్యాన్ని మన అదుపులో ఉండనివ్వనంతగా మారిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. మారుతున్న టెక్నాలజీ మరియు ఆహార అలవాట్లు మనను ప్రకృతికి దూరం చేసి స్క్రీన్లకు అతుక్కుపోయి, జంక్ ఫుడ్ తింటూ కూర్చునేలా చేసాయి. ఈ పరిస్థితుల ప్రభావంగా ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ప్రతీ ఇంటి గడప దాకా చేరిపోయాయి. ఈ ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పుట్టిన కొత్త పదమే బయో హ్యాకింగ్.

ఈ చిన్న ఉదాహరణతో ఈ బయో హ్యాకింగ్ మన నూతన జీవనశైలి లో ఎలా పనిచేస్తుందో మనం అర్థంచేసుకోవచ్చు. ఈ జెనరేషన్ లో రాత్రి తొమ్మిదింటికే నిద్రపోయే మనుషులు అస్సలు లేరనే చెప్పాలి. ఇంకా అర్థరాత్రి దాకా కళ్ళను డ్యామేజ్ చేసే బ్లూ లైట్ విడుదలచేసే మొబైల్, టీవీ లేదా ల్యాప్ టాప్ తోనే ఆ అర్ధరాత్రి దాకా గడిపేస్తుంటారు. దీని వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా నిద్రపోవడానికి అవసరమైన మెలటోనిన్ అనే హార్మోన్ కూడా విడుదల అవ్వదు. ఈ నిద్రలేమి మరియు కంటి ఆరోగ్యం దెబ్బతినడం అనే సమస్యలను నివారించే బయోహ్యాక్ పేరే బ్లూ లైట్ బ్లాకింగ్ కళ్ళజోడు ఉపయోగించడం. ఈ రకమైన కళ్ళజోడు ఉపయోగించడం వల్ల చుట్టూ పక్కన ఉండే బ్లూలైట్ మన కంటిలోకి వెళ్ళకుండా ఈ కళ్ళజోడు బ్లాక్ చేస్తుంది. తద్వారా ఆ బ్లూలైట్ నుండి వచ్చే సమస్య నివారించబడుతుంది.

ఈ విధంగా మారిన జీవన శైలికి ఎక్కువగా ఇబ్బంది కలిగించకుండా ఆరోగ్యాన్ని టెక్నాలజీ మరియు బయో సైన్స్ ని ఉపయోగించి తయారు చేసే ట్రిక్స్ మరియు విధానాలను బయో హ్యాకింగ్ అంటాము. ఈ బయో హ్యాకింగ్ లో న్యూరో సైన్స్, టెక్నాలజీ, బయాలజీ, జేనిటిక్స్ ను ఉపయోగించి ఈ బయో హ్యాకింగ్ ట్రిక్స్ ను కనిపెడుతుంటారు. దీనిని మనకు శారీరకంగా, మానసికంగా వస్తున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి, నివారించడానికి ఉపయోగిస్తుంటారు.

మాడర్న్ బయో హ్యాకింగ్ లో వివిధ రకాలు

Modern Bio Hacking

జీవన విధానంలో బయో హ్యాకింగ్

ఈ రకమైన బయోహ్యకింగ్ మన జీవనవిధానంలో మన చేసుకునే మార్పులు మరియు మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేసి ఆరోగ్యాన్ని సరిచేస్తుంది. ఉదాహరణకు మనం ఆహారం తినే వేళలు మార్చడం, మెడిటేషన్, వ్యాయామం వంటి వాటితో మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం. ఇది సాధారణంగా ఎన్నో ఏళ్ళ నుండి మనం పాటిస్తున్న విషయమే!

మాలిక్యులార్ బయో హ్యాకింగ్

ఈ మాలిక్యులార్ బయో హ్యాకింగ్ లో సింథటిక్ మాలిక్యుల్స్ తో తయారు చేసిన సప్లిమెంట్ల ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తారు. ఉదాహరణకు మనలో ఏదైనా ఒక పోషకం లోపించి ఉంటే, ఆ లోపాన్ని ఈ సప్లిమెంట్ ద్వారా బర్తీ చేస్తారు. ఇది పట్టణాలలో ఇప్పుడు చాలా మంది పాటిస్తున్న బయో హ్యాక్.

బయోలాజికల్ బయో హ్యాకింగ్

ఈ రకమైన బయో హ్యాకింగ్ లో DNA, RNA ప్రోటీన్స్ మరియు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్న కణాల లాంటి కృత్రిమ బయోలాజికల్ ప్రాడక్ట్స్ ని ఉపయోగించి మన శరీరంలోని సమస్యలను సరిచేస్తారు. ఉదాహరణకు స్టెమ్ సెల్స్ ను శరీరంలోకి పంపించడం లాగా, కానీ ఇందులో కొన్ని చేయాలంటే వైద్యుడి పర్యవేక్షణ అవసరం. కొన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల నాన్ మెడికల్ ఐవి థెరపీస్ పేరుతొ చేస్తున్నారు.

టెక్నాలాజికల్ బయో హ్యాకింగ్

సింపుల్ గా దీని గురించి చెప్పాలంటే మొదలు పెట్టాల్సింది మనం చేతికి కట్టుకునే స్మార్ట్ వాచ్ దగ్గరనుండే! మనం ఈ టెక్నాలజీని ఉపయోగించి మన శరీరం గురించి ఎక్కువ విషయాలు తెలుసుకుంటూ, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఈ టెక్నాలాజికల్ బయో యాకింగ్ లో మొదటి వైపు అయితే రెండోది ఎలక్ట్రానిక్ సిములేటర్స్, హైపర్ బేరిక్ చాంబర్స్ వంటి అడ్వాన్స్డ్ మెషినరీ ఉపయోగించి ఆరోగ్య సమస్యలను ట్రీట్ చేయడం. ఈ టెక్నాలాజికల్ బయోహ్యాకింగ్ ఇప్పుడు దాదాపు ప్రతీచోట ఉపయోగించబడుతుంది.

ఇవి మాత్రమే కాకుండా మన ఆరోగ్య అవసరాలను బట్టి కూడా ఎన్నో బయో హ్యాకింగ్ విధానాలు ఇప్పటి మాడర్న్ సొసైటీ లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు

  • ఏజ్ బయో హ్యాకింగ్
  • ఎనర్జీ బయో హ్యాకింగ్
  • డైట్ అండ్ న్యూట్రిషన్ బయో హ్యాకింగ్
  • ఫిజికల్ హెల్త్ బయో హ్యాకింగ్
  • బ్రెయిన్ బయో హ్యాకింగ్ మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.
  • మాడర్న్ బయో హ్యాకింగ్ మనకు మంచినే చేస్తుందా?

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మాడర్న్ బయో హ్యాకింగ్ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిది. దేని వల్ల జరిగే మంచీ ఉంది, చెడు కూడా ఉంది. ట్రిక్స్ ని ఉపయోగించి మన ఆరోగ్యాన్ని సరి చేయడం చేసే ఈ బయో హ్యాకింగ్, మన శరీరానికి స్వయంగా సమస్యలతో పోరాడే శక్తిని మరచిపోయేలా చేయగలదు. మనలో ఉన్న న్యాచురల్ హీలింగ్ పవర్ ను దూరం కూడా చేయగలదు.

ఒకానొక సమయంలో ప్రతీ విషయానికి ఈ బయో హ్యాక్స్ మీదే మన శరీరం ఆధారపడే పరిస్థితి కూడా రావచ్చేమో?

మరి అది మరింత ప్రమాదకరం కదా!

మరి ఈ సైడ్ ఎఫెక్ట్ లేని బయో హ్యాక్ ఏదైనా ఉందా అనేదే మీ ప్రశ్న అయితే,
ఇదే మా సమాధానం.

  • ఆయుర్వేదం : ది మదర్ ఆఫ్ బయో హ్యాకింగ్

మన శరీరం తన సమస్యను తాను పరిష్కరించుకోగలదు

అనేది ఆయుర్వేదం చెప్పిన సిద్ధాంతం.

మాడర్న్ బయో హ్యాకింగ్ మన శరీరానికి తనను తాను సరి చేసుకునే అవకాశం ఇవ్వకుండా పరిష్కారాన్ని వేరే చోటు నుండి, వేరే పద్ధతిలో సమస్య పరిష్కారం చూపుతుంది. ఆయుర్వేదం మాత్రం మన ప్రతీ సమస్యను ప్రకృతి నియమాలను గౌరవించి, ప్రకృతి ఇచ్చినదాన్నే ఉపయోగించి మన ఆరోగ్యాన్ని మన శరీరమే సరిచేసుకునేలా చేస్తుంది. అందుకే ఆయుర్వేదాన్ని ఈ బయో హ్యాకింగ్ విధానానికి మదర్ గా భావించడంలో ఎటువంటి సందేహం లేదు. మనం ఉదయం లేచిన నిమిషం దగ్గరనుండి నిద్రపోయే క్షణం వరకు దినచర్యను ఎలా ఆచరించాలో ఆయుర్వేదంలో చెప్పబడింది.
ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మన శరీరాన్ని మానిటర్ చేయడానికి మనం స్మార్ట్ డివైసెస్ ఉపయోగిస్తున్నట్టు ఒకప్పుడు ఆయుర్వేదం మన శరీరాన్ని మానిటర్ చేయడానికి మన శరీరంలోనే కొన్నిటిని ఆ మానిటరింగ్ మీడియంగా పేర్కొంది. ఉదాహరణకు మన జీర్ణ వ్యవస్థ సవ్యంగా ఉందా లేదా తెలుసుకోవడానికి ఆయుర్వేదం చెప్పిన బయోహ్యాక్ ఏంటంటే మన చేతి వేళ్ళ గొర్లపై దిగువ భాగంలో అర్థచంద్రాకారంలో ఉండే
లునులా ఉండటం.
సింపుల్ గా చెప్పాలంటే మన గోరు క్రింది భాగంలో ఒక అర్థచంద్ర కారం లాంటిది కనిపిస్తుంది, దానినే మనం
లునులా అంటాం. ఈ లునులా అన్ని వేళ్ళలో మనకు కనిపిస్తున్నట్లయితే అక్కడ జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉందని అర్థం. ఏ వేలికీ లునులా కనిపించట్లేదంటే అక్కడ జీర్ణ వ్యవస్థలో సమస్య ఉందని అర్థం. ఇలా ప్రతీ సమస్యను గుర్తించేందుకు కూడా ఆయుర్వేదం ఎన్నో బయో హ్యక్స్ ను చెప్పింది. అలాగే వాటిని పరిష్కరించేందుకు కూడా మరెన్నో ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి.
ఆయుర్వేదం మన దీర్ఘాయువు కోసం చెప్పిన రెండు ముఖ్యమైన బయో హ్యాక్స్

    • దినచర్య
      మనం ఒక రోజులో సాధారణంగా చేసే ప్రతీ పనీ దినచర్యలో భాగమే. ఈ దినచర్యను ఆయుర్వేదం రెండు విభాగాలు గా చేసింది. ఒకటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, రెండవది సూర్యాస్తమయం నుండి తిరిగి సూర్యోదయం వరకు. ఈ రెండు విభాగాల్లోనూ ప్రతీ నాలుగు గంటలకు వాత, పిత్త, కఫ దోషాలు, ఒకటి తరువాత ఒకటి ఆధిపత్యంలో ఉంటాయి. ఆయుర్వేదంలో మన శరీర తత్వాన్ని బట్టి మన దినచర్య ఉంటుంది.
    • ఋతుచర్య
      ఋతుచర్య అంటే కాలానికి అనుగుణంగా జీవించడం. ఆయుర్వేదం ప్రకారం ప్రతీ ఋతువు ప్రత్యెకమైనదే. ఋతువు మారినప్పుడు మన చుట్టూ ఉండే గాలి కూడా మారుతుంది, మనం తినే ఆహారం కూడా మారుతుంది. ఈ మార్పులను మనం గౌరవించి కాలానుగునంగా జీవించడమే ఈ ఋతుచర్య. ఈ మారే కాలాన్ని బట్టి మగ గట్ బ్యాక్టీరియా కూడా మారడం జరుగుతుంది, మనం తినే ఆహారం కూడా కాలాన్ని బట్టి తింటున్నట్లయితే మన గట్ ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవి మాత్రమే కాదు, ఆయుర్వేదంలో మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే . యోగా, ప్రాణాయామం, పంచకర్మ వంటి కొన్ని వేల ఆయుర్వేదిక్ బయో హ్యక్స్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఆయుర్వేదం ఒక సముద్రం లాంటిది. వెతికే కొద్ది ప్రశ్నలకు సమాధానాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు దొరుకుతూనే ఉంటాయి.

చివరగా చెప్పేదేమిటంటే,

మనం ఆయుర్వేదం చెప్పిన విధంగా ఈ దినచర్య, ఋతుచర్య మనం ఆచరించగలిగితే మనకు ఆరోగ్యంగా ఉండటానికి ఇతర ఏ విధమైన బయో హ్యాక్స్ అవసరం లేదు. మన శరీర తత్వాన్ని బట్టి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగే ఏకైక ప్రాచీన వైద్యం ఆయుర్వేదం.
ఆయుర్వేదం చెప్పిన ప్రతీ సూచన ఒక పవర్ ఫుల్ బయో హ్యాక్ తో సమానం.
అందుకే భారతీయ సంపదైన ఆయుర్వేదాన్ని విదేశీయులు సైతం మదర్ ఆఫ్ బయో హ్యాకింగ్ అంటున్నారు. ఇక మనం కూడా ఆయుర్వేదం అన్నిటి కంటే ఉత్తమమైన బయో హ్యాకింగ్ అని ఒప్పుకొని తీరాల్సిందే!

ప్రతీ భారతీయ ఇంటిలో ఆరోగ్య దీపాన్ని ఆయుర్వేదమనే అగ్నితో వెలిగిద్దాం !

క్యాన్సర్ వ్యాధికి ఆయుర్వేదంలో బయో హ్యాక్ !

బయో హ్యాకింగ్ కి ఆయుర్వేదం తల్లి లాంటిది అనే విషయానికి నిరూపణలు అవసరం లేదు.
ఒకవేళ నీరుపించమని అడిగితే మాత్రం, ఏ మాడర్న్ బయో హ్యాకింగ్ నయం చేయలేని ఒక సమస్యను ఆయుర్వేదం నయం చేసింది. ఆయుర్వేదం అనేది మదర్ ఆఫ్ బయో హ్యాకింగ్ అని చెప్పడానికి అదే నిలువెత్తు సాక్ష్యం.
ఏ బయో హ్యాకింగ్ ఇప్పటిదాకా పూర్తిగా దుష్ప్రభావాలు లేకుండా క్యాన్సర్ అనే సమస్యను అంతం చేయలేకపోయింది. కానీ ఆ పనిని ఆయుర్వేదం తన భుజానేసుకొని
రసాయన ఆయుర్వేద చికిత్స
ద్వారా క్యాన్సర్ ను పూర్తిగా తగ్గించగలిగింది. పునర్జన్ ఆయుర్వేద లో రసాయన ఆయుర్వేద చికిత్స తీసుకొని క్యాన్సర్ నుండి పూర్తిగా విముక్తి పొందిన ఎన్నో వేల ప్రాణాలే అందుకు సాక్ష్యం.

ఆయుర్వేదం లో దైవ వైద్యం గా పిలవబడే రసాయన ఆయుర్వేదం,

క్యాన్సర్ ను సైతం తగ్గించగలిగే పవర్ ఫుల్ బయోహ్యాక్ !

Book Appointment

    Follow On Instagram

    punarjan ayurveda hospital logo

    Punarjan Ayurveda

    16k Followers

    We have a vision to end cancer as we know it, for everyone. Learn more about cancer Awareness, Early Detection, Patient Care by calling us at +(91) 80088 42222

    Call Now